1. తలచినంతనే కాపాడే ప్రత్యక్ష దైవం శ్రీసాయినాథుడు
2. బాబా కృప
3. ఉద్యోగాన్నిచ్చి ఇష్టాన్ని నెరవేర్చిన బాబా
తలచినంతనే కాపాడే ప్రత్యక్ష దైవం శ్రీసాయినాథుడు
సాయి బంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయి బృందానికి ధన్యవాదాలు. నేను ఒక సాయి భక్తురాలిని. ఈరోజు నేను మీ అందరితో బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. 2022, జూన్ 30 ఉదయం మా చిన్నమ్మాయికి విపరీతమైన తలనొప్పి వచ్చింది. వెంటనే 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని జపించినప్పటికీ తన తలనొప్పి కొంచం కూడా తగ్గలేదు. పైగా తను బాధ తట్టుకోలేక విపరీతంగా ఏడుస్తూ, తనకి స్పర్శ కూడా తెలియట్లేదని చెప్పసాగింది. నాకు చాలా భయమేసి, "ఎందుకు తండ్రి కొంచెం కూడా నొప్పి తగ్గడం లేదు. ఎంతమందికో నిమిషాల్లో తగ్గించావు కదా. నా బిడ్డకి కూడా తగ్గించు తండ్రి" అని బాబాను ఎంతగానో వేడుకున్నాను. కానీ నా బిడ్డ తలనొప్పి తగ్గలేదు. అయినా నేను బాబా నా బిడ్డకి ఎలాగైనా తగ్గిస్తారని చాలాసేపు అలాగే ఉండిపోయాను. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చి, "ఈ అనుభవాన్ని సాయి భక్తుల అనుభవాల బ్లాగుకు పంపిస్తాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. అంతే, బాబా నా బాధను విని నా బిడ్డ తలనొప్పిని చాలా త్వరగా తగ్గించేసారు. ఆ తండ్రికి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే, నా బిడ్డ పడిన కష్టం అలాంటిది మరి.
ఈమధ్య మావారు నేరేడుపళ్లు తీసుకొచ్చారు. కొన్ని తినగానే నా గొంతు నుండి నడుము వరకు పట్టేసినట్లుగా అయి, ఊపిరి కూడా సరిగా ఆడక నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. వెంటనే నేను, "ప్లీజ్ బాబా, ఈ బాధనుండి నాకు కాస్త ఉపశమనం కలిగేలా చేయండి. అలా చేస్తే, నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. ఆయన దయవల్ల రెండు గంటల్లో నాకు చాలావరకు తగ్గి, మరుసటిరోజు ఉదయానికి పూర్తిగా బాగున్నాను.
ఈమధ్య మా చెల్లెలికి కాలు పాదం దగ్గర కాస్త నొప్పిగా అనిపించింది. తను హాస్పిటల్‍కి వెళ్లాలనుకున్నప్పటికీ వెళ్ళలేకపోయింది. అంతలో ఆ నొప్పి వల్ల నడవడం చాలా ఇబ్బందిగా మారింది. అప్పుడింక ఒక తెలిసిన డాక్టరు దగ్గరకు వెళ్తే ఒక ఇంజక్షన్ చేసారు. అయితే ఇంజక్షన్ చేసిన చోట అరచేతి అంత వెడల్పున నల్లగా అయింది. దాంతో తను వేరే హాస్పిటల్‍కి వెళ్ళింది. అప్పుడు నేను, "బాబా! ఏవిధమైన పెద్ద సమస్య లేకుండా చెల్లికి తగ్గిపోతే, ఈ అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాన"ని బాబాతో చెప్పుకున్నాను. ఆయన దయవల్ల డాక్షరు, "మందులతో తగ్గిపోతుంద"ని చెప్పడంతో మాకు ఉపశమనంగా అనిపించింది. తలచినంతనే కాపాడే ప్రత్యక్ష దైవం శ్రీసాయినాథుడు. ఆ తండ్రి దయుంటే చాలు ఎలాంటి సమస్య నుండైనా బయటపడతాము. "చాలా చాలా ధన్యవాదాలు బాబా". మరోసారి మరికొన్ని అనుభవాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.
సర్వేజనా సుఖనోభవంతు!!
శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!
బాబా కృప
అందరికీ నమస్తే. నా పేరు అంజలి. ఈమధ్య మా పాపకి బాగా జ్వరం వచ్చింది. నేను పాపచేత బాబా ఊదీ నీళ్లు త్రాగించి, రాత్రంతా పాప శరీరాన్ని తడిబట్టతో తుడుస్తూ, "తెల్లారేసరికి జ్వరం తగ్గి పాప మామూలుగా అయితే బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకు మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల ఉదయానికి పాప నార్మల్ అయింది. కానీ పాపకి కొంచం ఆయాసంగా, గొంతులో నసగా ఉండటంతో కోవిడ్ ఏమో అని నాకు అనిపించింది. వెంటనే, "బాబా! పాపకి ఉన్న ఇబ్బందులన్నీ తగ్గించండి తండ్రి" అని వేడుకున్నాను. ఆయన దయవల్ల మరుసటిరోజుకి పాప ఆయాసం, జ్వరం పూర్తిగా తగ్గాయి. ఆ మరుసటిరోజు తెల్లారేసరికి గొంతులో నస కూడా తగ్గిపోయింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
తమ్ముడు ప్రసాద్ ఇంట్లో తన భార్యతో గొడవలు జరిగి బాగా డిస్టర్బ్ అయ్యాడు. తను చాలా మూడ్ ఆఫ్ లో ఉండి 2022, జూన్ 30, గురువారం మహా పారాయణ గ్రూపు నుండి బయటకి వెళ్ళిపోయాడు. నాకు చాలా బాధ అనిపించి బాబాను, "బాబా! భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు సద్దుమణిగేలా చేసి, వాళ్ళు తొందరగా నార్మల్ అయ్యేలా చూడు తండ్రి" అని వేడుకున్నాను. బాబా దయవల్ల రెండురోజుల్లో వాళ్లిద్దరూ నార్మల్ అయ్యారు. "ధన్యవాదాలు బాబా. వాళ్ళు ఎటువంటి గొడవలు లేకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూడు తండ్రి. అలాగే తమ్ముడు తిరిగి మహా పారాయణ గ్రూపులో జాయిన్ అయ్యేలా, మీ మీద తనకి నమ్మకం కలిగేలా చూడండి తండ్రి".
ఉద్యోగాన్నిచ్చి ఇష్టాన్ని నెరవేర్చిన బాబా
"శ్రీసాయినాథునికి నా ప్రణామాలు". నేను ఒక సాయి భక్తురాలిని. బాబా నా జీవితంలో ఎప్పుడూ నాకు తోడుగా ఉన్నారు. 2022, జులై 4న బాబా నాకు ప్రసాదించిన అనుభవం నేను నా జీవితంలో మర్చిపోలేనిది. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. నాకు ఉద్యోగం చేయడమంటే చాలా ఇష్టం. కానీ నా కుటుంబం పరిస్థితులు 17 సంవత్సరాలపాటు నేను ఉద్యోగం చేయడానికి అనుకూలించలేదు. ఇక నా కోరిక తీరదేమోనని నేను చాలా మధనపడ్డాను. కానీ ఇప్పుడు పిల్లలు పెద్దయ్యారు. ఉద్యోగం చేయడానికి నాకు తీరిక దొరికింది. అయితే ఐటి సెక్టారులో ఉద్యోగం రావాలంటే అనుభవం అడుగుతారు. దానికోసం ఏం చేయాలని మధనపడుతుండగా నా ఫ్రెండ్ ఒక కోర్సు చేయమని సలహా ఇచ్చింది. నేను ఆ కోర్సును రెండు నెలలు ఎంతో శ్రద్ధగా నేర్చుకున్నాను. కానీ ఎక్కువ అనుభవం చూపించాలంటే నాకు చాలా భయమేసి, "సాయీ! నాకు కంపెనీవాళ్లే శిక్షణ ఇచ్చి ఉద్యోగంలోకి తీసుకోవాల"ని సాయికి దణ్ణం పెట్టుకున్నాను. దయామయుడైన సాయి నాకు అలాంటి అవకాశమే ఇచ్చారు. నేను మొదటి రెండు రౌండ్ల ఇంటర్వ్యూ చాలా సుళువుగా పూర్తి చేశాను. కానీ మూడో రౌండ్ చాలా కష్టమనిపించింది. ఎందుకంటే, అది వాయిస్ టెస్ట్ రౌండ్. మొదటిసారి అందులో నాకు స్కోర్ సరిగ్గా రాలేదు. రెండోసారి నా వాయిస్ రికార్డ్ అవ్వలేదు. చివరిగా నాకు మూడో అవకాశం ఇచ్చారు. అప్పుడు నేను, "సాయీ! ఈ రౌండ్ క్లియర్ ఐతే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని సాయికి దణ్ణం పెట్టుకున్నాను. బాబా దయవలన జులై 4న నేను ఆ రౌండ్ క్లియర్ చేసానని, నెక్స్ట్ వీక్ లో ఆఫర్ లెటర్ ఇస్తామని కాల్ చేసి చెప్పారు. తరువాత జులై 19న మంచి జీతంతో నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇదంతా సాయి దయవల్ల జరిగింది. ఆయన నేను పడుతున్న టెన్షన్ అంతా తీర్చేశారు. నా జీవితంలో ఇది ఒక గొప్ప మలుపు. ఇదంతా బాబా దయ. "ధన్యవాదాలు సాయి. కంపనీవాళ్ళు బ్యాక్‍గ్రౌండ్ వెరిఫికేషన్‍కి డాక్యూమెంట్లు అప్లోడ్ చేయమంటే చేశాను. మీ దయవల్ల అది కూడా పూర్తై నా ఉద్యోగం పేర్మినెంట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అది నెరవేరితే నా అనుభవాన్ని మళ్ళీ బ్లాగులో పంచుకుంటాను. మీ ఆశీస్సులతో నా ఉద్యోగ జీవితం సఫలమవ్వాలి బాబా. అలాగే నా పిల్లలు చదువుని, కుటుంబాన్ని మీరే చూసుకోవాలి. మీకు నా శతకోటి నమస్కారాలు బాబా". శ్రీ సచ్చిదానందా సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.
Om Sai ram
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
OME
ReplyDeleteOme sri satchinanda sanardha sadguru sai nath maharaj ki jai🙏🙏🙏🙏🙏
ReplyDeleteA carpenter manasu marchi money maku vachela cheyi thandri please baba
ReplyDelete