1. ప్రతి సందర్భంలో 'నేనున్నాన'ని అభయమిస్తున్న బాబా
2. సాయినాథుని అనుగ్రహం
ప్రతి సందర్భంలో 'నేనున్నాన'ని అభయమిస్తున్న బాబా
సాయిబంధువులకు మరియు 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకు నమస్కారం. నేను సాయిభక్తురాలిని. నేను ఇదివరకు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. ఒకసారి మా అత్తమ్మ మా మరిది వాళ్ళింట్లో ఉన్నప్పుడు ఆమెకి షుగర్ బాగా తగ్గిపోతే, మా మరిది హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళాడు. డాక్టరు అత్తమ్మను హాస్పిటల్లో అడ్మిట్ చేయమన్నారు. అప్పుడు మా మరిది మాకు ఫోన్ చేసి, "అమ్మ ఆరోగ్యం బాగాలేదు. తను ఏమీ తినడం లేదు. నడవడానికి కూడా రావడం లేదు. షుగర్ బాగా తగ్గిపోయింది. డాక్టరు హాస్పిటల్లో అడ్మిట్ చేయమంటున్నారు" అని అన్నారు. దాంతో నేను, మావారు అత్తమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేద్దామని బయలుదేరాము. నేను బయలుదేరేముందు బాబాకు దణ్ణం పెట్టుకుని, "బాబా! అత్తమ్మకి ఏమీ కాకూడదు. తను క్షేమంగా ఇంటికి రావాలి. అలా అయితే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని మ్రొక్కుకున్నాను. తరువాత మేము హైదరాబాద్ వెళ్తుంటే దారిలో బాబా మాకు దర్శనమిచ్చారు. నాకు చాలా సంతోషమేసింది. అదేరోజు అత్తమ్మని హైదరాబాద్ హాస్పిటల్లో అడ్మిట్ చేద్దామని వెళ్లిన మేము, బాబా దయవల్ల ఆమెకి కొంచెం బాగానే ఉండటంతో ఆమెను తీసుకుని నిజామాబాద్‌కి తిరుగు ప్రయాణమయ్యాము. అప్పుడు కూడా బాబా దర్శనమిచ్చారు. బాబాను చూసి నాకసలు ఏడుపు ఆగలేదు. 'ప్రపంచంలో మీరు ఎక్కడున్నా నేను మీతోనే ఉన్నాన'ని బాబా అన్నారు కదా! ఆయన దయతో మా అత్తమ్మ తొందరగా కోలుకునేలా చేశారు.
ఒకరోజు రాత్రి మేము పుట్టినరోజు పార్టీకి వెళ్లాము. అక్కడ నా ఫోన్ కనపడలేదు. అప్పుడు నేను, "బాబా! ఫోన్ దొరికితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. మావారు నా ఫోనుకి కాల్ చేస్తే, రింగ్ అయి ఎక్కడో పచ్చగడ్డిలో దొరికింది. అప్పుడు రాత్రి పదిన్నర అయింది. "థాంక్యూ సో మచ్ బాబా".
ఒకసారి మేము పెళ్ళికని మహారాష్ట్ర వెళ్లవలసి వచ్చింది. ఆ సమయంలో మా కారు పాడైపోవడం వల్ల మావారు మా అన్నయ్యని కారు అడిగారు. అన్నయ్య వేరే ఊరిలో ఉన్నప్పటికీ, 'బావగారు అడిగారు కదా!' అని కారు తీసుకొచ్చి మాకిచ్చి వెళ్లాడు. మేము సంతోషంగా పెళ్లికి వెళ్ళొచ్చాము. అప్పుడు నేను మావారితో, "రేపు అన్నయ్యకి కారు ఇచ్చేసి రండి" అని అన్నాను. ఆ మాటకి మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మరుసటిరోజు ఉదయం 7 గంటలకి నేను నిద్రలేచేసరికి మావారు లేరు, కారు కూడా లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన కాల్ లిఫ్ట్ చేయలేదు. కొద్దిసేపటికి మా వదిన ఫోన్ చేసి, "అన్నయ్యని ఏమన్నావు? కారు తీసుకొచ్చి బస్టాండ్ దగ్గర ఉన్నారంట. మీ అన్నయ్యకు ఫోన్ చేశారు" అని నన్ను తిట్టింది. నేను ఫోన్ పెట్టేసి, "బాబా! మీ దయవల్ల నాకు, మా ఆయనకి మధ్య మనస్పర్థలు తొలగిపోయి, మునుపటిలాగే మంచిగా మాట్లాడుకోవాలి" అని బాబాను వేడుకున్నాను. మావారు ఆ ఒక్కరోజు కొంచెం ముభావంగా ఉన్నప్పటికీ బాబా దయవల్ల మరుసటిరోజు నాతో మంచిగా మాట్లాడారు. "థాంక్యూ బాబా".
ఒకసారి మా మేనత్తకి గొంతులో బాగా నొప్పి వచ్చి, నీళ్లు కూడా మింగడానికి కష్టమైంది. ఆమె డాక్టరుకి చూపించుకుందామని నిజామాబాద్ వచ్చారు. నేను, "బాబా! మీ దయవల్ల మా మేనత్తకి ఏ పెద్ద సమస్యా రాకూడదు" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల, "పెద్ద సమస్య ఏమీ లేదు" అని డాక్టర్ అన్నారు. "థాంక్యూ బాబా".
ఇంకోసారి మా మేనత్త కూతురికి బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంటే, మహారాష్ట్రలో చూపించుకుంది. డాక్టర్లు, "బయాప్సీ చేయాల"ని అన్నారు. ఆమె భయపడి నిజామాబాద్ హాస్పిటల్‍కి వచ్చింది. డాక్టర్ టెస్టులు చేశారు. అప్పటికే ఆమె కడుపుకు చాలా ఆపరేషన్లు జరిగి ఉన్నందున నేను, "బాబా! మీ దయవల్ల రిపోర్టులో ఏమీ ఉండకూడదు" అని వేడుకున్నాను. డాక్టర్ రిపోర్టులు చూసి, "థైరాయిడ్ ఉంది. గర్భసంచి వాచింది. మందులు ఇస్తాను. అవి వాడి, రెండు నెలల తర్వాత రండి. చూద్దాము" అని అన్నారు. "ధన్యవాదాలు బాబా. మీ దయవల్ల తనకి ఆపరేషన్ అవసరం లేకుండా మందులతోనే తగ్గిపోయేలా అనుగ్రహించండి బాబా"
ఒకసారి మా పాపకి కళ్ళు బాగా వాస్తుంటే డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళాము. అప్పుడు నేను, "ఏ సమస్యా ఉండకూడదు బాబా" అని బాబాతో చెప్పుకున్నాను. ఆయన దయవల్ల డాక్టరు, "పెద్ద సమస్యేమీ లేదు. ఇది డస్ట్ ఎలర్జీ" అని అన్నారు. "థాంక్యూ బాబా".
ఒకసారి వర్షం పడి ఆ రాత్రి కరెంటు పోయి మరుసటిరోజు తెల్లారి వచ్చింది. ఆరోజు కూడా రాత్రి పది గంటలకి కరెంటు పోయింది. అప్పుడు నేను, 'నిన్న కరెంటు లేనందువలన నిద్రపోలేదు. మళ్లీ ఈరోజు కూడా కరెంటు పోయింది. ఈరోజు కూడా నిద్ర ఉండదా?' అని అనుకున్నాను. 11:30 గంటల వరకు వేచి చూసినప్పటికీ కరెంటు రాలేదు. ఇక లాభం లేదనుకుని, "బాబా! కరెంటు వస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయచూపారు. రాత్రి 12 గంటలకు కరెంటు వచ్చింది. "థాంక్యూ బాబా. అన్ని సమస్యల్లో నేనున్నానని మాకు ధైర్యాన్నిస్తున్నావు తండ్రీ".
సర్వేజనాః సుఖినోభవంతు!!!
సాయినాథుని అనుగ్రహం
అందరికీ నమస్కారం. నేను సాయిభక్తుడిని. నేను ఇటీవల చాలా అనుభవాలు బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు ఇంకో అనుభవంతో మళ్లీ మీ ముందుకి వచ్చాను. మామూలుగా ప్రతి సంవత్సరం మేము సింహాచలం వెళ్తుంటాము. అయితే కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలు వెళ్ళలేకపోయాము. ఈ సంవత్సరం వెళదామనుకుంటే రెండుసార్లు ఆటంకం వచ్చి ఆగిపోయాము. తరువాత మళ్లీ వెళదామనుకునేసరికి మా నాన్నగారికి జలుబు, దగ్గు మొదలయ్యాయి. అప్పుడు నేను, "అయ్యా, సాయినాథా! ఎలాగైనా రేపు మా ప్రయాణం ఏ ఆటంకం లేకుండా సాఫీగా సాగాలి. అలా జరిగితే, నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను. అలాగే మీ గుడికి వచ్చి 11 ప్రదక్షిణలు చేస్తాను" అని బాబాని వేడుకున్నాను. బాబా దయవల్ల ఆరోజు సాయంత్రానికి నాన్నకి జలుబు, దగ్గు కొంచెం తగ్గుముఖం పట్టడం ప్రారంభమై మరుసటిరోజుకి పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఇక మా యాత్ర హాయిగా సాగింది.
ఈమధ్య మా ఆఫీసులో చికాకులు బాగా పెరిగాయి. పని వత్తిడి, పైఆఫీసర్లు తిట్టటం లాంటివి పెరిగి నాకు మనశ్శాంతి కరువయ్యేలా చేశాయి. దాంతో రాత్రిళ్ళు నిద్ర ఉండేది కాదు. అప్పుడు నేను బాబాను, "బాబా! పరిస్థితులు చక్కబడేలా చూడండి. నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి'లో పంచుకుంటాను. మీ గుడికి వచ్చి 11 ప్రదక్షిణలు చేస్తాను" అని వేడుకున్నాను. ఇప్పుడు నెమ్మదిగా నా సమస్యలు తగ్గుముఖం పడుతున్నాయి. అది బాబా దయ మాత్రమే. కానీ పూర్తి స్థాయిలో ఒత్తిడి తగ్గలేదు. ఏదేమైనా నా బాబా నా వెన్నంటే ఉంటారని నాకు తెలుసు. ఆయన దయతో నా సమస్యలు పూర్తిగా పోతాయని ఆశిస్తున్నాను. "ధన్యవాదాలు బాబా".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sai ram
ReplyDeleteఓం సాయినాథా నమః నాకు అమెరికా వెళ్లాలని వుంది నా కోరిక నెరవేరేలాగ అనుగ్రహముతో ఆశీస్సులు అందించు.నాకు ఫోబియ వుంది దానిని పరిష్కరించు.నా కోరిక తీరేలాగ చూడు తండ్రి. నేను పడిన భాథ నీకు తెలుసు.
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai Always be with me
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteSeat ravali thandri please baba
ReplyDelete