సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1252వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయినాథుని అనుగ్రహ వీచికలు
2. ఎంత చిన్న సమస్యనైనా ఇట్టే తీర్చేస్తారు బాబా 
3. భక్తుల బాధలు తొలగించే బాబా

శ్రీసాయినాథుని అనుగ్రహ వీచికలు


సాయిబంధువులకు నమస్కారాలు. నా పేరు రేవతి. నేను గవర్నమెంట్ స్కూలు టీచరుని. NEP(నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ) అమలులో భాగంగా 3 కిలోమీటర్ల పరిధిలోని పాఠశాలలను సమీప హైస్కూల్లో విలీనం చేస్తారు. 2022లో మా స్కూలులోని 3,4,5 తరగతులను సమీప హైస్కూలుకి తరలిస్తామని అన్నారు. ఆ విషయం తెలిసి పిల్లలు, తల్లిదండ్రులు ఎంతో ఆందోళన చెందారు. మా ఉపాధ్యాయులం కూడా చాలా బాధపడ్డాము. ఆ సమయంలో నేను బాబాను ఒకటే ప్రార్థించాను: "బాబా! చిన్నపిల్లలు అంత దూరం నడవలేరు. ఏదైనా చేయడానికి మా చేతుల్లో ఏమీ లేదు. కాబట్టి మీరే ఏదో ఒకటి చేసి దీన్ని ఆపాలి" అని. బాబా నా మొర ఆలకించారు. ఈ సంవత్సరం హైస్కూలులో అదనపు తరగతి గదులు లేనందున మా పాఠశాల విలీన ప్రక్రియను తాత్కాలికంగా ఆపేశారు. అంటే, ఈ విద్యాసంవత్సరంలో మా స్కూలు విలీనం ఉండదు. మరుసటి సంవత్సరం కూడా బాబా ఏదో ఒక సహాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. "ధన్యవాదాలు బాబా. మీ వల్ల ప్రస్తుతానికి మా విద్యార్థుల సమస్య పరిష్కరించబడింది. దాన్ని పూర్తిగా పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను తండ్రీ".


మావారు కూడా టీచరుగా పనిచేసున్నారు. అయితే ఆయన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్టుమెంటులో టీచరు. 2022, జూన్ 25 తేదీన ఆ డిపార్టుమెంటులో ట్రాన్స్‌ఫర్లు జరిగాయి. ఆ సమయంలో నేను, "బాబా! మా మనసుల్లో ఎక్కడికి ట్రాన్స్‌ఫర్ జరగాలని ఉన్నా మీరు మావారికి ఏ ప్లేస్ కరెక్ట్ అనుకుంటున్నారో అక్కడికే ట్రాన్స్‌ఫర్ చేయండి" అని వేడుకున్నాను. మేము అనుకున్న చోటుకి మావారికి ట్రాన్స్‌ఫర్ కాలేదుగానీ, బాబా దయవల్ల కొంచెం దూరమైనా మేము అనుకున్న చోటు కంటే మంచి చోటుకి ట్రాన్స్‌ఫర్ అయింది. మనకేది మంచిదో మనకంటే ఎక్కువ బాబాకే తెలుసు. అందుకే నేను నా బాధ్యతలన్నీ బాబాకి అప్పగిస్తాను. నా కష్టసుఖాలన్నీ బాబాకే చెప్పుకుంటాను. నాకు అన్నీ బాబానే. "ధన్యవాదాలు సాయినాథా".


మేము ఒక సైట్ తీసుకోవాలనుకున్నాక మొదట ఒక సైట్ చివరిదాకా వచ్చి చేజారిపోయింది. ఇంకా రెండు నెలలు గడిచినా మాకు సరైన సైట్ దొరకలేదు. అప్పుడు నేను, "తండ్రీ! ఏది మంచిదో, ఏది చెడ్డదో మాకు తెలీదు. కాబట్టి ఈ విషయంలో మీదే భారం" అని బాబాకి చెప్పుకున్నాను. మొదట మేము చూసిన సైట్ కంటే చాలా మంచి సైట్ను, అది కూడా సరసమైన ధరలో బాబా మాకు సెట్ చేసారు. లోన్కి అప్లై చేస్తే 4 రోజుల్లోనే డబ్బు వచ్చింది. మధ్యలో కొంచెం టెన్షన్ పడినా ఆ సాయినాథుని, శ్రీలక్ష్మీనారాయణుల దయవల్ల ఏ ఆటంకం లేకుండా వారం రోజుల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. "ధన్యవాదాలు బాబా".


ఒకసారి మా చెల్లివాళ్ల పాపకి, బాబుకి జ్వరం వస్తే ఊదీ కలిపిన నీళ్ళు త్రాగించి, ఊదీ పెట్టగానే బాబా దయవల్ల జ్వరం నెమ్మదిగా తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా"


ఒకరోజు మా కజిన్ నిశ్చితార్థానికి వెళ్ళొచ్చాక మా చెల్లి చైన్‍కి ఉండాల్సిన లాకెట్ కనిపించలేదు. నేను మా చెల్లితో, "బాబాను ప్రార్థించు, లాకెట్ దొరుకుతుంది" అని చెప్పాను. తను అలాగే చేసింది. బాబా దయవల్ల తలగడ క్రింద లాకెట్ దొరికింది. "ధన్యవాదాలు తండ్రీ".


శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


ఎంత చిన్న సమస్యనైనా ఇట్టే తీర్చేస్తారు బాబా 


సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు గోపాలకృష్ణ. నేను సంవత్సరంన్నర కాలంపాటు సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్ఎతూ న్నోసార్లు బాబాతో, "బాబా! ఈ ఉద్యోగం నా కల" అని చెప్పుకున్నాను. బాబా నా ప్రార్థనకు స్పందించారు. ఆయన దయతో 2022, జూన్ 16, గురువారం నాడు నోటిఫికేషన్ వచ్చింది. ఆ వార్త తెలిసి నా నిరీక్షణ ఫలించిందని నాకు చాలా ఆనందమేసింది. జూన్ 20న ఆన్లైన్‍లో దరఖాస్తు చేసుకునే క్రమంలో నేను ముందుగా దరఖాస్తు రుసుము ఆన్లైన్‍లో చెల్లించాను. డబ్బులు సదరు డిపార్ట్మెంట్‍కి చేరినట్లు నాకు సందేశం వచ్చింది. కానీ దరఖాస్తు ప్రక్రియ పూర్తికాలేదు. నేను చాలా టెన్షన్ పడి మరోసారి ప్రయత్నించాను కానీ, ప్రయోజనం లేకపోయింది. ఇంకా నేను హెల్ప్‌లైన్‍కి కాల్ చేశాను. కానీ వాళ్ళు స్పందించలేదు. రెండురోజులు చూసి, "బాబా! నా ఈ సమస్యకు పరిష్కారం చూపండి" అని బాబాని వేడుకున్నాను. మూడోరోజు, అంటే గురువారం మధ్యాహ్నం రెండు గంటలకి మరోసారి టెక్నికల్ హెల్ప్‌లైన్‍కి కాల్ చేశాను. అంతకుముందు ఎన్నిసార్లు కాల్ చేసినా స్పందించని హెల్ప్‌లైన్ వాళ్ళు ఈసారి వెంటనే స్పందించారు. నేను వాళ్ళకి  నా సమస్య గురించి చెప్తే, వాళ్ళు నా మొబైల్ నంబర్ అడిగి తీసుకుని 7 రోజులలో డబ్బులు వెనక్కి పంపించారు. అప్పుడు మళ్ళీ దరఖాస్తు రుసుము చెల్లించి ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేశాను. "ధన్యవాదాలు బాబా. నాకు ఎన్ని సమస్యలు వచ్చినా వెన్నంటివుండి రక్షిస్తున్నావు తండ్రీ". 


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!!


భక్తుల బాధలు తొలగించే బాబా


సాయిబంధువులకు నమస్కారం. నా పేరు కార్తిక్. 2022, జూన్ 22, బుధవారం ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల మా అన్నయ్య తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుంటే, మేము తనని హాస్పిటల్లో జాయిన్ చేశాము. మందులతో సాయంత్రానికి నొప్పి కొంత తగ్గింది. కానీ మరుసటిరోజుకి మళ్ళీ ఎక్కువైంది. సాయిబాబా కృపవల్ల ఆ ముందురోజే నాకు 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగుకి సంబంధించిన 'సాయిభక్తుల అనుభవాలు' అనే టెలిగ్రామ్ గ్రూపు గురించి తెలిసింది. అందులోని భక్తుల అనుభవాలు చదివాక, 'కేవలం ఈ బ్లాగులో అనుభవాలు పంచుకుంటామని చెప్పుకుంటే సాయి మన బాధలు తొలగిస్తున్నార'ని నాకు ఆనందాశ్చర్యాలు కలిగాయి. అప్పుడు నేను కూడా సాయిబాబాకు, "బాబా! మా అన్నయ్య త్వరగా కోలుకునేటట్లు చూడండి. నేను కూడా నా అనుభవం ఈ బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల మరుసటిరోజుకల్లా అన్నయ్య కడుపులోని ఇన్ఫెక్షన్ కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చింది. డాక్టరు, "ఫుడ్ పాయిజన్ అయినా కోలుకున్నందుకు మనం సంతోషించాలి" అని అన్నారు. బాబా దయవల్ల అన్నయ్యకి త్వరగా నయమైంది. అందుకు నేను నా ఆజన్మాంతం బాబాను తలచుకుంటూ ఉంటాను. "ధన్యవాదాలు బాబా".


5 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete
  3. Baba we want your blessings.one week we stayed with our daughter.we enjoyed with grand sons..Baba my husband is feeling tension.He suffered with sasama he can't breath.please cure.Give full aaush and long life to children. also.om sai ram

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo