1. అంతా బాబా దయ
2. బాబా తోడుంటే అంతా మంచే జరుగుతుంది3. సాయినాథుని తలస్తే ఏదైనా సిద్ధిస్తుంది
అంతా బాబా దయ
నేను ఒక సాయి భక్తురాలిని. ఒకసారి మేము మా ఇంట్లో సాయి నవగురువార వ్రతం చేసుకున్నాము. 8 వారాలు అయ్యాక అనుకోని ఆటంకం వచ్చి 9వ వారం చేయాల్సిన వ్రత ఉద్యాపన రెండు వారాల వరకు చేయలేకపోయాము. అప్పుడు, "బాబా! ఉద్యాపన మంచిగా జరగాలి" అని బాబాను ప్రార్థించాము. ఉద్యాపన రోజు పూజ చేస్తుండగా అనుకోకుండా వర్షం వచ్చింది. కరెంటు కూడా పోయింది. "అయ్యో బాబా! ఇలా అయ్యింది ఏంటి?" అని చాలా బాధపడ్డాము. బాబా దయవలన వంటలు అన్నీ సిద్ధం అయ్యాయి. వర్షం పడుతున్నా, కరెంటు లేకపోయినా పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. బాబాయే రప్పించారు. అయన దయవల్ల ఒక్క కరెంటు లేదన్న వెలితి తప్ప మిగిలినదంతా సక్రమంగా జరిగింది. అనుకున్నట్లే 9 రకాల నైవేద్యాలను బాబాకు నివేదించి పూజ పూర్తి చేసాము. అందరూ భోజనాలు చేసి, తాంబూలాలు తీసుకోని వెళ్లారు. వండిన పదార్ధాలు అందరికీ సరిగ్గా సరిపోయాయి. అలా బాబా దయవలన ఉద్యాపన రోజున పూజ చాలా బాగా జరిగింది. మాకు చాలా సంతోషంగా అనిపించింది. "థాంక్యూ సో మచ్ బాబా".
ఒకరోజు మేము జాతరకు వెళ్ళాము. అది ఆఖరిరోజు కావడం వల్ల దాదాపు 50,000 మంది వరకు జనం వచ్చారు. ఆ రద్దీలో దర్శనానికి ఖచ్చితంగా 3 గంటల సమయం క్యూలో వేచి ఉండాలి. అయితే మాకు తెలిసిన ఒక వ్యక్తి వెనక వైపు నుండి లోపలికి తీసుకువెళ్లి దర్శనం చేయిస్తానని అన్నాడు. తీరా మేము బోనాలు తయారు చేసుకుని దర్శనం కోసం వెళ్లేసరికి అతను బిజీగా ఉన్నాడు. మేము అక్కడే వెనుక వైపు అతనికోసం ఎదురు చూడసాగాము. నేను, మా అక్క బాబా నామజపం చేసుకుంటూ, "బాబా! దర్శనం తొందరగా అయ్యేలా అనుగ్రహించు తండ్రి. మేము అంతసేపు క్యూలో నిలబడలేము. నాన్నకి షుగర్, మోకాలు నొప్పులు ఉన్నాయి" అని వేడుకున్నాము. ఆ సమయంలో అక్కడ పోలీసులు లేకపోవడంతో మేము బాబా నామజపం చేసుకుంటూ లోపలికి వెళ్లి దర్శనం చేసుకుని వచ్చాము. మాకు ఎవరూ అడ్డు చెప్పలేదు. అందరికీ దర్శనానికి మూడు గంటల సేపు పడుతుంటే మాకు మాత్రం కేవలం రెండు నిమిషాలలో అయిపోయింది. ఇదంతా బాబా దయ. "ధన్యవాదాలు బాబా. కొందరి అనుభవాలు ద్వారా ఎలాంటి సమస్య ఉన్నా నమ్ముకున్నవాళ్ళకి మీరు ఎలా సహాయం చేస్తున్నారో తెలుస్తుంది. అవి నా మనసుకు సంతోషాన్నిస్తున్నాయి. కానీ నేను ఒక ఆడపిల్లని. మీ బిడ్డని. నా సమస్యలు మీకు తెలుసు. నాకు చాలా చాలా అంటే చాలా బాధగా ఉంది. నా జీవితంలో సంతోషం అనేది లేదా? అందరికి మంచి జీవితాన్ని ఇచ్చే మీరు నాకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వలేరా బాబా? ఇలా అంతులేని నా ప్రశ్నలకు సమాధానమివ్వు బాబా. నిన్నే నమ్ముకున్నాను. ఎన్ని రాత్రులు మీకోసం ఏడ్చానో మీకు తెలుసు తండ్రి. నాకున్న హార్ట్ ప్రాబ్లెమ్ అనే సమస్య లేకుండా చేయండి ప్లీజ్. అలాగే నాకు పెళ్లి అయ్యేలా ఆశీర్వదించి నాకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వు బాబా. నువ్వు ఇచ్చే మంచి జీవితాన్ని అందరూ చూడాలి, 'తనకి బాబా ఉన్నార'ని అనుకోవాలి. అలాగని పెళ్లే జీవితమని నేను అనట్లేదు కానీ, సమాజంలో అందరూ అర్ధం చేసుకునేవాళ్లు ఉండరు. మంచి జీవితం అంటే సుఖం-దుఃఖం, మంచి-చెడుతోపాటు మీరు ఉండటం, ఎవ్వరు నన్ను వదిలేసినా, వదిలి వేయకున్నా నువ్వు నా చేయి నా చివరివరకు పట్టుకుని ఉండటం. అంతే బాబా".
బాబా తోడుంటే అంతా మంచే జరుగుతుంది
సాయి బంధువులందరికీ నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. బాబా ఏవిధంగా నాతో ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నారో ఇదివరకు మీతో పంచుకున్నాను. నేను ఈ బ్లాగులోని భక్తుల అనుభవాలను చదువుతూ, నా అనుభవాలను పంచుకున్నప్పటి నుండి నేను ఎప్పుడు బయటకి వెళ్లాల్సి ఉన్నా బయలుదేరే ముందు "బాబా! నాకు తోడుగా ఉండి ప్రయాణంలో ట్రాఫిక్ సమస్యలు వంటివి ఏమీ లేకుండా జాగ్రత్తగా తిరిగి ఇంటికి చేర్చండి" అని సాయికి చెప్పుకుని బయలుదేరుతున్నాను. బాబా దయవల్ల ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా జరుగుతుంది.
ఈమధ్య నాకున్న ఆరోగ్య సమస్య విషయంలో హోమియో డాక్టరు దగ్గరకి వెళదామని అనుకున్నాను. ఆ డాక్టరు సోమవారం మాత్రమే వస్తారు. కానీ నేను అతని దగ్గరకి వెళదామనుకున్న తరువాత ఒక వారం అతను రాలేదు. ఆ తరువాత వారం నాకు కుదరలేదు. మూడోవారం ఉదయం వెళదామంటే వర్షం పడింది. అప్పుడు నేను, "ఇదేంటి సాయి, డాక్టరు దగ్గరకి వెళదామనుకుంటే ఇలా జరుగుతుంది. ఇప్పుడింక ఎలాగైనా బయలుదేరుతాను బాబా. నాకు ఏ ఆటంకం కలగకుండా, వర్షంలో తడవకుండా నన్ను ఇంటికి తిరిగి తీసుకొచ్చే భాద్యత మీదే" అని బాబాతో చెప్పుకున్నాను. సాయితో చెప్పానుగా ఇంకా వర్షమూ లేదు, ఏమీ లేదు. కేవలం మబ్బుగా ఉంది. బాబా దయవల్ల నేను డాక్టరును కలిసి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాను. మరుసటి వారం కూడా మబ్బుగా ఉందిగానీ వర్షం పడలేదు. కొంచం ఆలస్యమైనా బాబా తోడుగా ఉంటే అంతా మంచే జరుగుతుంది. "ధన్యవాదాలు సాయి. నాకున్న అతిపెద్ద సమస్యను పరిష్కరించి నా జీవితానికి ఒక మార్గం చూపండి సాయి".
సాయినాథుని తలస్తే ఏదైనా సిద్ధిస్తుంది
ఓం శ్రీసాయినాథాయ నమః!!! నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలు మీతో పంచుకున్నాను. సాయినాథుని తలచి ఏదైన పని తలపెడితే, అందులో తప్పక విజయం సాధిస్తామని నాకు మళ్ళీ ఋజువైంది. ఆ అనుభవాన్ని నేనిప్పుడు ముందుగా అనుకున్న విధంగా మీతో పంచుకుంటున్నాను. మా దేవుని గదిలో చాలా చిన్న లక్ష్మి కాసులు మూడు ఉండేవి. ఒకరోజు చూస్తే, రెండు కాసులు మాత్రమే కనిపించాయి. ఇంకో కాసు కోసం అంతా వెతికాము కాని, కనపడలేదు. అప్పుడింక సాయిబాబాను ప్రార్ధించి వాడిపడేసిన పువ్వులలో వెతికితే బాబా దయవలన ఆ కాసు దొరికింది. "ధన్యవాదాలు బాబా".
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
Om Sri Sai Naadhaya Namaha 🙏🏼🙏🏼🙏🏼🌸🌸
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Jaisairam bless amma for her health and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam
ReplyDeleteOm sai ram
ReplyDeleteOm sai ram yesterday we performed. Pooja with my daughter and son_in_law,grand sons.Happily we did pooja.in evening we went to Baba's temple
ReplyDeleteOm sairam
ReplyDeleteSai always be with me
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOm sai ram 🙏
ReplyDelete