1. 'పిలిస్తే పలుకుతాన'ని ప్రతీసారి నిరూపిస్తూ విశ్వాసాన్ని దృఢపరుస్తున్న బాబా
2. శ్రీసాయినాథుని కరుణ
3. ఉద్యోగం ప్రసాదించిన బాబా
'పిలిస్తే పలుకుతాన'ని ప్రతీసారి నిరూపిస్తూ విశ్వాసాన్ని దృఢపరుస్తున్న బాబా
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!! 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు మరియు సాయి భక్తులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. జీవితంలో మనం ఎన్నో సమస్యలను, కష్టాలను ఎదురుకుంటూ ఉంటాము. సాయి భక్తులమైన మనం ఆ సాయినాథుని ప్రార్థించినంతనే ఆయన ఆ కష్టాలను గట్టెక్కిస్తున్నారు. సాయినాథుని దయతో మన కష్టాలు తొలిగిన క్షణాన మనకి ఆనందానుభూతి కలుగుతుంది. అలాంటి అనుభవాలను పంచుకోవడం వల్ల ఆ సాయినాథుడు సదా తమను స్మరించేవారి వెంట ఉంటారనే విశ్వాసం భక్తులలో దృఢమవుతుంది. అలాగే బాబా అనుగ్రహం మన మీద ఎంతలా ఉందో తలుచుకుంటూ ఆయన భోదించిన రీతిలో మన జీవితాలను చక్కదిద్దుకునే ప్రయత్నం జరుగుతుంది. అనుభవాలను పంచుకునే అవకాశమిస్తున్న 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు వారికి కృతజ్ఞతలు. నేను ఇదివరకు ఈ బ్లాగులో మూడు సార్లు నా అనుభవాలు పంచుకున్నాను. ఇపుడు మరో మూడు అనుభవాలను పంచుకోబోతున్నాను.
ఈ మధ్యకాలంలో మేము మా కుటుంబమంతా కలిసి తిరుమల దర్శనానికి బయలుదేరాము. పెళ్లి అయిన తరువాత మేము మొదటిసారి తిరుమలకి వెళ్తున్నందువల్ల ఏ చింతా లేకుండా దర్శనం చేసుకోవాలని నేను ఆశపడ్డాను. కానీ సరిగా అదే సమయానికి మాకు తెలిసిన దూరపు బంధువులు కూడా తిరుమలకి వస్తున్నారని మాకు తెలిసింది. ఆ విషయం తెలియగానే నాకు మనస్తాపం కలిగింది. ఎందుకంటే, మావారికి వాళ్లని కలవడం పెద్దగా ఇష్టం లేదు. ఒకవేళ వాళ్ళు ఎదురుపడితే మాటామాటా వచ్చి ఏదైన గొడవ జరుగుతుందేమోనని నేను భయపడి బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! మేము, వాళ్ళు కలిసే సందర్భం రాకూడదు. మేము ప్రశాంతంగా దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి చేరుకోవాలి. మీ దయతో మా యాత్ర సజావుగా జరిగితే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా అనుగ్రహం వల్ల వాళ్ళు, మేము కలుసుకోలేదు. చక్కగా స్వామి దర్శనం చేసుకుని ఇంటికి తిరిగి వచ్చాము. బాబా కరుణతో మా యాత్ర హాయిగా జరిగింది.
నా తమ్ముడు L.L.B ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. సరిగా వాడు తన రికార్డులు వ్రాసుకోవాల్సిన సమయానికి వాడికి జలుబు, జ్వరం తీవ్రంగా వచ్చాయి. ఒకరోజు వాడు నాకు ఫోన్ చేసి, "నేను రికార్డులు వ్రాయలేకున్నాను. ఆఖరి తేదీ దగ్గరకి వచ్చేసింది. ఏమి చెయ్యాలో తోచట్లేదు" అని చెప్పాడు. నాకు వాడి విషయంలో ఆందోళనగా అనిపించి, "బాబా! వాడికి ఏదో విధంగా సహాయం చేయండి. వాడు గనక ఆఖరి తేదీలోగా రికార్డులు వ్రాసి కాలేజీలో సబ్మిట్ చేస్తే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా అనుగ్రహం వల్ల తమ్ముడు తన రికార్డులు వ్రాసి సరిగ్గా ఆఖరి తేదీన కాలేజీలో సమర్పించాడు. ఆ పక్క రోజుకి వాడి జలుబు, జ్వరం తగ్గిపోయాయి. అనారోగ్యంతో అవస్థ పడుతున్న తమ్ముడికి రికార్డులు పూర్తి చేసే శక్తిని బాబానే ప్రసాదించారు. "థాంక్యూ సో మచ్ బాబా".
నేను ఈమధ్య మావారికి సంబంధించిన ఒక పని మీద ఒక ఆఫీసుకి వెళ్ళాను. నిజానికి ఆ పనికి మావారే స్వయంగా వెళ్ళాలి. ఆయన లేకుంటే పని జరగదు. ఆ పని సమయానికి జరగకపోతే మాకు సమస్య అవుతుంది. కాని కొన్ని కారణాలు వల్ల మావారు వెళ్లలేని పరిస్థితి. అందువలన నేను మావారు లేకపోయినా పని జరిగేలా ఆఫీసువాళ్లని సహాయం అడుగుదామని అనుకున్నాను. ఆఫీసుకి వెళ్లే ముందు బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! నాకు సహాయం అందేలా ఆశీర్వదించండి. మీ దయతో ఆ పనైతే, నా అనుభవం 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను అని మ్రొక్కుకున్నాను. మొదట ఆఫీసువాళ్ళు కుదరదని చెప్పినప్పటికీ కాసేపటి తర్వాత సహాయం చేసి మావారు లేకుండానే పని పూర్తి చేసారు. ఇదంతా ఆ బాబా అనుగ్రహం. 'పిలిస్తే పలుకుతాను' అని ఆయన ప్రతీసారి నిరూపిస్తూ అంతకంతకు నా విశ్వాసాన్ని దృఢపరుస్తున్నారు. "ధన్యవాదాలు బాబా"
అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!
శ్రీసాయినాథుని కరుణ
ఓం శ్రీసాయినాథాయ నమః!!! సాయి భక్తులందరికీ నమస్కారం. నా పేరు ఉష. మాది హైదరాబాద్. నేను ఇంతకుముందు సాయి చూపిన కరుణను ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇపుడు సాయి ప్రసాదించిన మరికొన్ని అనుభవాలను మీతో ఆనందంగా పంచుకుంటున్నాను. కోవిడ్ కారణంగా ఇంట్లోనే ఆన్లైన్ క్లాసులు జరుగుతుండటం వల్ల మా పాప అసైన్మెంట్స్, వర్క్ అంటూ ఎప్పుడూ లాప్టాప్ ముందరే కూర్చుని ఉంటుంటే తను ఏమి చేస్తుందో నాకు అర్థం అయ్యేది కాదు. ఏమైనా తప్పుదోవలో వెళుతుందేమో అని ఒక్కోసారి సందేహం కలుగుతుండేది. అడిగితే, తన ఇంజనీరింగ్ వర్క్ అని చెబుతుండేది. ఏమైనా అంటే అసలు చదవటం అవ్వటం లేదు, మానేస్తాను అని ఏడుస్తుండేది. ఇటువంటి పరిస్థితుల్లో నేను బాబాతో పాప పరిస్ఠితి, నా భయం గురించి చెప్పుకుని ఆయన కృపకోసం ఎదురుచూసాను. ఆయన దయతో పాపలో మార్పు తీసుకొచ్చి, తన దృష్టి చదువు మీదనే ఉండేలా చేశారు. "థాంక్యూ బాబా".
కోవిడ్ వల్ల ప్రతి సంవత్సరం చేసుకునే ఇయర్లీ హెల్త్ చెకప్ మూడు సంవత్సరాలుగా మేము చేసుకోలేదు. చివరికి 2022, జూన్ 2న హాస్పిటల్‌కి వెళ్ళి, టెస్టులు చేయించుకుంటే షుగర్, బిపి లేవు కానీ, కొన్ని అబ్‍నార్మల్ రిపోర్టులు వచ్చాయి. వాటి గురించి మరలా మరలా టెస్టులు చేయించుకుంటూ నెలంతా హాస్పిటల్ చుట్టూ తిరగటంతోనే సరిపోయింది. చివరికి ఏమి అవుతుందో అని ఒకటే టెన్షన్‍గా ఉంటుంటే బాబాకి చెప్పుకుని, "రిపోర్టులు నార్మల్‌గా వచ్చి, మందులతో తగ్గితే, బ్లాగులో నా అనుభవాలను పంచుకుంటాను" అని వేడుకున్నాను. ఆయన దయవల్ల టెస్టులు, బయాప్సీ, స్కానింగ్‌లు అన్నీ అయ్యాక, "క్యాన్సర్ కాదు, నార్మల్ ఇన్ఫెక్షన్. కానీ కొద్దిగా ఎక్కువ మోతాదులో మందులు వాడాలి" అని అన్నారు. ఏదేమైనా బాబా దయవలన నా మనసుకి శాంతి కలిగింది. ఏదో పాపం వల్ల కొద్దిరోజులు ఈ శారీరక బాధను అనుభవించి ఆ పాపాన్ని పోగొట్టుకుంటాను. ఇది బాబా నాకిచ్చిన ఒక సదవకాశంగా భావిస్తాను. "థాంక్యూ బాబా. ఎల్లపుడూ ఇలాగే మాపై దయ, కరుణ చూపించండి. అలాగే అందరిపై కరుణతో, వాత్సల్యంతో ఉంటారని ఆశిస్తున్నాను బాబా".
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక శ్రీ సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!
ఉద్యోగం ప్రసాదించిన బాబా
సాయి భక్తులందరికీ నమస్కారం. నా పేరు ప్రతిమ. నేను ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. తన పేరు సంపత్. తను బీటెక్ పూర్తి చేశాడు. నేను తనకి మంచి ఉద్యోగం వస్తే, ఈ బ్లాగులో పంచుకుంటానని అనుకున్నాను. బాబా దయ చూపారు. అన్నయ్యకి ఉద్యోగం వచ్చి మొదటి నెల జీతం కూడా అందింది. "ధన్యవాదాలు బాబా. నా అనుభవం పంచుకోవడం ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి బాబా".
Om sai ram your words piliste paluku tanu ani your words are beautiful.Baba,Baba please save us and be with us and give blessings to us
ReplyDeleteOm sri sai ram 🙏🏼🙏🏼🙏🏼
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sri Sainathaaya namaha
ReplyDeleteఅఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.. మాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించిన గొప్ప శిరిడి సాయినాథ మీకు ఇవే మా నమస్కార సాష్టాంగ దండ ప్రణామాలు షిరిడీ దేవా వేల కోట్ల నమస్కారాలు తెలుపుకుంటున్నాను సాయి బాబా
ReplyDeleteపిలిస్తే పలుకుతాను.. అని మమ్ములను సైతం అనునిత్యం కంటికి రెప్పలా కాపాడుతున్న గొప్ప దేవుడా.. శిరిడీ సాయినాథ.. మీకు ఇవే మా నమస్కార సాష్టాంగా ప్రణామాలు.. మా అనారోగ్యాలను రూపుమాపి నిర్మూలించి మా భయాలను పోగొట్టి అభయాన్ని ఆయురారోగ్యాలను ప్రసాదించిన గొప్ప దేవుడా షిరిడీ సాయినాథ మీకు మా నమస్కారం సాష్టాంగ దండ ప్రణామాలు
ReplyDeleteOme sri sai ram🙏🙏🙏
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete