ఈ భాగంలో అనుభవాలు:
1. బాబా ప్రసాదించిన అనుభవం
2. మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే, బాబా తప్పక కాపాడుతారు
3. నొప్పి లేకుండా చేసి సంతోషాన్నిచ్చిన బాబా
బాబా ప్రసాదించిన అనుభవం
సాయి భక్తులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. ఈ సంవత్సరంలో నాకు జరిగిన మంచి విషయమేమిటంటే, ఈ బ్లాగు గురించి తెలియడం. ఈ బ్లాగు వలన బాబా మీద నాకున్న విశ్వాసం మరింత బలపడింది. సాయి సచ్చరిత్ర చదివాక బాబా సశరీరులుగా ఉన్నప్పుడు జరిగిన ఇతర లీలలను కూడా తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉండేది. ఆ కుతూహలంతో విన్నీ చిట్లూరి, బి.వి.నరసింహస్వామి సేకరించిన బాబా భక్తుల అనుభవాలు చదవాలని అనుకునేదాన్ని. ఆ అనుభవాలను నా మాతృబాష అయిన తెలుగులోనే ఈ బ్లాగులో చదువుతూ నేను పొందుతున్న ఆనందానికి హద్దుల్లేవు. ఈ బ్లాగు నిర్వహిస్తున్నవారికి సాయి ఆశీస్సులు ఎల్లప్పుడూ మెండుగా ఉన్నాయి. బాబా మనకు ప్రసాదించిన అనుభవాలను పంచుకోవడానికి ఈ బ్లాగు ఒక చక్కని వేదిక. ఎందుకంటే, ఆ సాయితండ్రి ప్రసాదించిన అనుభవాలను నమ్మి, అర్థం చేసుకునే సామర్ధ్యం ఆయన భక్తులకు మాత్రమే ఉంటుంది. మిగిలిన వారు వాటిని నమ్మక కొట్టిపారేస్తారు. ఎందుకంటే, నేను నాస్తికురాలిగా ఉన్నప్పుడు అలాగే కొట్టిపారేసేదాన్ని. ఇంకా నా అనుభవానికి వస్తే...
2022, మే 30న నా పుట్టినరోజు. ఆరోజు నేను షాపులో పాలు కొని మా వీధిలో ఉన్న కుక్కలకు పెట్టాను. అది చూసి మా ఎదురింటి అంకుల్, "బాగా ఎండగా ఉంటుంది. వీటికి ఎవరూ ఆహారం పెట్టట్లేదు" అని అన్నారు. అప్పుడు నా మనసుకి 'వీటికి రోజూ పాలు పోయాల'ని అనిపించింది. మరుసటిరోజు బాగా ఎండగా ఉండటం వల్ల నేను బయటకి వెళ్ళలేక స్విగ్గి ఇస్టమార్ట్ లో 4 ప్యాకెట్ల పాలు ఆర్డర్ పెట్టాను. కానీ 5 ప్యాకెట్లు వచ్చాయి. నేను నా అవసరాలకి తరచూ పాలు, కూరగాయలు, చాకోలెట్స్ వంటివెన్నో ఆర్డర్ పెడుతుంటాను. కానీ ఇలా నేను పెట్టిన ఆర్డర్‍కు మించి అదనంగా రావడమన్నది ఎప్పుడూ జరగలేదు. అందుచేత నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించి మనసులో, "బాబా! నువ్వే ఆ కుక్కలకోసం ఇలా ఒక పాల ప్యాకెట్ అదనంగా పంపించావా?" అని అనుకున్నాను. అదే విషయం మా తమ్ముడికి చెప్తే నవ్వి, "నీకు పిచ్చి బాగా ముదిరింది" అని అన్నాడు. అప్పుడు నేను, 'బాబా! నిజంగా మీరే ఆ పాల ప్యాకెట్ పంపించి ఉంటే, నేను ఈరోజు చదివే భక్తుల అనుభవాలలో కుక్కల గురించి రావాలి' అని అనుకున్నాను (నేను రోజూ ఈ బ్లాగులోని బాబా సశరీరులుగా ఉండగా వారిని దర్శించుకున్న భక్తుల అనుభవాలు చదువుతుంటాను). ఆరోజు సాయంత్రం నేను కుక్కలకి పాలు పోసి వస్తుంటే, ఒక అంకుల్, "నువ్వు మా ఇంటిముందు పాలు పోయొద్దు. నువ్వు పాలు పోయడం వల్ల రోజూ ఈ కుక్కలు మా ఇంటిముందే గుమిగూడతాయి" అని కొంచం వ్యంగ్యంగా అన్నారు. అతను అలా అన్నందుకు నాకు కొంచం బాధగా అనిపించింది. తర్వాత నేను మా ఇంటికి పైకి వచ్చి బ్లాగు ఓపెన్ చేసి ముందురోజు ఆపేసిన దగ్గర నుంచి 'శ్యామ్ రావ్ జయకర్' అనుభవాలు చదవడం కొనసాగించాను. అందులో చివరన బాబాకు కుక్కలపట్ల ఉన్న ప్రేమ గురించి చెప్తూ కుక్కలకి సంబంధించి వచ్చేసరికి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించి నా కళ్ళ నుండి నీళ్లు వచ్చేసాయి. దాంతో నా బాధ అంతా పోయింది. రెండో విషయం ఏమిటంటే, ఉదయం అదనంగా వచ్చిన పాల ప్యాకెట్ తామే పంపించామన్న నిర్ధారణ బాబా ఇచ్చారు. మూడవది, ముందురోజు రాత్రి నేను శ్యామ్ రావ్ జయకర్ అనుభవాలు పూర్తిగా చదవకుండా నిద్ర వస్తుందని మధ్యలో ఆపేయడం ఈ బాబా లీలకు దోహదమైంది. అంటే, నేను ఏ రోజు, ఏది చదవాలో బాబానే నిర్ణయిస్తారని నిరూపించబడింది. "బాబా! ఇంత చక్కగా అనుగ్రహించిన మీకు చాలా చాలా ధన్యవాదాలు".
మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే, బాబా తప్పక కాపాడుతారు
సాయి భక్తులందరికి నమస్కారాలు. బ్లాగు నిర్వహిస్తున్న సాయికి కృతజ్ఞతలు. నా పేరు శ్రీనివాస్. మాది రాజమండ్రి దగ్గర రాజానగరం. నేను గతంలో బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఈ రోజు మరో రెండు అనుభవాలతో మీ ముందుకు వచ్చాను. 2022, జూన్ నెల మొదటివారంలో ముఖ్యమైన నా డాక్యుమెంట్లు ఎక్కడో పెట్టి మరిచిపోయాను. ఎంత వెతికినా కనిపించలేదు. వాటిని బయటకు తీసుకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా మర్చిపోయానేమోనని చాలా ఆందోళన చెంది, "బాబా! నా డాక్యుమెంట్లు కనబడితే, నా అనుభవాన్ని బ్లాగులో తెలియజేస్తాను" అని బాబాకి మొక్కుకున్నాను. వెంటనే ఆ డాక్యుమెంట్లు నా భార్యకు ఒక పుస్తకంలో కనిపించాయి. అదీ సాయి అనుగ్రహం.
మరో అనుభవం విషయానికి వస్తే, మా అబ్బాయి తన పదో తరగతి పరీక్షలకు చక్కగా ప్రిపేర్ అయ్యాడు. కానీ రేపు పరీక్ష అనగా ముందురోజు వరకు స్కూలు ఫీజ్ కట్టలేని పరిస్థితి వచ్చి హల్ టికెట్ ఇవ్వరేమో అని చాలా భయపడ్డాము. ఆ స్థితిలో, "బాబా! మీరే సహాయం చెయ్యాలి" అనుకుంటూ ఉండగా రావనుకున్న డబ్బులు ఆ రోజే రావడం మహాధ్బుతం. బాబా కృపవలన మా అబ్బాయి పరీక్షలు వ్రాసి పదవ తరగతి పాస్ అయ్యాడు. బాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే, ఆయన మనల్ని తప్పక కాపాడుతారు. అందులో సందేహమే లేదు. "బాబా! ఆలస్యంగా నా అనుభవం పంచుకున్నందుకు, అలాగే నా తప్పులు ఏవైనా ఉన్నా మన్నించండి. మీ భక్తికి నన్నెప్పుడూ దూరం చెయ్యొద్దు బాబా. మా సమస్యలు మీకు తెలుసు. మీరు వాటిని తీర్చినప్పుడు మళ్ళీ నా అనుభవాలు పంచుకుంటాను".
ఓం శ్రీసాయినాథాయ నమః!!!
నొప్పి లేకుండా చేసి సంతోషాన్నిచ్చిన బాబా
సాయి భక్తులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. మేము యు.ఎస్.ఏలో ఉంటున్నాము. నేను ఇప్పుడు బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవం పంచుకుంటున్నాను. 2022, మే 29న లాంగ్ వీకెండ్ సందర్భంగా మా ఫ్రెండ్స్ కుటుంబాలతో ఒక ట్రిప్‍కి వెళదామని ప్లాన్ చేసారు. కానీ అప్పటికే నా నడుము కిందగా మోకాలుకి సంబంధించి నొప్పిగా ఉంటుంటే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. కాబట్టి ట్రిప్‍కి వెళ్లాలా, వద్దా అని అనుకున్నాను. కానీ వెళ్ళాక తప్పలేదు. మొత్తం ఆరు కుటుంబాలు కలిసి ట్రిప్‍కి వెళ్ళాం. నేను వెళ్ళానన్న మాటే కానీ, నాకున్న సమస్య వల్ల మిగతా అందరికీ ఇబ్బంది అవకూడదని ఆలోచిస్తూ కాస్త ఆందోళన చెందాను. అప్పుడు బాబాని తలుచుకుని, "ట్రిప్‍లో నా ఆరోగ్యం బాగుండి ఎలాంటి ఇబ్బందీ రాకుంటే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. ఎంత విచిత్రమంటే, ఇంట్లో ఉన్నప్పుడు బాత్రూంకి వెళ్లేందుకు నడవడానికి ఇబ్బంది పడిన నేను ట్రిప్‍లో ఒక మైల్ దూరం ట్రెకింగ్(కొండ ఎక్కడం) చేశాను. నాకు ఎలాంటి నొప్పి అనిపించలేదు. అంతేకాదు ట్రెకింగ్ నుంచి తిరిగి వచ్చాక కూడా నాకు నొప్పి లేదు. 3 రోజల ట్రిప్ చాలా సంతోషంగా గడిచింది. అంతా బాబా దయ. "థాంక్యూ సో మచ్ బాబా. నేను తెలిసీతెలియక చేసిన తప్పులను మన్నించండి బాబా".
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
A carpenter manasu marchi money maku vachela cheyi thandri please baba
ReplyDelete