ఈ భాగంలో అనుభవాలు:
1. మొర విన్న బాబా
2. శ్రీసాయినాథుని కృప
3. జ్వరం మళ్ళీ రాకుండా అనుగ్రహించిన బాబా
మొర విన్న బాబా
నేనొక సాయిభక్తురాలిని. 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగును నిర్వహిస్తున్న అన్నయ్యకి, అలాగే భక్తులందరికీ ఆ సాయినాథుని కృపాదీవెనలు ఉండాలని కోరుకుంటూ బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని పంచుకుంటున్నాను. నాకు పెళ్ళయి ఒకటిన్నర సంవత్సరం అయింది. మాది ప్రేమ వివాహం. మేము పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. పెళ్ళైన 6 నెలల తర్వాత నాకు ఏదో తెలియని ఒక అనారోగ్య సమస్య వచ్చింది. చాలా హాస్పిటల్స్ తిరిగాము. రిపోర్టులు బాగానే వచ్చాయి, కానీ ఆ సమస్య వల్ల నేను, నా భర్త మానసికంగా, శారీరకంగా చాలా కృంగిపోయాము. నేను ఒక మూడు నెలలు నరకం చూశాను. నన్ను ఆ నరకకూపం నుంచి బయటపడేయమని బాబాని, దత్తాత్రేయస్వామిని వేడుకోని రోజు లేదు. వారి దయవల్ల నిదానంగా నేను ఆ సమస్య నుంచి బయటపడసాగాను. శారీరకంగా కోలుకోవడానికి నాకు 3 నెలల సమయం పట్టింది. కానీ మానసికంగా నేను చాలా బలహీనపడిపోయాను. నాలో విపరీతమైన ప్రతికూల ఆలోచనలు, దిగులు ఉంటుండేవి. వాటినుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్న స్థితిలో 2022, జూన్ 12 సాయంత్రం మళ్లీ మునుపటి సమస్యకి సంబంధించి చిన్న ఇబ్బంది అనిపించింది. దాంతో ఒక్కసారిగా నా గుండె చల్లబడిపోయింది. భయంతో కాళ్ళుచేతులు వణకటం మొదలైంది. ఎందుకంటే, గతంలో నేను అనుభవించిన నరకమంతా నా కళ్ళముందు కనిపించింది. వెంటనే నా కాళ్ళుచేతులు కడుక్కుని ఊదీనీళ్లు త్రాగి, సాయిసచ్చరిత్ర తీసి కన్నీళ్లు పెట్టుకుంటూ బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! నాకు మళ్ళీ ఆ నరకాన్ని ఇవ్వకండి. ఆ నరకకూపంలోకి వెళ్లే శక్తి నాకు లేదు" అని మొరపెట్టుకున్నాను. అంతేకాదు, "ఉదయానికి నేను మామూలుగా అయితే, 'సాయి మహరాజ్ సన్నిధి'లో నా అనుభవాన్ని పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా నా మొర విన్నారు. మళ్ళీ ఆ నరకకూపంలోకి వెళ్లకుండా నన్ను కాపాడారు. నాకు ఇప్పుడు నార్మల్‍గా అనిపిస్తోంది. ఎలాంటి ఇబ్బందీ అనిపించటం లేదు. ఇదంతా బాబా దయ. "థాంక్యూ సో మచ్ బాబా. ఇప్పటికి నేను కోరుకునేది ఒకటే, 'నన్ను మానసికంగా బలపరచి ఆరోగ్యంగా ఉంచు తండ్రీ. ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భర్తని నా అనారోగ్య సమస్యల వల్ల బాధపెట్టకు. నా కర్మలను తొలగించు. తెలిసీతెలియక చేసిన తప్పులకు భక్తులందరి ముందు క్షమాపణ అడుగుతున్నాను. ప్లీజ్ బాబా, నన్ను క్షమించండి".
శ్రీసాయినాథుని కృప
నా పేరు సురేష్. చిన్నప్పటినుంచి నాకు చదువు పెద్దగా అబ్బేదికాదు. జ్ఞాపకశక్తి పెద్దగా ఉండేది కాదు. బాగా పేదరికంలో ఉండేవాళ్ళం. అయితే కొంతమంది మంచి వ్యక్తులు సహాయం చేయడం వల్ల నేను ఎలాగోలా టీచర్ ట్రైనింగ్ పూర్తిచేసి, డిగ్రీ వరకు చదువుకున్నాను. కొన్ని ప్రైవేటు సంస్థల్లో పనిచేశాను. ప్రైవేట్ సంస్థలు అయినందున నాకు చాలా తక్కువ జీతం, అది కూడా చాలా ఆలస్యంగా వస్తుంది. అందువల్ల నేను వాళ్ల దగ్గర, వీళ్ళ దగ్గర అప్పులు చేసి మరీ జీవనం సాగిస్తున్నాను. నేనెంత పేదవాడినంటే, ప్రతిరోజూ ఉదయం 'ఈరోజు నాకు ఆహారం దొరుకుతుందా, లేదా?' అని ఆందోళన చెందుతుంటాను. అలాంటి పరిస్థితుల్లో నేను కపాలమోక్షం అనే గ్రంథంలో బాబా లీలలు చదివి బాబా భక్తుడినయ్యాను. ప్రతీ గురువారం బాబా దర్శనం చేసుకుని, బ్లాగులోని అనుభవాలు చదువుతూ ముగ్ధుడిని అవుతుండేవాడిని. అంతలో గవర్నమెంట్ ఉద్యోగావకాశాలు వెలువడ్డాయి. అయితే నేను ఇంగ్లీషు మరియు మెథడాలజీ సబ్జెక్టులలో చాలా వీక్. అందువలన వాటి కోచింగ్ కోసం నాకు ఒక 2,000 రూపాయలు అవసరమయ్యాయి. నా దగ్గర చూస్తే, అంత మొత్తం డబ్బులు లేవు. దాంతో నేను, 'తినడానికే తిండి దొరకక, రోజూ పస్తులు ఉంటూ, చిరిగిపోయిన వస్త్రాలు ధరించి, చెప్పులు కూడా లేకుండా నడిచే నాకు అంత డబ్బు ఎక్కడనుండి లభిస్తుంది?' అని బాధపడుతూ శివాలయంలో కూర్చున్నాను. అక్కడ నా మనసుకు శ్రీ శిరిడీ సాయిబాబా దర్శనమైనట్లు అనిపించి, మరుక్షణంలో 'సాయిభక్త అనుభవమాలిక' గుర్తొచ్చింది. నేను వెంటనే, "సాయినాథ్ మహరాజ్! మీరు నాకు సహాయం చేసినట్లైతే, నేను బ్లాగులో మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. ఆ తర్వాత నా చిన్ననాటి స్నేహితురాలైన శ్రీగాయత్రిమాత భక్తురాలిని సహాయం అర్థిస్తూ ఒక మెసేజ్ పెట్టాను. కానీ నన్నెందుకో అన్నివిధాలా నిరాశానిస్పృహలు ఆవరించి, 'ఆ... నన్నెవరు ఆదుకుంటారు' అని బాధపడ్డాను. అంతలో హఠాత్తుగా ఆ మిత్రురాలు నాకు తగినంత పైకం పంపించారు. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. "నా ప్రార్థన ఆలకించావు బాబా. నన్ను ఆదుకున్నావు బాబా. మీకు చాలా చాలా ధన్యవాదాలు. నేను నా జీవితంలో అన్నిటినీ కోల్పోయాను. నేను పైకిరావటం చాలా కష్టం. చదువులేదు, టాలెంట్ లేదు, ఆధ్యాత్మిక చింతన లేదు. కావున ధర్మార్థకామమోక్షప్రాప్తికి నాకు అవకాశం లేదు బాబా. పాహిమాం... పాహిమాం... ఈ దీనుణ్ణి ఆదుకోండి దేవా!"
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!
జ్వరం మళ్ళీ రాకుండా అనుగ్రహించిన బాబా
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
ఓం శ్రీ సాయినాథాయ నమః!!!
నేనొక సాయిభక్తురాలిని. 'సాయి మహరాజ్ సన్నిది' బ్లాగును నిర్వహిస్తున్న సాయికి మరియు సాటి సాయిభక్తులకు నా నమస్కారాలు. నేను ఇదివరకు కొన్ని అనుభవాలను సాటి సాయిభక్తులతో పంచుకున్నాను. ఇప్పుడు సాయినాథుని దివ్యపాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, బాబా మాపై చూపిన ప్రేమను, కరుణను పంచుకుంటున్నాను. మేము సంతానం కోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. ఒకరోజు హాస్పిటల్లో నాకు ట్రీట్మెంట్ జరుగుతుండగా మధ్యలో హఠాత్తుగా నాకు హై-ఫీవర్ వచ్చింది. ఫీవర్ ఎంతకీ కంట్రోల్ కాకపోయేసరికి డాక్టరు నన్ను రెండు రోజులు అబ్జర్వేషన్‍లో ఉంచారు. జ్వరం తగ్గాక డిశ్చార్జ్ చేశారు. మేము ఇంటికి వచ్చాక ఒక పూటంతా బాగానే ఉండి, తరువాత మళ్ళీ జ్వరం మొదలైంది. సంతానం కోసం మందులు వాడుతున్నందున పారాసిటమాల్ తప్ప వేరే ఏ టాబ్లెట్ వేసుకోవద్దని డాక్టరు చెప్పారు. అందువలన డాక్టరుని సంప్రదించి, తను సూచించిన మందులు వేసుకుంటుంటే, జ్వరం ఆ సమయానికి తగ్గి మళ్ళీ వస్తుండేది. అప్పుడు నేను, "ఏంటి బాబా నాకు ఇలా జరుగుతోంది?" అని చాలా బాధపడి, "బాబా! మీ దయతో మళ్ళీ రాకుండా జ్వరం తగ్గిపోతే, నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా సాటి సాయిభక్తులతో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. అలా బాబాకి మ్రొక్కుకున్నంతనే అంతవరకు ఉన్న జ్వరం మళ్ళీ రాలేదు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఈ జ్వరం వల్ల సంతానం కోసం మేము తీసుకుంటున్న ట్రీట్మెంట్‍కి ఏ ఆటంకం రాకుండా చూసి మా మీద దయచూపండి బాబా. మీకు మాటిచ్చిన విధంగా నా అనుభవాన్ని పంచుకున్నాను తండ్రీ".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Jaisairam bless amma for her health and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam
ReplyDeleteఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ReplyDeleteOm sai ram
ReplyDeleteOm sai ram i am also suffering with negative thoughts. Some time back i used medicines.i suffered lot.Sai baba blessed me and gave health to me.i am lucky my son is doctor he took care of me.Thar is Baba's blessings.
ReplyDeleteOme sri sai ram 🙏
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete