1. బాబా కృపతో 7 నెలల తరువాత దొరికిన చెవికమ్మలు2. బాబా అద్భుత వరం
3. తల్లిదండ్రులను కాపాడిన బాబా
బాబా కృపతో 7 నెలల తరువాత దొరికిన చెవికమ్మలు
సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు అంజునాగుప్తా. నేను మీ అందరికీ సుపరిచితురాలినే. నేను మూడు అంకెతో ముడిపడి, మూడు అంకెతో సుఖాంతమైన నా శిరిడీయాత్ర గురించి ఈమధ్యనే మీతో పంచుకున్నాను. 2021, నవంబరులో మేము శిరిడీ వెళ్లొచ్చిన అనుభవం కూడా మీ అందరితో పంచుకున్నాను. శిరిడీ నుండి వచ్చిన తరువాత 2021, నవంబర్ 11 నుండి 2022, జూన్ 13 వరకు నేను చాలా టెన్షన్ అనుభవించాను. అది చిన్న విషయం అనుకోవాలో, పెద్ద విషయం అనుకోవాలో నాకేం అర్థం కావడంలేదు గానీ, బాబా నా టెన్షన్‌ని ఎలా తీసేశారో నేనిప్పుడు మీతో పంచుకుంటాను. నేను మామూలుగా నాలుగు గ్రాముల బంగారు చెవికమ్మలు పెట్టుకుంటూ ఉంటాను. వాటితోటే నేను శిరిడీ వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాటిని తీసి రూములో ఉన్న ఒక అలమారలో పెట్టి, కట్టుకున్న చీరకి మ్యాచింగ్ అని ఒక గ్రాము బంగారుదిద్దులు చెవులకి పెట్టుకున్నాను. వాటితోనే శిరిడీలో ఉన్న మూడు రోజులు గడిపి నాలుగవరోజు తిరుగు ప్రయాణమవుతూ రూము ఖాళీ చేసేటప్పుడు ఒకటికి, రెండుసార్లు నేను, మావారు రూమంతా చెక్ చేశాము. మా వస్తువులు ఏవీ రూములో లేవు అనిపించాకే శిరిడీ నుండి వచ్చేశాము. ఇంటికొచ్చిన తర్వాత శిరిడీకి తీసుకెళ్లిన లగేజ్ అంతా ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ సర్దాను. కానీ నా బంగారు కమ్మలు ఎక్కడా కనిపించలేదు. వాటిని ఎక్కడైనా పెట్టినట్టు గుర్తు నాకు అస్సలు లేదు. అలాగని శిరిడీలో మర్చిపోలేదు. వాటిని తీసుకొచ్చాను అనే ఒక నమ్మకమైతే నాకు ఉంది. అయితే ఇంటిలో వాటిని ఎక్కడ పెట్టానో గుర్తులేదు. ఆ విషయమే మా వాళ్ళతో చెపితే, "తెచ్చినట్లు గుర్తుందని అంటున్నావు కదా, ఇంట్లో ఉంటే ఎక్కడికి వెళ్తాయి? ఎక్కడో ఓ చోట ఉంటాయి వెతుక్కో" అని అన్నారు. అప్పటినుంచి ఇంట్లో మామూలుగా బంగారు వస్తువులు ఎక్కడైతే పెడతానో అక్కడంతా వాటికోసం వెతికాను. ఆయా చోట్లు క్లీన్ అయిపోయాయి కానీ అవి దొరకలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే, వాటికోసం వెతికీ వెతికీ చివరికి, 'ఆ చెవికమ్మలను శిరిడీ నుండి తీసుకొచ్చానని అనుకుంటున్నాను కానీ, వాటిని అక్కడే వదిలేసి ఉంటాను, హ్యాండ్ బ్యాగులో పెట్టుకోలేదేమో' అని వాటి గురించి ఆశ వదిలేసుకున్నాను.
తరువాత మే నెలలో నేను బాబాకు దణ్ణం పెట్టుకుని, "బాబా! నా బంగారు కమ్మలు గనక నాకు దొరికితే, నా అనుభవాన్ని బ్లాగు ద్వారా సాయిబంధువులందరితో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. రెండు మూడు వారాలు గడిచాయి. కానీ ఆ చెవికమ్మలు దొరకలేదు. 'ఇక అంతేలే, అవి ఇంకేం దొరుకుతాయి?' అని అనుకున్నాను. సరిగ్గా నాలుగో వారంలో సోమవారంనాడు మావారు బీరువాలో తనకి సంబంధించిన పేపర్లు ఏవో వెతుకుతుంటే, ఆయన చేతికి ఏ బాక్సులో అయితే ఆ బంగారు కమ్మలు ఉండేవో ఆ బాక్స్ తగిలింది. 'ఇది ఎందుకు ఇక్కడుందబ్బా? ఇది కళ్యాణ్ జ్యువెల్స్ బాక్స్ కదా!' అని ఆ బాక్స్ తీసి చూశారు. అందులో నా చెవికమ్మలు ఉన్నాయి. వెంటనే ఆయన, "నువ్వు ఒకసారి నీ చెవికమ్మలు కనిపించలేదని అన్నావు కదా, దొరికాయా?" అని అడిగారు. నేను, "లేదు" అంటే, "ఇవేనేమో చూడు" అంటూ వాటిని నా చేతికిచ్చారు. నా సంతోషానికి అవధులు లేవు. ఆనందంతో నాకు కన్నీళ్లొచ్చాయి. ఇంక బాబాకు కృతజ్ఞతలు చెప్పుకోవడం, వాటిని తీసిపెట్టుకోవడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఎంతోమంది భక్తులు 'తమ అనుభవాలను, బాధలను ఈ బ్లాగుకి వ్రాసుకుంటే బాబాతో చెప్పుకున్నట్లే' అని అంటున్న విషయం నాకు ఈ చిన్న అనుభవం నిరూపించిందని చెప్పవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క సాయిబంధువు తమ అనుభవాలను తప్పకుండా పంచుకుంటారని, తద్వారా బాబా అనుగ్రహాన్ని, ప్రేమను అందరికీ తెలియజేస్తారని ఆశిస్తున్నాను.
ఈ బ్లాగును నడిపిస్తున్న సాయికి నా కృతజ్ఞతలు. అప్పుడు బాబాకి చెప్పుకున్నట్లు నా అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మనస్ఫూర్తిగా బాబాను వేడుకుంటే, ఖచ్చితంగా మనం కోరుకున్నది నెరవేరుతుంది. కానీ కొన్నికొన్ని కష్టాలుంటాయి. ఎందుకంటే, కొన్ని కర్మఫలాలు బలంగా ఉన్నప్పుడు వాటిని మనం అనుభవించక తప్పదు. అలాంటి విషయం ఒకటి నా విషయంలో జరుగుతోంది. అది ఎనిమిది సంవత్సరాల నిరీక్షణ. ఇప్పటికీ కొనసాగుతోంది. ఆ నిరీక్షణ ముగిసి నా కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని మీ అందరూ నాకోసం కోరుకుంటారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఆ కష్టం గనక తొలగిపోతే, ఈ బ్లాగులో పంచుకుంటాను.
బాబా అద్భుత వరం
బాబా భక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు జాహ్నవి. నేను 10 సంవత్సరాలుగా బాబాకు భక్తురాలిని. 2019లో నాకు పెళ్లి అయింది. ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉండటం వల్ల 'నాకు పిల్లలు పుట్టడం చాలా కష్టమ'ని చెప్పారు. 2021, జనవరిలో నేను ఒక బాబా గుడికి వెళ్ళినప్పుడు నాకు ధ్యానంలో 'దత్తసాయి' అన్న పేరు, 'దత్తాత్రేయుని విగ్రహం' కనిపించాయి. అప్పటివరకు నేను ఎప్పుడూ దత్తాత్రేయుని పూజించలేదు, ఆయన ఫోటో కూడా మా ఇంట్లో లేదు. 'అలాంటిది ఆయన ఎందుకు కనిపించారో'నని నేను ఆశ్చర్యపోయాను. 'సరే, ఈ విషయంలో బాబా నాకు ఏదైనా చెప్పాలనుకుంటే ఆయనే మళ్లీ నాకు తెలియజేస్తారు' అని అనుకున్నాను. తరువాత మేము 2022, సంక్రాంతికి వైజాగ్ వెళ్లి, తిరిగి రాజమండ్రి మీదుగా హైదరాబాద్ వస్తుంటే ఒక చోట కారు ఆపవలసి వచ్చింది. అక్కడ 'దత్తసాయి' మందిరం అని ఒక గుడి కనిపించింది. ఆ గుడిలో నాకు అదివరకు ధ్యానంలో కనిపించినటువంటి దత్తవిగ్రహం ఉంది. ఒక చిన్న సాయిబాబా విగ్రహం ఉయ్యాలలో వేసి ఉంది. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, ఊదీని నుదుటన పెట్టుకున్నాను. ఎందుకు అలా చేయాలనిపించిందో తెలియదుగానీ కొంచెం ఊదీ నా పొట్టపై కూడా పెట్టుకున్నాను. ఆ నెల నాకు నెలసరి రాలేదు. జనవరి 20న ప్రెగ్నెన్సీ టెస్టు చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. ఇది బాబా నా జీవితంలో చేసిన ఒక అద్భుత వరం.
బాబా దయవల్ల 20 వారాల వరకు అంతా బాగానే నడిచింది. కానీ 20వ వారంలో స్కానింగ్ తీస్తే, రిపోర్టులో బేబీ కిందకి వచ్చేసిందని వచ్చింది. దాంతో కుట్లు వేసి, బెడ్ రెస్ట్‌లో ఉండమని డాక్టర్ చెప్పారు. అమ్మావాళ్ళు నన్ను పుట్టింటికి తీసుకుని వచ్చారు. ఇక్కడకు వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు వచ్చాయి. నేను 'ఎన్ని ఇబ్బందులు వచ్చినా బాబా కాపాడుతార'నే నమ్మకంతో ఉండసాగాను. 25వ వారంలో నొప్పులు వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. నేను చాలా భయపడి బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! నన్ను ఈ గండం నుండి బయటపడేయండి" అని చెప్పుకున్నాను. డాక్టరు, "28వ వారం స్కానింగ్ రిపోర్టు చూసి, ఏ విషయమూ చెప్తాన"ని అన్నారు. బాబా దయవల్ల స్కానింగ్ రిపోర్టులు నార్మల్‌గా వచ్చాయి. బాబానే నన్ను, నా బిడ్డను దీవించారు. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, రాజాధిరాజు, యోగిరాజు, పరబ్రహ్మ అయిన శ్రీసాయికి కోటి కోటి నమస్కారాలు.
తల్లిదండ్రులను కాపాడిన బాబా
సాయిబాబాకి ప్రణామాలు. సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు బిందు. మా కుటుంబమంతా సాయిభక్తులం. మాకు ఎప్పుడు ఏ బాధ కలిగినా బాబా మాకు తోడుగా నిలుస్తారు. నాకు చాలాసార్లు మా ఇంటి పూజగది ప్రాంగణంలో గోడ మీద బాబా రూపం దర్శనమైంది. ఒకసారి మా ఇంట్లో కుటుంబ సమస్యల వలన గొడవ జరిగి మా అమ్మానాన్నల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. అమ్మ ఇంట్లో గొడవలకి తట్టుకోలేక ట్రైన్ కింద పడాలని వెళ్ళింది. ఇంకొక్క క్షణంలో ఆమెను ట్రైన్ ఢీకొట్టబోతుందనగా బాబా మానవాకారంలో ప్రత్యక్షమై అమ్మని కాపాడారు. కేవలం ఆయన దయవల్లే అమ్మ తీవ్రగాయాలతో బయటపడింది. మేము బాబాను, "అమ్మని జాగ్రత్తగా చూసుకుని, త్వరగా కోలుకునేలా అనుగ్రహించు బాబా" అని వేడుకున్నాము. బాబా దయవల్ల వారంరోజుల్లో అమ్మ గాయాలు మానిపోయాయి. ఇక నాన్న విషయానికి వస్తే, కుటుంబ గొడవల్లో నాన్నకి చాలా గాయాలయ్యాయి. ఆయన మనస్తాపం చెంది ఇంట్లో చెప్పాపెట్టకుండా ఎటో వెళ్ళిపోయారు. మేము ఆయనకోసం చాలా వెతికాము. కానీ ఎంతకీ నాన్న ఆచూకీ తెలియలేదు. నేను చాలా బాధపడి బాబానే శరణువేడాను. రెండు రోజుల్లో బాబా నాన్నని ఇంటికి తిరిగి రప్పించారు. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు".
Om Sairam
ReplyDeleteSai always be with me
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ఓం సాయి రామ్
ReplyDeleteఓం సాయి రామ్ తొందర పడి నా భర్త ని తూలనాడేను.కోపం ఎక్కువ అయింది. అనుమానం ఎక్కువ అయింది. ఆయన భాద పడ్డారు. సారీ సాయి బాబా. నా కోపం
ReplyDeleteతగ్గించు.తొందర పడ్డాను.
Please save my husband and children from my anger.please give them long life.Dhegra askush.i am fool baba.sorry baba
ReplyDeleteThank you Sai baba my tandri
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteఓం సాయి రామ్
ReplyDeleteHi guys thankyou for sharing 🙏💐
ReplyDelete