ఈ భాగంలో అనుభవాలు:
1. సాయి దయతో తీరిన చిన్నచిన్న సమస్యలు
2. బాబా అనుగ్రహంతో ఫలించిన కోరికలు
3. సాయితల్లి తన బిడ్డల బాధలను సరైన సమయంలో తీరుస్తారు
సాయి దయతో తీరిన చిన్నచిన్న సమస్యలు
'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. నా పేరు లలిత. నేను రాజాం నివాసిని. నేను ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. ఒకసారి నా చెవిదిద్దు ఎక్కడో పడిపోయి ఎంత వెతికినా దొరకలేదు. అప్పుడు నేను, "సాయీ! నా చెవిదిద్దు దొరికితే, నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. ఆయన దయవలన పది నిమిషాల తరువాత ఆ చెవిదిద్దు మా తోటికోడలికి దొరికింది. "ధన్యవాదాలు సాయీ".
ఈమధ్య మా బావగారి కూతురుకి వివాహం అయింది. పెళ్ళి ముందురోజు కరెంట్ పోయింది. ఇంటినిండా చుట్టాలు ఉన్నారు. పైన వాటర్ ట్యాంకులో నీళ్ళు లేవు. అందువలన నేను చాలా ఆందోళన చెంది సాయిబాబాకి దణ్ణం పెట్టుకుని, "సాయీ! మీ దయతో కరంట్ వస్తే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని చెప్పుకున్నాను. సాయి దయవలన కొద్దిసేపట్లో కరంట్ వచ్చింది.
ఒకసారి నేను నా పుట్టింటికి వెళ్లాలని అనుకున్నాను. కానీ మా ఇంట్లోవాళ్ళు ఒప్పుకోలేదు. అప్పుడు నేను, "సాయీ! ఇంట్లోవాళ్ళు నేను వెళ్ళడానికి ఒప్పుకోవాలి" అని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. సాయి దయవలన ఇంట్లోవాళ్ళు ఒప్పుకున్నారు. "ధన్యవాదాలు సాయీ. మీ దయవలన మా పెద్దపాపకున్న నెలసరి సమస్య కొంతవరకు తగ్గింది. ఆ సమస్యను పూర్తిగా తగ్గించండి బాబా. నాకు కన్ను ఆపరేషన్ చేయాలని డాక్టరు చెప్పారు. మీ దయవలన ఆపరేషన్ శుభ్రంగా అయిపోతే మళ్లీ నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటాను. నేను ఏవైనా అనుభవాలు పంచుకోవడం మరచిపోయుంటే నన్ను క్షమించండి. మీ పాదాలయందు నాకు శ్రద్ధ కలిగేటట్లు అనుగ్రహించండి".
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
బాబా అనుగ్రహంతో ఫలించిన కోరికలు
నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఇదివరకు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఈ బ్లాగు ద్వారా తోటి సాయి భక్తులతో పంచుకొన్నాను. ఇప్పుడు మరో చిన్న అనుభవం పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది. తను నన్ను చాలా ప్రోత్సహిస్తూ గైడ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళది చాలా పేద కుటుంబం. ఈమధ్య వాళ్ళ అమ్మాయికోసం ఒక మంచి స్కూల్లో సీటు గురించి ప్రయత్నం చేసారు. ఆ స్కూలులో పాపకి సీటు వస్తే, 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు, ఆపై llTకి ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తారు. ఇంకా హాస్టల్ సదుపాయం కూడా ఉంటుంది. కాబట్టి పాపకి సీటు రావడం వలన ఆ పేద కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందని నేను, "బాబా! ఎలాగైనా పాపకి ఆ స్కూలులో సీటు రావాల"ని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. బాబా దయవల్ల పాపకి సీటు వచ్చింది. సాయి మహారాజ్ అనుగ్రహానికి నా ఫ్రెండ్ చాలా సంతోషంగా ఉంది. "ధన్యవాదాలు బాబా".
మరో అనుభవం: నేను వరంగల్‍లో గెస్ట్ ఫ్యాకల్టీగా 3 సంవత్సరాల నుండి పని చేస్తున్నాను. ఈ సంవత్సరం మాకు ఆఫ్ లైన్ డెమో కండక్ట్ చేసారు. ఆ సమయంలో నేను చాలా టెన్షన్ పడుతూ, "బాబా! నేను డెమోలో క్వాలిఫై అయితే నా సంతోషాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాని ప్రార్థించాను. ఒక వారం తరువాత 2022, జూన్ 20న వచ్చిన ఆ డెమో తాలూకు ఫలితాల్లో నేను క్వాలిఫై అయ్యేలా బాబా ఆశీర్వదించారు. "నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను బాబా. ఈ సంవత్సరమంతా మీ ఈ అనుగ్రహం కంటిన్యూ అయ్యేలా ఆశీర్వదించండి తండ్రి. థాంక్యూ బాబా... థాంక్యూ సో మచ్".
సాయితల్లి తన బిడ్డల బాధలను సరైన సమయంలో తీరుస్తారు
సాయి మహరాజ్ కీ జై!!! నేను గత ఐదు సంవత్సరాలుగా సాయి భక్తురాలిని. నేను ప్రతిరోజు బాబాని చూస్తూనే నా రోజుని ప్రారంభిస్తాను. బాబా నాతోనే ఉన్నారని నేను బాగా నమ్ముతాను. బాబా ఆశీస్సులతో 2022, మే 12న మాకు ఒక పాప పుట్టింది. జూన్ 22 నాటికి తనకి 40 రోజుల వయస్సు అనగా రెండు రోజుల ముందు నుండి తనకి విరోచనం కాలేదు. దాంతో తను మూలుగుతూ ఉంటే, నా పాప బాధని చూసి నేను అస్సలు తట్టుకోలేకపోయాను. తనే మాకు మొదటి సంతానమైనందు వల్ల పిల్లల విషయంలో నాకు అనుభవం లేక చాలా భయమేసి, 'పాపకి అసలు ఏమౌతుంది. పాపం తను చాలా ఇబ్బందిపడుతుంది" అని అనుకున్నాను. వెంటనే, "తండ్రీ! నా బిడ్డ బాధ చూసి తట్టుకోలేకపోతున్నాను. తనకి విరోచనమయ్యేలా చేయండి బాబా. అదే జరిగితే, ఈ అనుభవాన్ని తోటి సాయి భక్తులతో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. తర్వాత 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపిద్దామని మొదలుపెట్టాను. వెంటనే నా పాపకి విరోచనమైంది. సాయితల్లి తన బిడ్డల బాధలను సరైన సమయంలో తీరుస్తారు. "థాంక్యూ సో మచ్ బాబా. ఎప్పుడూ ఇలాగే తోడుగా ఉండి నా బిడ్డకి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించు తండ్రి".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sai ram
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteఓం శ్రీ సాయి రాం
ReplyDeleteA carpenter manasu marchi money maku vachela cheyi thandri please baba
ReplyDeleteOme sri sai nadhaya namo namaha
ReplyDelete