సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1236వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కోరుకున్నట్లే మనవడిని ప్రసాదించిన బాబా
2. బాబా కరుణాదృష్టి
3. కృపతో కాలి బాధను తొలగించిన బాబా 

కోరుకున్నట్లే మనవడిని ప్రసాదించిన బాబా


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!! సాయి మహరాజ్‍కి నా శతకోటి వందనాలు. ఈ బ్లాగు నిర్వాహకులకు మనఃపూర్వక కృతజ్ఞతలు. నేను ఒక సాయి భక్తురాలిని. నాకెవరూ ధైర్యం ఇవ్వని సందర్భాలలో నాకు నా బాబా ఉన్నారు అని అనుకుంటాను. ఆయన నేను ఏ విషయంలో టెన్షన్ పడినా ఆ టెన్షన్‍ని చాలా సింపుల్‍గా తీసేస్తారు. నేను ఇంతకుముందు నా అనుభవాలలో మా కుమారుని వివాహం గురించి, పిల్లల ఉద్యోగాల గురించి, వాళ్ళ ప్రమోషన్, బోనస్‍ల గురించి నేను ఏవిధంగా బాబాను కోరుకున్నానో అలాగే బాబా అనుగ్రహించారని పంచుకున్నాను. ఇక ప్రస్తుత అనుభవానికి వస్తే..


నా కుమారుడి పెళ్లయ్యాక  తనని, కోడలిని నేను  దేశ్‍ముఖ్ సాయిబాబా గుడికి తీసుకెళ్లి, "నా కోడలు నాకు త్వరగా శుభవార్త చెప్పాలి" అని బాబాని కోరాను. బాబా నా కోరిక మన్నించారు. నా కోడలు తొందరలోనే గర్భవతి అయింది. 2022, జూన్ 2, గురువారంనాడు నేను బాబా గుడికి వెళ్లి, "బాబా! నా కోడలికి నార్మల్ డెలివరీ అయి బాబు పుట్టాలి. అదే జరిగితే నేను బ్లాగులో పంచుకుంటాన"ని బాబాను మనస్ఫూర్తిగా కోరాను. తరువాత బుధవారం నా కోడలు హాస్పిటల్లో జాయిన్ అయింది. ఆరోజు రాత్రి బాబా భక్తురాలైన మా అక్కకి 'నా కోడలికి డెలివరీ అయి, బాబు పుట్టాడని, తను నాతో 'నీకు సాయి పుట్టాడ'ని చెప్తున్నట్లు' కల వచ్చింది. అక్క మరుసటిరోజు ఉదయం నాకు ఫోన్ చేసి, "నీకు మనవడు పుడతాడు, చూడు. రాత్రంతా నీ కోడలు నా కలలో మెదులుతుంది. నేను కలలోనే 'సాయి పుట్టాడు, సాయి పుట్టాడు' అని అంటున్నాను" అని చెప్పింది. అదేవిధంగా బాబా కరుణించారు. 2022, జూన్ 9, గురువారంనాడు నా కోడలు ప్రసవించి పండంటి మనవడిని మాకు ఇచ్చింది. బాబుని చూస్తూనే 'సాయినాన్న' అని పిలుచుకున్నాను నేను. ఆ ఆనందంలో, "బాబా! మిమ్మల్ని ఎలా కొలవను తండ్రి" అని అనుకున్నాను. అలాగే నా సంతోషాన్ని బ్లాగులో పంచుకోవాలనుకున్నాను. అంతలో బాబుకి కొద్దిగా జాండిస్ ఉందని, వేరే హాస్పిటల్‍కి పంపారు. నేను, "బాబా! బాబుకి నార్మల్ అయితే, మీ అనుగ్రహమంతా ఒకేసారి భాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. తరువాత 2022, జూన్ 16, గురువారంనాడు నేను మాకు దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికి వెళ్తుంటే, మా బాబు ఫోన్ చేసి, "అమ్మా! బాబుకి నార్మల్ అని రిపోర్టు వచ్చింద"ని చెప్పాడు. అప్పుడు నేను సంతోషంగా, "అవునా! నేను వాడికోసమే బాబా గుడికి వెళ్తున్నాను. ఇంతలోనే బాబా అనుగ్రహించారు" అని అన్నాను. తరువాత అంతా మంచిగానే ఉంది అనుకున్నాము. కానీ బాబా దయవల్ల మా కోడలికి మంచిగా పాలు వస్తున్నప్పటికీ, బాబు కూడా చక్కగా తాగుతున్నప్పటికీ కొద్దిగా చెస్ట్ పెయిన్ వలన మా కోడలు బాబుకి పాలు పట్టలేకపోయేది. దాంతో బాబు ఏడుస్తుంటే పోతపాలు పట్టాల్సి వచ్చింది. ఇలాంటి స్థితిలో నేను బాబాను, "బాబా! మా కోడలి నొప్పిని తగ్గించి, తను ఆరోగ్యంగా తన బిడ్డకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా పాలు పట్టేలా అనుగ్రహించండి. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. నా బాబా నన్నెప్పుడూ నిరాశపరచరు. ఆయన దయవలన నిదానంగా నా కోడలికి నొప్పి తగ్గి, బాబుకి మంచిగా పాలు ఇవ్వసాగింది. ఎల్లవేళలా కరుణించి, దయచూపే నా సాయితండ్రి ఋణం నేను ఎలా తీర్చుకోగలను? ఈ అనుభవాన్ని వ్రాస్తూ 'ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా నా బాబా నాకు ఉన్నార'ని తలచుకుంటుంటే నాకు ఆనందభాష్పాలు వస్తున్నాయి. "బాబా! ఇలాగే ధైర్యాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని మాకు ప్రసాదించి మమ్మల్ని, మా పిల్లల్ని, కోడలిని, మనవడిని చల్లగా చూడు సాయి".


చివరిగా ఇంకో విషయం. మా కోడలి డెలివరీ, మా బాబు తీసుకున్న కారు పూజ ఒకేసారి అవ్వడం వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను. కానీ కారు పూజ చేయించిన దేవాలయంలో సకల దేవతా మూర్తులు ఉన్నాయి. నా బాబా కూడా ఉన్నారు. అందరినీ దర్శించుకుని ఆనందంతో చేతనైనంత అన్నదానానికి ఇచ్చాను. అయితే ఆ దేవాలయ ప్రాంగణంలో బాగా ఇసుక ఉండటవలన ఆ ఇసుక, అందులోని రాళ్ళూ నా కాళ్లలో గుచ్చుకున్నాయి. ఆరోజు ఏమీ అనిపించలేదు కానీ, ఊరికి తిరిగి వచ్చాక నా కాళ్ళు, పాదాలు విపరీతంగా నొప్పి పెట్టాయి. నాకు షుగర్ వచ్చిందేమోనని భయపడి, "బాబా! ఈ నొప్పులు తగ్గేలా చూడండి" అని బాబాను ప్రార్థించాను. కానీ నొప్పులు తగ్గలేదు. అప్పుడు, "నేను తప్పు చేస్తున్నట్లైతే నన్ను క్షమించండి బాబా" అని బాబాతో చెప్పుకుని ఊదీ కాళ్లకు, పాదాలకు రాసుకున్నాను. అంతే, అప్పటి వరకూ టాబ్లెట్లు వేసుకున్నా తగ్గని నొప్పి ఊదీతో90 - 100% తగ్గింది. బాబా దయవల్ల నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. మమ్మల్ని ఎల్లప్పుడూ రక్షించే దయగల కరుణామూర్తి శ్రీసాయినాథుడు. చివరిగా మా సంతోషాన్ని ప్రతి ఒక్కరితో పంచుకునే అవకాశమిస్తున్న బ్లాగు నిర్వాహకులకు మరోసారి ధన్యవాదాలు.


బాబా కరుణాదృష్టి

సాయి బంధువులందరికీ నా నమస్కారం. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి కృతజ్ఞతలు. నా పేరు నాగలక్ష్మి. ఎన్నోరోజుల నుండి నా అనుభవాలను వ్రాయాలనుకుంటూ కూడా వ్రాయలేకపోయాను. ఇన్ని రోజులకి నాకీ అవకాశం కల్పించిన ఆ సాయినాథునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఒకసారి మావారికి బాత్‍రూమ్‍లో నడుము పట్టేసింది. దానివలన ఆయన చాలా బాధ అనుభవించారు. ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా తగ్గలేదు. అప్పుడు నేను, "బాబా! నొప్పి తగ్గితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. ఆ సాయినాథుని దయవలన నొప్పి తగ్గిపోయింది. "థ్యాంక్యూ బాబా".

మా పెద్దపాప ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. తన ప్యాకేజీ(జీతం) చాలా తక్కువగా ఉన్నందువలన నేను, "బాబా! మా పాపకి మంచి ప్యాకేజీతో ఉద్యోగం రావాల"ని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయతో పాపకి నేను కోరుకున్నట్లే మంచి ఉద్యోగం వచ్చింది. "ధన్యవాదాలు బాబా. ఇలాగే మావారి ట్రాన్స్ ఫర్ విషయంలో, మా పాప పెళ్ళి విషయంలో మాకు సహాయం చేయండి బాబా. ఈ అనుభవాలను వ్రాయడంలో ఆలస్యం చేసినందుకు క్షమించండి బాబా. మీ కరుణా దృష్టి మాపై ఎల్లప్పుడూ ఇలానే ఉంచి అందరి ఆరోగ్యాలను కాపాడండి తండ్రి".

కృపతో కాలి బాధను తొలగించిన బాబా 

ముందుగా ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా నమస్కారాలు. మంచి మంచి సాయి అనుభవాలను పంచుతున్న సాయికి ఎల్లప్పుడూ ఆ సాయి కృప ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు మల్లారెడ్డి. నేను హైదరాబాదు నివాసిని. నేను ఇంతకుముందు ఈ బ్లాగు ద్వారా కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఇటీవల జరిగిన మరో అనుభవాన్ని పంచుకుంటున్నాను. 2022, జూన్ 6న నేను మెట్లు దిగుతూ చివరి మెట్టు వచ్చేసరికి కాలు జారి కింద పడిపోబోయాను. పక్కనే ఉన్న గోడ సహాయంతో పూర్తిగా పడిపోకుండా కాసుకోగలిగాను. అలా రెండుసార్లు జరిగినప్పటికీ నేను కింద పడిపోలేదు. లేకపోయుంటే మెట్ల పైనుంచి పడిపోవటం వల్ల నా తలకు దెబ్బ తగిలి ఉండేది. ఆ సాయి కృపవలనే నేను ప్రమాదం నుంచి బయటపడగలిగాను. కానీ ఆ ఘటన వల్ల నా రెండు మోకాళ్ళు పట్టేసి నడవలేని స్థితి ఏర్పడింది. మెల్లగా గోడను పట్టుకుని బయటకి వెళ్ళాను. తరువాత ఒక వారం రోజుల వరకు నడవడానికి ఇబ్బందిగా ఉంటూ ఒక కాలు పిక్కలో నరం లాగేస్తూ ఉండేది. రోజూ బాబా ఊదీ కాలుకి రాసుకుని, నుదుటన పెట్టుకుని, మరికొంత నోట్లో వేసుకుని ఆఫీసుకు వెళ్తుండేవాడిని. మోకాలికి పట్టి కూడా వేసుకున్నాను. కానీ నరం లాగడం తగ్గలేదు. 2022, జూన్ 14న నేను నా రోజువారీ అలవాటు ప్రకారం మా ఆఫీసులో ఉండే బాబా విగ్రహాన్ని పూజిస్తూ, "బాబా! నొప్పి భరించలేకపోతున్నాను. దయచేసి తగ్గించండి బాబా. తొందరగా నొప్పి తగ్గితే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. ఆ రాత్రి తెల్లవారుఝామున నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో మా బాబా గుడిలోని సేవకులంతా కలిసి ఒక ఉత్సవం చేస్తూ ఊరేగింపు తరువాత గుడికి వచ్చి, ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు బాబా గుడి అగ్నికి ఆహుతి అవుతున్నట్లు, అందులో ఒక పంతులుగారు చిక్కుకున్నట్టు కనిపించింది. అంతలో బాబా నాతో ఏదో చెప్తున్నట్లుగా అనిపించి వెంటనే నేను వెనక నుంచి గుడిలోకి వెళ్లి ఆ పంతుల్ని ఎలాగోలా బయటకు తీసుకువచ్చాను. అంతటితో కల ముగిసింది. అదేరోజు మధ్యాహ్నం నా కాలినొప్పి తగ్గిపోయి, మళ్లీ రాలేదు. ఇది సాయి చేసిన అద్భుతంకాక మరేమిటి? సాయి మహిమలు తెలుసుకోవడం ఎవరి తరం కాదు. సాయి కృప ఎలా ఉంటుందో నా ఈ అనుభవం ద్వారా అందరికీ అవగతమవుంతుందని ఆశిస్తున్నాను. ఆ కృప మన సాయి భక్తులందరిపై ఉండాలని సాయి పాదపద్మములకు విన్నవించుకుంటున్నాను. "ధన్యవాదాలు బాబా".

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!

7 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. Jaisairam bless amma for her health and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  5. ఓం సాయి బాబా మీ కృప మా అందరి మీద ఉండాలి సాయి బాబా

    ReplyDelete
  6. Omesairam.. A carpenter manasu marchi money maku vachela cheyi thandri please baba

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo