1. కష్టసమయంలో తోడుగా ఉంటున్న బాబా2. సాయి కృపతో దొరికిన ముత్యాల మాల
3. పని ఒత్తిడిని తగ్గించిన సాయి మహరాజ్
కష్టసమయంలో తోడుగా ఉంటున్న బాబా
నా పేరు కృష్ణవేణి. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు సభ్యులకు నా వందనాలు. ఈ బ్లాగు నాకు ఎంతో ధైర్యాన్నిస్తుంది. ఈ బ్లాగు వలన బాబా నాతోనే ఉన్నట్లు ఉంటుంది. "బాబా! మీకు అనేకానేక కృతజ్ఞతలు. ఇప్పటివరకు నన్ను చాలా సమస్యల నుండి కాపాడావు తండ్రి. సమస్యలతో పోరాడే ఓపికని, ధైర్యాన్ని మరియు శక్తిని నాకు ఇవ్వండి బాబా ప్లీజ్".
మా ఆయన రెండు సంవత్సరాల నుంచి కంటి సమస్యతో బాధపడుతున్నారు. ఆయన కంటికి రెటీనా ప్రాబ్లమ్ వచ్చింది. డాక్టర్లు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఇప్పటికి 4సార్లు సర్జరీ చేసి నెలకి ఒకసారి చెకప్‍కి రమ్మన్నారు. హాస్పిటల్‍కి వెళ్లిన ప్రతిసారీ 'ఏం చేస్తారో, ఏం చెప్తారో' అన్న టెన్షన్‍తో నరకంలా ఉంటుంది. ఇలా ఉండగా ఈమధ్య మరోసారి సర్జరీ అయ్యింది. అప్పుడు నేను, "బాబా! సర్జరీ మంచిగా అయితే బ్లాగులో పంచుకుంటాను. ప్లీజ్ బాబా, మావారిని ఈ బాధ నుండి కాపాడండి. నాకు ఇష్టమైన వాళ్ళు ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారు. ఏ జన్మలో ఏ పాపం చేసానో నన్ను క్షమించండి బాబా" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవలన నా భర్త సర్జరీ మంచిగా జరిగింది.
రెండు సంవత్సరాల క్రితం నా బ్లాడర్‍కి చిన్న లేజర్ ట్రీట్మెంట్ చేసి 6 నెలలకి ఒకసారి చెకప్‍కి రమ్మన్నారు. ఇటీవల 2022, జూన్ మొదటివారంలో నేను హాస్పిటల్‍కి వెళ్ళినప్పుడు మళ్లీ సర్జరీ ఏమైనా అంటారేమోనని భయమేసి, ప్రస్తుత పరిస్థితులలో సర్జరీ అంటే చాలా కష్టమని, "బాబా! ప్రాబ్లమ్ ఏమీ లేదని చెప్తే, బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల డాక్టరు నాకు ఏ ప్రాబ్లమ్ లేదని, మూడు నెలలు మందులు వాడి తరువాత రమ్మన్నారు. "థాంక్యూ సో మచ్ బాబా".
నేను ఈ మధ్య అనుకోకుండా ఒకరోజు మా అత్తయ్యవాళ్ళతో తెలంగాణలోని చెరువుగట్టు శివాలయంకి వెళ్ళాను. నేను ఎక్కడికి వెళ్లినా బాబా నాతో ఉన్నానని నిదర్శనమిస్తుంటారు. అందుచేత ఇంటినుంచి బయలుదేరినప్పటి నుంచే నేను, 'బాబా ఈరోజు నాకు ఏ రూపంలో దర్శనమిస్తారో!' అనుకుంటూ వెళ్ళాను. కానీ బాబా కనిపించలేదు. అక్కడ లంచ్ చేసి చిట్యాల దగ్గర నాగిరెడ్డిపల్లి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక నేను షాక్ అయ్యాను. ఎందుకంటే, అక్కడ కూడా శివాలయం ఉందని నాతో మావాళ్ళు చెప్పారు. కానీ అది బాబా గుడి. అక్కడ శివలింగాల మధ్యలో బాబాని చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. అంతేకాదు, అనుకోకుండా చేసిన నా ప్రయాణం బాబా సంకల్పమని అనిపించింది. అక్కడ బంగారు శివలింగానికి అభిషేకం చేసాను. ఇదంతా బాబా దయ. "థాంక్యూ సో మచ్ బాబా. కష్టసమయంలో నాకు తోడుగా ఉండి నేనున్నానని ధైర్యాన్నిస్తున్నారు తండ్రి. మీకు నా కోటికోటి ప్రణామాలు బాబా. ఇంతకన్నా నేను మీకు ఏమి చేయగలను తండ్రి?".
సాయి కృపతో దొరికిన ముత్యాల మాల
సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు ఉమ. నేను సాయి భక్తురాలిని. బాబా నాకు ప్రసాదించిన ఒక చిన్న అనుభవం నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటాను. నా దగ్గర డైమండ్ లాకెట్ ఉన్న ముత్యాల మాల ఒకటి ఉంది. 3 సంవత్సరాల క్రితం నేను దాన్ని వేసుకుని ఒక ఫంక్షన్‍కి వెళ్ళొచ్చాను. ఆ తరువాత నేను దుబాయ్ మరియు కెనడా వెళ్లాను. ఇండియాకి వచ్చిన తరువాత ఆ మాలను వేసుకుందామని ఇంట్లో ఉన్న లాకరులో చూస్తే, అది కనిపించలేదు. సరేనని, బ్యాంకు లాకరులో చూస్తే, అక్కడ కూడా లేదు. దాన్ని ఇంకెక్కడైనా పెట్టానో ఏమో కానీ, నాకు ఎంతకీ గుర్తు రాలేదు. ప్రతిరోజూ నాకు ఆ మాల జ్ఞాపకం వచ్చినప్పుడు, "బాబా! నా ముత్యాల మాల దొరికేలా చూడండి, మేరే దయామయా తండ్రి" అని వేడుకుంటూ ఉండేదాన్ని. ఒకటి కాదు రెండు కాదు ఆరు నెలలపాటు ఆ మాలకోసం వెతికి, దొరక్కపోయేసరికి ఊరుకున్నాను. ఇంకొన్ని రోజులు గడిచాయి. తరువాత ఒకరోజు మధ్యాహ్నం నేను నా కప్ బోర్డులో ఉన్న ఖాళీ జ్యువెలరీ బాక్సులన్నీ ఒక కవరులో వేసి, వాటిని బయట ఉన్న లాక్ చేయని కప్ బోర్డులో పెడుతున్నప్పుడు, "బాబా! వీటిలో ఏదైనా ఒక బాక్సులో నా ముత్యాల మాల కనిపించేలా చేయండి. నా మాల నాకు దొరికితే, మీ బ్లాగు ద్వారా నా అనుభవం అందరితో పంచుకుంటాను మేరే బాబా, ఓ దయామయా తండ్రి. మేరే బాబా" అని అనుకుంటూ ఒక్కో బాక్స్ తెరుచుకుంటూ వెళ్ళాను. అద్భుతం! ఒక బాక్సులో ఆ మాల కనిపించింది. "మేరే బాబా! ఓ దయామయా తండ్రి. మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు నా వెంటే ఉంటూ నన్ను నడిపించండి తండ్రి. ఆలస్యంగా నా అనుభవాన్ని పంచుకున్నందుకు నన్ను క్షమించండి. మేరే సాయి మేరే విశ్వాస్ మేరే బాబా! ఓ కరుణామయ తండ్రి! మీ కృప మేరే పరివార్ పర్ హమేషా, హమేషా కేలియే బనాకే రఖ్నా మేరే బాబా ఓ కరుణామయా తండ్రి!!!
ముందుగా ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయి బంధువులకి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సుస్మిత. నేను ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగిని. నాకు ఈ బ్లాగ్ గురించి మా అమ్మగారి ద్వారా తెలిసింది. అమ్మకి బాబాపట్ల చాలా నమ్మకం. ఆమె ఎప్పుడు, ఏది అడిగినా బాబా పలుకుతారు. దానితో నాకు బాబా మీద నమ్మకం బాగా కుదిరి శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ చెయ్యడం మొదలుపెట్టాను. నాకు క్యాంపస్ సెలక్షన్లో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చినప్పటికీ మంచి ప్రాజెక్ట్ దొరకక నేను చాలా అసంతృప్తిగా ఉండేదాన్ని. అప్పుడు కంపెనీ మారిపొమ్మని అందరూ సలహా ఇచ్చారు. కేవలం బాబా దయవలన నాకు మంచి ప్యాకేజీతో వేరే కంపెనీలో ఉద్యోగం రావడం, అక్కడ మంచి పేరు తెచ్చుకోవటం జరిగాయి. కానీ హఠాత్తుగా ప్రాజెక్ట్ మార్చడంతో నాకు పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయి నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. నాకొచ్చిన కష్టం గురించి అమ్మతో చెప్పుకుని ఏడ్చినప్పుడు, "మనల్ని ఎప్పుడూ కాసుకునేది మన తండ్రి బాబానే. ఆయనే మనకి దిక్కు. ఆయనకే మొరపెట్టుకో" అని ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు గురించి చెప్పింది అమ్మ. నేను వెంటనే, "బాబా! ఈ సంకటస్థితి తొలిగిపోతే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అంతే, కొద్దికాలంలోనే పని ఒత్తిడి తగ్గి, ప్రశాంతత చేకూరింది. నిజంగా అద్భుతమిది. ఈ విషయం ఇలా సాయి బంధువులతో పంచుకోవడం నా అదృష్టం. సర్వం సాయి మయం. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
శ్రీ సాయినాథ్ మహరాజ్ కి జై!!!
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteSai always be with me
A carpenter manasu marchi money maku vachela cheyi thandri please baba
ReplyDelete