1. ప్రతి సమస్య విషయంలో బాబా అనుగ్రహం
2. శ్రీసాయినాథుని ఆశీర్వాదం
3. కొద్ది నిమిషాలలోనే ట్రైన్ వచ్చేలా అనుగ్రహించిన బాబా
ప్రతి సమస్య విషయంలో బాబా అనుగ్రహం
శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!! నా పేరు రవీంద్ర. నేను హైదరాబాద్ నివాసిని. నేను చాలా సంవత్సరాల నుండి సాయి భక్తుడిని. బాబా ఆశీస్సులతో నాకు చాలా అనుభవాలు జరిగాయి. ఇదివరకు చాలా అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. ఒకప్పుడు నేను ఒక ఆఫీసులో టైపింగ్ వర్క్ చేశాను. ఆ పనికి గానూ నాకు రావాల్సిన డబ్బులు చాలా రోజులు గడిచినా ఇవ్వలేదు. ఆ విషయంలో నేను, "బాబా! నాకు రావాల్సిన డబ్బు వచ్చేటట్లు చేయండి. మీ అనుగ్రహంతో నా డబ్బులు నాకు వస్తే, ఆ అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవలన నా డబ్బులు నాకు వచ్చాయి. "బాబా! ఆఫీస్ నుండి నాకు రావాల్సిన డబ్బులు వచ్చేలా చేసినందుకు ధన్యవాదాలు".
2022, జూన్ 2 రాత్రి నా ఛాతి పైభాగంలో నొప్పి వస్తే, "బాబా! మీ దయవలన నొప్పి తగ్గితే బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకుని నొప్పి ఉన్న చోట బాబా ఊదీ రాసుకుని, మరికొంత ఊదీ నీళ్లలో కలుపుకుని త్రాగి పడుకున్నాను. బాబా దయవలన నొప్పి తగ్గిపోయింది. మర్నాడు ఉదయం కొద్దిగా కండరం నొప్పిగా అనిపించినప్పటికీ బాబా దయతో తగ్గిపోయింది. నాకు తరచు గ్యాస్ట్రిక్ నొప్పి వస్తుంటుంది. ఒకసారి అలా వచ్చినప్పుడు ఎంతకీ తగ్గలేదు. అప్పుడు బాబా ఊదీ రాసుకుని, కొద్దిగా ఊదీ నోట్లో వేసుకున్నాను. తెల్లారేసరికి నొప్పి తగ్గింది. అలాగే మరోసారి అకస్మాత్తుగా గ్యాస్ట్రిక్ నొప్పి వచ్చి, అప్పుడు కూడా ఎంతకీ తగ్గలేదు. "బాబా! ఈ నొప్పి తగ్గితే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను అని" బాబాను ప్రార్థించాను. అలా ప్రార్థించినంతనే నొప్పి తగ్గింది. "థాంక్యూ సో మచ్ బాబా".
మా పాపకి పరీక్షల సమయంలో హఠాత్తుగా దగ్గు, జలుబు, చేయినొప్పి వచ్చాయి. అప్పుడు నేను, "బాబా! పాపకి ఎటువంటి సమస్యలు లేకుండా చూడండి. తను మంచి మార్కులతో పాస్ అయినట్లయితే బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవలన పాప మంచి మార్కులతో పాస్ అయింది.
నాకు ఒక కిరాణా షాపు ఉంది. అది సరిగా నడవడం లేదని, ఆ షాపు మూసేద్దామని నిర్ణయించుకున్నాను. ఆ షాపులో ఉండే ర్యాక్స్, కౌంటర్స్ అమ్మేద్దామనుకుని, "బాబా! మీ దయతో షాపులోని రాక్స్, కౌంటర్స్ అమ్ముడైపోతే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా అవి అమ్ముడైపోయాయి. "ధన్యవాదాలు బాబా. మూడు సంవత్సరాలుగా నేను ఉదోగ్యం కోసం ఎదురు చూస్తున్నాను. మీ దయవలన ఉదోగ్యం వస్తే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను. దయచేసి నాకు ఈ నెలలో ఉద్యోగం వచ్చేలా అనుగ్రహించండి. భక్తులందరికీ మీ ఆశీస్సులు ఉండాలి తండ్రి".
శ్రీసాయినాథుని ఆశీర్వాదం
శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!! ముందుగా ఈ బ్లాగును అద్భుతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు, సాయి బంధువులకు నమస్సుమాంజలి. నా పేరు లక్ష్మి. నేను ఇదివరకు కొన్ని అనుభవాలను తోటి సాయి భక్తులతో పంచుకున్నాను. ఇప్పుడు ఈమధ్య జరిగిన మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నందుకు నాకు ఆనందంగా ఉంది. ఈమధ్య మావారు ఒకసారి కళ్ళు టెస్టు చేయించుకుందామని హాస్పిటల్‌కి వెళ్లారు. అక్కడ అన్ని రకాల టెస్టులు చేసి, "కుడికంటిలో నరాలు బలహీనంగా ఉన్నాయి. గ్లూకోమా కూడా మొదటి స్టేజిలో ఉంది" అని చెప్పారు. రెండు రోజుల తరువాత మరొక టెస్టు చేసి, "జాగ్రత్తగా ఉండమ"ని చెప్పారు. ఆ విషయం విని నాకు చాలా టెన్షన్‌గా అనిపించింది. సెకండ్ ఒపీనియన్ కోసం ఒకసారి ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రికి వెళ్లి మరోసారి టెస్టు చేయించుకోమని మావారితో చెప్పి, మనసులోనే, "బాబా! మావారి రిపోర్టులన్నీ నార్మల్ వచ్చేలా అనుగ్రహించండి. అదే జరిగితే, ఈ అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని సాయినాథుని ప్రార్థించాను. వారం రోజుల తరువాత మాకు ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రిలో అపాయింట్మెంట్ దొరికితే, చెకప్ కోసం అక్కడికి వెళ్ళాము. అక్కడి డాక్టర్లు మరలా టెస్టులు అన్ని రాసారు. నేను బాబా నామస్మరణ చేసుకుంటూ, "రిపోర్టులు నార్మల్‌గా రావాల"ని దయగల తండ్రి సాయినాథుని ప్రార్ధించాను. ఆయన ఆశీర్వాదబలం వల్ల రిపోర్టులన్నీ నార్మల్ వచ్చాయి. డాక్టరు, "మీరు చెప్పినట్లుగా ఏమీ లేదు. నరాలన్నీ బాగానే ఉన్నాయి. అంత వీక్‌గా ఏమీ లేవు. గ్లూకోమా ఉన్నట్లు కూడా ఏమీ కనిపించట్లేదు" అని చెప్పారు. అంతా ఆ సమర్ధ సద్గురు సాయినాథుని ఆశీర్వాదామని మాకు అనిపించింది.
ఈ మధ్య మేము మా బంధువుల ఇంట్లో పెళ్లికని విజయవాడ వెళ్ళాము. పెళ్ళైన తరువాత మేము శ్రీకనకదుర్గ మరియు శ్రీ మంగళగిరి పానకాల నరసింహస్వామి వార్ల దర్శనానికి వెళ్లాలని అనుకున్నాము. అయితే ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల నా ఆరోగ్యం చెడి విరోచనాలతో ఇబ్బందిపడ్డాను. అప్పుడు సాయినాథున్ని తలుచుకుని ఊదీ మంచినీళ్లలో కలుపుకుని త్రాగి, "బాబా! నాకు ప్రయాణంలో ఏవిధమైన ఇబ్బంది లేకుండా చేయండి. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాని ప్రార్ధించాను. అపూర్వమైన ఆయన ఆశీర్వాద బలం వల్ల ఏ విధమైన ఇబ్బంది కలగకుండా దర్శనాలు బాగా జరిగాయి. ప్రయాణం కూడా సాఫీగా జరిగి క్షేమంగా ఇంటికి చేరుకున్నాము. "సాయినాథా! మీకు నా హృదయపూర్వక వందనాలు తండ్రి. నిన్ను కొలుచుట మా పూర్వజన్మ సుకృతం. ఎప్పటికీ మీ కరుణ మాపై, సాయి భక్తులందరిపై ఇలాగే వర్షించాలి తండ్రి".
కొద్ది నిమిషాలలోనే ట్రైన్ వచ్చేలా అనుగ్రహించిన బాబా
సాయి భక్తులకు నమస్కారం. నా పేరు అరుణ లక్ష్మి. ఇప్పుడు నేను బాబా నాకు ఇటీవల ప్రసాదించిన ఒక చిన్న అనుభవం మీతో పంచుకుంటున్నాను. 2022, జూన్ నెలలో మేము మా బంధువుల గృహప్రవేశానికి వెళ్ళాము. తిరుగు ప్రయాణంలో మేము ఎక్కవలసిన ట్రైన్ ఆలస్యంగా నడుస్తుంది. రాత్రి సమయం కావడం వలన బాబు నిద్రకి తాళలేక ఏడుస్తూ ఉన్నాడు. కానీ ట్రైన్ ఎంతకీ రావడం లేదు. అది రానురాను ఆలస్యమవుతూ రాత్రి 2 గంటల అయింది. అప్పుడు ఇంకా నేను, "బాబా! చిన్నపిల్లాడితో ఇబ్బంది పడుతున్నాము. దయ చూపి ట్రైన్ వేగంగా వచ్చేలా చూడు స్వామి. నా ఈ అనుభవం బాబా భక్తుల బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. అంతే, కొద్ది నిమిషాలలోనే ట్రైన్ వచ్చింది. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి! 'బాబా పిలిస్తే పలికే దైవం' అనడానికి. "ధన్యవాదాలు బాబా". నాకీ అవకాశం ఇచ్చిన బ్లాగు నిర్వాహకులకు ధన్యవాదాలు.
బోలో సమర్ధ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Ome sri sai ram🙏
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOm sairam
ReplyDeleteSai always be with me