సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1239వ భాగం....


భాగంలో అనుభవాలు:

1. దయతో అన్నీ అనుగ్రహించే బాబా
2. మరోసారి ఊదీ మహిమను చూపిన బాబా
3. పుట్టినరోజు సందర్భంగా దర్శనంతో విష్ చేసిన బాబా

దయతో అన్నీ అనుగ్రహించే బాబా

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి. సాయి బంధువులందరికీ నా నమస్కారం. నా పేరు భవాని. మాది గుంటూరు జిల్లా. మా కుటుంబసభ్యులందరికీ బాబాపట్ల భక్తి, ప్రేమలు చాలా ఎక్కువ. మాకు ఏ బాధ కలిగినా ముందుగా గుర్తొచ్చేది, తలచుకునేది బాబానే. బాధ కలిగినప్పుడు విషయం చాలా పెద్దదిగా, బాబా దయతో ఆ కష్టం తొలిగిపోయిన క్షణాన విషయం చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఇలాంటి సంఘటనలు మా జీవితాలలో ఎన్నో ఉన్నాయి. నేను ఉద్యోగరిత్యా వేరే రాష్ట్రంలో ఉంటున్నప్పటికీ మా పిల్లల చదువు నిమిత్తం మేము ఆంధ్ర నుండి హైదరాబాదుకు, అదికూడా ఎప్పుడూ రద్దీగా ఉండే ముషీరాబాద్‍కి మకాం మార్చాల్సి వచ్చింది. అది బాగా కమర్షియల్ ఏరియా. అక్కడ ఇల్లు దొరకాలంటే కనీసం పదిరోజులు పడుతుంది. అక్కడ ఇంటి అద్దెలు చాలా ఎక్కువగా ఉంటాయి. మన బడ్జెట్‍కి అందుబాటులో అస్సలు ఉండవు. అందువలన నేను బాబాను ఆశ్రయించి, "బాబా! నా బడ్జెట్‍లో నాకొక మంచి ఇల్లు అతి త్వరగా దొరికేలా అనుగ్రహించండి" అని వేడుకున్నాను. అంతే, ఏదో మాయలా ఎప్పటినుంచో ఆ ఏరియాలో నివాసముంటున్న ఒకతను పరిచయమవటం, ఆ మరుసటిరోజే అతను నాకు ఫోన్ చేసి, "మా ఎదురు ఇల్లు ఖాళీ అవుతుంద"ని చెప్పటం, మేము చూడడం, మాట్లాడడం అన్ని చకచకా ఒకే రోజులో జరిగిపోయాయి. పది రోజులు తిరిగినా దొరకని ఇల్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా సులభంగా దొరికిందంటే ఆ బాబా లీలే కదా! ఇలా ఆ బాబా మమ్మల్ని ఎల్లప్పుడూ చల్లగా చూస్తూనే ఉన్నారు.

ఇకపోతే, మేము మొదటినుండి ఎమ్.ఎస్. చదివించడం కోసం మా బాబుని అమెరికా పంపించాలని అనుకున్నాము. అందుకుగానూ GRE, IELTS టెస్టులకోసం బాబుకి కోచింగ్ ఇప్పించాము. బాబా దయవలన బాబుకి GREలో బాగానే స్కోరు వచ్చినప్పటికీ IELTSలో సంతృప్తికరమైన స్కోర్ రాలేదు. మంచి అకాడమిక్ రికార్డు మొదలు అన్నీ ఉన్నప్పటికీ IELTSలో మంచి స్కోర్ రాకపోయేసరికి బాబు బాగా డల్ అయ్యాడు. మేము ఆ బాబా మీద భారమేసి బాబుని ఈసారి TOEFLకి ప్రిపేరు చేయించాము. బాబా దయవలన అందులో మంచి స్కోర్ వచ్చింది. దాంతో మేము కొన్ని యూనివర్సిటీలకి అప్లై చేశాము. అన్ని యూనివర్సిటీల నుండి ఆక్సెప్టెన్స్ లెటర్లు వచ్చాయి. అందులో మేము బాగా ఇష్టపడిన యూనివర్సిటీ కూడా ఉంది. బాబా దయవల్ల అదే యూనివర్సిటీ నుండి బాబుకి i20 వీసా వచ్చింది. దానికి సంబంధించి ఎంతో కష్టమనుకున్న స్లాట్ బుకింగు బాబా దయతో మా పరిచయస్తులు ద్వారా ఏ ఇబ్బంది లేకుండా చాలా సుళువుగా అయిపోయింది. అన్నిటికంటే ముఖ్యమైన బ్యాంకు లోన్ సాంక్షన్ లెటర్, బ్యాంక్ బ్యాలన్స్ అన్ని మా బంధువుల ద్వారా ఏ మాత్రం ఇబ్బంది లేకుండా సక్రమంగా జరిగాయి. ఎంతో టెన్షన్ పడ్డప్పటికీ బాబా చల్లని దృష్టి వల్ల వీసా అప్రూవల్ కూడా పూర్తయింది. 2022, జూన్ 17న బాబు ప్రయాణానికి కావాల్సిన టికెట్లు కూడా దొరికాయి. డబ్బులేకపోయినా బాబా దయవల్ల బంధువుల ద్వారా అన్నీ ఆ సమయానికి సమకూరుతున్నాయి. మేము ఏ పని మొదలుపెట్టినా, బాబా మీద భారం వేసి మొదలుపెడతాము. ఆయన దయవలనే ఆ పనులన్నీ పూర్తయి మమ్మల్ని ఆనందంలో ముంచుతున్నాయి. ఇకముందు కూడా బాబా దయతో నా కోరికలన్నీ తీరాలి. చివరిగా ఆ బాబా దయతో మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. ఆయన ఎల్లప్పుడూ మమ్మల్ని ఇలాగే చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను.
 
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసాయినాథ్ మహరాజ్ కి జై!!!

మరోసారి ఊదీ మహిమను చూపిన బాబా

సాటి సాయి బంధువులకు నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. మా 8 నెలల పాపకు ఒకరోజు హఠాత్తుగా జ్వరం వచ్చింది. అసలే తనకి పుట్టుకతో హార్ట్ ప్రాబ్లెమ్ ఉన్నందువల్ల తనకేదైనా ఆరోగ్య సమస్య వస్తే, అస్సలు తట్టుకోలేని నాకు చాలా ఏడుపు వచ్చేసింది. వెంటనే బాబాను తలుచుకుని, దణ్ణం పెట్టుకుని, పాపకి బాబా ఊదీ పెట్టాను. బాబా దయవల్ల సాయంత్రానికి జ్వరం తగ్గిపోయింది. "థాంక్యూ బాబా".

మరొకరోజు పాపకి విరోచనం కాలేదు. సరే, ఒకటి, రెండు రోజులు విరోచనం కానంత మాత్రన ఏం కాదులే అనుకున్నాను. కానీ చూస్తూ చూస్తుండగానే ఏడు రోజులు గడిచిపోయాయి. ఆరోజు పాప బాగా ముక్కుతూ ఇబ్బంది పడుతుంటే, అప్పటిదాకా తనకి విరోచనం కాలేదన్న విషయం గుర్తు లేనందుకు నా మీద నాకే కోపం వచ్చింది. ఇంకా చాలా బాధపడుతూ బాబాకి దణ్ణం పెట్టుకుని వేడి నీళ్లలో ఊదీ వేసి పాప పొట్ట మీద రాసాను. అత్యంత అద్భుతమైన విషయం ఏమిటంటే, పది నిమిషాల్లో పాపకి విరోచనం అయింది. ఆ అద్భుతానికి నేను ఎంత సంబరపడిపోయానో మాటల్లో చెప్పలేను. ఆవిధంగా బాబా తమ ఊదీ మహిమను మరోసారి నాకు చూపించారు. ఇంకా ఈ అనుభవం ద్వారా నా బాబా నాతోనే, నా కుటుంబంతోనే ఉన్నారని మరోసారి ఋజువైంది. బాబా ఎప్పుడూ తన భక్తులను వదిలిపెట్టరు. ఆయన ఒక్కసారి మనల్ని పట్టుకుంటే ఎప్పటికీ పట్టుకునే ఉంటారు. మన తప్పులను సరిదిద్దే ప్రక్రియలో మనకు కష్టాలు రావొచ్చు కానీ, అవి కేవలం భవిష్యత్తులో మనల్ని సంతోషంగా ఉంచడానికి బాబా చేసే వైద్యం మాత్రమే. "అన్నిటికి థాంక్యూ బాబా. నా తప్పులు ఏవైనా ఉంటే క్షమించండి బాబా. నా కుటుంబాన్ని ఆశీర్వదించండి బాబా. దయచేసి నా బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్షుని ప్రసాదించండి బాబా".

ఓం శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథాయ నమః!!!

పుట్టినరోజు సందర్భంగా దర్శనంతో విష్ చేసిన బాబా

ముందుగా సాయిబాబాకు, 'సాయి మహారాజ్ సన్నిధి'కి నమస్కారాలు. నా పేరు శ్రీనివాస్ బాబు. మాది హైదరాబాదు. నేను ఈ బ్లాగులో నా అనుభవం పంచుకోవడం ఇదే మొదటిసారి. చాలా సంవత్సరాల క్రితం రేపు నా పుట్టినరోజు అనగా ఆ రోజు సాయంత్రం నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! మీరే నన్ను మొదట విష్ చేయాలి" అని అనుకున్నాను. ఆ రాత్రి నాకు కలలో బాబా దర్శనం ఇచ్చారు. దీపాల కాంతిలో బాబా వెలిగిపోతుండగా, ఆయన చుట్టూ దీపాలు తిరుగుతున్నాయి. ఆ దర్శన భాగ్యానికి నా మనసు ఆనందంతో నిండిపోయింది. అలా బాబా తమ దర్శనంతో ఆ పుట్టినరోజును నా జీవితంలో చిరస్మరణీయమయ్యేలా చేసారు. "థాంక్యూ బాబా. ఎల్లప్పుడు మమ్మల్ని ఇలాగే అనుగ్రహించండి తండ్రి".

6 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om sai ram last sai leela is very nice if we trust baba he makes everything nice.That got dream baba blessed him.He is lucky. Sai's udi mahima is great.with baba blessings my health improved..I suffered for 3 months but medicines didn't work.my son is doctor he treated me.with sais blessings i recovered from dieses.That is sa i's power

    ReplyDelete
  3. Jaisairam bless amma for her health and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo