1. తోడుగా ఉన్నానన్న నమ్మకాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చే సాయినాథుడు
2. నమ్ముకున్న వారి రక్షణ విషయంలో అప్రమత్తంగా ఉండే బాబా
3. బాబా దయ
తోడుగా ఉన్నానన్న నమ్మకాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చే సాయినాథుడు
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!
ఈ బ్లాగు నిర్వహిస్తున్నవారికి, బ్లాగులో ప్రచురితమవుతున్న సాయి లీలలు చదువుతున్నవారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. మన జీవితంలో జరిగే ప్రతి విషయం ఆ సాయినాథుని సంకల్పానుసారమే జరుగుతాయనే విశ్వాసం మనకు ఎంతగా ఉంటుందో అంతగా మనము ఆయన అనుగ్రహాన్ని, పనులలో సఫలతను పొందుతాము. నేను ఇదివరకు ఈ బ్లాగులో సాయినాథుడు నాకు అనుగ్రహించిన రెండు అనుభవాలను పంచుకున్నాను. ఇపుడు మరికొన్ని అనుభవాలను పంచుకోబోతున్నాను. ఒకసారి మా దూరపు బంధువులు హఠాత్తుగా ఫోన్ చేసి, "మీ ఇంటికి వస్తున్నామ"ని చెప్పారు. కొన్ని కారణాలు వల్ల మా ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేవు. అందువలన నాకు ఇటువంటి సమయంలో వాళ్ళు వస్తే, కొత్త తలనొప్పులు ఏమన్నా వస్తాయేమోనని చాలా ఆందోళనగా అనిపించింది. కానీ ఫోన్ చేసి వస్తామని చెప్పిన వాళ్లతో రావద్దని చెప్పలేము. అలాగని వాళ్ళు వస్తే మనస్పూర్తిగా ఉండలేము. ఇటువంటి స్థితిలో ఏమి చేయాలో పాలుపోక బాబాకి దణ్ణం పెట్టుకుని, "సాయినాథా! ఇంటికి వచ్చేవాళ్లని రావద్దని చెప్పడం కరెక్ట్ అని నాకనిపించడం లేదు. కానీ వాళ్ళు వస్తే, ఇంట్లో పరిస్థితి గమనించి మా మనసు గాయపరుస్తారేమోనని భయంగా ఉంది. కాబట్టి మీరే ఏదో ఒకటి చేయాలి. మీకు ఏది శ్రేయస్కరం అనిపిస్తే అది చేయండి" అని ప్రార్ధించాను. తరువాత వాళ్ళు ఏ సమయంలో వస్తారో అని ఆతృతగా చూస్తున్నాను. కాని సాయంత్రం దాకా రాలేదు. రాత్రికి ఫోన్ చేసి, "మాకు వేరే పని ఉండి, రాలేకపోయాము. ఈసారి ఎప్పుడైనా వస్తాము" అని చెప్పారు. ఆ క్షణంలో నా మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించింది. బాబా దయని తలచుకుని ఎంతో పొంగిపోయాను. "ధన్యవాదాలు బాబా. ఈసారి వాళ్ళు వచ్చే సమయానికి మా ఇంట్లో పరిస్థితులు మారాలి. మేము మనస్పూర్తిగా వాళ్ళని ఆహ్వానించ గలిగేలా ఉండాలి బాబా".
అలాగే నేను ఒకరోజు ఒక పని మీద వేరే ఊరు వెళ్ళాల్సి ఉండగా ఆ ముందురోజు మాకు తెలిసినవాళ్ళు తాము కూడా అదే ఊరుకి వెళుతున్నామని, నన్ను తమతో రమ్మని బలవంతపెట్టారు. ఎంత చెప్పినా ఒప్పుకోలేదు. చివరికి ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నాను. కానీ మనసులో ఇబ్బందిగా ఉండి బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా!.నేను ఒక్కదాన్నే వెళ్లి, నా పని పూర్తి చేసుకోగలిగితే, మీ గుడికి వచ్చి హారతి పాడి ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. చిత్రంగా వాళ్ళు, "మేము వెళ్ళడం లేదు, నువ్వు నీ ఇష్టం ప్రకారం వెళ్ళు" అని చెప్పారు. అప్పటివరకూ నువ్వు మాతో రావాలని పట్టుబట్టిన వాళ్ళు అంతలోనే అలా చెప్పేసరికి నాకు చాలా ఆశ్చర్యమేసింది. ఇక సంతోషంగా ఊరు వెళ్లి, నా పని పూర్తి చేసుకుని, ఆపై బాబా గుడికి వెళ్లి హారతి పాడి ఇప్పుడిలా మీతో నా అనుభవాన్ని పంచుకున్నాను.
చివరగా ఇంకో అనుభవం: 2022, జూన్ రెండో వారంలో మా అమ్మనాన్న ఒక ఫంక్షన్‍కి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళడానికి ముందే నాన్న ఆరోగ్యం అంతగా బాగాలేదు. అలాంటి స్థితిలో వాళ్ళు వెళ్ళడం వల్ల నాకు భయంగా అనిపించి, "బాబా! వాళ్ళు క్షేమంగా ఇంటికి రావాలి. ఫంక్షన్‍కి వెళ్ళడం వల్ల వాళ్ళ ఆరోగ్యం పాడవ్వకుండా ఉండాలి" అని బాబాని ప్రార్ధించాను. బాబా దయవల్ల వాళ్ళు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారు. అంతేకాదు అక్కడికి వెళ్లొచ్చాక నాన్న ఆరోగ్యం కుదుటపడింది. ఇలా చిన్న చిన్న విషయాలలో కూడా నాకు తోడుగా ఉన్నానన్న నమ్మకాన్ని, మనో ధైర్యాన్ని ఇస్తున్న ఆ సాయినాథుని ఎలా స్తుతించాలో నాకు తెలియడం లేదు. బాబా తమను విశ్వసించేవారిని చివరికంటా గమ్యం చేరుస్తారనేది అక్షర సత్యం. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
సమర్ధ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!
నమ్ముకున్న వారి రక్షణ విషయంలో అప్రమత్తంగా ఉండే బాబా
సాయి బంధువులందరికీ మరియు 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు నమస్కారాలు. నా పేరు రెడ్డిప్రసాద్. నేను ఇప్పుడు బాబా నాకు ప్రసాదించిన ఒక అద్భుతమైన అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. ఇంత ఆలస్యంగా తెలియజేస్తున్నందుకు బాబాని క్షమాపణలు వేడుకుంటున్నాను. నేను కరెంట్ ఆఫీసులో ఫీల్డ్ ఆఫీసరుగా ఉద్యోగం చేస్తున్నాను. 2010 డిసెంబర్ 29న నేను నా వృత్తిరిత్యా 33వేల ఓల్ట్స్ సామర్ధ్యం ఉన్న ట్రాన్స్ ఫార్మర్ వద్ద 15 అడుగుల ఎత్తులో పని చేస్తున్నాను. నేను తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలన్నీ తీసుకున్నప్పటికీ అనుకోకుండా షార్ట్ సర్క్యూట్ జరిగి ఒక పెద్ద మంట వచ్చి నా కుడిచేయికి అంటుకుంది. నిజానికి షార్ట్ సర్క్యూట్ అవుతూనే అంతా చీకటిగా అయిపోయి నేను 15 అడుగుల ఎత్తు నుండి కిందకి పడిపోయాను. ఆ స్థితిలో ఏవో అదృశ్య హస్తాలపై నేను పడుకుని ఉంటే, అవి నన్ను సురక్షితంగా క్రిందకు దింపి నేలపై పడుకోబెట్టిన అనుభూతి నాకు కలిగింది. ఆ మరుక్షణం నా కళ్ళలో సాయిబాబా, నా భార్యబిడ్డలు, నా తల్లిదండ్రులు కనబడ్డారు. 5 నిమిషాల తర్వాత నేను తేరుకున్నాను. నన్ను అంబులెన్స్ లో ఆసుపత్రికి తీసుకు వెళ్లి మంటల వల్ల కాలిన నా కుడిచేతికి ప్రధమ చికిత్స చేశారు. అదికాక నా నుదుటిమీద రెండు కుట్లు తప్ప నా ఒంటి మీద ఎటువంటి గాయాలు లేవు. అంత పెద్ద ప్రమాదం నుండి నన్ను కాపాడిన ఆ అదృశ్య హస్తాలు ఎవరివో కాదు సాక్షాత్తు బాబావేనని, వారే నన్ను కాపాడారని నా నమ్మకం. నా జీవితంలో ఇది మరువలేని, మర్చిపోని అద్భుతమైన అనుభవం. ఇవాళ నేను జీవించి ఉండటానికి కారణం శ్రీసాయిబాబానే. తమని నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు బాబా. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
బాబా దయ
ముందుగా ఈ బ్లాగు నిర్వాహకులకు మరియు సాటి సాయి బంధువులకు నా నమస్కారాలు. నా పేరు సాహిత్య. హఠాత్తుగా ఒకరోజు మా డాడీకి తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. డాక్టరు ఎనీమియా చెయ్యాలి అన్నారు. అయితే ఎనీమియా చేశాక కూడా కడుపునొప్పి కొద్దిగా ఉండటంతో స్కానింగ్, యూరిన్ టెస్టు వ్రాశారు. నేను చాలా భయపడుతూ బాబాని, "బాబా! నాన్న టెస్టు రిపోర్టులన్నీ మంచిగా వస్తే, నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల నాన్న టెస్టు రిపోర్టులన్నీ నార్మల్ వచ్చాయి. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
మా పాపకి హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నందువల్ల అప్పుడప్పుడు మేము సాచ్యురేషన్ చెకప్ చేయిస్తున్నాము. ప్రతిసారీ సాచ్యురేషన్ 94, 98కి మధ్యలో ఉండేది. కానీ పాపకి 7వ నెల వచ్చాక చెక్ చేసినప్పుడు సాచ్యురేషన్ 87% రావడంతో భయపడ్డాము. కానీ బాబాకి చెప్పుకున్నాక ఆయన దయవల్ల సాచ్యురేషన్ 94కి పైన వచ్చింది. ఆ అనుభవం దృష్ట్యా పాపకి 8వ నెల వచ్చాక 2022, జూన్ 11న చెకప్‍కి వెళ్ళేటప్పుడు నేను, "బాబా! నా పాపకి సాట్యురేషన్ 96% పైన ఉంటే, నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల నా పాపకి సాచ్యురేషన్ 96 పైనే వచ్చింది. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. నా బేబీకున్న హార్ట్ ప్రాబ్లమ్ నయమయ్యేలా చేయండి బాబా".
ఓం శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథాయ నమః.
Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏
ReplyDeleteJaisairam bless amma for her health and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA
ReplyDeleteJaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
A carpenter manasu marchi money maku vachela cheyi thandri please baba
ReplyDelete