ఈ భాగంలో అనుభవాలు:
1. శ్రీసాయి అనుగ్రహవీచికలు
2. సాయి కృపతో తప్పిన గండం
3. బాబా దయతో ట్రైన్‌లో సీట్లు
శ్రీసాయి అనుగ్రహవీచికలు
ఈ బ్లాగు నిర్వాహకులకు మరియు బ్లాగుని ప్రతిరోజు చదువుతున్న వారికి నా నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. మేము యూరప్‌లో నివాసముంటున్నాము. మేము ఇటీవల బెల్జియం నుంచి ఇండియాకి ప్రయాణం చేయాల్సి వచ్చింది. గతంలో ప్రయాణ సమయంలో మేము ఎదుర్కున్న అనేక సమస్యల కారణంగా నేను, "ఈసారి ప్రయాణమంతా ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటే, బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా మా ప్రయాణం సాగింది. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్".
ఈమధ్య మా ఇంట్లో ఏసీ 2, 3 రోజులు పని చేయలేదు. 4వ రోజు దానంతటదే పని చేసింది. అయితే ఒక వారం తరువాత మళ్ళీ పని చేయలేదు. అప్పుడు నేను, "బాబా మీ దయతో ఏసీకి ఎలాంటి సమస్య లేకుండా ఉంటే, బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. తరువాత బాబా దయవల్ల అది ఏసీ సమస్య కాదని, పవర్ సప్లై వల్ల వచ్చిన సమస్య అని తెలిసింది. అంతేకాదు తొందరలోనే ఆ సమస్య కూడా పరిష్కారమైంది. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్".
మాకు ఒక బాబు ఉన్నాడు. తన పేరు 'సాయి'. తను ఒకరోజు బాగా అల్లరి చేస్తూ ఆడుకుంటున్నప్పుడు అనుకోకుండా తన తల గోడకి గుద్దుకుని బాగా దెబ్బ తగిలి రక్తం వచ్చింది. నాకు భయంతో ఏం చెయ్యాలో తోచక, "బాబా! మా సాయి తలకి ఏ సమస్య లేకుండా త్వరగా తగ్గిపోతే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల బాబుకి ఎలాంటి సమస్య కాలేదు. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్".
తరువాత మేము మా అత్తగారింటి దగ్గర నుంచి అమ్మవాళ్ల ఇంటికి వచ్చాను. అక్కడికి వెళ్లినప్పుడల్లా మా సాయికి ఏదో ఒక దెబ్బ తగులుతూ ఉంటుంది. అందువలన నేను అమ్మవాళ్ల ఇంటికి వెళ్లేముందు, "బాబా! ఈసారి అమ్మవాళ్ల ఇంటికి వెళ్ళినపుడు ఏ సమస్య లేకుండా చూడండి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటే, బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల చిన్న చిన్న దెబ్బలు తగిలినా పెద్ద ప్రమాదం జరగకుండా బాబా రక్షించారు. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్".
ఒకరోజు మా బాబు ఆడుకుంటూ నా కంటిలో పొడిచేసేసాడు. దాంతో నా కన్ను ఎర్రగా అయిపోయి నీరు కారసాగింది. రెండురోజులైనా తగ్గలేదు. ఏమైనా సమస్య అవుతుందేమోనని నాకు భయంమేసి బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల ఐ డ్రాప్స్ తో సమస్య తగ్గిపోయింది. "థాంక్యూ. థాంక్యూ.. థాంక్యూ వెరీ మచ్ సాయి".
సాయి కృపతో తప్పిన గండం
అందరికీ నమస్తే. నా పేరు అరుణ. ఇలాంటి బ్లాగుని మాకు అందించిన బ్లాగు నిర్వాహకులైన సాయికి చాలా ధన్యవాదాలు. నేను ఇంతకుముందు ఎన్నో అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవం పంచుకుంటున్నాను. సాయి దయవల్ల ఈమధ్య మా అక్క కూతురుకి బాబు పుట్టాడని తెలిసి మేము చాలా సంతోషించాము. అయితే వాడు పుట్టిన 10 నిమిషాలకే ఉమ్మనీరు తాగటం వల్ల ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ అయి వెంటిలేషన్ పెట్టే పరిస్థితి వచ్చింది. డాక్టర్లు, "48 గంటలు గడిస్తేగాని ఏమీ చెప్పలేము" అని అన్నారు. ఆ విషయం తెలిసి, "అయ్యో! మనం సంతోషించిన పది నిమిషాలకే ఇలా అయిందేమిటి?" అని మేము పడ్డ బాధ అంతా ఇంత కాదు. ఇక అప్పటినుంచి సాయి స్మరణ చేయసాగాము. మా అక్క కూడా సాయి భక్తురాలు. తను సచ్చరిత్ర పారాయణ నిర్విరామంగా చేసింది. బాబా దయవల్ల 4 రోజుల తరువాత బాబుకి పెట్టిన వెంటిలేషన్ తొలగించారు. దాంతో అందరమూ ఊపిరి పీల్చుకున్నాము. అయితే బాబుకి నెలన్నర వయస్సు వచ్చాక తన చెవి మరియు మాడుపై ఇన్ఫెక్షన్ వచ్చింది. నాకు చాలా భయమేసింది. పెద్ద గండం నుండి బయటపడ్డ బాబుకి మళ్లీ ఇప్పుడు ఈ సమస్య ఏమిటని, "బాబా! అది పెద్ద ప్రాబ్లం కాదు. చిన్న సమస్యే అని డాక్టర్ చెప్తే, బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. నేను ఆశించినట్లే అది పెద్ద సమస్యేమీ కాదు. బాబా దయవల్ల ఇప్పుడు బాబు చాలా ఉషారుగా, సంతోషంగా ఉన్నాడు. "చాలా సంతోషం సాయితండ్రి. కేవలం మీ దయవల్లే మేమందరం ఇంత ఆనందంగా ఉండగలుగుతున్నాము. సదా మీ ఆశీస్సులు మాపై ఉండనివ్వండి బాబా. నా కోపాన్ని తగ్గించి నాకు మానసిక ప్రశాంతతను ఇవ్వండి. ఇంకా ఇలానే నా జీవితంలో మీ కృపతో ఎన్నో అనుభవాలు జరిగేలా మీ కృప నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబా".
బాబా దయతో ట్రైన్‌లో సీట్లు
నా పేరు సత్యకళ్యాణి. మాది పశ్చిమగోదావరి జిల్లా. నేను అడుగడుగునా సాయిప్రేమను పొందుతున్న భాగ్యశాలిని. బాబా నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. ఎన్నిసార్లో నన్ను ఆపదల నుండి గట్టెంక్కించారు. నేనిప్పుడు ఇటీవల జరిగిన ఒక చిన్న అనుభవం మీతో పంచుకుంటున్నాను. ఇటీవల మేము మా పిల్లల సెలవులు పొడిగించడంతో అప్పటికప్పుడు శిరిడీ వెళ్లాలనుకున్నాము. మా అమ్మాయి, అల్లుడు, మనవలు మరియు మా అమ్మాయి స్నేహితురాలు, వాళ్లపాప మొత్తం ఏడుగురు వెళ్ళాలని తలచి 2022, జూన్ 9న ప్రయాణయ్యేందుకు ట్రైన్ రిజర్వేషన్ కోసం ప్రయత్నిస్తే నలుగురికి మాత్రమే టికెట్లు దొరికాయి. మరి మిగతా ముగ్గురి పరిస్థితి ఏమిటని టెన్షన్ పడి సాయిని ప్రార్ధించుకుని బయలుదేరాము. బాబా దయవల్ల ట్రైన్లో టిసి కూర్చోడానికి సీట్లు ఇచ్చారు. కొద్దిగా కష్టపడినా ప్రయాణం సజావుగా సాగి శిరిడీ చేరుకున్నాము. మొత్తం మూడుసార్లు బాబా దర్శనం చేసుకుని ఎంతో తృప్తిగా తిరుగు ప్రయాణమయ్యాము. "చాలా చాలా ధన్యవాదాలు బాబా"
Jaisairam bless amma for her health and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sai raam
ReplyDeleteOm sai ram i am suffering with health problems.i am using medicines.my health is not improving.i have stomach pain,weekness .I want to take Baba's darshan in Siri di.please Baba call my family to have darshan.
ReplyDeletePlease give health to me.Bless my family and be with us
A carpenter manasu marchi money maku vachela cheyi thandri please baba
ReplyDelete