ఈ భాగంలో అనుభవాలు:
1. ఉద్యోగం ప్రసాదించిన బాబా
2. బాబా కృపతో సంవత్సరంనాటి తలనొప్పి నుండి కొంత ఉపశమనం
3. అమ్మ చెవినొప్పి తగ్గించిన బాబా
ఉద్యోగం ప్రసాదించిన బాబా
సాయిబంధువులందరికీ నా నమస్కారం. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు సత్య. నేను ఇంతకుముందు నా అనుభవాలు కొన్ని మీతో పంచుకున్నాను. నేను ఇంకా ఎన్నో అనుభవాలు పంచుకోవాల్సి ఉంది. వాటిని ఒక్కొక్కటిగా మీ అందరితో పంచుకుంటాను. కొద్దిరోజులుగా నా కుమార్తె సంతృప్తికరమైన టీచర్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఆ క్రమంలో తనకి ఉద్యోగాలు వస్తుండేవి, కానీ జీతం తక్కువగా ఉండటం, స్కూల్ చాలా దూరంలో ఉండటం వంటి ఏదో ఒక లోటు ఉండేది. మా ఇంటికి దగ్గరగా రోజూ వచ్చిపోయే దారిలో ఒక స్కూలు ఉంది. ఆ స్కూల్లో అప్లై చేయమని నేను ఎన్నోసార్లు నా కుమార్తెతో చెప్పాను. తను అప్లై చేసిందో, లేదో నాకు తెలియదుగానీ, ఒకరోజు నాతో ఇలా చెప్పింది: "ఆన్లైన్ ద్వారా ఈ స్కూల్లో ఎన్నోసార్లు అప్లై చేశాను. కానీ వారినుండి ఎటువంటి సమాధానం రాలేదు" అని. ఇలా చాలాసార్లు జరిగాక ఒక శనివారంనాడు నేను, నా కుమార్తె ఆ స్కూల్ దారిలో వస్తున్నప్పుడు నేను మళ్ళీ అదేమాట తనతో అన్నాను. తననుండి మునుపటి సమాధానమే వచ్చింది. ఆరోజు సాయంత్రం యూట్యూబ్ ద్వారానో లేక 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ ద్వారానో నాకు సరిగా జ్ఞాపకం రావడం లేదు గానీ, '5 దీపాలతో, 5 రోజులు సాయి పూజ చేస్తే, కోరిన కోరిక నెరవేరుతుంది' అని నేను తెలుసుకున్నాను. వెంటనే ఆ విషయాన్ని నేను నా కుమార్తెతో చెప్పి, "నువ్వు రేపటినుండే ఆ పూజ చేయి" అని చెప్పాను. తను నా మాట మన్నించి ఆదివారం నుండి గురువారం వరకు కొద్దిసేపే అయినా 5 దీపాలతో చాలా శ్రద్ధగా పూజ చేసింది. మరుసటిరోజు శుక్రవారంనాడు నా కుమార్తె అదే స్కూలుకి ఆన్లైన్‍లో అప్లై చేసింది. శనివారంనాడు ఆ స్కూలు ఇన్‌ఛార్జ్ ఫోన్ చేసి, "సోమవారం ఉదయం 10 గంటలకి ఇంటర్వ్యూకి రమ్మ"ని చెప్పారు. నాకు ఎంతో ఆశ్చర్యం, ఆనందం కలిగాయి.
2022, మే 30, సోమవారం నేనే నా కుమార్తెని ఇంటర్వ్యూకోసం స్కూలుకి తీసుకుని వెళ్ళాను. మేము అక్కడికి వెళ్ళాక రిసెప్షన్‍లో కూర్చున్నాము. ఒక 10 నిమిషాల తరువాత నా కుమార్తె ఇంటర్వ్యూ చేసే గదిలోకి వెళ్లింది. నేను అక్కడే రిసెప్షన్‍లో ఉన్న ఒక కూర్చీలో కూర్చొని ఎదురుగా ఉన్న గ్లాసు ప్యానెల్ వైపు చూస్తున్నాను. కొద్దిసేపటికి ఆ గ్లాసు ప్యానెల్ వెనుకవైపు మసకమసకగా అచ్చం శిరిడీలో ఉండే సాయిబాబా పోలికలో కాషాయవస్త్రాలు ధరించి, తెల్లని పూలదండతో ఉన్న ఒక ఆకారం నా కుమార్తెకి ఏదో పత్రం ఇస్తున్నట్టు నాకు కనిపించింది. ఒక్కసారిగా నాకు ఒళ్ళంతా వణుకు మొదలైంది. అలా కొంతసేపు జరిగింది. అంతలో ఒకామె టీ తీసుకుని నా దగ్గరకి వచ్చింది. నేను ఆ టీ త్రాగుతూ 'ఇంటర్వ్యూ గదిలో అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో' అన్న ఆలోచనతో చాలా కంగారుగా అనిపించింది. వెంటనే నేను, 'ఓం శ్రీసాయి ఉద్యోగక్షేమదాయ నమః' అని జపించడం మొదలుపెట్టి నా కుమార్తె ఇంటర్వ్యూ గది నుండి బయటకి వచ్చేవరకు చేశాను. 108 సార్లు వరకు లెక్కపెట్టానుకానీ ఆపై ఎన్నిసార్లు జపించానో నాకు తెలీదు. అంతా బాబా చూసుకుని ఉంటారని నాకు తెలుస్తున్నప్పటికీ, "ఇంటర్వ్యూ ఎలా జరిగింది?" అని నా కుమార్తెని అడిగాను. అందుకు తను, "రేపటి నుండి రమ్మన్నారు" అని చెప్పింది. చూశారా! బాబాపై భారం వేస్తే, ఎటువంటి పనైనా ఎలాంటి ఇబ్బందీ లేకుండా సునాయాసంగా జరిగిపోతుంది. నా కుమార్తె ఏ ఆటంకాలు లేకుండా స్కూలుకి కంటిన్యూగా వెళ్తూ మంచి టీచరుగా పేరు తెచ్చుకోవాలని బాబాని వేడుకుంటున్నాను. ఇంతటితో నా అనుభవాన్ని ముగిస్తూ మరో అనుభవంతో మీ ముందుకి వస్తానని సెలవు తీసుకుంటున్నాను.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
బాబా కృపతో సంవత్సరంనాటి తలనొప్పి నుండి కొంత ఉపశమనం
నేను ఒక సాయి భక్తురాలిని. సంవత్సరం నుంచి మావారు తలనొప్పితో బాధపడుతున్నారు. జండుబామ్ రాసుకోవడం, గ్యాసు టాబ్లెట్ వేసుకోవడం వంటివి చేస్తుంటారు. అయినా ఒక్కోసారి చాలా బాధపడుతుంటారు. ఈమధ్య నేను ఆయన బాధ చూడలేక బాబా ముందు కూర్చుని, "బాబా! నేను ఆయన బాధ చూడలేకపోతున్నాను. మీరు ఆయన బాధను తీసేయగలరు. మీ దయతో ఆయన తలనొప్పి తగ్గితే, ఈ అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అలా నేను బాబాను అడిగిన వారం తరువాత మావారిని, "తలనొప్పి ఎలా ఉంది?" అని అడిగాను. అందుకాయన, "తగ్గింది" అని అన్నారు. 'బాబా దయవలన ఆయనకు తగ్గింది' అని నేను నా మనసులో అనుకున్నాను. మళ్ళీ నాలుగు, ఐదు రోజులకి మావారు "లైట్‍గా తలనొప్పి వస్తుంది" అని అన్నారు. అది విని నేను, "ఇదేం పరీక్ష బాబా? బ్లాగులో పంచుకుంటానని పంచుకోలేదు బాబా. అయినా బ్లాగులో పెట్టే సమయం నువ్వు నిర్ణయించే ఉంటావుగా బాబా! ఏదేమైనా మావారి తలనొప్పి భారం మీ పాదాల మీద వేస్తున్నాను బాబా" అని బాబాతో చెప్పుకున్నాను.
అమ్మ చెవినొప్పి తగ్గించిన బాబా
సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఇప్పుడు బాబా నాకు ప్రసాదించిన ఒక చిన్న అనుభవం మీ అందరితో పంచుకుంటాను. 2022 జూన్ 10 రాత్రి నిద్రపోయే సమయంలో మా అమ్మ చెవిలో ఏదో పురుగు దూరడం వలన విపరీతమైన నొప్పి వచ్చింది. పురుగు బయటకి వచ్చేసినప్పటికీ అమ్మ నొప్పిని భరించలేకపోయింది. నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! ఎలాగైనా అమ్మ చెవినొప్పి తగ్గించండి. ఆ నొప్పి తగ్గితే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. ఉదయం నిద్ర లేచేసరికి అమ్మ చెవినొప్పి పూర్తిగా తగ్గిపోయింది. "థాంక్యూ సో మచ్ బాబా".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me
Themanath 9449570019
ReplyDeleteA carpenter manasu marchi money maku vachela cheyi thandri please baba
ReplyDeleteom sai ram.anathakoti bramadha nayaka rajadhiraja Yogi Raja parabramha sri sachithanada sadguru Sainath Maharaj ki Jai.
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete