1. సెటిల్‌మెంట్ చేసి కాపాడిన సాయినాథుడు
2. ప్రార్థించినంతనే సమస్యలను తొలగించే సాయితండ్రి
3. చెడు వ్యసనాల నుండి కాపాడిన బాబా
సెటిల్‌మెంట్ చేసి కాపాడిన సాయినాథుడు
సాయిభక్తులందరికి నమస్కారాలు. నా పేరు శ్రీనివాస్. నేను చాలా సంవత్సరాల క్రితం తెలిసిన ఒక వ్యక్తిపై నమ్మకంతో అతను తీసుకున్న రెండు లక్షల రూపాయల లోన్‌కి ష్యూరిటీ సంతకం పెట్టాను. ఆ వ్యక్తి కొంతకాలం లోన్ డబ్బులు కట్టి తరువాత పరిస్థితులు అనుకూలించక కట్టలేకపోయాడు. దాంతో గవర్నమెంట్ ఉద్యోగినైన నా మీద ఆ భారం పడింది. ఫైనాన్స్ కంపెనీవాళ్ళు నాకు నోటీసులు పంపించడం మొదలుపెట్టారు. నేను ఎన్నిసార్లు ఆ లోన్ తీసుకున్న వ్యక్తిని అడిగినా అతను ప్రతిసారీ వాయిదాలు వేస్తూ పోయేవాడే తప్ప డబ్బులు మాత్రం కట్టేవాడు కాదు. చివరికి ఆ ఫైనాన్స్ కంపెనీవాళ్ళు ఆ వ్యక్తి తీసుకున్న డబ్బుని నా శాలరీ నుండి చెల్లించే విధంగా శాలరీ అటాచ్‌మెంట్ నోటీసు నా పైఅధికారికి పంపి, ఆయనపై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టారు. నాకు ఏం చేయాలో తెలియక, "బాబా! ఆ అప్పు నా శాలరీకి అటాచ్ కాకుండా మీరు ఆపండి" అని బాబాని వేడుకున్నాను. నా మంచితనం వల్ల నా పైఅధికారి చాలారోజులు శాలరీ అటాచ్‌మెంట్ జరగకుండా ఆపారు. ఇది నిజంగా బాబా చేసిన అద్భుతం. కానీ సమస్య పూర్తిగా సమసిపోనందువల్ల, నేను తీసుకోని లోన్‌కి బాధ్యుడనై పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. అట్టి స్థితిలో నేను అనుభవిస్తున్న కష్టాన్ని బాబాకి చెప్పుకోని రోజంటూ ఉండేది కాదు. చివరికి, "ఆ వ్యక్తికి సహాయం చేసి, శాశ్వతంగా నా బాధను తీర్చాల"ని బాబాకి విన్నవించుకున్నాను. తరువాత ఒక గురువారంరోజున నేను ఆ లోన్ తీసుకున్న వ్యక్తి ఇంటికి వెళ్లి, అతని సమస్యలు తెలుసుకుని, అతని తండ్రితో మాట్లాడాను. దాంతో అప్పటివరకు దూరంగా ఉంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకోని ఆ తండ్రీకొడుకులు మాట్లాడుకుని, ఇల్లు తాకట్టు పెట్టి లోన్ కట్టడానికి ఒప్పుకున్నారు. ఇన్నాళ్ళూ కొడుకు మీద నమ్మకం లేక అతను తీసుకున్న లోన్ తీర్చడానికి ఒప్పుకోని తండ్రి దాదాపు ఐదు సంవత్సరాల తరువాత ఒప్పకోవడం నిజంగా సాయినాథుని కృపే! విషయం ఫైనాన్స్ కంపెనీవాళ్ళకి చెప్తే, వాళ్ళు దానికి అంగీకరించి కొంత సమయం ఇచ్చారు. ఈవిధంగా నేను బాబా మీద భారం వేసి, ఆ ష్యూరిటీ సమస్య నుండి కొంతవరకు బయటపడ్డాను. అప్పుడు నేను, "బాబా! వాళ్లు ఆ లోన్ డబ్బులు చెల్లించేసి నేను పూర్తిగా సమస్య నుండి బయటపడేలా దయ చూపండి" అని బాబాని వేడుకున్నాను. బాబా కృపవల్ల ఒక్క నెలరోజులకు ఆ వ్యక్తి తండ్రి లోన్ డబ్బులు మొత్తం తీర్చేయడంతో నేను సమస్య నుండి పూర్తిగా బయటపడ్డాను. ఏ సమస్యకైనా సమాధానం సాయినాథుడే! సహనం, నామస్మరణే ఆయుధాలు. శ్రీసాయినాథునికి శతకోటి నమస్కారాలు.
ఒకసారి నెలాఖరు వచ్చినా నేను తీసుకున్న లోన్‌కి EMI కట్టలేని పరిస్థితి వచ్చింది. అప్పుడు నేను బాబాపై భారం వేశాను. ఆశ్చర్యంగా, లోన్ కట్టించుకునే ఏజెంట్ మా ఇబ్బందిని అర్థం చేసుకుని, తనే నా EMI కట్టి, "నాకు మీరు డబ్బులు తరువాత ఇవ్వండి" అని చెప్పాడు. లోన్ కట్టించుకునే వ్యక్తితోనే EMI కట్టించే అద్భుతం చేయడం బాబాకు మాత్రమే సాధ్యం. ఈ అనుభవం ద్వారా తమకేదైనా సాధ్యమేనని నిరూపించారు బాబా. "థాంక్యూ బాబా. మీ నామస్మరణకు నన్నెప్పుడూ దూరం చేయకండి బాబా".
నేను నా SBI బ్యాంకు అకౌంటుని ఒక బ్రాంచి నుండి మరో బ్రాంచికి మార్చుకున్నప్పుడు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ నెల జీతం రాకుండా ఆగిపోయింది. ఇది చిన్న విషయంలా అనిపించవచ్చు, కానీ ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. కాబట్టి నేను, "బాబా! నా జీతం వచ్చేలా అనుగ్రహించండి" అని బాబాకి విన్నవించుకున్నాను. బాబా దయవల్ల ఆటంకాలు తొలగి మర్నాడే నా జీతం నాకు వచ్చింది. మనస్ఫూర్తిగా బాబాను వేడుకుంటే, ఆయన తప్పక అనుగ్రహిస్తారు.
సర్వేజనాః సుఖినోభవంతు!!!
ఓం సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!
ప్రార్థించినంతనే సమస్యలను తొలగించే సాయితండ్రి
సాయిభక్తులందరికీ నా నమస్కారం. బాబా ఈ భక్తురాలి సమస్యలను సుళువుగా ఎలా పరిష్కరించారో నేనిప్పుడు సాయిబంధువులందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఒకసారి మేము ఉంటున్న అద్దె ఇంటిలో వసతులు తక్కువగా ఉన్న కారణంగా ప్రక్కనే ఉన్న ఇల్లు ఖాళీ అయిన తర్వాత అందులోకి మారుతామని మా ఇంటి యజమానులను అడిగాము. వాళ్ళు మొదట సరేనన్నారు. కానీ తర్వాత అద్దెకు ఇల్లు కావాలని వచ్చినవాళ్ళందరూ ఖాళీ అయిన ఆ ఇల్లు మాత్రమే తీసుకుంటామని చెప్పడంతో మా ఇంటి ఓనరు, "మీరు ఉంటున్న ఇంటిలోనే మీరు ఉండండి. ఎందుకంటే, అందరూ ఆ ఇంటిని అద్దెకు తీసుకుంటాం అంటున్నారు. ఎవరూ మీరు ఉన్న ఇంటిలోకి అద్దెకు రావడానికి ఇష్టపడటం లేదు. కనుక ఎక్కడివాళ్ళు అక్కడే ఉండండి" అన్నారు. అప్పుడు నాకు చాలా బాధేసి, ఏడుపొచ్చి, కష్టకాలంలో సత్వరమే ఆదుకునే నా సాయితండ్రిని వేడుకున్నాను. మరునాడు మా ఇంటి ఓనరు తనంతటతానే, "మీరు ఎప్పుటినుండో అడుగుతున్నారు. కనుక మీరు ప్రక్కఇంటిలోకి మారండి" అని చెప్పారు. నాకు చాలా చాలా ఆశ్చర్యమేసింది. ఎందుకంటే, అప్పటివరకు జరిగిన సంఘటనలను బట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు ఆ ఇల్లు ఇవ్వరని అనుకున్నాను. కానీ బాబా తమ లీలను చూపి నన్ను చాలా ఆనందపరిచారు.
నా చుట్టుప్రక్కల అందరికీ ప్రభుత్వ పథకాలు వచ్చినప్పటికీ నా జీవితంలో నాకెప్పుడూ రాలేదు. చివరికి నేను, "నాకు అన్ని అర్హతలూ ఉన్నా ప్రభుత్వ పథకాలు రావడంలేద"ని నా సాయితండ్రితో చెప్పుకున్నాను. అంతే, నాకు రెండు ప్రభుత్వ పథకాలు వచ్చాయి. ఇది కేవలం సాయితండ్రి వలనే వచ్చాయని నా ప్రగాఢ విశ్వాసం. ఆయనే నాకు ఆ పథకాలను ప్రసాదించారు.
ఒకసారి ఆరోగ్య సమస్యల వలన మా పాప చాలా బాధపడుతూ ఉంటే, నేను తన బాధ చూడలేక బాబాను చాలా ఆర్తిగా వేడుకున్నంతనే పాప ఆరోగ్యంలో చాలా మార్పు వచ్చింది. నేను ఆనందంగా 'నా పాపకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించమని, కుటుంబ సమస్యలను తొలగించమ'ని సాయిభక్తుల సమక్షంలో సాయితండ్రికి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
చెడు వ్యసనాల నుండి కాపాడిన బాబా
ఓం శ్రీసాయినాథాయ నమః!!!. నేను ఒక సాయి భక్తురాలిని. మావారు ఒక డ్రైవరు. ఎటువంటి చెడు అలవాట్లు లేని ఆయన ఈమధ్యకాలంలో తన స్నేహితులతో కలిసి తాగుతున్నారని నాకు ఒక అన్నయ్య ద్వారా తెలిసింది. నేను బాబా దగ్గర చాలా ఏడ్చి, "బాబా! మావారు ఆ అలవాటు మానితే, మీ గుడికి వచ్చి 108 ప్రదక్షిణలు చేస్తాన"ని మ్రొక్కుకున్నాను. బాబా దయవలన మావారు, "ఇక మీదట తాగన"ని నాకు మాట ఇచ్చారు. ఇప్పుడు తాగట్లేదు కూడా. "ధన్యవాదాలు బాబా! ఈ మార్పుని శాశ్వతంగా ఉంచండి. మేము ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాము బాబా. అందువల్ల నేను కూడా ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. మీ దయతో నాకు ఒక మంచి ఉద్యోగాన్ని ప్రసాదించండి. అలాగే మావారు తన వృత్తిలో కష్టపడి పనిచేసి రోజురోజుకీ అభివృద్ధి చెందేటట్లు అనుగ్రహించండి బాబా. తెలిసీ తెలియక తప్పులు ఏమైనా చేసి ఉంటే క్షమించండి బాబా'.
Sai ram
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteఓం సాయి బాబా
ReplyDeleteఓం సాయి రామ్ నన్ను అమెరికా పంపించు దేవా.నా కోరిక తీరేలాగ ఆశీస్సులు అందించు సాయి. నేను అమెరికా వెళ్లి వచ్చిన తరువాత నా కృతజ్ఞతలు యిక్కడ పంచుకొంటాను.దేవా దయ చుపు తండ్రి.
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Seat ravali thandri please baba
ReplyDeleteSri satchinanda sanardha sadguru sai nath maharaj ki jai🙏🙏🙏🙏🙏
ReplyDeleteఓం సాయి రామ్ శ్రీ సాయి రామ్ జై జై సాయి రామ్
ReplyDeleteSai nadhaya namaha 🙏 baba please help me
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house lo problem solve cheyandi pl ma abbai chedu.vasansm kuda mani pinchu thandri
ReplyDelete