సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1256వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయి అనుగ్రహం
2. సాయి దయవుంటే అంతా సాధ్యమే
3. చెడు స్వప్నాన్ని నిజం కాకుండా అనుగ్రహించిన బాబా

శ్రీసాయి అనుగ్రహం


సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!! సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా వందనాలు. నేనొక సాయిభక్తురాలిని. నా పేరు లలిత. మాది రాజాం. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. ఈమధ్య మా అక్కకి నడుమునొప్పి చాలా ఎక్కువగా వచ్చింది. తను డాక్టరు దగ్గరకి వెళ్ళి టెస్టు చేయించుకుంటే, రిపోర్టులో డిస్కులు పక్కకి జరిగాయని వచ్చింది. డాక్టరు తనకి ఆపరేషన్ చేయాలని అన్నారు. ఆపరేషన్ అనేసరికి అక్క చాలా భయపడింది. నాతో చెప్పుకుని చాలా బాధపడింది. నేను అప్పుడు బాబాకి నమస్కరించుకుని, "బాబా! అక్కకి ఆపరేషన్ అవసరం లేకుండా మందులతో తగ్గిపోవాలి. అలా జరిగితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల అక్కకి ఆపరేషన్ చేయలేదు. "మందులు, ఫిజియోథెరపీతో తగ్గిపోతుంది" అని డాక్టరు చెప్పారు. సాయికి మాట ఇచ్చినట్టు ఈ అనుభవాన్ని పంచుకున్నాను.


నేను నా గత అనుభవంలో నా కంటికి ఆపరేషన్ జరగనుందని చెప్పాను. ఆపరేషన్ జరుగుతున్నంతసేపు నేను బాబానే తలచుకున్నాను. సాయి దయవలన ఆపరేషన్ బాగా జరిగింది. మరో 15 రోజుల్లో రెండవ కంటికి కూడా ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంది. అది కూడా చక్కగా జరిగితే మళ్లీ ఈ బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను.


ఒకసారి నేను, మా పిల్లలు బస్సులో నా కన్నవారింటికి వెళ్తున్నప్పుడు మధ్యదారిలో అనుకోకుండా నా ఫోను పనిచేయలేదు. పూర్తిగా ఫోను బ్లాక్ అయిపోయింది. అప్పుడు నేను బాబాని తలచుకుని, "బాబా! ఫోను ఆన్ అయ్యి చక్కగా పనిచేస్తే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని దణ్ణం పెట్టుకున్నాను. ఒక పది నిమిషాల తరువాత మళ్లీ మా పాప ఫోన్ ఆన్ చేసి చూస్తే, ఫోను చక్కగా పనిచేసింది. ఇదంతా సాయి దయ. అందుకే ఈ అనుభవాన్ని సాయికి మాటిచ్చినట్లు మీ అందరితో పంచుకున్నాను. "ధన్యవాదాలు సాయీ! ఇంకేమైనా అనుభవాలు పంచుకుంటానని మీతో చెప్పి మర్చిపోయివుంటే నాకు గుర్తుచేయండి బాబా. తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి బాబా".


శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జైజైజై!!!


సాయి దయవుంటే అంతా సాధ్యమే


నేనొక సాయిభక్తురాలిని. 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగును అనుగ్రహించిన శ్రీసాయినాథునికి పాదాభివందనాలు. సాయిభక్తులకు నమస్కారం. నేను ఇంతకుముందు ఒక అనుభవాన్ని మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. మేము ఒక అపార్ట్‌మెంటులోని ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నాము. ఈమధ్య మా ఇంటి ఓనరు ఒక నెలలో ఇల్లు ఖాళీచేయమని మాతో చెప్పారు. ఆ అపార్ట్‌మెంటులో మాకు  చాలా ప్రశాంతంగా ఉంటున్నందున, నేను, "ఇందులోనే మాకు ఒక ఫ్లాట్ ఇప్పిస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. నేను కోరుకున్నట్లే అదే అపార్ట్‌మెంటులో బాబా మాకొక ఫ్లాట్ చూపించారు. బాబా దయవుంటే ఏదైనా సాధ్యమే.


మా పాపకి లంగ్స్ ఇన్ఫెక్షన్ అయి, చాలా కష్టమనీ, సర్జరీ చేయాలనీ అన్నారు. అంతేకాదు, సర్జరీ కూడా ప్రమాదకరమని మందులు వ్రాసిచ్చారు. రెండు సంవత్సరాల నుండి మేము ఆ మందులు వాడుతున్నాము. ఈమధ్య చెకప్‌కి వెళ్ళేటప్పుడు నేను, "బాబా! మీ కృపవలన పాపకి మందులతో తగ్గితే, బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను, డాక్టరు సి.టి. స్కాన్ తీసి, "చాలావరకు  రికవర్ అయింది. ఇంకో నెల మందులు వాడి మానేద్దాం" అని అన్నారు. "ధన్యవాదాలు బాబా. మీ దయతో పాపకి మళ్లీ ఈ ప్రాబ్లెమ్ రాకుండా ఉండి, తనకి పెళ్ళైతే మీ బ్లాగులో పంచుకుంటాను తండ్రీ".


ఈమధ్య నేను, "ఒక నెలలో మా బాబుకి ఉద్యోగం వస్తే, బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవలన నెలలో బాబుకి ఉద్యోగం వచ్చింది. "ధన్యవాదాలు బాబా. మీ దయవల్ల బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా ఏ ప్రాబ్లెమ్ లేకుండా పూర్తయితే మళ్లీ బ్లాగులో పంచుకుంటాను తండ్రీ" అని బాబాకి చెప్పుకున్నాను. ఆ తండ్రి చల్లని కృప వల్ల అది కూడా ఏ ఇబ్బందీ లేకుండా పూర్తయింది. ఇలా అన్నీ విషయాలలో బాబా అనుగ్రహం మాకు తోడుగా ఉండి నడిపిస్తుంది. "ధన్యవాదాలు బాబా".


చెడు స్వప్నాన్ని నిజం కాకుండా అనుగ్రహించిన బాబా


శ్రీసాయి పాదపద్మములకు నా శతకోటి వందనాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. నేనొక సాయిభక్తురాలిని. 2022, ఫిబ్రవరి 8న నాకు ఒక చెడు కల వచ్చింది. ఆ కలలో నా స్నేహితుడు మే నెలలో ఆత్మహత్య చేసుకున్నట్టు కనపడింది. దాంతో నాకు చాలా  భయమేసింది. తను ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే తన కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. నేను, "బాబా! నాకు ఏమిటి ఈ పరీక్ష? నాలో నేను బాధపడటం తప్ప ఈ విషయం నేను ఎవ్వరికీ చెప్పలేను. తనకి మీరే సహాయం చేయండి. మే నెల పూర్తయ్యేవరకు తనకి ఏమీ కాకుండా ఉంటే, నేను 'సాయి మహరాజ్ సన్నిధి'లో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. అంతేకాదు, అప్పటివరకూ సాయినామాన్ని శ్రద్ధగా జపించాను. సాయి నా మొర ఆలకించారు. నా స్నేహితునికి ఏమీ కాలేదు. "చాలా ధన్యవాదాలు బాబా. చాలా ఆలస్యంగా నా అనుభవాన్ని పంచుకున్నందుకు నన్ను క్షమించండి సాయీ".


ఈమధ్య నా మొబైల్ ఎవ్వరూ ఏమీ చేయకుండానే ఉన్నట్టుండి ఆఫ్ అయిపోయింది. అప్పుడు నేను, "బాబా! ఉదయానికల్లా నా మొబైల్ ఆన్ అయితే తోటి సాయిబంధువులతో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల మరుసటిరోజు ఉదయం మొబైల్ మామూలుగానే పనిచేసింది. "థాంక్యూ సాయీ. నాకు రావలసిన డబ్బులు  ఆగస్టు 31 కల్లా పూర్తిగా వచ్చేస్తే మళ్ళీ నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను బాబా".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo