సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1261వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబాని ఏదైనా అడిగితే ఏదో ఒక రూపంలో అనుగ్రహిస్తారు
2. 'పిలిస్తే పలుకుతాను. మీ వెన్నంటే ఉంటాన'ని మరోసారి నిరూపణ ఇచ్చిన బాబా
3. అస్వస్థత నుండి ఉపశమనం ప్రసాదించిన బాబా

బాబాని ఏదైనా అడిగితే ఏదో ఒక రూపంలో అనుగ్రహిస్తారు


ముందుగా ఈ బ్లాగ్ నిర్వహకులకు, తోటి సాయిభక్తులకు నా నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. నేనిప్పుడు బాబా నాకు అనుగ్రహించిన కొన్ని అనుభవాలను తోటి సాయిభక్తులతో పంచుకోవాలనుకుంటున్నాను. మా అన్నయ్యగారి చిన్నమ్మాయి పేరు శ్రీమౌనిక. రెండున్నర సంవత్సరాల వయస్సప్పుడు తన కాలి పాదంపై చిన్నగా ఫంగస్‌లాగా వస్తే, తామర అనుకుని చాలా ఆయింట్‌మెంట్‌లు వాడాము. అయితే అది కొన్నిరోజులు తగ్గి మళ్ళీ వచ్చేస్తుండేది. అలా తనకి 5 సంవత్సరాలు వచ్చినా కానీ ఆ ఫంగస్ తగ్గలేదు. పాపం, తను ఇంజెక్షన్లు, టాబ్లెట్లతో చాలా బాధపడుతుండేది. ఒకసారి ఫంగస్ బాగా ఎక్కువై పాదమంతా వచ్చేసింది. అప్పుడు నేను, "బాబా! తన కాలి ఫంగస్ తగ్గితే, మీ బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అలా అనుకున్న వెంటనే ఆ ఫంగస్ తగ్గడం మొదలుపెట్టి క్రమంగా తగ్గుతూ కొన్నిరోజులకు పూర్తిగా తగ్గిపోయింది. కానీ, నేను ఆ అనుభవాన్ని బ్లాగులో పంచుకోవడం చాలా అంటే చాలా ఆలస్యం చేశాను. ఇప్పుడు మళ్లీ ఫంగస్ మొదలైంది. "నన్ను క్షమించండి బాబా. తనకి పూర్తిగా తగ్గేలా చూడండి బాబా. పాపం, చిన్నపిల్ల తట్టుకోలేకపోతోంది. మేము ఎన్ని మందులు వాడినా ఫంగస్ తగ్గట్లేదు బాబా. ఇక మాకు మీరు తప్ప ఎవరూ లేరు బాబా. మీరే తనని కాపాడాలి. తనకి పూర్తిగా తగ్గిపోతే, నేను మళ్ళీ నా తోటి సాయిభక్తులతో మీకు మాపై ఉన్న దయని పంచుకుంటాను బాబా".


ఒకసారి నాకు నడుమునొప్పి వచ్చింది. చిన్న నొప్పే కదా అని వదిలేస్తే, రోజురోజుకీ  ఎక్కువ కాసాగింది. అప్పుడు నేను, "బాబా! నడుమునొప్పి తగ్గిపోతే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. ఆ సాయంత్రానికి నొప్పి తగ్గిపోయింది. అది నాకు అస్సలు తెలియలేదు. మరుసటిరోజు గమనించుకుని, 'అరే! నాకు నిన్న నడుమునొప్పి ఉంది కదా, అదెప్పుడు తగ్గిపోయింది? ఇదంతా బాబా లీల' అని అనుకున్నాను. కానీ ఈ విషయాన్ని కూడా బ్లాగులో పంచుకోవడం చాలా ఆలస్యం చేశాను. ఇప్పుడు మళ్ళీ నడుమునొప్పి మొదలైంది. డాక్టరుని సంప్రదిస్తే, "మునుపటి మందులే వాడండి, తగ్గకపోతే స్కానింగ్ చేయాలి" అని అన్నారు. "నా అనుభవాన్ని పంచుకోవడం ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించండి బాబా. డాక్టరు చెప్పిన మందులైతే వాడతాను. ఆ మందులతో నొప్పి పూర్తిగా తగ్గేలా చూడండి బాబా. ప్లీజ్ బాబా. నా నొప్పి తగ్గిపోతే, మళ్ళీ మీ కృపను నేను నా తోటి సాయిభక్తులతో పంచుకుంటాను బాబా".


నేను ప్రతిరోజూ కంప్యూటర్ క్లాసుకి వెళ్తుంటాను. ఒకరోజు నా ఆరోగ్యం బాగాలేక క్లాసుకి వెళ్ళకూడదని అనుకున్నాను. అయితే నేను క్లాసుకి రాలేనని నా ఫ్రెండ్‌తో గానీ, సార్‌తో గానీ చెప్పలేని పరిస్థితి. అందుకని, "బాబా! ఈరోజు క్లాసు ఉండకపోతే, నేను ఎవరికీ ఏమీ చెప్పనవసరం ఉండదు. ప్లీజ్ బాబా, క్లాసు లేకుండా చూడండి" అని అనుకున్నాను. అయితే క్లాసు ఉంది. ఇక తప్పనిసరై నా ఫ్రెండ్‌తో, "హెల్త్ బాగాలేదు" అని చెప్పాను. అప్పుడు తను, "సరే, కొత్త టాపిక్ చెప్తానన్నారు కదా, నేను వెళ్తాను" అని అంది. నేను తనతో సరేనని అన్నాను కానీ, "ఏమిటి బాబా ఇలా అయింది? కొత్త టాపిక్ చెప్తే నేను మిస్సవుతాను కదా" అని అనుకున్నాను. మా ఫ్రెండ్ క్లాసుకని వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాక నాతో, "నేను అనవసరంగా వెళ్ళాను. సార్ రాలేదు" అని చెప్పింది. అది విని నాకు చాలా సంతోషంగా అనిపించింది. బాబాని ఏదైనా అడిగితే, ఆయన ఏదో ఒక రూపంలో అనుగ్రహిస్తారు. మనం ఓపికతో ఉండాలి, అంతే. "థాంక్యూ సో మచ్ బాబా".


'పిలిస్తే పలుకుతాను. మీ వెన్నంటే ఉంటాన'ని మరోసారి నిరూపణ ఇచ్చిన బాబా


రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


నా పేరు ఉపేంద్ర. మాది విజయవాడ. ఇటీవల మేము మా అమ్మాయిని హాస్టల్లో జాయిన్ చేశాము. వారంరోజుల్లో తనకి జ్వరం, ఒళ్ళునొప్పులు, గొంతునొప్పి వచ్చాయి. తనతోపాటు హాస్టల్లో ఉంటున్న ఇంకో పదిమంది అమ్మాయిలకు కూడా అదేవిధంగా జ్వరం, ఒళ్ళునొప్పులు ఉండేసరికి మాకు భయమేసి వెంటనే మా అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి డాక్టరుకి చూపించాము. డాక్టరు కోవిడ్ అయుండొచ్చని, RTPCR టెస్ట్ రాశారు. నేను ఆందోళన చెంది వెంటనే, "బాబా! నా బిడ్డకు టెస్టులో నెగిటివ్ రావాలి. అలా వస్తే, నా అనుభవాన్ని ఆలస్యం చేయకుండా బ్లాగులో పంచుకుంటాన"ని మన సాయినాథ ప్రభువుని ఆర్తితో వేడుకున్నాను. ఆరోజు సాయంత్రం టెస్టు శాంపిల్ ఇస్తే, ఆ ల్యాబ్ అతను 'రిజల్ట్ మరుసటిరోజు సాయంత్రం రావచ్చు' అని చెప్పారు. గత రెండు సంవత్సరాలుగా బాబా ఎల్లప్పుడూ నా వెన్నంటి ఉంటూ, నన్ను కాపాడుతూ ముందుకు నడిపిస్తున్న అనుభవాలు నాకు చాలా ఉన్నాయి. అందుకే బాబా మీద విశ్వాసంతో ఇంటికి వెళ్లి, మా అమ్మాయి నుదుటన బాబా ఊదీ పెట్టి, టాబ్లెట్లు ఇచ్చి పడుకున్నాను. రాత్రి ఒంటిగంటకు అమ్మాయికి టాబ్లెట్ ఇద్దామని లేచి ఫోన్ చూస్తే, ల్యాబ్ నుండి వచ్చిన మెసేజ్ ఉంది. అందులో కోవిడ్ 'నెగిటివ్' అని ఉంది. ఎక్కువసేపు ఆందోళన పడనివ్వకుండా నా దేవుడు, మన బాబా త్వరగా సంతోషకరమైన వార్త అందించారు. ఈ విధంగా, 'పిలిస్తే పలుకుతాను. మీ వెన్నంటే ఉంటాను' అని మరోసారి నిరూపించారు బాబా. వెంటనే బాబాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపి, ఈ నా అనుభవాన్ని టైప్ చేసి బ్లాగుకు పంపాను. ఆ కరుణామూర్తి దయవల్ల అందరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.

 

ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః!!!

శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


అస్వస్థత నుండి ఉపశమనం ప్రసాదించిన బాబా


నేనొక సాయిభక్తుడిని. ప్రప్రథమంగా నా సాయికి ప్రణామాలు. ప్రతి ఒక్కరి అనుభవాలను విపులంగా ప్రచురిస్తున్న సాయి అన్నయ్యకి ధన్యవాదాలు. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకుంటున్నాను. ఇలా బాబా ప్రసాదించిన అనుభవాలను పంచుకోవడం మనస్సుకు ఎంతో ఆనందాన్నిస్తుంది. ఇక నా అనుభవానికి వస్తే.. 2022, జులై 10న నాకెందుకో నా ఆరోగ్యం కొంచెం బాగాలేనట్లు అనిపించింది. సాయంత్రం వరకు చూశాను. అప్పటికీ అలాగే ఉండడంతో బాబాని స్మరిస్తూ, "బాబా! నా ఈ ఇబ్బంది నుండి ఉపశమనం లభిస్తే, మన బ్లాగులో ఈ అనుభవాన్ని పంచుకుంటాన"ని మ్రొక్కుకున్నాను. తరువాత ఊదీ పెట్టుకుని, బాబాకి పెట్టిన నైవేద్యం కొంచెం తిని పడుకున్నాను. మరుసటిరోజు ఉదయానికి నాకు చాలా ఉపశమనంగా ఉంది. అంతా సాయి దయ. ఇలా అడుగడుగునా కాపాడుతున్న బాబాకి నా హృదయపూర్వక అభినందనలు. "బాబా! ఎన్నో సంవత్సరాల నుండి ఒక సమస్య కారణంగా నేను మనోవికలత చెంది ఉన్నాను. నాపై కరుణతో ఆ సమస్య విషయంలో నాకు ఒక దారి చూపి, త్వరలోనే ఆ అనుభవాన్ని కూడా పంచుకునే అదృష్టాన్ని నాకు కలిగించండి బాబా. శతకోటి వందనాలు తండ్రీ"


 - మీ భక్తుడు.


10 comments:

  1. ఓం సాయి బాబా నేను కూడా దురదలు తో చాలా బాథ పడుతున్నా .మందు పడక దురదలు. మందు తయారు చేసిన కంపెనీ వేరేది.అప

    ReplyDelete
  2. అవటం వలన. ఆ మందు ఒకచోట దొరుకుతుంది. ప్రిష్కిశన్ లేదు. ఆ డాక్టర్ రాస్తే కాని మందు యివ్వడు.ఇలా బాథ పడుతున్నాను.ఆ బాబా నా సమస్య పరిష్కారం చూపాలి

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  4. Jaisairam bless amma for her health and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam

    ReplyDelete
  5. Na bidda ki fever thaggali baba...Inka rakundu...e 3months nunchi fever tho suffer avuthane vunnadu...plz baba Inka rakunda chudu baba..plz

    ReplyDelete
  6. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  7. Sai ram🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  8. Sai naku anonya dampathyani prasadhinchu sai

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo