1. అంతా బాబా దయ
2. నమ్మకం కోల్పోకుండా ఉంటే మనకి కావలసింది బాబా అనుగ్రహిస్తారు
3. సాయి అనుగ్రహించిన బహుమతి
అంతా బాబా దయ
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
సాయిబంధువులకు నా నమస్కారాలు. నా పేరు శ్రీదేవి. బాబానే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం. ఆయనే నా తోడు-నీడ. మా బావగారి కొడుకుకు 30 సంవత్సరాలు. తనకి పెళ్లి సంబంధాలు చూస్తుంటే, ఆస్తి లేకపోవడం వల్ల సంబంధాలు కుదిరేవికాదు. అప్పుడు నేను, "బాబా! ఎలాగైనా తల్లిలేని (అబ్బాయి తల్లి చిన్నప్పుడే చనిపోయింది) ఆ అబ్బాయికి మంచి సంబంధం చూసి తల్లిలా మీరే దగ్గరుండి పెళ్లి చేయించాలి తండ్రీ" అని బాబాను ప్రార్థించాను. తరువాత తెలిసినవాళ్ళ ద్వారా ఒక సంబంధం వచ్చింది. ఆ అమ్మాయి చాలా బాగుంది. ఫోటో చూసిన వెంటనే నేను, "బాబా! ఎలాగైనా ఈ అమ్మాయితో సంబంధం కుదిరేలా చూడండి" అని ప్రార్థించాను. బాబా దయవల్ల ఆస్తి లేకపోయినా అబ్బాయి బాగున్నాడని ఎటువంటి సమస్యలు లేకుండా సంబంధం కుదిరింది. నేను కోరుకున్నట్లు బాబానే దగ్గరుండి తల్లిలా సంబంధం కుదిర్చారు. నిశ్చితార్థం కూడా అయింది. మే నెలలో పెళ్ళి చెయ్యాలని అనుకుంటున్నారు. బాబా దయవలన ఎటువంటి ఆటంకం లేకుండా పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను. అంతా బాబా ఆశీర్వాదం, ఆయన దయ.
2022, సంక్రాంతి సెలవుల తర్వాత మా పెద్దపాపకు కాలేజీ తెరిచి, కరోనా రిపోర్టు తీసుకుని రావాలని చెప్పారు. సరేనని, పాపకు కరోనా టెస్టు చేయిస్తే, కరోనా లక్షణాలేవీ లేకపోయినా రిపోర్టు పాజిటివ్ అని వచ్చింది. రెండురోజుల తర్వాత మళ్ళీ టెస్టు చేస్తే, అప్పుడు కూడా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. అప్పుడు నేను, "బాబా! ఎలాగైనా నెగిటివ్ రిపోర్టు వచ్చేలా చూడండి" అని బాబాను ప్రార్థించాను. ఆయన దయవల్ల మరుసటిరోజు చేసిన టెస్టు రిపోర్టులో నెగిటివ్ వచ్చింది. దాంతో పాప కాలేజీకి వెళ్ళింది. అంతా బాబా దయ.
మా చెల్లెలు భర్త ఇంజనీరు. అతను లక్నోలో ఉద్యోగం చేస్తుండగా కుటుంబం హైదరాబాదులో ఉండేది. అతను హైదరాబాదులో ఉద్యోగమొస్తే కుటుంబంతో కలిసి ఉండొచ్చని హైదరాబాదులో ఉద్యోగం కోసం చాలా ప్రయత్నించాడు. ఆ క్రమంలో చాలా ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు కానీ, సెలెక్ట్ కాలేదు. అప్పుడు నేను, "బాబా! ఎలాగైనా అతనికి హైదరాబాదులో ఉద్యోగం వచ్చేలా చూడు తండ్రీ" అని బాబాను ప్రార్థించాను. బాబా కరుణించారు. అతనికి హైదరాబాదులోని ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అంతా బాబా దయ. ఆయన దయ, కరుణ ఉంటే ఎటువంటివైనా సాధ్యం అవుతాయి. "ధన్యవాదాలు బాబా. నా అనుభవాలు పంచుకోవడంలో ఆలస్యమైనందుకు క్షమించండి బాబా".
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!
నమ్మకం కోల్పోకుండా ఉంటే మనకి కావలసింది బాబా అనుగ్రహిస్తారు
ఓం శ్రీ సాయినాథాయ నమః!!! నేనొక సాయిభక్తుడిని. నా వద్ద ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది. ఆ బండి తీసుకుని సంవత్సరమయ్యాక బండి సర్వీసింగ్ కోసం షాపువాళ్ళకి కాల్ చేస్తుంటే చాలారోజుల కలవలేదు. చివరికి ఒకరోజు దగ్గరలో ఉన్న ఒక గ్యారేజ్‍లో బండి ఇస్తే, అక్కడ సర్వీసింగ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా బ్యాటరీలోకి నీళ్లు వెళ్లాయి. దాంతో బ్యాటరీ ఆటోమేటిక్‍గా డిశ్చార్జ్ అయిపోతూ బండి అస్సలు ఆన్ అవ్వలేదు. ఆ గ్యారేజీ అతన్ని అడిగితే, "ఎండలో పెట్టి చూడండి, అప్పటికీ ఆన్ అవ్వకపొతే మీరు బండి ఎక్కడ కొన్నారో ఆ షాపువాళ్లనే అడగండి" అని అన్నాడు. నాకు ఏమి చేయాలో తెలియక, "బాబా! మీ దయవల్ల బండి స్టార్ట్ అవ్వాలి" అని బాబాను ప్రార్థించాను. మరుసటిరోజు బండి స్టార్ట్ అయింది, కానీ కదలలేదు. ఆ మరుసటిరోజుకి మాత్రం బాబా దయవల్ల సమస్యంతా క్లియర్ అయి బైక్ కొత్త బండిలా పరుగులు పెట్టింది. నమ్మకం కోల్పోకుండా బాబాని నమ్ముకుంటే, మనకి కావలసింది ఆయన అనుగ్రహిస్తారు.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
సాయి అనుగ్రహించిన బహుమతి
ఓం శ్రీ సాయినాథాయ నమ:!!! "అఖిలాండకోటి బ్రహ్మాండనాయక శ్రీసాయినాథా! మహాప్రభూ! మీకు కోటానుకోట్ల పాదాభివందనాలు". సాయిభక్తులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు శ్రీవాణి. మా బాబు ఏడవ తరగతి చదువుతున్నప్పుడు జరిగిన సైన్స్-డే సెలబ్రేషన్స్‌లో మొదటిసారి పాల్గొన్నాడు. ఎవరి సహాయం తీసుకోకుండా తన సొంత తెలివితేటలతో వారంరోజులపాటు చాలా కష్టపడి బ్యాటరీ, పైపులు, మోటార్ ఉపయోగించి హ్యాండ్ శానిటైజర్ పరికరాన్ని తయారుచేశాడు. నేను, "బాబా! నా కొడుకు మొదటిసారి పరికరాన్ని తయారుచేశాడు. తనకి తప్పకుండా బహుమతి రావాలి స్వామీ. ఇప్పుడు బహుమతి వస్తే గనక తనకి ఆసక్తి పెరుగుతుంది" అని బాబాను వేడుకున్నాను. సాయినాథుడు నా కొడుకుని అనుగ్రహించారు. మండల స్థాయి సైన్స్ ఫేర్‌లో నా కొడుకుకి రెండవ బహుమతి వచ్చింది. "బాబా! నేను కోరుకున్న కోరికలను ప్రేమతో తీరుస్తున్నారు. మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. మీ కరుణ నా పిల్లలపైన ఎప్పటికీ ఇలాగే ఉండాలి సాయీ. వాళ్లకు చక్కటి విద్యాబుద్ధులు, ఆరోగ్యాన్ని ప్రసాదించి సన్మార్గంలో నడిపించండి. ఆపై వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండేటట్లు చూడండి బాబా".


Om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteJaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam
ReplyDeleteOmsairam
ReplyDelete