సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1019వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయిబాబా అద్భుతలీలలు
2. అమోఘమైన సాయికృప
3. బాబాకి చెప్పుకుంటే తీరిన సమస్యలు

సాయిబాబా అద్భుతలీలలు


సాయిభక్తులందరికీ నా నమస్సులు. ఈ బ్లాగు నడుపుతున్న  సాయికి నా ప్రణామాలు. ‍నా పేరు జ్యోతి. నేను ఇంతకుముందు ఈ బ్లాగు ద్వారా కొన్ని అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు ఈమధ్య జరిగిన మరికొన్ని అనుభవాలు పంచుకుంటాను. బాబా కృపాకటాక్షాలతో 2021, సెప్టెంబరు 1న మా ద్వితీయ కుమార్తె వివాహం ఎంతో ఆనందదాయకంగా జరిగింది. ఆ వివాహం సందర్భంగా అమెరికా నుండి మా పెద్దమ్మాయి, 2 సంవత్సరాల మా మనవరాలు వచ్చారు. మా మనవరాలికి బాబా అంటే ఎంతో ఇష్టం.  రోజూ తను మాచేత కనీసం 20 సార్లైనా శంకర్ మహదేవన్ పాడిన ‘హారతి సాయిబాబా’ పాటని ఫోన్‍‍లో పెట్టించి, తన చిన్ని చిన్ని చేతులు దగ్గరగా పెట్టి బాబాకి హారతి ఇస్తున్నట్లు తిప్పుతూ అందర్నీ అలా చేయమంటుండేది. నేను ప్రతి గురువారం బాబాకి అభిషేకం చేస్తాను. ఒక గురువారం నేను బాబాకి నీళ్ళతో అభిషేకం చేస్తుంటే మా మనవరాలు నేనూ చేస్తానంటూ అభిషేక జలాన్ని చాలా శ్రద్ధగా బాబా విగ్రహంపై పోసింది. తరువాత బాబాకి వస్త్రధారణ చేస్తుంటే, తను కూడా చేస్తానని పేచి పెడితే అలాగే చేయించాను. తను చాలా చక్కగా చేసింది. తర్వాత నేను హారతి ఇస్తుంటే, తను కూడా తన అరచేతులు రెండు బాబాకి చూపిస్తూ, వాటిని తిప్పుతూ శ్రద్ధగా హారతిలో పాల్గొంది. హారతి సేవ ముగిసాక చూస్తే సాయిబాబా ముఖ ఆకృతి హారతి పళ్లెంలో దర్శనమిచ్చింది. బాబా చిన్నపిల్లతో సేవ చేయించుకుని తమ దర్శననిచ్చి  మా మనవరాలిని, కుటుంబసభ్యులని ఆశీర్వదించారనిపించింది నాకు. “సాయీ! నీ కృప ఎప్పుడూ మా కుటుంబసభ్యులందరిపై, అలాగే మీ భక్తులపై ఉండాలని ఆకాంక్షిస్తున్నాను”. 

ఇంకొక అనుభవం: ఈమధ్య మా బంధువుల్లో ఒకరు కరోనా వలన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయన ఆక్సిజన్ లెవెల్స్ 85కి పడిపోయాయి. దాంతో మా అందరికీ చాలా భయం వేసి అందరమూ ఆందోళన చెందాము. ఈ మధ్యే వారి గృహంలో వివాహ సంబరాలు జరిగి ఆనందంగా ఉన్న తరుణంలో ఈ విధంగా వారు ఆసుపత్రి పాలవడం మాకు ఎంతో బాధను కలిగించింది. సెంటిమెంటల్‍గా ఫీలై, కొత్త కోడలిని ఏమైనా అంటారేమోనని నాకు చాలా టెన్షన్‍గా అనిపించింది. వెంటనే నేను బాబాకు దణ్ణం పెట్టుకుని, “బాబా! ఆయనకు ఏమీ కాకుండా చూడు. లేకపోతే ఆ అమ్మాయికి చెడ్డ పేరు వస్తుంది, ఎలా అయినా ఆయన బాగా అయిపోయి ఇంటికి వచ్చేలా చూడు. మీకు ఊదీ పూజ చేస్తాను” అని చెప్పుకున్నాను. తరువాత కూడా ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మేము కారులో ప్రయాణిస్తున్నప్పుడు నేను, “బాబా! ఆయనకి తగ్గిపోతుంది అంటే ఎదురుగా వచ్చే మొదటి కారు ఎరుపు రంగుదై ఉండేలా అనుగ్రహించండి” అని బాబాను వేడుకున్నాను. మరుక్షణం ఎదురుగా చూస్తే, ఎరుపు రంగు కారు కనబడింది. ఆహా! నిజంగానే ఎరుపురంగు కారు కనబడింది అని ఆశ్చర్యపోతూనే, ఏదో అనుకోకుండా జరిగిందేలే అనుకుని, “ఈసారి తెలుపురంగు కారు కనపడాలి” అనుకుని చూసాను. వెంటనే తెలుపురంగు కారు ఎదురుగా కనబడింది. మళ్లీ ఆశ్చర్యపోయి ఈసారి బ్లూ కారు కనపడాలి అనుకుని ఎదురుగా చూస్తే బ్లూ కారు కనబడింది. మరింత ఆశ్చర్యపోతూ ఈసారి గ్రే కలర్ కారు కనిపించాలి అనుకుంటే వెంటనే గ్రే కలర్ కార్ కనపించింది. దాంతో బాబా ఆయన్ని ఖచ్చితంగా బాగు చేస్తారు, ఆయనకి తగ్గిపోతుంది అని ధైర్యం కలిగి కొంచెం ఆందోళన తగ్గింది. అయితే బాబాను పరీక్షించాలని కోరుకున్న రంగులో కారు కనబడాలని అన్నిసార్లు అనుకున్నందుకు బై ఛాన్స్ అలా కనబడిందేమోనని అనుకున్నాను. కానీ బాబా దయవలన ఆయనకి తగ్గిపోయి ఇంటికి వచ్చారు. ఇప్పుడు నార్మల్‍గా ఉన్నారు. “మీకు కోటి కోటి వందనాలు బాబా. నువ్వు ఉండగా మాకు ఏ భయం లేదు. ఎల్లప్పుడూ అందరినీ ఇలాగే కాపాడుతూ నీ అనుగ్రహాన్ని కురిపించు బాబా సాయినాథా”.

         

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


అమోఘమైన సాయికృప


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి. ముందుగా సాయిబంధువులందరికీ నమస్కారం. బ్లాగ్ నిర్వహిస్తున్న వారికి ధన్యవాదాలు. నా పేరు పి.సి.శేఖర్. నేను ఏడు సంవత్సరాలుగా సాయిభక్తుడిని. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. 2021, డిసెంబర్ 2, గురువారంనాడు నేను గురువార వ్రతం ఎలా చేయాలని మనస్సులో బాబాను ధ్యానించాను. తరువాత నా దగ్గర ఉన్న ఒక పీ.డీఎ.ఫ్ ఫైల్‍లో బాబా మహిమలు గురించి చదివాను. అందులో పూజ/వ్రతం ఎలా చేయాలో లేదు. కానీ కాసేపట్లో యూట్యూబ్‍లో నేనేమీ సెర్చ్ చెయ్యకుండానే నాకు సాయి దివ్యపూజకి సంబంధించిన లింక్  వచ్చింది. అది చూడగానే నేను కోరుకున్నదాన్ని బాబా నాకు పంపించారని చాలా సంతోషంగా అనిపించింది. "ధన్యవాదాలు బాబా". (నాకొచ్చిన సాయి దివ్యపూజ లింక్: https://youtu.be/KZrmJmaWzdU)


నేను సాయిభక్తుల అనుభవమాలిక 963వ భాగంలో నేను, నా ఫ్రెండ్ కలిసి విజయదశమికి శిరిడీ వెళ్ళామని, నా ఫ్రెండ్ అదే మొదటిసారి శిరిడీ రావడం అని చెప్పాను. నా ఫ్రెండ్ పేరు సాగర్ రెడ్డి. శిరిడీ వెళ్లేముందు తాను నాతో "తనకి పెళ్లి కావడం లేద"ని చెప్పి నాతో శిరిడీ వచ్చాడు. బాబా కృపవలన  2021, డిసెంబర్ 2, గురువారంనాడు తనకి పెళ్లి నిశ్చయమైంది. ఆ విషయం తెలిసి మొదటిసారి శిరిడీ దర్శనంతోనే బాబా నా ఫ్రెండ్‍ని అంతలా అనుగ్రహించినందుకు పట్టలేని ఆనందంతో నా ఒళ్ళు పులకరించింది. "సాయిబాబా! ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలం? శతకోటి వందనాలు బాబా".


బాబాకి చెప్పుకుంటే తీరిన సమస్యలు


శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి, సాయిబంధువులకు నమస్కారాలు. ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ఒక సచ్చరిత్ర వంటిది. ఇందులో భక్తుల అనుభవాలు చదువుతుంటే చాలా ఆనందం కలుగుతుంది. బాబా అనుగ్రహంతో నేను ఇప్పుడు ఈ బ్లాగులో నా రెండవ అనుభవం పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఒక సాయి భక్తురాలిని. నాకు ఒకసారి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అప్పుడు నేను సాయిని తలుచుకుని ఊదీ నీళ్లు త్రాగితే తగ్గింది. ఒకసారి మా అమ్మాయికి జ్వరం వచ్చింది. కరోనా పరిస్థితుల వల్ల జ్వరం అంటేనే భయంగా ఉంటున్నందున నేను, "బాబా! అమ్మాయికి జ్వరం, నీరసం త్వరగా తగ్గి తను మామూలుగా అయితే ఈ అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని సాయికి నమస్కరించుకుని మా అమ్మాయికి ఊదీ నీళ్లు ఇచ్చాను. దాంతో అమ్మాయి జ్వరం తగ్గింది. ఒకసారి మా మనవరాలు అట్లతద్ది నోము నోచుకుంది. ఆరోజు సాయంత్రం మబ్బుల వలన నక్షత్రం, చంద్రుడు కనిపించలేదు. అప్పుడు సాయికి నమస్కరించుకుని, "నక్షత్ర దర్శనమైతే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటామ"ని అనుకోగానే నక్షత్ర దర్శనం అయింది. సాయికి చాలా చాలా కృతజ్ఞతలు. మమ్మల్ని, మా కుటుంబాన్ని ఇంతలా కాపాడుతున్న బాబాని కరోనా బారినుండి ప్రపంచాన్ని, ప్రజలను కాపాడమని వేడుకుంటున్నాను. మా అబ్బాయికి పెళ్లి నిశ్చయం కావాలని బాబాను వేడుకుంటున్నాము. ఆయన దయవలన పెళ్లి కుదిరి, త్వరగా పెళ్లి జరిగితే మళ్లీ నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటాను.


12 comments:

  1. Om Sai ram నువ్వు చ ల్ల ని తం డ్రి వి . మ మ్మ లిని కాపా డుతున్నా వు. నువ్వు మా ప్రి య మై న దేవుడు. ఈ రోజు సాయి అనుభవాలు చా లా బాగున్నయీ. కరోనా ఈ లోకములో లేకుండా chee .om Sai ram ❤️❤️❤️❤️

    ReplyDelete
  2. Very good experiences.. .Om sai ram

    ReplyDelete
  3. నా తండ్రి సాయినాథ నువ్వు మమ్మల్ని ఎప్పుడు చల్లగా చూడు తండ్రి నీవే మాకు రక్ష నీవు తప్ప ఈ ప్రపంచంలో నాకు ఏదీ వద్దు ఎవరు వద్దు ధన్యవాదాలు తండ్రి

    ReplyDelete
  4. Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness and happiness in the world of yours.jaisairam

    ReplyDelete
  5. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  6. Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  7. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  8. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  9. Baba kapadu thandri sainatha pleaseeee

    ReplyDelete
  10. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🤗🌺🥰🌹😃🌼😀🌸👪💕

    ReplyDelete
  11. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo