1. ఎంతో జాగ్రత్తగా చూసుకునే సాయితండ్రి
2. కష్టం చెప్పుకుంటే బాబా తప్పక నిదర్శనం చూపిస్తారు
ఎంతో జాగ్రత్తగా చూసుకునే సాయితండ్రి
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సమర్థ సద్గురు శ్రీసాయినాథాయ నమః!!!
నా పేరు మల్లీశ్వరి. మనందరినీ అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతున్న ఆ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీసాయినాథునికి ఎన్ని పాదాభివందనాలు చేసినా, ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. బాబా మనకు ప్రసాదించిన అనుభవాలను ఎన్ని పంచుకున్నా ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. మా శిరిడీయాత్ర గురించి మీతో పంచుకుంటానని ఇంతకుముందు చెప్పాను. ఆ అనుభవాన్ని ఇప్పుడు పంచుకుంటాను. మా కోసం ట్రైన్ స్లో అయిందని ఇంతకుముందు అనుభవంలో చెప్పాను కదా. తరువాత బాబా దయవల్ల అందరం క్షేమంగా శిరిడీ చేరుకున్నాము. ఈ కరోనా సమయంలో ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఆ సాయితండ్రిని మూడు రోజులు (13, 14, 15 తేదీలలో) కన్నులారా దర్శించుకున్నాము. శిరిడీ బయలుదేరేముందు మా పాప, “నాకు ఇది నెలసరి వచ్చే సమయం, అందుకే నేను శిరిడీ రాను” అంది. “నెలసరి వస్తే రూంలోనే ఉండు” అని చెప్పి తనను మాతో శిరిడీ తీసుకుని వెళ్ళాము. దయామయుడైన సాయినాథుని దయవల్ల మా పాప రెండు రోజులు ఎంతో సంతోషంగా బాబాను దర్శించుకుంది. మేము నాసిక్, శనిసింగణాపూర్ కూడా వెళ్ళాము. శనిసింగణాపూర్ వెళ్ళేటప్పుడు మా అల్లుడు శిరిడీలో పుట్టినరోజు జరుపుకోవాలని భావించి ఒక షాపులో కేక్ తీసుకున్నారు. కానీ, దాన్ని అక్కడే షాపులో పెట్టి మర్చిపోయారు. కారులో కూర్చున్న తరువాత ఆ కేక్ సంగతి గుర్తుకొచ్చింది. మన సాయితండ్రి మనతో ఉంటే మనకు చిన్నవి, పెద్దవి అని తేడాలేదు, అన్నీ బాబాకు చెప్పుకుంటాము. నేను మనసులోనే బాబాను స్మరించుకుని, “సాయినాథా, ఆ కేక్ అక్కడే ఉండేలా చేయి నాయనా” అని అనుకున్నాను. బాబా దయవల్ల అక్కడ షాపులోవాళ్ళు ఆ కేక్‌ని తీసి జాగ్రత్తగా ఫ్రిజ్‌లో పెట్టారు. ఎంత జాగ్రత్తో చూడండి. ఎవరైనా మర్చిపోతారేమోగానీ కరుణామయుడైన మన బాబా మాత్రం మర్చిపోరు.
ఇకపోతే, బాబా మమ్మల్ని ఎంత జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చారో చెప్తాను. మేము కర్ణాటకలో ఉంటాము. మావాళ్ళేమో హైదరాబాదులో దిగాలి. మేము హైదరాబాదులో దిగి ఇంటికి రావాలంటే సాయంత్రం అవుతుందని అన్నారు. అటు వెళ్ళి రావడం అంటే చాలా ఆలస్యమైపోతుంది, పిల్లలకి ఇబ్బంది అవుతుందని అనుకున్నాం. కానీ, మన బాబా వేరే దారి చూపించి మమ్మల్ని అతి తొందరగా (5 గంటల లోపే) ఇంటికి చేర్చారు. మనల్ని మన గమ్యానికి చేర్చే ప్రయత్నంలో మనకు తెలియని దారులు కూడా బాబా తెలియజేస్తారు. అన్ని సమస్యలనూ దూదిపింజలా తీసిపారేసే మన సాయితండ్రి మనకు అండగా ఉండగా మనకు భయమెందుకు?
ఇకపోతే, మా పాప అమెరికా నుండి వచ్చిందని ఇంతకుముందు అనుభవంలో చెప్పాను కదా. ఈ కరోనా సమయంలో తను తిరిగి అమెరికా ఎలా వెళుతుందోనని మేము కంగారుపడ్డాము. కానీ, అందరినీ చల్లగా చూసే మన బాబా ఉండగా మనకు భయమెందుకు? బాబా దయవల్ల మా పాప ఎంతో తేలికగా, ఏ టెస్టులూ లేకుండా 2021, మార్చి 12వ తేదీన క్షేమంగా అమెరికా చేరుకుంది. నిరంతరం మనల్నే గమనిస్తూ, ఈ సాయి మహారాజ్ సన్నిధి బ్లాగ్ ద్వారా మన ఇబ్బందులను దూరం చేస్తూ, మన కంటికి కనిపించకుండా మనందరినీ జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుతున్న మన సాయినాథునికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే.
సాయిబాబా గురించి నాకు తెలియకముందే ఆ సాయితండ్రి మా ఇంటికి వచ్చారు. ఇప్పుడు ఏ సమస్య వచ్చినా, ‘బాబా నా సమస్యకు ఏం సమాధానం చెప్తారా?’ అని నేను ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగ్ ఓపెన్ చేసి చూస్తాను. ఏ పని చేసినా ఆ తండ్రిని అడిగే చేస్తాను. ఏమి చేస్తున్నా ఎప్పుడూ ‘సాయి, సాయి’ అని అనుకుంటూనే ఉంటాను. ఎవరికి ఏ సమస్య వచ్చినా బాబా ఊదీనే మందు. ఒకరోజు మా ఇంట్లో టీవీ రాలేదు. దాంతో మావారు దానిని రిపేరుకు తీసుకువెళ్లారు. టీవీని పరిశీలించిన షాపువాళ్ళు, ‘ఇది పాతదయింది, వేరే టీవీ తీసుకోండి’ అన్నారు. టీవీ పనిచేయకపోవటంతో మా పాప, “ఇంట్లో టీవీ ఏమో రావటం లేదు, క్రొత్త టీవీ తీసుకురావటం లేదు” అంది. నేను వెంటనే బాబా ఊదీ తీసుకెళ్ళి టీవీకి పెట్టాను. తరువాత రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. నేను చేస్తున్నదంతా చూస్తున్న మా పాప, ‘ఏంటమ్మా, ఏం చేస్తున్నావు?’ అని అడిగింది. ‘టీవీ పనిచేస్తుందేమోనని చూస్తున్నాను’ అని చెప్పాను. ఇంతలో, అంతకుముందు ఏమీ రాని టీవీలో వెంటనే సెట్టింగ్స్ స్క్రీన్ వచ్చింది. అది చూసి మా పాప, ‘నేను చూస్తాలేమ్మా’ అని రిమోట్ తీసుకుంది. బాబా దయవల్ల వెంటనే టీవీ పనిచేయటం ప్రారంభించింది.
చెప్పుకుంటూపోతే ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి, కానీ అన్నీ రాయలేము కదా. “బాబా, ఇంకేమైనా మర్చిపోతే నన్ను క్షమించు తండ్రీ. తప్పులు చాలా ఉంటాయి తండ్రీ, క్షమించు నాయనా”. ఇకపోతే, మా పిల్లలకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నాము. మన సాయితండ్రి దయవలన వారి వివాహాలు సునాయాసంగా జరిగిపోతే ఆ అనుభవాలను కూడా మీతో పంచుకుంటాను. నా అనుభవాలను చదివిన అందరికీ ధన్యవాదాలు.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక సమర్థ సద్గురు సాయినాథాయ నమః!!!
ఓం శాంతి.. ఓం శాంతి...
కష్టం చెప్పుకుంటే బాబా తప్పక నిదర్శనం చూపిస్తారు
శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
నేను ఒక సాయిభక్తుడిని. బాబా నా జీవితంలో ఒక భాగం. నాకు ఎటువంటి ఇబ్బంది ఎదురైనా మొదట నేను చెప్పుకునేది బాబాకే. బాబా నాకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తూ నన్ను అనేక ఇబ్బందుల నుండి కాపాడుతూ ఉన్నారు. ఇటీవల జరిగిన ఒక అనుభవం గురించి నేను ఇప్పుడు మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఈమధ్య పది సంవత్సరాల మా అమ్మాయికి శరీరమంతా పెద్దపెద్ద దద్దుర్లు వచ్చి విపరీతమైన దురదతో చాలా బాధపడింది. తను అలా ఇబ్బందిపడుతుంటే మాకు చాలా కష్టంగా అనిపించేది. రాత్రుళ్ళు మా అందరికీ నిద్ర ఉండేది కాదు. ఆ దద్దుర్లు వస్తే, ఎన్ని మందులు వాడినా కనీసం పదిరోజులు ఇబ్బంది పెడుతుంది. కానీ ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు నాకు మొదట గుర్తుకు వచ్చేది బాబానే. నేను ఆయనతో, "మా అమ్మాయికి వచ్చిన ఈ దద్దుర్లు తగ్గి తనకి ఉపశమనం కలిగినట్లయితే నా అనుభవాన్ని పంచుకుంటాన"ని మొక్కుకున్నాను. తరువాత నేను మా పాపకు డాక్టరు ఇచ్చిన మందులతోపాటు బాబా ఊదీ రాస్తూ ఉండసాగాను. ఆశ్చర్యంగా పదిరోజులైనా ఇబ్బందిపెట్టే ఆ ఎలర్జీ ఐదురోజుల్లోనే పూర్తిగా తగ్గిపోయింది. దాంతో మాకు ఎంతో ఉపశమనంగా అనిపించింది. మేము ఎల్లప్పుడూ బాబాకు కృతజ్ఞులమై ఉంటాము. బాబాతో నా కష్టం ఇది అని చెప్పుకుని మన ప్రయత్నం మనం చేస్తే, ఆయన మనకు తప్పక నిదర్శనం చూపిస్తారు.
Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness and happiness in the world of yours. Jaisairam
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sai ram tandri I also suffered from skin elagri it is very painful. with baba blessings it cured. my son is doctor he gave medicines.om sai ram ❤️❤️❤️❤️
ReplyDeleteOmsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOm Sairam
ReplyDeleteఅఖిలాండకోటి బ్రహ్మాండనాయక సమర్థ సద్గురు సాయినాథాయ నమః!!!
ReplyDeleteBaba nenu kuda oka samasya tho badapadtuna please tondarga cure cheyi thandri pleaseeee
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🤗🌺🥰🌹😃🌼😀🌸👪💕
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete