1. శ్రీసాయి అనుగ్రహం2. మానసిక ప్రశాంతతనిచ్చిన బాబా
3. కోరుకున్నట్లు సమస్యను పరిష్కరించిన బాబా
శ్రీసాయి అనుగ్రహం
సాయిబంధువులకు, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు నా నమస్కారాలు. నాపేరు దీప్తి. మాది హైదరాబాద్. నేనిప్పుడు బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటాను. మా పెద్దమ్మాయి 10వ తరగతి 'ICSE'లో పూర్తి చేసింది. తర్వాత మేము తనని ఇంటర్ మొదటి సంవత్సరం ఒక కాలేజీలో జాయిన్ చేసాము. 2021, సెప్టెంబర్ వరకు ఆన్లైన్ క్లాసులు మంచి లెక్చరర్స్ చక్కగా బోధించారు. సెప్టెంబర్ 1 నుంచి ఆఫ్ లైన్ క్లాసులు మొదలయ్యాయి. అక్టోబరు వరకు కాలేజీకి వెళ్ళిన మా అమ్మాయి, "ఇక నేను కాలేజీకి వెళ్లను, మళ్ళీ పాత స్కూలుకే వెళ్తాను. అక్కడే 11వ స్టాండర్డ్ చదువుతాను" అని ఏడవడం మొదలుపెట్టింది. దాంతో పాత స్కూలు హెడ్మాస్టర్ని కలిసి మాట్లాడదామని నేను, మావారు, మాపాప ముగ్గురం కలిసి స్కూలుకి వెళ్ళాము. వెళ్ళే దారిలో అంతా నేను సాయి నామజపం చేస్తూ వెళ్ళాను. ఆ స్కూలువాళ్ళు మొదట, "ఇప్పటికే నాలుగు నెలలు గడిచిపోయాయి, పరీక్షలు కూడా అయ్యాయి. కాబట్టి సీటు ఇవ్వలేము" అన్నారు. కాని కొంతసేపటికి మళ్లీ వాళ్లే, "ఫోన్ చేస్తాము, ఇప్పుడు మీరు వెళ్ళండి" అని చెప్పి పంపారు. మేము ఇంటికి వచ్చిన తర్వాత, "సోమవారం రండి" అని ఫోన్ చేసారు. సరేనని, నేను మా ఇద్దరమ్మాయిలతో కలిసి సోమవారం స్కూలుకు వెళ్తే, కొంత ఫీజు తగ్గించి డబ్బులు కట్టమన్నారు. అదే స్కూల్లో మా అమ్మాయి ఐదేళ్లు చదివినప్పటికీ ఫీజులో కన్సెషన్ ఇవ్వడం ఇదే మొదటిసారి. ఇదంతా ఆ సాయితండ్రి దయ. ఇక మా అమ్మాయి బాధ్యత అంతా ఆ సాయితండ్రికే అప్పగించాను.
నేను మూడు సంవత్సరాల క్రితం కెనరా బ్యాంకులో లాకరు తీసుకున్నాను. అప్పుడు నా దగర ఉన్న డబ్బులకు, బంగారంకు సరిపడా చిన్న లాకరు తీసుకున్నాను. ఆ తర్వాత బాబాతండ్రి దయవలన కొత్త ఇంటికోసం బ్యాంకులో పెట్టిన బంగారం తాకట్టు నుండి విడిపించాము. అప్పుడు మీడియం సైజ్ లాకర్ కావాలని బ్యాంకు ఎంప్లాయ్‍ని అడిగితే, అతను నన్ను మేనేజర్ వద్దకు తీసుకుని వెళ్ళి, మాట్లాడి చాలా తక్కువ డిపాజిట్‍కే లాకరు ఇప్పించాడు. అయితే బ్యాంకులో ఒక మేడమ్, డబ్బు మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాము, ఇంట్రెస్ట్ కూడా ఇవ్వమని అన్నారు. అప్పుడు మళ్ళీ మేనేజర్ వచ్చి, అలా కాదని ఫిక్స్డ్ డిపాజిట్ చేయకుండా సేవింగ్స్ అకౌంటులోనే ఉంచేటట్లు చేసారు. అది కూడా ఆ సాయినాథుని దయే. ఎందుకంటే, అదే కెనరా బ్యాంకువాళ్ళు మా ఎదురింటి వాళ్ళు లాకర్ తీసుకుంటామని అడిగినప్పుడు రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేయమన్నారు.
నేను 2021, ఆగస్టు నెల చివరిలో నా పదవ తరగతి స్నేహితుని ఇంటి గృహప్రవేశానికి వెళ్ళాను. ఒక్క రోజులో వెళ్ళి, రావచ్చు అని అక్కడినుండి ఇంకో ఇద్దరు స్నేహితురాళ్ళతో కలిసి తిరుపతి వెళదాం, అందుకోసమై మెల్లగా ఇంట్లోవాళ్ళ అనుమతి కూడా తీసుకుందామని అనుకున్నాను. కాని మా స్నేహితుడు దసరా తరువాత వెళదామని చెప్పి విమాన టికెట్లు, దర్శనం టికెట్లు బుక్ చేసాడు. బాబా దయవలన ఒక్కరోజులోనే తిరుపతి, తిరుచానూరు, గుడిమల్లం, శ్రీకాళహస్తి దర్శనం చేసుకుని వచ్చేసాము. మేము వెళ్ళే ముందు, తిరిగి వచ్చిన తర్వాత ఆ ప్రాంతమంతా భారీ వర్షాలు. ఆ సాయితండ్రి దయవలన మాకు దర్శనాలన్నీ బాగా జరిగాయి.
నేను తిరుపతి ప్రమాణమనుకోగానే అక్టోబర్ 7న శిరిడీలో దర్శనాలు మొదలయ్యాయి. వెంటనే శిరిడీ వెళతానని అడిగితే, మా ఇంట్లోవాళ్లు ఏమంటారోనని భయపడి ఆ సాయితండ్రినే, "మీ దర్శనం చేసుకుని రెండు సంవత్సరాలైంది. ఎలాగైనా శిరిడీ వచ్చేలా అనుగ్రహించండి బాబా" అని ప్రార్థించాను. ఆ సాయితండ్రి దయవలన తమ్ముడు వరసైన గోపాల్ అనే అతను ఫోన్ చేసి, "మా ఆవిడ శిరిడీ వెళదాం అంటుంది. అందరం కలిసి వెళదాం" అన్నాడు. నేను ఆనందంగా సరేనన్నాను. ఆ తర్వాత మా అమ్మ కూడా వస్తానంటే అందరికీ టికెట్లు బుక్ చేద్దామనుకున్నాము. ముందు నవంబరు 24న వెళ్ళి 27కి తిరిగి వద్దామనుకున్న ప్రయాణం కాస్త డిసెంబరు 3కి వాయిదా పడి, దర్శనం టికెట్లు ఆన్లైన్‍లో బుక్ చేసుకుని శిరిడీ వెళ్ళాము. బాబా దయవలన శనివారంనాడు ఒక గంటలో మాకు దర్శనం అయ్యింది. ఆ తర్వాత శనిశింగణాపూర్ వెళ్ళొచ్చాము. ఆదివారంనాడు బాబా దర్శనం చేసుకున్న తరువాత రహతా, సాకోరి, పంచముఖ గణపతి ఆలయాన్ని దర్శించాము. అక్కడినుండి వచ్చాక మధ్యాహ్నం 3 గంటలకి నేను మళ్ళీ బాబా దర్శనానికి వెళ్ళాను. ఆ సమయంలో విపరీతంగా రద్దీ ఉండటంతో నాకు చాలా భయమేసి క్యూలైన్‍లోనే సచ్చరిత్ర చదువుతూ ఆ సాయితండ్రిని ప్రార్థించాను. ఆయన దయవల్ల ప్రశాంతంగా దర్శనమై రెండు గంటల తర్వాత సాయంత్రం 5 గంటలప్పుడు బయటికి వచ్చి రూమ్‍కి వెళ్ళాను. తరువాత 6 గంటలకి తిరుగు ప్రయాణమై నాగర్సోల్కి బయలుదేరాము. టాక్సి డ్రైవరు ఏదో పని ఉండి యావలాలో పది నిమిషాలు ఆగితే, అక్కడున్న పురాతన 'శ్రీకృష్ణ దేవాలయం', 'హనుమాన్ మందిరం' దర్శించుకున్నాము. తరువాత రైల్వేస్టేషన్‍కు వెళ్ళి మరుసటిరోజుకి హైదరాబాద్ చేరుకున్నాము. అందరినీ ఆ సాయినాథుడు కాపాడాలని కోరుకుంటూ... సెలవు.
మానసిక ప్రశాంతతనిచ్చిన బాబా
నాపేరు ఉష. నేను బాబా ప్రసాదించిన మరో అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. మూడు, నాలుగు నెలల క్రిందట కోవిడ్ కారణంగా నేను ఇండియాలోని నా స్నేహితులు, కుటుంబసభ్యుల ద్వారా చెడు వార్తలు విన్న మూలాన నా మనస్సు పూర్తిగా నా నియంత్రణను కోల్పోయింది. నేను ఆ విచారకరమైన వార్తలను అస్సలు తీసుకోలేక మానసికంగా చాలా కృంగిపోయి ఒంటరితనాన్ని అనుభవించాను. ప్రతికూలమైన అనేక ఆలోచనలతో నా జీవితంలో ఏమి జరుగుతుందోనని ప్రతిక్షణమూ చాలా భయపడుతూ ఎంతమాత్రమూ నేను ఆ ఆలోచనల నుండి బయటకు రాలేకపోయాను. చివరికి ప్రతిరోజూ సాయిసచ్చరిత్ర చదవడం ప్రారంభించి సానుకూల వాతావరణాన్ని, మానసిక ప్రశాంతతను ప్రసాదించమని బాబాను ప్రార్థించసాగాను. నేను ఎప్పుడూ చదివే ఫేస్‌బుక్ పేజీలోని బాబా సందేశాలు నాకు సానుకూల అనుభూతినివ్వగా నేను నెమ్మదిగా కోలుకున్నాను. బాబా ఆశీస్సులతో నేను ఇప్పుడు చాలా బాగున్నాను. "ధన్యవాదాలు బాబా".
కోరుకున్నట్లు సమస్యను పరిష్కరించిన బాబా
సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా ధన్యవాదాలు. నేను ఒక సాయిభక్తుడిని. ఈ రోజు నేను బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2021, నవంబర్ 20వ తేదీన ఆఫీసులో నాకు ఒక పెద్ద సమస్య వచ్చింది. నేను అదేరోజు నా సమస్య గురించి బాబాతో చెప్పుకుని, "బాబా! 25వ తేదీ నాటికి నా సమస్యను తొలగించు తండ్రి" అని చెప్పుకున్నాను. ఆయన దయతో 26వ తేదీకి నా సమస్య తొలగిపోయింది. "ధన్యవాదాలు బాబా. మీ దయవలన నేను 27సంవత్సరాల సర్వీసు పూర్తి చేసాను. ఇంకా 7 సంవత్సరాల 6 నెలల సర్వీసును కూడా మీ దయతో సంతోషదాయకంగా పూర్తి చేసుకోవాలని, ఇంకా మీ కరుణాకటాక్షాలు మా కుటుంబం మీద సదా ఉండాల"ని వేడుకుంటున్నాను. చివరిగా మరోసారి ఈ బ్లాగు నిర్వాహకులకు నా ధన్యవాదాలు.
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!
సద్గురు సాంబశివ మహరాజ్ కి జై!!!
Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam onsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeleteOm sai ram
ReplyDeleteఓం సాయి రాం బాబా నీకు నమస్కారం బాబా. రోజు నీ అనుభవాలు చదువు తాను.బాగుంటాయి. మమ్మల్ని నువ్వే రక్షణ.కలిగించాలి.
ReplyDeleteJaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness and happiness in the world of yours. Jaisairam
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha pleaseeee
ReplyDeleteNaku bayanga vundhi baba kapadu thandri sainatha
ReplyDeleteSai will take care of everything. Sai satcharitra sapthaha parayanam chyinchandi baba mere. Nalo unna negative feeling ni pogotandi thandri.
ReplyDeleteLove you baba.
Sai is always with me.
Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😃🌺🤗🌼🥰🌸😀🌹👪💕
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete