సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1010వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అత్తవారింటికి తిరిగి తీసుకు వెళ్ళేలా అనుగ్రహించిన బాబా
2. బాధల నుండి మనల్ని కాపాడటానికి అవతరించిన దేవుడే సాయిబాబా
3. పైసా ఖర్చు లేకుండా ల్యాప్‌టాప్ బాగయ్యేలా అనుగ్రహించిన బాబా

అత్తవారింటికి తిరిగి తీసుకు వెళ్ళేలా అనుగ్రహించిన బాబా


తోటి సాయిభక్తులకు నమస్కారం. నా పేరు శిరీష. 2021, జనవరిలో నాకు పెళ్లయింది. మా అత్తవారింట్లో తినే తిండి దగ్గర నుండి మొత్తం అంతా మా అత్తగారి ఇష్ట ప్రకారం, ఏదైనా ఆవిడ చెప్పినట్లే జరగాలి. ఆవిడ ప్రతీ విషయానికి ఏదో ఒక గొడవ పెడుతూ ఉంటుంది. అందువలన ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ ఉండనే ఉంటుంది. ఇవన్నీ మా వారికి అంతగా ఏమీ తెలీదు. ఒకసారి ఏదో అనారోగ్య సమస్య వలన నా కుడిచెయ్యి సరిగా పనిచేయక ఏ పనీ చేయడానికి రాలేదు. అయినా ఏదో ఒక విధంగా ఇంట్లో పనంతా చేసేదాన్ని. నాకొచ్చిన ఆరోగ్య సమస్యతో నేను ఎంతగానో ఇబ్బంది పడుతున్నా మా అత్తయ్యవాళ్ళు నన్ను డాక్టరుకి చూపించకపోగా మా అమ్మవాళ్లనే నన్ను డాక్టరు దగ్గరకు తీసుకుని వెళ్ళమన్నారు. అప్పుడు అమ్మవాళ్ళు వచ్చి నన్ను హాస్పిటల్‍కి తీసుకుని వెళ్ళారు. డాక్టరు నా కుడిచెయ్యి అసలు పని చేయట్లేదని మందులిచ్చి పంపారు. అప్పుడిక నా చేయి బాగా లేదన్న కారణంగా మా అత్తయ్యవాళ్ళు నన్ను మా అమ్మవాళ్ల ఇంటికి పంపించారు. అంతే, తరువాత వాళ్ళు నన్ను చూడటానికి రావడం గానీ, కనీసం ఫోన్ చేయడం గానీ జరగలేదు. అలాంటిది చాలా రోజుల తరువాత ఒకరోజు రాత్రి మా మావయ్య ఫోన్ చేశారు. అది కూడా మాతో గొడవ పడటానికి. అత్తయ్య, మావయ్య ఇద్దరూ పెద్ద గొడవ చేశారు. ఆ మరుసటిరోజు మా పెళ్లి జరిపించిన పెళ్లి పెద్దల ఇంటికి రమ్మని ఫోన్ చేస్తే, అమ్మ, నాన్న, నేను వెళ్ళాము. అక్కడ మా మావయ్య, "మీ అమ్మాయి మాకు వద్దు" అని అన్నారు. మా పెళ్ళికి ముందు నన్ను కోడలిగా చేసుకోకుంటే మా ఆయన్ని, మా అత్తని ఇంట్లోకి రానివ్వలేదట మా మావయ్య. అలాంటి ఆయనే పెళ్లి అయ్యాక మా అత్తయ్య చెప్పే మాటలు విని నన్ను వద్దని, మీ అమ్మాయిని మీ దగ్గరే ఉంచుకోండి అని అన్నారు. ఇంకా మా అత్తయ్య మావారితో 'నన్ను తీసుకుని రావద్దని, అక్కడే ఉండమ'ని చెప్పమంది. ఆయనకి వాళ్ళ అమ్మ మాట వేదం. కాబట్టి ఆయన నాతో అలానే చెప్పారు. చివరికి ఆయనను నాతో మాట్లాడనివ్వలేదు కూడా. ఇక నన్ను మా అత్తగారింటికి తీసుకెళ్ళరని అనుకున్న నేను మంగళవారంనాడు గొడవ జరిగితే, గురువారంనాడు, "బాబా! మా ఆయన వచ్చి నన్ను తీసుకుని వెళ్లేలా చేయండి" అని బాబాకి మ్రొక్కుకున్నాను. ఆరోజు సాయంత్రం అవుతున్నా ఎవరు రాకపోయేసరికి ఇక నన్ను తీసుకుని వెళ్ళడానికి ఎవరూ రారు అనుకున్నాను. కానీ సుమారు అరు గంటల ప్రాంతంలో మావారు వచ్చి నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళారు. "ధన్యవాదాలు బాబా. మీకు శతకోటి నమస్కారాలు. ఈ అనుభవం మీ బ్లాగులో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది బాబా. మీ దయవలన ఇక్కడికి వచ్చిన తరువాత రెండు నెలలు బాగానే ఉంది బాబా. కానీ రెండు రోజుల నుండి అత్తయ్య మళ్ళీ గొడవ మొదలుపెట్టింది. ఇంటిలో ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండేలా చూడండి బాబా. నేను, నా భర్త సంతోషంగా ఉంటే ఓర్వలేకపోతున్నారు బాబా. వాళ్ల మనసును మార్చి మేము సంతోషంగా ఉండేలా అనుగ్రహించండి బాబా. ఇంకో సమస్య సాయి: మావారికి నెలకు 20,000 రూపాయలు వస్తాయి. నెల మొత్తానికి ఇంట్లో 3,000 రూపాయలు ఖర్చు అవుతాయి. ఆ ఖర్చులకి నాకు వచ్చే డబ్బులు సరిపోతాయి. కానీ మా అత్తయ్య ప్రతి నెలా మొత్తం డబ్బులు ఖర్చు అయిపోయాయని, డబ్బులు లేవని అంటుంది. మా ఆయన దేనికి ఖర్చు అయ్యాయి అని కూడా అడగరు. ఆయన అంత అమాయకుడు. ఆయనకు కొంచెం జ్ఞానోదయమయ్యేలా, ఆలోచన పెరిగేలా చేయి తండ్రి. అలాగే మా అత్తయ్య దాచుకునే డబ్బులు గురించి మా ఆయనకి తెలిసేలా చేసి మాకున్న అప్పులన్నీ తీరిపోయేలా అనుగ్రహించండి బాబా. సాయీ! మీ కృపకోసం ఎదురుచూసే ఈ భక్తురాలిపై దయ చూపించు తండ్రి".


ఓం శ్రీ సాయినాథాయ నమః!!!


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్‌ కి జై!!!


బాధల నుండి మనల్ని కాపాడటానికి అవతరించిన దేవుడే సాయిబాబా


నా పేరు దుర్గ. నేను, నా భర్త ఇద్దరమూ బాబా భక్తులం. మాకు 2021, జూన్ నెలలో కోవిడ్ వచ్చినప్పటికీ బాబా దయవలన కోలుకున్నాము. తర్వాత వ్యాక్సిన్ వేయించుకోవాలంటే మాకు చాలా భయమేసింది. ఎందుకంటే, 'వ్యాక్సిన్ వేయించుకున్నాక జ్వరం వస్తుంది, బాగా నీరసపడతారు' అని కొందరు చెప్పారు. వాళ్ల మాటల వల్ల కోవిడ్ నుండి బయటపడ్డ మాకు చాలా భయమేసింది. కానీ, మేము పనిచేసే స్కూల్లో మేము వ్యాక్సిన్ వేయించుకోలేదని అందరికీ తెలిసి, తొందరగా వ్యాక్సిన్ వేయించుకోమని మమ్మల్ని బలవంతపెట్టారు. అప్పుడు మేము, "బాబా! మాకు జ్వరం, ఇంకా ఏ ఇబ్బందీ లేకుండా చూడండి" అని బాబాతో చెప్పుకుని, ఆయనపై నమ్మకముంచి వ్యాక్సిన్ వేయించుకున్నాము. బాబా మమ్మల్ని ఆశీర్వదించి, మా వెంట ఉండి మాకు ఏ ఇబ్బందీ లేకుండా చూసుకున్నారు. ఆయన దయవలన మాకు జ్వరం, నీరసం వంటివేమీ రాలేదు. చాలా నార్మల్‌‌గా అనిపించింది.


తర్వాత ఒకరోజు మా పాపకి జ్వరం వచ్చింది. అప్పుడు నేను, "బాబా! పాపకి తొందరగా జ్వరం తగ్గేలా చూడండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవలన మరుసటిరోజుకే పాపకి జ్వరం తగ్గి నార్మల్ అయింది. చాలా సంతోషంగా అనిపించి బాబా మాకు చేసిన ఈ మేలు గురించి బ్లాగులో పంచుకోవాలని అనుకున్నాను. సమస్త ప్రజలను వారివారి బాధలనుండి కాపాడటానికి అవతరించిన దేవుడే శ్రీసాయిబాబా. ఆయనను నమ్ముకున్నవారికి ఏనాడూ కష్టాలు ఉండవు. ఆయన ఎప్పుడూ తన భక్తుల ప్రక్కనే ఉంటూ అందరినీ ఖచ్చితంగా కాపాడుతారు. చివరిగా, ఈ బ్లాగులో తమ అనుభవాలను పంచుకుంటున్న భక్తులందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే, అందరి అనుభవాలు చదువుతున్నప్పుడు ‘బాబా మనపై ఎంత ప్రేమ చూపిస్తున్నారో’ అని చాలా ఆనందం కలుగుతుంది. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా!”.


పైసా ఖర్చు లేకుండా ల్యాప్‌టాప్ బాగయ్యేలా అనుగ్రహించిన బాబా


సాయిబంధువులకు నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. దయ మనందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆ తండ్రిని ప్రార్థిస్తున్నాను. నేను ఈమధ్య క్రొత్తగా ఒక ఉద్యోగంలో చేరాను. ఎంతోకాలం నిరీక్షణ తరువాత వచ్చిన అవకాశం అయినందువల్ల చిన్న ఉద్యోగమైనా నేను ఆ ఉద్యోగంలో చేరిపోయాను. అయితే, ఉద్యోగంలో చేరిన తర్వాత అక్కడి వర్క్ నాకు అంతగా నచ్చలేదు. దానికి తోడు నా ల్యాప్‌టాప్ అనుకోకుండా పాడైంది. ఎంత ప్రయత్నించినా అది పని చేయలేదు. అసలే హాస్టల్ కోసం, ఉద్యోగం కోసం కొంత డబ్బు ఖర్చు చేసినందువల్ల ల్యాప్‌టాప్ రిపేర్ కోసం ఖర్చు చేసేందుకు నా దగ్గర డబ్బు లేదు. అందువలన చెప్పలేనంతగా మానసిక ఒత్తిడికి లోనయ్యాను. చివరికి బాబాతో, "ప్లీజ్ తండ్రీ, నా ల్యాప్‌టాప్ బాగయ్యేలా అనుగ్రహించండి" అని వేడుకున్నాను. బాబా కృపవలన మా ఆఫీసులోని ఒక ఉద్యోగి మూడు గంటలపాటు శ్రమించి నా ల్యాప్‌టాప్ బాగుచేసి ఇచ్చారు. అందుకు అతను ఒక్క పైసా కూడా తీసుకోలేదు. అంతా బాబా దయ. "బాబా! అతని రూపంలో మీరే నాకు సహాయం చేశారు. చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఆలస్యంగా ఈ అనుభవాన్ని పంచుకున్నందుకు నన్ను క్షమించండి బాబా. ప్రస్తుతం నేనున్న పరిస్థితి గురించి మీకు తెలుసు. దయచేసి అన్నీ పరిష్కరించండి బాబా".


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!



9 comments:

  1. Om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram

    ReplyDelete
  2. Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness and happiness in the world of yours. Jaisairam

    ReplyDelete
  3. Om sai ram this covid is very dangerous. So many people died to this mahamari. My husband suffered due to covid . With baba's blessings he recorded my daughter also suffered with weakness and fever. Please remove this virus from world . Om sai ram❤❤❤

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  5. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  6. Om sai ram baba ma arogya samasyalani tondarga teerchu thandri sainatha pleaseeee

    ReplyDelete
  7. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😃🌹🤗🌼😀🌸🥰🌺👪💕

    ReplyDelete
  8. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo