సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1024వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • అడుగడుగునా బాబా అనుగ్రహం

అందరికీ నమస్కారం! ముఖ్యంగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేనొక బాబా భక్తురాలిని. బాబా నన్ను అడుగడుగునా కాపాడుతున్నారు. నాకేదైనా సమస్య వచ్చినప్పుడు, “బాబా! దయచేసి ఈ విషయంలో నాకు సహాయం చేయండి” అని బాబాను ప్రార్థించగానే బాబా వెంటనే బదులు పలుకుతున్నారు. ఈ ‘సాయి మహరాజ్ సన్నిధి’ బ్లాగులో ప్రచురిస్తున్న ‘సాయి వచనం’లో కూడా, "నేను నిన్ను అడుగడుగునా కాపాడుతున్నాను, లేకుంటే అసలు ఏమి జరిగేదో" అనే సాయి వచనం ఎన్నోసార్లు వచ్చింది. నేను బాబాను సహాయం కోరినప్పుడల్లా బాబా నాకు ‘సాయి వచనం’ ద్వారా ప్రతిస్పందించారు. “బాబా! నాకు ఈ సహాయం చేయండి, నేను సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను” అని చెప్పుకోగానే బాబా వెంటనే నాకు సహాయం చేస్తున్నారు. ఇలాంటి ఒక వేదికని స్థాపించి అందరూ బాబాను చేరుకోవటానికి ఒక మాధ్యమాన్ని కల్పించినందుకు ఈ బ్లాగ్ నిర్వాహకులకు మరోసారి నా ధన్యవాదాలు.

అన్నింటికంటే ముందు నేను నా అనుభవాన్ని ఒకటి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇది జరిగి ఎన్నో నెలలు గడిచినప్పటికీ నేను దీనిని మీతో పంచుకోలేదు. ఎందుకంటే, ఆ అనుభవం కలిగినప్పుడు, ‘నిజంగానే నేను అంత అదృష్టవంతురాలినా? ఒకవేళ ఇది నా భ్రమేమో!’ అనుకున్నాను. అందుకే నేను ఆ అనుభవాన్ని పంచుకోలేదు. కానీ, ‘శ్రీసాయిలీలామృతం’ చదువుతున్నప్పుడు అందులో అలాంటి ఒక సందర్భం చదివిన తరువాత నాకు నా అనుభవాన్ని పంచుకునే ధైర్యం వచ్చింది. అది నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ, వైఫల్యం చెంది విరక్తితో ఉన్న సమయం. ఆ సమయంలో చివరి ప్రయత్నంగా ఒకరోజు బాబాకు పూజ చేసి, "బాబా, నిన్ను నేను ఎంతగా నమ్మాను! కానీ నువ్వు నన్ను వదిలేశావు. నాకు తండ్రి కూడా లేరు. నిన్ను అంతగా నమ్ముకున్నందుకు నువ్వు మాకేమీ చేయలేదు” అంటూ ఎంతో బాధగా, హృదయపూర్వకంగా బాబాతో మాట్లాడుతున్నాను. అదే సమయంలో మా నాన్న కూడా గుర్తొచ్చేసరికి ఇంక దుఃఖం ఆపుకోలేక సోఫాలో కూర్చుని ఏడుస్తూ ఉన్నాను. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఉన్నట్టుండి నాకు ఒకరకమైన చక్కని సువాసన వచ్చింది. అది ముస్లిమ్స్ ధూపం వేయటానికి వచ్చినపుడు వేసుకుని వచ్చే అత్తరు పరిమళం లాగా వుంది. ఆ సువాసన నా ముందునుండి వచ్చి నా పక్కకి చేరుకుంది. హఠాత్తుగా వచ్చిన ఆ సువాసనని అదే పనిగా పీలుస్తూ, 'ఈ సువాసన ఎక్కడినుండి వస్తోంది? ఒకవేళ దూరంగా ఆరేసివున్న ఉతికిన బట్టల నుండి వస్తోందేమో?' అని అనుకుంటూ వాటి దగ్గరకి వెళ్ళి వాసన చూశాను. కానీ, ఆ సువాసన ఆ బట్టల నుండి రావటం లేదు. వేరే బట్టల నుండి ఆ సువాసన వస్తోందేమో అనుకుని ఇంట్లో వేరేచోట ఉన్న బట్టలన్నీ చెక్ చేశాను. కానీ, ఎక్కడా మళ్ళీ అలాంటి సువాసన నాకు రాలేదు. ‘అమెరికాలో అత్తరు సువాసన వస్తోందే, పైగా అలాంటి పెర్‌ఫ్యూమ్ ఇంట్లో ఎవ్వరూ వాడరు కూడా. అంతేకాదు, ఆ సువాసన హఠాత్తుగా వచ్చింది, మళ్ళీ అసలు రానేలేదు..’ అంటూ ఇలా అన్నీ ఆలోచిస్తుంటే, అది బాబానే (బాబా సన్నిధి) అని అనిపించినప్పటికీ, మళ్ళీ అంతలోనే ‘నాకు అంతటి అదృష్టమా?’ అని అనుకుని ఆ అనుభవం పట్ల అపనమ్మకంగా ఉన్నాను. కానీ మనసులో మాత్రం “బాబానే వచ్చారు” అనుకున్నాను. అంతేకాదు, ఆ సమయంలో బాబా దయవల్ల నేను ప్రయత్నిస్తున్న ఉద్యోగం కూడా వచ్చింది. అడుగడుగునా ఎన్నో చిక్కులు ఎదురైనా, ‘బాబా’ అని తలచుకోగానే వాటినుండి నన్ను కాపాడి నాకు ఉద్యోగం ప్రసాదించారు బాబా. అంతేకాదు, ఉద్యోగంలో చేరినరోజు నుండి ఇప్పటివరకు బాబా నన్ను అడుగడుగునా కాపాడుతూనే ఉన్నారు.

ఈ బ్లాగులో ‘సాయి వచనం’ ఎన్నోసార్లు నాకు బాబా నేరుగా చెప్పినట్లే ఉంటుంది. నేను ఉద్యోగం రాగానే బాబాకు నమస్కరించుకుని, “బాబా, నీ మీద నాకు ప్రేమతో కూడిన భక్తి ఉండాలేగానీ భయంతో కూడిన భక్తి వద్దు. నేను ఈ బ్లాగ్ చూసేటప్పుడు ఉద్యోగం వచ్చింది అనీ, బ్లాగ్ చూడకపోతే ఉద్యోగం పోతుందేమో అనే భయంతో కూడిన ప్రేమ ఉండకూడదు” అని కోరుకున్నాను. అదే రోజు బ్లాగ్ ఓపెన్ చేస్తే సాయి వచనంలో, "ఎందుకు మళ్ళీ మళ్ళీ వస్తున్నావు? వచ్చావంటే కొడతాను" అని వచ్చింది. ఎంత కరెక్ట్‌గా వచ్చింది నాకు బాబా నుండి మెసేజ్! అలా ‘సాయి వచనం’ ద్వారా బాబా నాతో మాట్లాడుతున్నారని నా మనసుకి అనిపిస్తుంది.

ఈమధ్య నాకు ఉద్యోగంలో ఎన్నో సమస్యలు వచ్చాయి. బాబా అనుగ్రహం వలన వాటినన్నింటినీ నేను దాటగలిగాను. నేను కాంట్రాక్ట్ బేసిస్‌పై వర్క్ చేస్తున్నాను. ఒక సోమవారంనాడు మా మేనేజరుతో 1 on 1 మీటింగులో, “నా ఉద్యోగం పర్మినెంట్ అయ్యే ఛాన్స్ ఉందా?” అని ఆవిడని అడిగాను. అప్పుడు మా మేనేజర్ నాతో , “మన టీంలో ఆ అవకాశం లేదు. కానీ, నువ్వు వేరే టీంలో కావాలంటే అప్లై చేసుకో!” అంటూ ఎలా అప్లై చేసుకోవాలో కూడా చక్కగా చెప్పింది. కానీ, రెండు రోజుల తరువాత మళ్ళీ టీం అందరితో మీటింగ్ పెట్టి, “ఉద్యోగం పర్మినెంట్ కావాలనుకుంటే అందరూ అప్లై చేసుకోండి. కానీ, ఆ విషయం ఉద్యోగం వచ్చేశాక చెప్పకుండా కాస్త ముందే నాకు చెప్పండి. మీ అందరి కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్ కోసం నేను ఎంతో కష్టపడుతున్నాను” అంటూ చాలాసేపు ఏదేదో చెప్పింది. అది విని నేను, “విడిగా అడిగినప్పుడు అంతా చక్కగా వివరించి, ఇప్పుడేంటి ఇలా అంటోంది? ఆవిడకేమైనా కోపం వచ్చిందేమో? అనవసరంగా నేను అంతా చెడగొట్టుకున్నానా?” అని నాకు చాలా బాధగా అనిపించింది. ఇదంతా గురువారంనాడు జరిగింది. ఆ మీటింగులో నేను మౌనంగా ఉన్నాను. మరుసటి సోమవారం నాకు మా మేనేజరుతో 1 on 1 మీటింగ్ ఉంది. ఆ వీకెండ్ అంతా నేను బాబాను ప్రార్థిస్తూ, “బాబా! ఆవిడ నాతో మంచిగా ఉండాలి. ఆ విషయం గురించి నన్ను ఏమీ అనకూడదు, ప్లీజ్ బాబా. ఆవిడ నాతో మంచిగా ఉంటే నా అనుభవాన్ని నేను సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అనుకున్నాను. సోమవారంనాడు ఆవిడ తనంతట తానే ఆ విషయాన్ని ప్రస్తావించి, “నేను అందరినీ భయపెట్టినట్లున్నాను. నేను చెప్పింది అందరికీ తప్పుగా అర్థమైంది. అందరూ భయపడ్డారు. సారీ, నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే, మీ అందరూ ముందు మీ జీవితం గురించి, మీ కుటుంబం గురించి ఆలోచించండి. నేను కూడా మొదట కాంట్రాక్ట్ బేసిస్ మీదే ఇక్కడ చేరాను. ఆ తరువాత ఫుల్ టైం తీసుకున్నాను. మీరు కూడా మొదట మీ గురించి ఆలోచించండి, ఆ తరువాతనే టీం వస్తుందని చెప్పాలనుకున్నాను. కానీ అందరికీ వేరేగా అర్థం అయింది, సారీ!” అని చెప్పింది. అసలు నిజంగా బాబా ప్రమేయం లేకుంటే ఈ విషయమంతా ఇలా ఇంత సానుకూలంగా మారగలదా?

మళ్ళీ ఇంకొకసారి వేరేవాళ్ళ వర్క్‌ విషయంలో మా మేనేజర్ ఎన్నిసార్లు అడిగినప్పటికీ వాళ్ళు ఆ వర్క్ చేయగలిగినా కూడా ఆ వర్కులో సమస్యలున్నాయని చెప్పి ఆ వర్క్ చేయలేదు. అయితే నేను మీటింగులో, ‘ఆ వర్క్ చేయవచ్చు’ అని మా మేనేజరుకి చెప్పి అన్నీ ఫిక్స్ చేయించాను. అలా ఫిక్స్ చేయించినందుకు ఆ ఇంకో ఇద్దరు వర్కర్స్‌కి నా మీద చాలా కోపం వచ్చింది. అప్పటినుండి ఆ ఇద్దరూ నా మీద చాలా కోపంగా ఉండి నాకు మనశ్శాంతి లేకుండా చేశారు. అప్పుడు కూడా నేను, “బాబా! ప్లీజ్, నాకు మనశ్శాంతి కల్పించండి” అని బాబాను వేడుకున్నాను. అప్పుడు మా మేనేజర్ మరియు ఇంకో కో-వర్కర్ కూడా నాతో మాట్లాడుతూ, “నువ్వు చాలా బాగా హెల్ప్ చేశావు. నిజానికి అవన్నీ వాళ్ళు చేయాలి. కానీ వాళ్ళు చేయలేక చేయలేదు. నీదేమీ తప్పులేదు. అవి ఫిక్స్ చేసినందుకు థాంక్స్” అని చెప్పారు.

అలానే ఇంకొకసారి, “నాకు మా మేనేజరుతో 1 on 1 మీటింగ్ వద్దు బాబా” అని అనుకోగానే ఆఖరి నిమిషంలో ఆవిడకి వేరే ఇంపార్టెంట్ మీటింగ్ వచ్చి మా 1 on 1 మీటింగుని క్యాన్సిల్ చేసింది. ఇలా బాబా నాకు అడుగడుగునా సహాయం చేస్తున్నారు. చాలాసార్లు నేను ఆఫీసులో ఎక్స్‌ట్రా వర్క్ చేసినప్పటికీ టైం షీట్‌ సబ్మిట్ చేసేటప్పుడు ఆ ఎక్స్‌ట్రా పనిగంటలు ఎంటర్ చేసేదాన్ని కాదు. కానీ, నేను అంత వర్క్ చేసినప్పటికీ, సిన్సియర్‌గా వర్క్ చేసినవాళ్ళకి, వర్క్ సరిగా చేయనివాళ్ళకి తేడా చూపటం లేదు అని మా మేనేజర్ మీద కోపం వచ్చినప్పుడు మాత్రం శుక్రవారంరోజున టైం షీట్ సబ్మిట్ చేసేటప్పుడు ఆ ఎక్స్‌ట్రా పనిగంటలు సబ్మిట్ చేసేదాన్ని. అయితే అలా సబ్మిట్ చేసినప్పుడల్లా తిరిగి సోమవారంరోజున జరగబోయే 1 on 1 మీటింగులో మా మేనేజర్ ఆ విషయం గురించి అడుగుతుందేమో అని కొంచెం భయం ఉండేది. మనం దానికి అర్హులమైనప్పటికీ ఎప్పుడూ అన్నీ రూల్స్ ప్రకారం జరగవు. అయితే, “బాబా! ప్లీజ్.. మా మేనేజర్ ఆ విషయం గురించి అడగకుండా చూడు” అని బాబాను ప్రార్థించిన ప్రతిసారీ సోమవారం ఉదయం నా టైం షీట్‌ను మా మేనేజర్ అప్రూవ్ చేసేసేది. ‘ఎక్స్‌ట్రా పనిగంటలు ఎందుకు ఎంటర్ చేశావు?’ అని నన్నసలు అడిగేది కాదు. చివరకు ఈరోజు (డిసెంబరు 7, 2021) కూడా నేను ఇదే సమస్య నుండి కాపాడమని బాబాను వేడుకున్నాను. “బాబా, నాకు మా మేనేజరుతో 1 on 1 మీటింగ్ వద్దు. అలాగే, సబ్మిట్ చేసిన ఎక్స్‌ట్రా పనిగంటల గురించి ఆమె నన్ను అడగకుండా చూడండి” అని. నేను కోరుకున్నట్లే మా మేనేజర్ నన్నేమీ ప్రశించకుండానే టైం షీట్‌ని అప్రూవ్ చేసింది. ఇదంతా కేవలం బాబా దయే. ఇలా బాబా నన్ను అడుగడుగునా కాపాడుతున్నారు.

అలానే ఈమధ్య ఒకసారి మా బాబు విషయంలో బాబా సహాయం చేసారు. అసలే కరోనా వల్ల ఏ కాస్త బాగాలేకపోయినా పిల్లలిద్దరూ స్కూలుకి వెళ్లడం మానేసి, కోవిడ్ పరీక్ష చేయించుకోవాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరోజు మా చిన్నబాబుకి ఐస్ క్రీం తినటం వల్ల జలుబు, జ్వరం వచ్చాయి. అది కోవిడ్ కాదని నాకు తెలుసు. ఎందుకంటే, మా చిన్నవాడు పెద్ద స్పూన్‌తో ఒక్కసారిగా ఐస్ క్రీం తింటే వాడికి జలుబు మొదలవుతుంది. అయితే అంతకుముందు వారంలో ఇలాంటి పరిస్థితి వస్తే, పిల్లల్ని స్కూలు నుండి ఇంటికి పంపండం, పరీక్షలు చేయించడం వంటి హంగామా జరిగింది. అప్పుడు కూడా నాకు తెలుసు, అది కోవిడ్ కాదని. కాబట్టి నేను భయపడలేదు. కానీ స్కూలు నుంచి బాబుకి లైట్ గా ఫీవర్ మొదలైందని ఫోన్ వస్తే, వాడిని డాక్టరు దగ్గరకి తీసుకుని వెళ్లి అన్నీ పరీక్షలు చేయించాల్సి వచ్చింది. వారం గడిచేసరికి మళ్లీ ఇలా బాబుకి అతికొద్దిపాటి జలుబు మొదలైంది. అంటే మళ్ళీ పిల్లలు స్కూలు మానేయాలి, వాళ్లకి కోవిడ్ పరీక్షలు చేయించాలి. అయితే పెద్దబాబు మళ్ళీ ఒక వారం స్కూలు  పోతుందని బాధపడుతుంటే, నేను వాడిని స్కూలుకి పంపించి, అది కోవిడ్ కాదని నాకు తెలుసినందున చిన్నవాడిని కూడా పంపాను. కానీ బాబుకి జ్వరం వస్తే స్కూలువాళ్ళు ఏమన్నా అంటారేమోనని భయపడి, "బాబా! ప్లీజ్ బాబా! బాబుకి జ్వరం రాకుండా చూడండి" అని బాబాను వేడుకున్నాను. తరువాత కూడా స్కూల్ నుంచి ఏదైనా ఫోన్ కాల్ వస్తుందేమోనని నాకు చాలా భయమేసింది. కానీ, బాబా దయవల్ల ఏలాంటి ఇబ్బందీ రాలేదు. బాబు మామూలుగానే ఇంటికి వచ్చాడు. జలుబు కూడా రెండు రోజులలో తగ్గిపోయింది. ఇలా ప్రతిసారీ బాబా నాకు సహాయం చేస్తున్నారు. "బాబా! మీ దయ, ప్రేమ నా మీద, నా పిల్లల మీద ఎప్పుడూ ఇలానే వుండేలా ఆశీర్వదించండి. మీ దయ లేకుంటే నాకు మనశ్శాంతి అనేది ఉండేది కాదు. బాబా, ఇంతవరకు మీరు నాకు ప్రసాదించిన అన్నిటికీ మీకు చాలా ధన్యవాదాలు. మీ ప్రేమ, కరుణ ఎల్లప్పుడూ ఇలాగే నా మీద, నా కుటుంబం మీద మరియు అందరిమీదా చూపించండి బాబా. నాపై ఎన్నడూ కోపగించుకోవద్దు బాబా. ఎన్నడూ మమ్మల్ని వదిలి పెట్టవద్దు బాబా. ప్లీజ్ బాబా, మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడండి బాబా. నేను ఈ అనుభవాలను ఇంత ఆలస్యంగా పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి బాబా.

ఓం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు!
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


14 comments:

  1. Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  2. Plss baba kapadu omsairam omsairam

    ReplyDelete
  3. Om Sai Ram please help us to get rid of corona.please bless us all.without you there is no life.you are only our hope.when I am 10years old I saw baba in temple but I don't know anything about him.after wards Baba's preaching spread.then I started praying to him.my mother-in-law from Siridi she brought Baba's moorty and satcharitra she gave to me.like that baba entered in my life.i became his devotee.om sai ram ❤️❤️❤️

    ReplyDelete
  4. 0m sai ram om sai ram om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  5. 🙏💐🙏Om sairam🙏💐🙏

    ReplyDelete
  6. Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness and happiness in the world of yours. Jaisairam

    ReplyDelete
  7. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  8. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  9. Om sai ram baba mamalini kapadu thandri

    ReplyDelete
  10. Baba na health tondarga cure ayyela chudu thandri sainatha

    ReplyDelete
  11. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😃🌺😀🌼🤗🌸🥰🌹👪💕

    ReplyDelete
  12. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo