సాయి వచనం:-
'గురువు ఎన్నడూ తనను తాను నీకు గురువుగా చేసుకోడు. ఆయనను గురువుగా గుర్తించవలసింది నువ్వే!'

'నీ సద్గురువు మీద నువ్వు మనస్సు కేంద్రీకరించడానికి చేసేదంతా ధ్యానమే!' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1028వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. తలచినంతనే పలికే దైవం సాయినాథుడు
2. బాబా దయతో ప్రెగ్నెన్సీ
3. టెన్షన్ తొలగించిన బాబా

తలచినంతనే పలికే దైవం సాయినాథుడు


రాజాధిరాజాయ విద్మహే

యోగిరాజాయ ధీమహే

తన్నో సాయి ప్రచోదయాత్!!!


నా పేరు రఘు. సాయిబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. తలచినంతనే పలికే దైవం సాయినాథుడు. ఆయన నాకు ప్రసాదించిన రెండు అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. 2021, అక్టోబర్ నెల రెండవవారం ఆరంభంలో మా అమ్మ నా దగ్గరకి వచ్చింది. తనకి ఎప్పటినుంచో కన్ను ప్రాబ్లమ్ ఉంది. పోయిన సంవత్సరం కేటరాక్ట్ ఆపరేషన్ చేయాలని చెప్పినప్పటికీ కరోనా వలన ఆపరేషన్ చేయించలేకపోయాము. కాబట్టి ఈ సంవత్సరం అక్టోబర్ రెండవవారంలో నేను అమ్మని ఒక హాస్పిటల్‍కి తీసుకుని వెళ్ళాను. డాక్టరు చెక్ చేసి, "కేటరాక్ట్ సమస్య రెండు కళ్ళకీ ఉంది. ఇంకా ఒక కంటి రెటీనాలో హోల్ పడింది. రెటినా డాక్టర్ వచ్చిన తరువాత చెక్ చేసి సర్జరీ ఎస్టిమేషన్ చెప్తారు" అని చెప్పారు. తరువాత రెటీనా డాక్టర్ స్కాన్ చేసి రెండు కళ్ళ రెటీనాలో హోల్ ఉంది. రెండు కళ్ళకి కేటరాక్ట్ అండ్ రెటీనా హోల్ ఫిల్లింగ్‍కి సర్జరీ చేయాలి" అని చెప్పారు. తరువాత మేము వేరే హాస్పిటల్‍కి వెళ్ళాము. వాళ్ళు గూడా అదే చెప్పారు. తరువాత మేము ఎల్.వి.ప్రసాద్ హాస్పిటల్‍కి వెళితే, వాళ్ళు 15 రోజుల ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలని చెప్పారు. బాబా దయవల్ల మేము డిఫరెంట్ శాఖలలో ట్రై చేసి ఆపరేషన్‍కి డేట్ తీసుకున్నాము. డాక్టరు కుడికన్నుకి సర్జరీ చేసేముందు బీపీ అండ్ షుగర్ చెక్ చేసి రిపోర్ట్ పంపమన్నారు. మేము ఒక క్లినిక్‍లో టెస్ట్ చేస్తే షుగర్ ఎక్కువ ఉందని వచ్చింది. అప్పుడు నేను బాబాని ప్రార్ధించి మరుసటిరోజు వేరే క్లినిక్‍లో మళ్లీ టెస్టు చేయించాను. బాబా దయవల్ల షుగర్ నార్మల్ వచ్చింది. దాంతో డాక్టర్ సర్జరీ చేసారు. నేను ఆపరేషన్ బాగా జరగాలని బాబాను ప్రార్థించాను. ఆయన దయవల్ల ఆపరేషన్ బాగా జరిగి ఇప్పుడు అమ్మకి బాగా కనపడుతుంది. ఇదంతా బాబా దయవల్లే జరింగింది.


రెండవ అనుభవం: రెండేళ్ల క్రితం నేను షుగర్ టెస్టు చేయించుకుంటే షుగర్ బోర్డర్ లైనులో ఉందని, ఫుడ్ అండ్ హెల్త్ విషయంలో కేర్ తీసుకోమని డాక్టర్ చెప్పారు. అప్పటినుండి నేను అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండేవాడిని. కానీ కరోనా వల్ల ఆహారం ఎక్కువగా తీసుకోవడంతో నేను బరువు పెరిగాను. ఇంకా ఇంట్లో ఉంటూ వర్క్ చేయటం వల్ల శారీరక శ్రమ కూడా లేదు. అప్పుడప్పుడు కాళ్ళు, వేళ్ళు నొప్పులుగా ఉంటుంటే నాకు షుగర్ వచ్చిందేమోనని భయపడ్డాను. దాంతో షుగర్ టెస్ట్ చేయుచుకుందామని క్లినిక్‍కి వెళ్లాను. అయితే వెళ్లేముందు బాబాని, "రిపోర్టు నార్మల్‍గా రావాల"ని ప్రార్ధించి, "అలా జరిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మాటిచ్చాను. బాబా దయవలన షుగర్ రిపోర్ట్ నార్మల్‍గా వచ్చింది. "ధన్యవాదాలు బాబా! ఇలాగే మీ కరుణ, దయ, ప్రేమానురాగాలు ఎప్పుడూ మాపై చూపించండి తండ్రి. మీరే మాకు దిక్కు, మమ్మల్ని ఎల్లప్పుడూ అనుగ్రహించండి బాబా. అమ్మ ఎడమ కన్ను ఆపరేషన్ కూడా సక్రమంగా జరిగేలా మరియు నాకున్న విటమిన్ లోపం వలన వస్తున్న కాళ్ళు మరియు చేతుల నొప్పులు తగ్గేలా, అలాగే థైరాయిడ్ నార్మల్ ఉండేటట్లు దీవించండి బాబా. ఇంకా మేము కొనబోయే అపార్ట్మెంట్ విషయంలో మీ సహాయం మాకు కావాలి. దయచేసి మాకు సహాయం చేయండి. ఆ అనుభవాలని మళ్ళీ ఈ బ్లాగులో పంచుకుంటాను".


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!


బాబా దయతో ప్రెగ్నెన్సీ


నా పేరు మానస. ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి మరియు సాయిభక్తులందరికీ నా వందనాలు. ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం గురించి మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. నాకు పెళ్ళై 7 సంవత్సరాలు అవుతుంది. మొదటి నాలుగు సంవత్సరాలు మేము పిల్లలు వద్దు అనుకున్నాము. తరువాత మేము పిల్లులు కావాలనుకున్నా కొన్ని కారణాల వల్ల ఒక సంవత్సరానికి గానీ నాకు ప్రెగ్నెన్సీ నిర్ధారణ కాలేదు. చివరికి బాబా దయవల్ల ప్రెగ్నెన్సీ నిర్థారణ అయ్యిందనుకున్నప్పటికీ 9వ వారంలో నాకు అబార్షన్ అయ్యింది. ఆ సమయంలో నాకు బాబాపై చాలా కోపం వచ్చింది. మళ్ళీ రెండు నెలలకి నేను ప్రెగ్నెంట్ అయ్యాను. అయితే అప్పుడు కూడా అబార్షన్ అయ్యింది. డాక్టర్లు బేబీ గుండె కొట్టుకోవట్లేదు అని చెప్పారు. నాకు చాలా బాధేసింది. మానసికంగా చాలా అలసిపోయినందున ఒక సంవత్సరంపాటు విరామం తీసుకున్నాను. ఆపై హైదరాబాదులోని మంచి గైనకాలజిస్ట్ ని కలిసి సమస్యలు పరిష్కరించుకున్న తరువాత బాబా దయవల్ల మళ్ళీ గర్భవతినయ్యాను. కానీ నాకు ప్రెగ్నెన్సీ నిర్థారణ అయ్యిందన్న సంతోషం కన్నా చాలా భయంగా ఉంటుండేది. అలా భయంభయంగా ఉన్నా బాబా దయవల్ల మూడు నెలలు జయప్రదంగా ముగిశాయి. తరువాత 4వ నెలలో బ్లీడింగ్ అయ్యి చాలా భయమేసింది. బాబాని గట్టిగా ప్రార్ధించి, సాయిసచ్చరిత్ర తీసుకుని హాస్పిటల్‍కి వెళ్లి, "స్కాన్ రిపోర్టు బాగుంటే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. డాక్టరు స్కాన్ చేసి అంతా బాగుందని, కొన్ని మందులిచ్చారు. బాబా దయవల్ల ఇప్పుడు నాకు బాగానే ఉంది. ఏ సమస్యా లేకుండా బాబా ఈ ప్రెగ్నెన్సీని కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా ఆశపడుతున్నాను. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు భక్తులందరూ కూడా నన్ను  ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మంచి  ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చాక మళ్లీ నా అనుభవాన్ని మీతో పంచుకుంటాను.


టెన్షన్ తొలగించిన బాబా


సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నాపేరు శిరీష. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలు మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు 2021, డిసెంబర్ 7, మంగళవారంనాడు మావారి విషయంలో జరిగిన ఒక చిన్న అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆరోజు మావారు మీటింగ్ ఉందని విజయవాడ, డి.ఐ.జి(ఫైర్) ఆఫీసుకు వెళ్ళారు. ఆయన నాతో, "మీటింగ్‍కి వెళ్తున్నానని కాకుండా, విజయవాడ క్యాంప్‍కి వెళ్తున్నాను, వీలైతే మధ్యాహ్నం భోజనానికి వచ్చేస్తాను" అని చెప్పారు. నేను ఆరోజు మధ్యాహ్నం 12.30 నుండి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు. మధ్యాహ్నం 2గంటల వరకు నాకు టెన్షన్ లేదు కానీ, ఆపై 'ఎంత బిజీగా ఉన్నా, ఫోన్ సైలెంట్‍లో పెట్టుకున్నా లంచ్ బ్రేక్‍లో అయినా ఫోన్ చూసుకుని, కాల్ చేస్తారు. కానీ 2.30 అయినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేద'ని కంగారుగా అనిపించి, "బాబా! మావారి గురించి ఏదైనా విషయం తెలియజేయండి. నా అనుభవాన్ని బ్లాగులో ఆలస్యం చేయకుండా పంచుకుంటాను" అని ప్రార్ధించాను. వెంటనే ప్రేరణ కలిగి మావారి కారు డ్రైవరుకి ఫోన్ చేశాము. తను, "సార్ గంటలో వస్తానని ఆఫీసు లోపలికి వెళ్ళారు. నేను ఫోన్ చేస్తున్నా సార్ లిఫ్ట్ చేయడం లేదు. నేను కూడా సార్ కోసం వెయిట్ చేస్తున్నాను" అని చెప్పాడు. వెంటనే బాబాను తలుచుకుని విజయవాడ A.E గారికి ఫోన్ చేసాము. ఆయన, "మేడమ్, సార్ డి.ఐ.జి ఆఫీసులో మీటింగ్‍లో ఉన్నారు. అక్కడకు వెళ్ళేటప్పుడు ఫోన్ తీసుకుని వెళ్ళకూడదు. ఫోన్ క్రింద ఫ్లోర్‍లోనే పెట్టేస్తారు. నేను మీటింగుకు వెళ్ళలేదు" అని చెప్పారు. మరుక్షణంలో మా డ్రైవరు ఫోన్ చేసి, "మేడమ్, సార్ మీటింగులో ఉన్నారు. నేను వెళ్ళి కనుక్కొని వచ్చాను" అని చెప్పాడు. అప్పటికి సమయం 3.30 అయింది. ఇది చిన్న విషయమే కావొచ్చు. కానీ బాబా నన్ను ఆ టెన్షన్ నుండి కాపాడి నాకు ధైర్యాన్నిచ్చారు. "ధన్యవాదాలు బాబా". చివరిగా అందరి అనుభవాలను సాయిభక్తులందరికీ తెలియజేస్తూ ఈ బ్లాగును ఆధునిక సాయిసచ్చరిత్రగా తీర్చిదిద్దుతున్న బ్లాగు నిర్వాహకులకు నా కృతజ్ఞతలు.


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!



11 comments:

  1. Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  2. Om sai ram 🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  4. Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness and happiness in the world of yours .jaisairam

    ReplyDelete
  5. Om Sai ram many people have health problems.sai sloves all health problems.our trust in sai and bless us
    makes cure.He is our father he takes care of everyone.Don't worry.om sai ram ❤️❤️❤️

    ReplyDelete
  6. Om sai ram. .. Please show me the way to correct my mistake. Om sai ram ��

    ReplyDelete
  7. Om sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha pleaseeee

    ReplyDelete
  8. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  9. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Namaha 🕉🙏😊❤😃🌺😀🌼🤗🌸🥰🌹👪💕

    ReplyDelete
  10. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo