- బాబా సంరక్షణలో భక్తురాలి కుటుంబం
సాయిభక్తులందరికి నా నమస్కారం. నా పేరు శ్రావణి. బాబా నాకు ప్రసాదించిన ఎన్నో అనుభవాల్ని ఇదివరకు మీతో పంచుకున్నాను. ఇప్పుడు బాబా మా కుటుంబాన్ని కరోనా నుండి ఎలా రక్షించారో మీ అందరికి తెలియజేస్తాను. సాధారణంగా ఒకే ఇంట్లో ఉండే కుటుంబసభ్యులందరూ ఒకే సమయంలో కరోనా బారినపడటం గురించి మనం విన్నాము. అలాంటిది బాబా ఎంతో దయతో మా ఇంట్లో అందరూ ఒకేసారి కరోనా బారినపడకుండా రక్షించారు. వివరాలలోకి వెళ్తే... ముందుగా 2021, ఏప్రిల్ 20న మావారికి కొద్దిగా జ్వరం వచ్చింది. కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్నందున మావారు వెంటనే రెండు రకాల కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. ర్యాపిడ్ టెస్టులో పాజిటివ్ రాగా, RTPCR టెస్టులో నెగిటివ్ వచ్చింది. ఆలస్యం చెయ్యకుండా మావారు మేము ఎప్పుడూ చూపించుకునే హోమియో డాక్టరుని సంప్రదించారు. ఆయన ఇచ్చిన మందులతో మావారికి జ్వరం తగ్గింది కానీ, దగ్గు మొదలయింది. ఆ సమయంలో నేను మా అమ్మ వాళ్ళింట్లో ఉన్నందువల్ల మొదటి రెండు రోజులు మావారి స్నేహితుడు దగ్గరుండి మావారికి ఎంతో సహాయం చేసాడు. కరోనా నెగిటివ్ వచ్చిన తరువాత కూడా మావారికి తీవ్రమైన దగ్గు ఉండడంతో CT స్కాన్ చేయించాము. అందులో CO-RADS 5 ఉండడంతో కరోనా ఇంకా ఉందని నిర్ధారణ అయ్యింది. దాంతో నేను మావారి దగ్గరకి వెళ్ళడానికి సిద్ధమయ్యాను. కానీ మావారు, "మన ఇద్దరిలో ఎవరో ఒకరు బాబుని చూసుకోవాలి, నా పరిస్థితి ఇలా ఉంది. నువ్వు కూడా వస్తే ఎలా? అందుకే నువ్వు అక్కడే ఉండు. మా అమ్మ వస్తుందిలే" అని అన్నారు. సరేనని, నేను అమ్మ వాళ్ళింట్లోనే ఉంటూ తనకి తగ్గేవరకు రోజూ బాబాని ప్రార్థిస్తూ స్తవనమంజరి, సచ్చరిత్రలోని 34వ అధ్యాయం పఠిస్తూ ఉండేదాన్ని. బాబా తమ సందేశాల ద్వారా ఎన్నో నిదర్శనాలు ఇస్తుండేవారు. అయితే రెండవ రోజుకి మా అత్తగారికి కూడా కరోనా వచ్చింది. ఇద్దరికీ నీరసం ఎక్కువగా ఉండడంతో ఒక ఆటో అతనితో మాట్లాడి, వాళ్ళకి కావాల్సినవన్నీ నేనే సమయానికి పంపుతుండేదాన్ని. వాళ్ళకి రుచి తెలియడం లేదంటే వండిన పదార్ధాలలో ఊదీ కలిపేదాన్ని. దాంతో వాళ్ళకి రుచి తెలిసి తృప్తిగా తినేవారు. రెండు రోజుల తర్వాత మావారు డాక్టరుని సంప్రదించడానికి వెళ్ళారు. సరిగ్గా అదే సమయంలో మా అన్నయ్యకి "పరిస్థితులలో ఒక్కసారిగా మార్పు వస్తుంది" అని బాబా సందేశం వచ్చింది. అంతే! డాక్టరు మావారిని పరీక్షించి, కరోనా టెస్టు చేయనప్పటికీ "కరోనా తగ్గింద"ని చెప్పి, ఇంకా మిగిలి ఉన్న దగ్గుకి మందులు మార్చి ఇచ్చారు. దాంతో బాబా చెప్పినట్లుగానే మావారు తొందరగా కోలుకున్నారు.
ఇకపోతే, మా అత్తగారి విషయంలో ఆమె బ్లడ్ రిపోర్టులలో ఏదో తేడా ఉండడంతో ఆమెని హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమని డాక్టరు చెప్పారు. కానీ ఆమె భయపడి ఇంటికి వచ్చేసారు. ఆ సమయంలో మాకు ఏమి చెయ్యాలో అర్ధంకాలేదు. అంతలో మా తమ్ముడు అత్తగారిని ఆయుర్వేదిక్ హాస్పిటల్లో చూపిద్దామని, అక్కడికి తీసుకుని వెళ్ళాడు. బాబా కృపవలన ఆమె రెండు రోజుల్లో కోలుకుంది. 2021, మే 9వ తేదీకి వాళ్ళిద్దరికీ కరోనా నెగిటివ్ వచ్చింది. కానీ వాళ్ళిద్దరూ కోలుకున్నారనే సంతోషాన్ని ఆస్వాదించలేకపోయాము. ఎందుకంటే, అప్పటికే అంటే ఏప్రిల్ 30న కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మా అమ్మకి జలుబు, జ్వరం మొదలై రోజులు గడుస్తున్నా తగ్గలేదు సరికదా, మధ్యలో రుచి, వాసన కూడా తెలిసేది కాదు. ఏ సమయంలో చూసినా జ్వరం 104 డిగ్రీలు ఉంటుండేది. దాంతో నేను, మా అమ్మ కరోనా టెస్టు చేయించుకుందామని అనుకున్నాము. కానీ మా నాన్న భయంతో ఒప్పుకునేవారు కాదు. ఇలా ఉండగా ఒకసారి మా అమ్మకి జ్వరం చూస్తూ ఉన్నాను నేను అనుకోకుండా బాబా ప్రేరణతో ఆమె శరీరానికి అంతా ఊదీ రాసాను. ఆ తరువాత మావారు తాను చూపించుకున్న హాస్పిటల్‌కి అమ్మని తీసుకుని వెళ్లి, బ్లడ్ టెస్టు మొదలు అన్ని టెస్టులు చేయించారు. ఆ రిపోర్టులు చూసిన డాక్టరు 'అమ్మకి కరోనా వచ్చి తగ్గిపోయింద'ని చెప్పారు. అది విని మేము చాలా ఆశ్చర్యానికి లోనయ్యాము. డాక్టరు ఇచ్చిన మందులతో అమ్మ ఆరోగ్యం కొద్దిరోజుల్లోనే కుదుటపడింది. బాబా దయవల్ల అమ్మతోనే ఉన్న నాన్నకి, మా బాబుకి కరోనా సోకలేదు. నాకు మాత్రం ఒంట్లో నలతగా అనిపిస్తూ ఉండేది. అందువల్ల ఎంతో ఇష్టంగా చేసే బ్లాగు వర్క్ కూడా చెయ్యలేనని అన్నయ్యకి చెప్పాను. ఆ తరువాత రెండు రోజులకి అంటే మే 21న నాకు వాసన తెలియలేదు. దాంతో నాకు కూడా కరోనా వచ్చిందని నిర్ధారించుకున్నాను. అదేరోజు మన బ్లాగులో వాసన కోల్పోయిన ఒక భక్తురాలి అనుభవం పబ్లిష్ అయ్యింది. అది చూసి 'బాబా నాతోనే ఉన్నార'ని నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను. అంతలో మావారు వచ్చి నన్ను ఒక్కదాన్నే మా కొత్త ఇంటికి(ఆ ఇల్లు మాకు బాబా అనుగ్రహం) తీసుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే నాకు జ్వరం మొదలు అయ్యింది. ఏమి తిన్నా వాంతి చేసుకునేదాన్ని. గదిలో ఒంటరిగా ఉన్న నేను శిరిడీ నుండి తెచ్చుకున్న టేబుల్ వెయిట్ బాబాని ఎప్పుడు గట్టిగా పట్టుకుని ఉండేదాన్ని. ఆ సమయంలో వచ్చే బాబా సందేశాలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చేవి. కానీ జ్వరం మాత్రం వస్తూ, పోతుండేది. ఆ సమయంలో నాకు కరోనా ఉన్నా కూడా మావారు నాకు ఆహారం తినిపించడం వంటివి చేసేవారు. అది బాబా నాకు ఇచ్చిన వరమని చెప్పాలి. ఆయన దయవల్ల మావారికి ఏ ఇబ్బంది కలగలేదు.
రెండవరోజు మధ్యాహ్నం బాబా ఆరతి పాటలు వింటుండగా మావారి స్నేహితుడు ఫోన్ చేసి, "ఆనందయ్య మందు దొరికింది. అయితే ఒకరికి మాత్రమే ఉంది" అని చెప్పారు. అది విని మావారు బాబా ప్రేమకి ఎంతో సంతోషించారు. అదలా ఉంచితే, ఆరోజు 4 పూటలా డోలో వేసుకున్నా జ్వరం వస్తూనే ఉండటంతో మా తమ్ముడు నాకు ఇంగ్లీష్ మెడిసిన్ పనిచేయట్లేదని మా అత్తయ్యను చూపించిన ఆయుర్వేదిక్ హాస్పిటల్లో నన్ను చూపించి మాటల్లో అనందయ్య మందు విషయం ప్రస్తావించాడు. డాక్టరు నా నాడీ చూసి, "మీకు ఇంకా జ్వరం ఉంది. ఈ సమయంలో అనందయ్య మందు దొరకడం మీ అదృష్టం" అని చెప్పి మరికొన్ని మందులు కూడా ఇచ్చారు. బాబా దయవల్ల మరుసటిరోజుకి జ్వరం లేదు. రెండు రోజులకి రుచి, వాసన కూడా తెలిసాయి. తరువాత నాలుగు రోజులకి నేను, మావారు బండి మీద డాక్టరు చెకప్ కోసం వెళ్తుంటే, నడుస్తున్న బండి మీద నుంచి వెనుక కూర్చుని ఉన్న నేను కూర్చున్నట్లే క్రిందపడిపోయాను. 'బాబా బాబా' అనుకుంటూ లేచాను. బాబా దయవల్ల నాకేమీ కాలేదు. అంతా బాబాకు నా మీద ఉన్న ప్రేమ.
తరువాత నేను రుచి, వాసన తెలుస్తున్నాయి కాబట్టి కరోనా తగ్గి ఉంటుందని భావించి మా బాబుని నా దగ్గరకి తెచ్చుకోవాలని కరోనా టెస్టు చేయించుకున్నాను. అదే పెద్ద తప్పైంది, చాలా టెన్షన్ క్రియేట్ చేసింది. మరుసటిరోజు వాలంటీర్ ఫోన్ చేసి, "మీకు కరోనా పాజిటివ్ వచ్చింద"ని చెప్పింది. అంతవరకు బాగానే ఉంది కానీ, "పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఇంట్లో ఉండకుండా బయట తిరిగి అందరికి అంటిస్తున్నారు. అందువల్ల గవర్నమెంట్ కొత్త రూల్ పెట్టింది. దాని ప్రకారం కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్లంతా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. మీరు కాదంటే మా ఏ.ఎన్.ఎమ్ ఒప్పుకోదు" అని ఆ వాలంటరీ విసిగించడం మొదలుపెట్టింది. మావారు, "తనకి బాగుంది, మేము తనని హాస్పిటల్లో అడ్మిట్ చెయ్యము" అని చెప్పినా ఊరుకోలేదు. అయినా మేము ఒప్పుకోకపోయేసరికి తాను మళ్ళీ మాట్లాడతానని ఫోన్ పెట్టేసింది. ఫోన్ లొకేషన్ ఆధారంగా నేను ఎక్కడ ఉన్నానో తెలుసుకుని మరీ నన్ను హాస్పిటల్‍కి తీసుకుని పోతారేమోనని నాకు భయమేసి నా మొబైల్‍లోని సిమ్ కార్డు తీసేసాను. అంతేకాకుండా, "ఇదేంటి బాబా? ఇలా అయిందేంటి? టెస్టు చేయించుకుని లేనిపోని కష్టం తెచ్చుకున్నానా?" అని చాలా ఏడ్చాను. బాబా దయవల్ల నాకొక ప్రేరణ కలిగి మాకు తెలిసిన ఒక సార్‌కి ఫోన్ చేశాను. ఆయన, "నీ దగ్గరకి ఎవరు రాకుండా నేను చూసుకుంటాను" అని చెప్పి కొండంత ధైర్యం ఇచ్చారు. బాబా కృపవలన తరువాత నా దగ్గరకి ఎవరూ రాలేదు.
తరువాత ఒకరోజు నాకు కొన్ని వస్తువులు అవసరమై మా అమ్మ వాళ్ళింటికి వెళ్ళాను. ఇంట్లోకి అడుగుపెట్టగానే వరండాలో ఉన్న సోఫాలో సాయిలీల మ్యాగజైన్ కనిపించింది. బహుశా మేము ఎవరూ ఇంట్లో లేకపోవడంతో పోస్టుమెన్ అక్కడ వేసి వెళ్లినట్లున్నారు. ఆ మ్యాగజైన్‍ని చూడగానే నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. బాబా ప్రేమకి ఎంతో ఆనందించాను. అసలు విషయమేమిటంటే, నాకు, మా బాబుకి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడల్లా బాబా మ్యాగజైన్ రూపంలో మాకు సానుకూల సంకేతం పంపుతుంటారు. తరువాత 14 రోజులకి టెస్ట్ చేసుకుంటే నెగిటివ్ వచ్చింది.
అయితే కరోనా తగ్గాక నాకు నెలసరి రాలేదు. ఈ విషయం గురించి ఎవరినైనా అడుగుదామంటే నా ఫ్రెండ్స్ ఎవరికీ ఆ సమస్య రాలేదు. గూగుల్లో చూస్తే, కరోనా తగ్గిన నెల రోజులు వరకు నెలసరి రాదని, వచ్చినా అధిక స్రావం జరుగుతుందని ఉంది. అది చూసి భయమేసి బాబాని ప్రార్ధించాను. మరుసటిరోజే నెలసరి వచ్చింది. నేను భయపడినట్లుగా ఏమీ కాలేదు. బాబా ఇలా అడుగడుగునా నన్ను కాపాడుతూ ఉన్నారు.
పోస్ట్ కరోనా లక్షణాలలో గ్యాస్ట్రిక్ సమస్య ఒకటి. ఆ సమస్య నాకు ముందు నుండి ఉన్నా కూడా ఈ సమయంలో నేను దాంతో ఎక్కువగా ఇబ్బందిపడ్డాను. ఇంకా ఒంటరిగా ఉన్న సమయంలో ఛాతి దగ్గర నొప్పి వస్తూపోతుండేది. దాని గురించి డాక్టరుకి చూపించుకుందామనుకున్నాను. కానీ బాబానే మన పెద్ద డాక్టరని ఊదీ వేడినీళ్లలో కలుపుకుని రోజుంతా త్రాగుతుండేదాన్ని. అలా ఉండగా గురుపౌర్ణమి వచ్చింది. ఆరోజు బాబాకి పూజ చేసి, "బాబా! నా ఈ గ్యాస్ సమస్యని తగ్గించండి" అని వేడుకున్నాను. అదేరోజు మా ఎదురు ఇంట్లో షష్టిపూర్తి మహోత్సవం జరిగింది. వారింట్లో భోజనంలో పెరుగు తీసుకున్నాను (కరోనా వచ్చినప్పటి నుండి దగ్గు వస్తుండడం వల్ల మజ్జిగ, పెరుగు తీసుకోవడం లేదు). బాబా దయవల్ల దగ్గు రాలేదు గానీ మరుసటిరోజు ఉదయం నుండి విరోచనాలు మొదలయ్యాయి. దాదాపు ఆరుసార్లు వెళ్ళాను. అప్పుడింక బాబా ఊదీ తీసుకుని, "విరోచనాలు తగ్గితే, బ్లాగులో నా అనుభవాలన్ని పంచుకుంటాను. ఇక ఆలస్యం చెయ్యను" అని అనుకున్నాను. అంతే నా విరోచనాలు ఆగిపోయాయి. అప్పటి నుండి నా గ్యాస్ సమస్య కూడా తగ్గుముఖం పట్టింది. ఆరోజు మధ్యాహ్నం నేను మా అమ్మ వాళ్ళింటికి వెళ్లాను. మధ్యాహ్నం 1.30 ప్రాంతంలో బాబా బండి వచ్చింది. నిజానికి అంతకు ముందెప్పుడూ ఆ సమయంలో బాబా బండి మా వీధిలోకి రాలేదు. నేను బాబాకి 10 రూపాయలు దక్షిణ సమర్పిచాను. ఆ బండి నడిపే అతను నాకు ఊదీ పొట్లం ఇచ్చాడు. బాబా ప్రేమకి ఎంతో సంతోషపడ్డాను.
మేము అందరమూ కరోనా నుండి కోలుకుంటున్న సమయంలో 2021, జూన్ 22వ తేదీ రాత్రి మా బాబుకి కొద్దిగా జ్వరం వచ్చింది. వెంటనే వాడి నుదిటిపై ఊదీ పెట్టి, ఊదీ నీళ్లు ఇచ్చాను. తరువాత పారాసెటమోల్ టాబ్లెట్ వేసాను. అయినా జ్వరం తగ్గకపోయేసరికి బాబుని డాక్టరుకి చూపించాము. ఆయన, "మామూలు జ్వరమే, తగ్గిపోతుంది" అని కొన్ని మందులిచ్చారు. కానీ మరుసటిరోజుకి కూడా జ్వరం తగ్గలేదు. దాంతో మళ్ళీ అవే మందులిచ్చి, వాటితోపాటు ఎల్, ఎఫ్ మందులు కూడా ఇచ్చారు. సాధారణంగా ఆయుర్వేదంలో ఆ మందులు కరోనా రోగులకు ఇస్తారు. అందువల్ల డాక్టరు ఆ మందులు ఇచ్చినప్పటినుండి నాకు, మా వారికి ఒకటే ఆందోళన మొదలైంది. కరోనా 3rd వేవ్ వచ్చేసిందేమోనని చాలా భయపడ్డాము. ఏదేమైనా మేము బాబానే నమ్ముకుని మా బాబుకి కోవిడ్ టెస్టు చేయించలేదు. కేవలం ఆయుర్వేదిక్ మందులే ఇప్పించసాగాము. ఇలా ఉండగా ఒకరోజు మా బాబు, "నేను బాబాకి 1000 రూపాయలు ఇవ్వాలనుకున్నాను. వెంటనే బాబాకి పంపు" అని రచ్చ చేసాడు. వాడి గోల భరించలేక నేను వెంటనే శిరిడీ సంస్థాన్ యాప్ ఓపెన్ చేసి, బాబాకి 1001 రూపాయలు పంపాను. తరువాత వాడు బాబా ఫోటో వైపు చూస్తూ సంతోషంగా "బాబా నన్ను చూసుకుంటారు. నాకు నయం చేస్తారు" అని ఏదేదో మాట్లాడుతుండేవాడు. ప్రతినెలా బాబా మందిరంలో కొన్ని ప్రసాదాలు ఇచ్చే అలవాటున్న మా నాన్నగారు ఎప్పటిలాగానే ఆ నెల కూడా ఇవ్వగా ఆ గుడిపూజారి నాకు ఇవ్వమని ఒక పెద్ద కవర్ నిండా ఊదీ పంపారు. ఊదీ చూసిన మాకు ఎంతో ఉరటగా అనిపించింది. వెంటనే ఆ ఊదీని బాబు శరీరమంతా పూసాను. జూన్ 26వ తేదిన ఈ క్రింది బాబా సందేశం వచ్చింది.
భావం: ఇదంతా దేవుని ఆట. స్వయంగా ఆయనే నయం చేస్తారు. మనమెందుకు ఆందోళన చెందాలి?
ఆరోజు రాత్రంతా బాబుకి వాంతులు, విరోచనాలవుతూనే ఉన్నాయి. అయితే డాక్టర్ మాకు ముందుగానే ఇన్ఫెక్షన్ అలా వెళ్లిపోవాలని చెప్పడంతో మేము భయపడకుండా కొంచం ధైర్యంగానే ఉన్నాము. బాబా చేప్పినట్లే మరుసటిరోజు నుండి బాబు జ్వరం తగ్గుముఖం పట్టింది. డాక్టరుకి చూపిస్తే, "బాబు కోలుకున్నాడు. ఇక మందులు అవసరం లేదు" అని చెప్పారు. ఇది బాబాకి మా బాబుపై ఉన్న ప్రేమ, అనుగ్రహాలకు నిదర్శనం. "ధన్యవాదాలు బాబా. మీ ఆశీస్సులు వాడిపై ఎప్పుడూ ఇలాగే ఉండాలి".
Om sai ram❤❤❤
ReplyDeleteOm sai ram every body suffered with corona. With baba blessings i was corona free. We took all corona vaccines. Booster dose also. Sai saved us from corona virus. That is sai's power. Om sai ram❤❤❤
ReplyDeleteOm sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram
ReplyDeleteOm sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteJaisairam bless Eesha she is suffering with fever. Bless her and save her to recovery from fever. Jaisairam
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha pleaseeee
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI.. OM SAI RAM
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😃🌺🤗🌹🥰🌼😀🌸👪💕
ReplyDeleteSainatha please bless my baby with good health and long life ahead
ReplyDelete..
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete