సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1020వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఏ సమస్య వచ్చిన బాబా తోడుంటారు
2. బాబా అనుగ్రహంతో మనసు మార్పు - ఆరోగ్యం
3. బాబా దయవల్ల గట్టెక్కిన సమస్యలు

ఏ సమస్య వచ్చిన బాబా తోడుంటారు


శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి, సాయిబందువులకు నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. బాబా తన భక్తులను సప్త సముద్రాల అవతల ఉన్నా పిచ్చుక కాలికి దారం కట్టి ఈడ్చునట్లు తమ దగ్గరకి చేర్చుకుంటారు. అదేవిధంగా బాబా భక్తులను ఒక్కటిగా చేసిన ఈ బ్లాగు నిర్వాహకులకు, నన్ను కూడా ఈ బ్లాగులో చేర్చిన బాబాకు ధన్యవాదాలు. ఏదైనా సమస్య వచ్చినపుడు చాలా సందర్భాలలో బాబానే చాలావరకు తోడుగా ఉంటారు. ఇప్పుడు ఈ అనుభవాలు చదువుతూ, "బాబా! మేము కూడా మా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాం" అంటే సమస్యలు తీరుతున్నాయి. 


ఒకసారి వరలక్ష్మీ వ్రతమప్పుడే నాకు నెలసరికి సమయమైనందువల్ల నేను పూజ చేసుకోగలనో, లేదో అని భయపడ్డాను. అప్పుడు బాబా దగ్గర నా సమస్య గురించి చెప్పుకుని ఊదీ నీళ్లు త్రాగి, "పూజ ఏ ఆటంకం లేకుండా జరిగితే, నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాన"ని బాబాను వేడుకున్నాను. సాయి దయతో ఆ పూజనే కాదు తరువాత వచ్చిన విజయదశమి తదితర పండుగలప్పుడు కూడా నెలసరి వలన నాకు ఏ ఆటంకం లేకుండా కాపాడారు. అందుకు సాయికి నా కృతఙ్ఞతలు.


ఒకరోజు రాత్రి మా అమ్మకు వణుకుతో కూడిన జ్వరం వచ్చింది. అది కరోనా ఉధృతి కారణంగా లాక్డౌన్ నడుస్తున్న సమయమైనందున డాక్టర్లు అందుబాటులో లేని పరిస్థితి. అప్పుడు మేము, "జ్వరం తగ్గితే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటామ"ని బాబాను వేడుకుని అమ్మ నుదుటన ఊదీ పెట్టి, మరికొంత ఊదీ నీళ్లులో కలిపి త్రాగించాము. బాబా దయవల్ల ఉదయానికి టెంపరేచర్ తగ్గి నార్మల్ అయింది. కరోనా వైరస్ బారిన పడకుండా మమ్మల్ని, మా కుటుంబాన్ని రక్షిస్తున్న బాబాకి శతకోటి నమస్కారాలు. ఇలాగే ప్రజలందరినీ కాపాడాలని బాబాను వేడుకుంటున్నాను.


ఈమధ్య నా బంగారు ఉంగరం, చెవి బుట్ట ఒకటి  కనపడకుండా పోయి ఎంత వెతికినా దొరకలేదు. అప్పుడు నేను ఈ బ్లాగులో ఒక భక్తుని బంగారం దొరికిన అనుభవం చదివి, "బాబా! మీ అనుగ్రహంతో బంగారం దొరికితే, ఆ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. అవి దొరికిన వెంటనే ఆ అనుభవంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.


బాబా అనుగ్రహంతో మనసు మార్పు - ఆరోగ్యం


ఓం శ్రీసాయినాథాయ నమః. సాయి బంధువులకు వందనాలు. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు కృతజ్ఞతలు. నా పేరు కృష్ణవేణి. నేను ఇదివరకు బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని పంచుకున్నాను. ఇప్పుడు మరో రెండు అనుభవాలు పంచుకుంటున్నాను. మా ఆడపడుచువాళ్ళ అమ్మాయి ప్రస్తుతం డిగ్రీ చదువుతుంది. తనని మొదట ఒక టాప్ కాలేజీలో జాయిన్ చేశారు. అయితే అక్కడ ఫుడ్ బాగాలేదని, వాంతులు అవుతున్నాయని అమ్మాయి రోజూ ఏడ్చేది. కొన్నిరోజులకు దసరా సెలవులు వచ్చాయి. అప్పుడు ఇంటికి వచ్చిన అమ్మాయి, "ఇక ఏ కాలేజీకీ వెళ్లను. ఇంటి వద్దే ఉంటాను" అని గొడవ చేసింది. ఎవరు చెప్పిన వినిపించుకోలేదు. అప్పుడు నేను, "తను మనసు మార్చుకుని కాలేజీకి వెళ్తే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి చెప్పుకున్నాను. అంతలోనే తన మనసు మారి వేరే కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఒప్పుకుంది. ఇప్పుడు తను కొత్త కాలేజీలో మంచిగా ఉంది. ఇదంతా బాబా దయ. "చాలా చాలా ధన్యవాదాలు సాయి". 


ఈమధ్య మా ఇంట్లో అందరికీ వైరల్ ఫీవర్, జలుబు, దగ్గు వచ్చాయి. కరోనా కాలమైనందున నాకు చాలా భయమేసింది. అయితే బాబా దయవల్ల కోవిడ్ టెస్టు చేయించుకుంటే నార్మల్ వచ్చింది. కానీ జలుబు, దగ్గు తగ్గలేదు. పైగా ఫుడ్ తిన్న తర్వాత మా బాబుకి వాంతై వాడు బాగా డల్ అయిపోయాడు. అప్పుడు నేను "బాబా! బాబుకి జ్వరం, జలుబు, దగ్గు తగ్గితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల ఇప్పుడు బాబుకి తగ్గింది. "ధన్యవాదాలు బాబా. బాబు ఆరోగ్యం మంచిగా ఉండేలా చూడు తండ్రి. తనకి చదువు మీద ఆసక్తి ఏర్పడేలా అనుగ్రహించండి బాబా. నాడు తాత్యాను చూసుకున్నట్లు అన్నీ మీరై మా బాబుని చూసుకోండి బాబా".


ఓం సమర్ధ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కి జై!!!


బాబా దయవల్ల గట్టెక్కిన సమస్యలు


నేను ఒక సాయిభక్తురాలిని. బాబా ప్రసాదించే అనుభవాలను పంచుకునే అవకాశమిస్తూ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా ధన్యవాదాలు. నేనిప్పుడు కొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. మావారి ఉద్యోగ విషయంగా నేను బాబాని, కామాక్షి అమ్మవారిని మొక్కుకున్నాను. బాబా దయవల్ల ఆఫర్ లెటర్ గురువారంనాడు వచ్చింది. కొన్ని ఇబ్బందులు ఉన్నా మేము సమస్యనుంచి ఒడ్డునపడ్డాం అనిపించింది. 2021, నవంబరు 25న మా అత్తగారి తిథి విషయంగా పనిమనిషి దొరకదేమోనని భయపడ్డాము. ముందు ఒక అమ్మాయి వస్తానని, మళ్లీ వేరేచోట అయ్యప్ప పూజ ఉందని రానని అంది. సగం పని చేసుకున్నాక ఒక పనిమనిషి దొరికిందని మా తోడికోడలు(అక్క) చెప్పింది. అయితే ఆ పనామె గొడవ మనిషిలా ఉంది,  డబ్బు కూడా ఎక్కువ అడిగింది. కానీ మా అక్క మాట్లాడితే మేము అనుకున్న ధరకి ఒప్పుకుంది. తరువాత కూడా ఆమె నసుగుతూ ఉన్నా, పని బాగానే చేసింది. ఆ మర్నాడు కూడా ఆమె వచ్చి పనిచేస్తూ నసుగుతుంటే, "బాబా! ఆమె గొడవ చెయ్యకుండా ఇచ్చింది తీసుకెళితే నా అనుభవం  'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల ఆమె పని పూర్తిచేసి, డబ్బులు తీసుకుని వెళ్ళిపోయింది. 2021, డిసెంబరు 3న ఇంకో వ్యక్తిగతమైన సంగతి విషయంగా నా ఫోన్ నెంబర్ మార్చేటప్పుడు ఇవ్వాల్సిన కార్డ్ నెంబర్ మర్చిపోయినా మావారికి కోపం రాకపోతే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటానని అనుకున్నాను. మళ్లీ చిన్నపిల్లలా ఇదేంటి అనుకున్నాను కానీ,  బాబా దయవల్ల అంతా సవ్యంగా జరిగింది.  మరుసటిరోజు కొత్తగా కొన్న స్టవ్ వాషర్ సమస్య వల్ల లీక్ అవుతుంటే, కంపెనీ వ్యక్తికి ఫోన్ చేసి ఈ అనుభవం వ్రాస్తున్నాను. ఎందుకంటే, అది కూడా బాబా దయవల్ల పరిష్కారం అవుతుందని నాకు తెలుసు. "ధన్యవాదాలు బాబా. మీరు ఎంత జాలి చూపినా అర్థం చేసుకోని అజ్ఞానం నాది. క్షమించండి బాబా".



9 comments:

  1. Om Sai ram baba we want your blessings. please call us to శిరిడీ for your darshan and blessings. with your blessings our problem solving.om Sai ram ❤️ ❤️❤️

    ReplyDelete
  2. Om sadguru sai nadhaya namaha 🙏🙏🙏🙌🙌🙌🙌🌺🌺🌺🌺💞💞💞💞💞🌹🌹🌹🌹👏👏0m sai ram omsai ram🙏🙌🙌🙌🙌

    ReplyDelete
  3. Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness and happiness in the world of yours. Jaisairam

    ReplyDelete
  4. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  5. Omsairam om Sairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  6. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🤗🌺🥰🌹😃🌼😀🌸👪💕

    ReplyDelete
  7. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo