1. కోరుకున్నది అనుగ్రహించే బాబా
2. పెద్ద సమస్య నుండి సురక్షితంగా బయటపడేసిన బాబా3. బాబా ఆశీస్సులతో ఆరోగ్యం
కోరుకున్నది అనుగ్రహించే బాబా
ఓం శ్రీసాయినాథాయ నమః!!! సాయిబంధువులకు, 'సాయి మహారాజ్ సన్నిధి' నిర్వాహకులకు నా నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. నేను ఇంతకు ముందు ఈ బ్లాగులో పంచుకున్న నా అనుభవంలో బాబాతో, "నా సమస్యను మీకు ఇష్టమైన రీతిలో తొందరగా పరిష్కరించండి బాబా. మీ అనుగ్రహం కోసం ఎదురు చూస్తుంటాను. మీ అనుగ్రహం లభిస్తే, నా అనుభవాన్ని తోటి సాయిబంధువులతో పంచుకుంటాను" అని వేడుకున్నాను. (ఆ అనుభవం లింక్: https://saimaharajsannidhi.blogspot.com/2021/05/791.html).
నిజానికి నేను నా గత అనుభవం వ్రాసి 'సాయి మహారాజ్ సన్నిధి' నిర్వాహకులకు వాట్సప్ ద్వారా పంపించిన తరువాత 'నా అనుభవం బ్లాగులో ప్రచురితమయ్యేసరికి నా సమస్య తీరితే బాగుండు' అనుకున్నాను. అయితే అనుకోని కారణాల వల్ల నా ఫోన్ పగిలిపోయింది. 2021, జూన్ 19న నా సమస్య నాకు ఇష్టమైన రీతిలో బాబా పరిష్కరించారు. తరువాత నేను నా ఫోన్ బాగు చేయించుకుని బ్లాగు తెరిచేసరికి, నా అనుభవం 2021, మే 31న బ్లాగులో ప్రచురితమైందని తెలిసి ఎంత గొప్ప చమత్కారం చేశారో నా బాబా అని అనుకున్నాను. ఎందుకంటే, నా సాయి నేను కోరుకున్నట్లే నా అనుభవాన్ని ఈ బ్లాగులో నేను చదువుకునేసరికి నా సమస్యను పరిష్కరించారు. సంతోషంగా బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాను.
తరువాత కొన్నిరోజులకి నాకు, మావారికి, మా అత్తగారికి మధ్య గొడవలు మొదలయ్యాయి. మొదట్లో మావారు నన్ను బాగానే చూసుకునేవారు. కానీ రానురానూ మా మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దానికి తోడు మా అత్తగారితో గొడవల వల్ల మేము మరింత గొడవపడి నేను మా పుట్టింటికి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది. అది కూడా నా బాబా అనుగ్రహమని చెప్పాలి. అలా ఎందుకు అంటున్నానంటే, అత్తవారి ఇంటికి వచ్చాక మా పుట్టింటికి దూరమయ్యాననే బాధ నాకు ఎక్కువగా ఉండేది. అందుచేత, "ఎలాగైనా మా అమ్మానాన్నలతో కలపండి దేవా!" అని రోజూ కన్నీళ్ళతో బాబాకి మొరపెట్టుకునేదాన్ని. దానికి గొడవల నెపంతో నన్ను మా పుట్టింటికి పంపి అక్కడ ఒక ఇరవై రోజులు ఉండేలా చేశారు బాబా. ఆపై నన్ను, మావారిని ఒకటి చేసి, వేరే కాపురం పెట్టుకునేలా అనుగ్రహించి నా సమస్యను పరిష్కరించారు బాబా. ఇప్పటికీ నాకు, మావారికి మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతున్నప్పటికీ మునపటిలా కాకుండా అదేరోజు ఇద్దరిలో ఎవరో ఒకరం సర్దుకుపోతున్నాము. ఇంకో విషయం, "నా సమస్యల పరిష్కారమే పుట్టింటి నుంచి నాకు మంగళసూత్రాలు వస్తే, బ్లాగులో పంచుకుంటాన"ని బాబాతో నేను చెప్పుకున్నాను. నేను కోరుకున్నట్లే పుట్టింటి నుండి మంగళసూత్రాలు వచ్చేలా అనుగ్రహించారు బాబా. "ధన్యవాదాలు బాబా. జన్మజన్మలకి నేను మీకు ఋణపడి ఉంటాను".
ఒకసారి నేను చేస్తున్న పి.హెచ్.డి రివ్యూ విషయంలో సమస్య వచ్చింది. అప్పుడు నేను, "బాబా! నా పి.హెచ్.డి రివ్యూ సమస్యను పరిష్కరిస్తే బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. అంతే, ఎప్పుడూ వర్క్ విషయంలో నన్ను తిట్టే మా మేడమ్ ఒక్క మాటైనా అనకుండా రివ్యూ అయ్యేలా సహాయం చేశారు. "ధన్యవాదాలు బాబా. నాకు, మావారికి, అత్తగారికి మధ్య ఉన్న గొడవల కారణంగా నేను నా చదువుపై ఏకాగ్రత పెట్టలేకపోతున్నాను తండ్రి. దయచేసి పి.హెచ్.డి విషయంలో మీరే నాకు మార్గనిర్దేశం చేసి పి.హెచ్.డి డిగ్రీ ప్రసాదించి ఆ అనుభవాన్ని కూడా బ్లాగు ద్వారా సాయిబంధువులందరితో పంచుకునేలా అనుగ్రహించండి బాబా. అలాగే నాకు ఒక ప్రభుత్వోద్యోగాన్ని అనుగ్రహించి, మాకున్న ఆర్ధిక సమస్యలు తొలగించండి. ఇంకా ఇక నుండైనా నాకు, మా వారికి మధ్య ఉన్న గొడవలు తగ్గి ఒకరికొకరం అన్యోన్యంగా ఉండేలా చూసి, మంచి సంతోషకరమైన రోజలు ప్రసాదించండి బాబా. రోజురోజుకి జీవితంపై విసుగు వస్తుంది. నాలో ఉన్న పాజిటివ్ ఆశలు పోతున్నాయి. దయచేసి నా జీవితాన్ని పట్టించుకోండి బాబా. మీరు తప్ప నాకు దిక్కు ఎవరూ లేరు బాబా. ఇంకా పరీక్షించక కరుణించి నాకు మనఃశాంతినివ్వండి. చివరిగా మాకు పుత్ర సంతానాన్ని ప్రసాదించండి బాబా".
నా పి.హెచ్.డి కోసం నేను, మావారు తిరుపతిలో ఉన్న యూనివర్సిటీకి వెళ్లి, తిరిగి ఇంటికి వచ్చేసరికి మావారికి చాలా తీవ్రంగా జలుబు చేసింది. మరుసటి రోజుకి జ్వరం వచ్చింది, వాసన కూడా కోల్పోయారు. దాంతో కరోనా ఏమోనని నాకు చాలా భయమేసి, "బాబా! నాకు, మా వారికి కరోనా రాకూడదు. తొందరగా ఆరోగ్యవంతుల్ని చేయండి. మీ దయవలన మేము ఆరోగ్యంగా ఉంటే బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. రెండు రోజుల్లో మావారికి జ్వరం, జలుబు తగ్గి, వాసన కూడా తెలిసేలా అనుగ్రహించారు బాబా. "ధన్యవాదాలు బాబా".
కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ వేయించుకున్నాక మా అమ్మ జ్వరంతో రెండురోజులు చాలా బాధపడింది. అప్పుడు నేను, "అమ్మకు జ్వరం తగ్గితే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకోగానే అమ్మకి జ్వరం తగ్గి ఆరోగ్యం చేకూరేలా చేశారు నా బాబా. "కృతజ్ఞతలు బాబా. నాన్న కూడా నీరసంగా ఉంటున్నారు. వారిద్దరికీ చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించి, సంతోషంగా ఉండేలా చూడండి బాబా. నేను అమ్మ, నాన్నని ఎంతగానో బాధపెట్టాను, దయచేసి నన్ను క్షమించండి. నావల్ల నా తల్లిదండ్రులకి చెడ్డపేరు రాకుండా చూడండి బాబా. అలాగే నన్ను చూసి వాళ్ళు సంతోషంతో గర్వపడేలా చేయండి బాబా".
ఒకసారి నా బ్రేస్లెట్ కనిపించకపోతే, "బాబా! బ్రేస్లెట్ దొరికితే బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. ఐదు నిమిషాల్లో బ్రేస్లెట్‍ను చూపించారు బాబా. "బాబా! ఇప్పటివరకు నేను అడిగిన ప్రతి దానిని మీరు నాకు ఇచ్చారు. నేను కోరుకున్నదేదీ మీరు ఇవ్వకుండా లేరు. అంతలా మీరు నా మొరలాలకించి సమస్యలను పరిష్కరిస్తున్నా నేను నాకున్న బద్ధకం వల్ల బ్లాగులో పంచుకోవడం ఆలస్యం చేస్తున్నాను. నా ప్రవర్తనతో మిమ్మల్ని బాధపెడుతున్నాను, నన్ను క్షమించండి. నన్ను ఎప్పటికీ మీ పాదాల నుండి దూరం చేయక మీ పాదాల వద్దే సేద తీరనివ్వండి బాబా. నేను అప్పుడప్పుడు మీపై అలిగినా నన్ను దూరం పెట్టొద్దు బాబా. నాలో ఇంకా భక్తిని, సహనాన్ని పెంచండి బాబా. చివరిగా ఏవైనా మ్రొక్కుకుని మర్చిపోతే నన్ను క్షమించండి బాబా. లవ్ యు బాబా".
పెద్ద సమస్య నుండి సురక్షితంగా బయటపడేసిన బాబా
నా పేరు మురళీమోహన్. ఈ బ్లాగు ద్వారా బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని సాటి సాయిభక్తులతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. ఈ మధ్యకాలంలో నేను చేస్తున్న ఉద్యోగంలో జరిగిన ఒక పొరపాటు వల్ల నేను పెద్ద సమస్యలో పడ్డాను. వెంటనే నేను, "బాబా! నేను ఈ సమస్య నుండి బయటపడితే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. తరువాత నేను టెన్షన్‌లో ఉండగా, "నేను ఉండగా భయమెందుకు? నువ్వు నిశ్చింతగా ఉండు. అవసరమైంది నేను చేస్తాను. నిన్ను చివరికంటా గమ్యం చేరుస్తాను" అన్న బాబా సందేశం నా కంటపడింది. దాన్ని చూశాక నాకు చాలా ఉపశమనం కలిగింది. తరువాత కొన్నిరోజులకి ఆ సమస్య పూర్తిగా పరిష్కారమైంది. బాబా దయవల్లే నేను పెద్ద సమస్య నుండి సురక్షితంగా బయటపడ్డాను. ఆ సాయితండ్రికి నా శతకోటి వందనాలు.
శిరిడీవాసాయ విద్మహే సచ్చిదానందయ ధీమహి తన్నో సాయి ప్రచోదయాత్!!!
బాబా ఆశీస్సులతో ఆరోగ్యం
Om Sai ram all Sai Leelas are great.when Sai is with us no problems are there to devotees.we are facing many problems due to corona.please in this new year you remove virus from world.make people happy.you have that power tandri.sata koti namaskars to you
ReplyDeleteToday my experience printed thank you Sai.I felt happy sai
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram
ReplyDeleteOm sai ram om sai ram om sai ram om sai ram om sai ram
ReplyDeleteJaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness and happiness in the world of yours.jaisairam
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sai nathaya namha
ReplyDeleteOm sai ram baba kapadu thandri
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🤗🌹🥰🌼😃🌸😀🌺👪💕
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete