సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1006వ భాగం....


బాబా అనుగ్రహం అందరిపై వర్షించాలని, వారి స్మరణలో మన అందరి జీవితాలు సదా సంతోషదాయకంగా ఉండాలని మనసారా కోరుకుంటూ... అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఈ భాగంలో అనుభవం:
  • నమ్మకంతో బాబాపై ఆధారపడటమే ఏకైక సాధన

సాయి కుటుంబసభ్యులందరికీ నమస్కారం. బాబాకి నేను ఒక చిన్న భక్తురాలిని. నేను మన బాబా బ్లాగులో భక్తులు పంచుకుంటున్న అనుభవాల ద్వారా తెలియని విషయాలు ఎన్నో నేర్చుకుంటున్నాను. కొంతమంది అనుభవాలు చదివితే, 'శరణాగతి చెందటం ఎలాగో' తెలుస్తోంది. మరికొంతమంది అద్భుత అనుభవాల ద్వారా 'అసాధ్యాలను బాబా ఎలా అవలీలగా సుసాధ్యం చేస్తారో కదా!' అని సంభ్రమం కలుగుతుంది, "నా లీలలు శ్రవణం చేస్తే, జ్ఞానరత్నాలు లభిస్తాయి" అని బాబా చెప్పిన విషయం స్ఫురణకు వస్తుంది. ఇంకొంతమంది అనుభవాల ద్వారా 'బాబాపై భక్తి, ప్రేమలను ఎలా వృద్ధి పరుచుకోవాలో, సహనాన్ని ఎలా పెంపొందించుకోవాలో' తెలుస్తున్నాయి. అధైర్యంగా ఉన్న సమయాల్లో కొన్ని అనుభవాలు చదివినప్పుడు 'మనకు బాబా ఉన్నారు, ఏదో ఒకరోజు తప్పక మన కష్టాలు తీరుస్తారనే' భరోసా వస్తుంది. 'సాయితల్లే గనక సదా మనల్ని కనిపెట్టుకుని ఉండకపోతే, జీవితం ఎంతటి అగాధంలో పడిపోయేదో' అని చాలామంది భక్తులు వెలిబుచ్చే అనుభవపూర్వక అభిప్రాయం అక్షర సత్యం. మనందరం ఆ తల్లి బిడ్డలం అవటం ఎన్నో జన్మల సుకృతం. బాబా ఋణం తీర్చుకోలేనిది, ఎప్పటికీ తీరనిది. మోక్ష పర్యంతం ఆయనతో ఋణానుబంధం కలిగి ఉండే అదృష్టం సాయితల్లి మనకు అనుగ్రహించాలి. ఇక నా అనుభవాల విషయానికి వస్తే....


కొంతకాలం క్రిందట మేము ఒక భూమి తీసుకున్నాము. ఆ భూమి విషయంలో ఒక చిన్న గొడవ ఉందని ముందుగా తెలిసినప్పటికీ, అది మేనేజ్ చేసేంత చిన్నదిగా పైకి కనిపించటంతో మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. కానీ నెమ్మదిగా సమస్యలు మొదలై రానురానూ మాకు పగలే చుక్కలు కనపడేంత పరిస్థితులు పుట్టుకొచ్చాయి. ఆ భూమి యజమాని బంధువులు, లోకల్ లీడర్లు కొన్ని సంవత్సరాలుగా ఆ ల్యాండ్ మీద కన్నేసి ఎప్పటికైనా, ఎలాగైనా ఆ భూమిని ఉత్తపుణ్యానికే తమ సొంతం చేసుకోవాలని మానసికంగా ఫిక్స్ అయిపోయారు. ఒకరు సరిహద్దు సరిగ్గా లేదని తిరకాసు పెడితే, ఇంకొకరు అది మా గ్రామమని, మరొకరు పర్మిషన్ అని, ఇలా ఒకటని కాదు ఎన్ని రకాలుగా వేధించవచ్చో అన్ని రకాలుగా వేధింపులు, బెదిరింపులు మాకు వాళ్ల నుండి ఎదురయ్యాయి. ఇవన్నీ మాకు డైలీ సీరియల్ లాగా రోజుకో కొత్త ట్విస్ట్ తో టెన్షన్ పెట్టేవి. చివరికి పోలీస్ కంప్లైంట్, కోర్టులో కేసు దాకా వెళ్ళింది పరిస్థితి. దానికి తోడు ప్రభుత్వం రోజుకో కొత్త రూల్ అన్నట్లు జీవోలు ఇవ్వటం వల్ల మా పరిస్థితి ఇంకా టెన్షన్‍గా తయారైంది. ఒకవైపు కరోనా కారణంగా కూర్చుని తింటుంటే, మరోవైపు అన్ని పర్మిషన్స్ ఉన్నా ఒక్క గజం భూమి అయిన అమ్మలేక, పెట్టిన పెట్టుబడి ఇరుక్కుపోయి సంవత్సరంన్నరపాటు మేము చాలా మానసిక వేదన అనుభవించాము. అన్ని కష్టాలలోనూ బాబానే మా ధైర్యం. మేము పై సమస్యలలో నలిగిపోతున్నప్పుడు ఒకసారి మన ఈ బ్లాగులో నేను ఒక భక్తుని అనుభవం చదివాను. ఆ అనుభవంలో అతను తన తోడల్లుడు ద్వారా ఒక భూమిని కొనడం, తీరా అతను ఆ భూమిని అమ్మాలనుకున్నప్పుడు ముందు ఒకేచోట ఏకచెక్కగా చూపించిన భూమిని తర్వాత అక్కడో ముక్క, ఇక్కడో ముక్కగా అతని తోడల్లుడు చూపించటమే కాకుండా, అది హరిజనుల భూమి అని వాళ్ళని అతని మీదకి ఉసిగొలుపుతాడు. అంతవరకూ చదివాక నాకు 'అతను ఆ భూమిని అమ్మటం అసాధ్యం, దుర్లభం' అనిపించింది. కానీ బాబా దయవలన అతని భూమి అమ్మకం జరిగింది. ఆ అనుభవం చదివిన నా మనసుకి, "త్వరలో మీ సమస్యను కూడా ఇలాగే పరిష్కరిస్తాను" అని బాబా సందేశమిస్తున్నట్లు అనిపించింది. దాంతో అంత క్లిష్టమైన వాళ్ళ సమస్యను పరిష్కరించినట్టే మా సమస్యను కూడా బాబా తప్పకుండా పరిష్కరిస్తారని నమ్మకం కుదిరి ఇంకా ఎక్కువ విశ్వాసంతో బాబాను ప్రార్థించాను. అనేక మలుపులు తిరిగి, పెద్ద మొత్తంలో ఖర్చు అయినప్పటికీ చివరకు ఒక గురువారం రోజు బాబా దయవలన మా సమస్య పరిష్కారమైంది. నిజం చెప్పాలంటే నాకు ఇప్పటికీ అదంతా ఒక కలలా అనిపిస్తుంది. అలజడి సృష్టించేది, రక్షణనిచ్చేది బాబానే. నమ్మకంతో బాబాపై ఆధారపడటమే మనం చేయవలసిన ఏకైక సాధన. "థాంక్యూ బాబా. ఈ అనుభవాన్ని ఆలస్యంగా పంచుకున్నందుకు నన్ను క్షమించండి బాబా". 


ఇంకో అనుభవం: మా అమ్మాయి విదేశాల్లో చదువుకోసం 'ielts' పరీక్షకి ప్రిపేర్ అవుతుంది. అందులో భాగంగా తను ఆ పరీక్ష వ్రాసేందుకు టైం స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉండగా రెండు, మూడు తేదీలు అనుకుని ఏ తేదీన పరీక్ష వ్రాయాలో బాబా దగ్గర చీటీలు వేస్తే, ఒక తేదీ వచ్చింది. బాబా ఆదేశానుసారం ఆరోజుకి టైం స్లాట్ బుక్ చేసుకోవాలని ప్రయత్నిస్తే, ఆ రోజుకి స్లాట్స్ మొత్తం బుక్ అయినట్లు, అంతేకాక జనవరిదాకా స్లాట్ బుకింగ్ లేవని చూపించింది. అప్పుడు నేను, "బాబా! స్లాట్ బుక్ అయితే, ఈ అనుభవాన్ని మన బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. తర్వాత మా అమ్మాయితో, "బాబాకి చెప్పుకున్నాక జరగకుండా ఉండటం అసాధ్యం. కాబట్టి రేపు మళ్ళీ ప్రయత్నించు" అని చెప్పాను. అధ్భుతం! ముందురోజు కనబడని వేకెన్సీ ఆరోజు కనిపించడంతో మా అమ్మాయి సంతోషంగా స్లాట్ బుక్ చేసుకుంది. "ధన్యవాదాలు బాబా. మా జీవితంలో జరిగే ప్రతీదీ మీ అనుగ్రహమే. ఇలాగే ప్రతీక్షణం మమ్మల్ని కాపాడండి బాబా. మీకు మాటిచ్చిన ప్రకారం నా అనుభవం పంచుకున్నాను".


ఇప్పుడు చెప్పబోయేదాన్ని అనుభవం అనటం కన్నా మొదట్లో చెప్పినట్లు భక్తుల అనుభవాలు చదవటం వల్ల మన భక్తిలో వచ్చే మార్పు లేదా పరిణితి అనుకోవచ్చు. కొంతమంది మనస్తత్వం విచిత్రంగా ఉంటుంది. మా పక్కింట్లో అద్దెకు ఉండేవాళ్ళ మనస్తత్వం అటువంటిదే. ఆవిడ రోజూ ఉదయం వాళ్ళ ఇంటిముందు చెత్తను ఊడిచి మా ఇంటిముందు పెడుతుండేది. కొన్ని నెలలు చూసి చూసి చివరికి విసుగొచ్చి ఆమెతో, "అలా చేయకండి" అని మంచిగా మర్యాదపూర్వకంగా చెప్పాను. కొన్ని రోజులు బాగానే గడిచింది. తరువాత మళ్ళీ మునపటిలాగే ఆవిడ చేస్తుంటే, మళ్ళీ మంచిగా చెప్పాను. కానీ ఆవిడ తన పద్దతి మార్చుకోలేదు. ఇక లాభం లేదని ఆ ఇంటి యజమానికి చెప్పాను. అతను వాళ్ళతో చెప్తానండి అన్నారు. కానీ షరా మామూలే. ఈసారి ఆ ఇంటి యజమాని భార్యకి చెప్పాను. అయినా ప్రయోజనం లేకపోయింది. అలా సంవత్సరాలు గడిచాయి. చివరకు బాబాతో, "బాబా! నాకు అలా ఇంటిముందు చెత్త చూస్తుంటే చెడ్డ చిరాగ్గా ఉంది. నా ప్రయత్నం చేసాను. కానీ వాళ్లలో మార్పులేదు. అందరిలో ఉండేది మీరే అంటారు కదా! ఇక మీదే భారం, మీరే వాళ్ళ మనసు మార్చి వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేయండి" అని చెప్పుకున్నాను. ఆశ్చర్యం! మరుసటిరోజు నుంచి వాళ్ళు మా ఇంటిముందు చెత్త పెట్టడం ఆపేసారు. కొన్ని విషయాలు వినటానికి, చూడటానికి సిల్లీగా ఉంటాయి, అనుభవించేవాళ్ళకే దాంట్లో బాధ తెలుస్తుంది. గేటు ముందు చెత్తను చూస్తే, నాకు ఎంత చిరాగ్గా ఉండేదో నేను మాటల్లో చెప్పలేను. మంచిగా చెప్తే వాళ్ళ చెవికెక్కేది కాదు. అలాగని చిల్లర వాళ్ళలా గొడవ పడనూలేము. అందుకే భారం పూర్తిగా బాబాపై వేస్తే, ఆయన అంతా సరిచేశారు. "థాంక్యూ బాబా. మీకు మాటిచ్చినట్టు ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకున్నాను. కానీ చాలా ఆలస్యమైనందుకు క్షమించండి. మేము మిమ్మల్ని మరిచినా, మీరు మమ్మల్ని మరవరు సాయీశ్వరా! మీరు మాకు ఇచ్చిన ప్రతీదానికి ధన్యవాదాలు".



11 comments:

  1. With your blessings new year we are celebrateing with joy. Please remove corona from wrold. To stay happier and safe. You only can do it. That is your power. ❤❤❤

    ReplyDelete
  2. Jaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours. Jaisairam

    ReplyDelete
  3. Om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram

    ReplyDelete
  4. థాంక్యూ సాయి థాంక్యూ సాయి శరణం నాకు కూడా మంచి అనుభవం ఎన్నో ఇచ్చావు అనారోగ్యాన్ని నయం చేసి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించారు.. థాంక్యూ తండ్రి థాంక్యూ థాంక్యూ సాయి శ్వర

    ReplyDelete
  5. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😃❤😊🌺🤗🌹🥰💕😀🌸🌼👪❤💕

    ReplyDelete
  6. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  7. Jaisairam
    Plese help my daughter to recover from fever and save her. Jaisairam

    ReplyDelete
  8. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI.. OM SAI RAM

    ReplyDelete
  9. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊🌺😃🌹🤗🌼🥰🌸😀💕👪❤

    ReplyDelete
  10. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo