1. ఆటంకాలు లేకుండా చేయడమేకాక, గృహప్రవేశానికి విచ్చేసిన బాబా
2. ఊదీ మహిమలు
3. కోరుకున్నట్లు ధ్యానానికి అవసరమైన ప్రశాంతతనిచ్చిన బాబా
ఆటంకాలు లేకుండా చేయడమేకాక, గృహప్రవేశానికి విచ్చేసిన బాబా
అందరికీ నమస్కారం. నా పేరు అంజలి. నేను ఇంతకుముందు చాలా అనుభవాలు ఈ బ్లాగులో పంచుకున్నాను. బాబా ప్రేమను ఇంకా ఇంకా మీతో పంచుకునేందుకు బాబా నాకు చాలా అనుభవాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఇటీవల ఆయన ప్రసాదించిన ఒక అనుభవాన్ని ఇప్పుడు పంచుకుంటున్నాను. కొంచెం ఆలస్యమైనందుకు ముందుగా బాబాకు క్షమాపణ చెప్పుకుంటున్నాను. బాబా దయవల్ల మేము ఈమధ్య గుంటూరులోని ఒక అపార్టుమెంటులో ఒక ఫ్లాట్ తీసుకున్నాము. దాన్ని బాబానే ఇప్పించారు. ఆ ఇంటి గృహప్రవేశం 2021, నవంబర్ 20న పెట్టుకొని, "ఎలాంటి ఇబ్బందులు లేకుండా గృహప్రవేశం మంచిగా జరగాల"ని బాబాని వేడుకొని భారం ఆయన మీద వేసాను. 2021, నవంబరు 17న మేము ఉంటున్న నల్గొండ నుండి గుంటూరుకు బయలుదేరాము. ఆలస్యమై ఆ రాత్రికి విజయవాడలోని బంధువుల ఇంట్లో ఉండిపోయాము. నిజానికి నాకు నెలసరి నవంబరు ఒకటినే వచ్చింది. కానీ ఆ రాత్రి నాకు మళ్ళీ నెలసరి వచ్చినట్లు కనిపించింది. దాంతో నాకు చాలా ఆందోళనగా అనిపించి, 'కార్యక్రమం నా వల్ల అగిపోతుందా?' అని చాలా భయం వేసింది. నాకు ఏ కష్టం వచ్చినా గుర్తు వచ్చేది బాబానే. వెంటనే ఆయనను తలుచుకుని, "బాబా! నెలసరి ఆగిపోయేలా అనుగ్రహించి, ఎటువంటి ఇబ్బందీ లేకుండా గృహప్రవేశం జరిపించండి. నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకుని భారం ఆయన మీద వేసాను. ఆయన దయవవలన బుధ, గురు వారాల్లో కనపడిన నెలసరి శుక్ర, శని వారాల్లో అస్సలు కనపడలేదు, పూర్తిగా ఆగిపోయింది. ఇక బాబా అనుగ్రహంతో ఎటువంటి ఆటంకం లేకుండా గృహప్రవేశం చాలా బాగా జరిపించాము. ఆరోజు బాగా వర్షం పడుతున్నప్పటికీ బాబా దయవల్ల దూర ప్రాంతాల నుండి సైతం మేము ఆహ్వానించిన అందరూ వచ్చారు. ఇంకా అతిథులందరికీ ఏ లోటూ లేకుండా ఆహారపదార్థాలు సరిపోయాయి. ఈవిధంగా బాబా దయవల్లే అంత వర్షంలోనూ గృహప్రవేశం చాలా బాగా జరిగింది.
ఇప్పుడు అతి ముఖ్యమైన అనుభవం చెప్తాను. మా ఫ్రెండ్ ఒకామె నాకు ఫోన్ చేసి, "నీకు బాబా అంటే ఇష్టం కదా! నీకోసం ఒక బాబా విగ్రహం కానుకగా ఇస్తాను" అంది. అందుకు నేను, "వద్దు, నా వద్ద పంచలోహ బాబా విగ్రహం ఉంది. దానికే నేను పూజ చేస్తాను" అని అన్నాను. కానీ మనసులో ఇలా అనుకున్నాను: "బాబా! నేను అడిగి పిలిపించుకోవడం కాదు. మీరే మా ఇంటికి రావాలి" అని. నేను చెప్పినందువల్ల మా ఫ్రెండ్ గృహప్రవేశానికి వచ్చినప్పుడు వేరే గిఫ్ట్ తెచ్చింది. ఇంకో ఫ్రెండ్ వాళ్ల తమ్ముడు వెండి బాబా విగ్రహం తెచ్చి నాకు ఇచ్చాడు. అది చూసి బాబా వచ్చారని నాకు చాలా సంతోషం వేసింది. ఇది బాబాకు మన మీద ఉండే ప్రేమ. ఆయన మన ప్రతి చిన్న కోరికను నెరవేరుస్తారు.
గృహప్రవేశం పూర్తయ్యాక మేము క్షేమంగా నల్గొండ చేరుకోవాలని, అలాగే మా కుటుంబసభ్యులందరికీ, విచ్చేసిన అతిథులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చూడమని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల అందరమూ క్షేమంగా ఉన్నాము. అయినా నా తండ్రి బాబా ఉండగా నాకు భయమెందుకు? అంతా ఆయన చూసుకుంటారు. ఆ సాయినాథునికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటూ... వారి అనుగ్రహం మన అందరి మీద ఇలాగే ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
ఊదీ మహిమలు
సాయిబంధువులకు నా నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా కృతజ్ఞతలు. నేను ఒక సాయిభక్తురాలిని. ఇటీవల నేను వ్యాక్సిన్ వేయించుకున్నాను. తరువాత నాకు చాలా తలనొప్పి వచ్చి మరుసటిరోజు ఉదయానికి మరింత ఎక్కువ అయ్యింది. దాంతో నాకు చాలా భయం వేసింది. ఆ రోజు రాత్రికి కూడా నొప్పి అలానే ఉంటే నేను నిద్రపోయే ముందు నా తలకి ఊదీ రాసుకుని, "బాబా! ఉదయానికల్లా తలనొప్పి తగ్గేలా చేయి తండ్రి. అలా అయితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. బాబా చేసిన మిరాకిల్ వల్ల ఏ టాబ్లెట్ వేసుకోకుండానే ఉదయానికి తలనొప్పి తగ్గిపోయింది. "థాంక్యూ సో మచ్ బాబా".
మరొక రోజు రాత్రి నాకు విపరీతమైన దగ్గు వచ్చింది. ఆ దగ్గు వల్ల ఊపిరితిత్తుల్లో చాలా నొప్పి కూడా వచ్చింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల కారణంగా నాకు చాలా భయమేసి నొప్పి ఉన్న చోట ఊదీ రాసుకుని, "బాబా! దగ్గు, ఊపిరితిత్తుల్లో నొప్పి తగ్గేలా అనుగ్రహించండి. అలా జరిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకుని పడుకున్నాను. ఊదీ మహిమ వల్ల ఉదయానికి దగ్గు పూర్తిగా తగ్గిపోయింది. "థాంక్యూ సో మచ్ బాబా".
కోరుకున్నట్లు ధ్యానానికి అవసరమైన ప్రశాంతతనిచ్చిన బాబా
ముందుగా సాయికి, ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా ధన్యవాదాలు. నేను ఒక సాయిభక్తురాలిని. మాది విజయవాడ దగ్గర ఒక పల్లెటూరు. బాబాతో నాకు చాలా అనుభవాలున్నాయి. నిజంగా బాబా దైవమన్న అనుభవాలు ఒకటి, రెండు కాదు చాలా ఇచ్చారు. కానీ బాబా వేటినైతే పంచుకునేందుకు అనుమతినిచ్చారో వాటినే పంచుకుంటున్నాను. ఇది నా ఐదవ అనుభవం. నాకు ఎప్పటినుంచో ఆరోగ్య సమస్యలున్నాయి. అయితే ఆరోగ్య సమస్యలనేవి మన గతజన్మల పాపకర్మల వలన వస్తాయని బాబా నాకు ఇదివరకే అవగాహన కల్పించారు. అందువల్ల నేను ఆయన నాకెప్పుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారోనని వేచి చూస్తున్నాను. కానీ 2021, నవంబరు 28న నా ఆరోగ్య సమస్యల పట్ల నేను చాలా నీరసించిపోయాను. ఆ కారణంగా నేను ధ్యానానికి(ధ్యానానికి బాబా ఎలా సహాయం చేశారో నేను ఇదివరకటి నా అనుభవంలో పంచుకున్నాను) కూడా కూర్చోలేకపోయాను. అందువలన నాకు చాలా బాధగా అనిపించి, "బాబా! నాకు ధ్యానం అస్సలు కుదరట్లేదు. విపరీతమైన ఆలోచనలతో చాలా చిరాకుగా ఉంది. దానికి తోడు నీరసం ఒకటి. ఎలా అయినా రేపు ఉదయానికి నా స్థితి కాస్త మెరుగయ్యేలా చూడండి. అలా అయితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. మరుసటిరోజు ఉదయానికి బాబా నాకు చాలా ప్రశాంతతనిచ్చారు. మునపటి కంటే మెరుగ్గా ధ్యానం చేసుకోగలిగాను. "థాంక్యూ బాబా. మీ ఆశీస్సులు ఎప్పుడూ నాకు ఉండాలి. మీ అనుగ్రహం వల్ల నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలి".
Om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm sai ram with your blessings we are fine in this pandamic. Sai you us to come to Siridi to have darshan. Make every thing arranged perfectly. Om sai ram❤❤❤
ReplyDeleteJaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness and happiness in the world of yours. Jaisairam
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOm sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha pleaseeee
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🤗🌹😀🌼🥰🌸😃🌺👪💕
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI....OM SAI RAM
ReplyDelete