సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1023వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అడుగడుగునా మాతో ఉన్న బాబా
2. సాయి ద్వారా పొందిన సహాయాలు

అడుగడుగునా మాతో ఉన్న బాబా

సాయిబంధువులకు నమస్కారం. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి చాలా కృతజ్ఞతలు. నేను ఒక సాయిభక్తురాలిని. బ్లాగులోని భక్తుల అనుభవాలు చదవుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. నేను కూడా ఇదివరకు నా అనుభవాలు కొన్ని బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవం పంచుకుంటున్నాను. 2021, మే నెలలో మా అమ్మానాన్నలకు కరోనా వచ్చి, బాబా దయవల్ల తగ్గింది. తర్వాత ఆగష్టులో నాన్న కరోనా వ్యాక్సిన్ రెండో డోస్‍ వేయించుకున్నారు. సరిగ్గా పదిరోజులకి నేను అమ్మతో ఫోన్‍లో మాట్లాడుతుండగా నాన్న 'నొప్పి' అన్నారు. హాస్పిటల్‍కి తీసుకెళితే, 'గ్యాస్' అని మందులిచ్చి పంపారు. అయితే అదేరోజు సాయంత్రం ఇంకా ఎక్కువ నొప్పి రావడంతో వెంటనే నాన్నను అత్యవసరంగా భీమవరంలోని వర్మ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అక్కడ ఆయనకు యాంజియోగ్రామ్ చేసి, "హార్టులో బ్లాకులున్నాయి. వెంటనే సర్జరీ చేయాలి" అన్నారు. అయితే వర్మ హాస్పిటల్ అంటేనే బాగా డబ్బులు ఖర్చు పెట్టేంచేవరకు రోగుల ఆరోగ్య విషయంలో ఏ గ్యారెంటీ ఇవ్వరని బాగా టెన్షన్ పడ్డాం. వెంటనే మేము దుబాయ్ నుండి బయలుదేరి ఇండియాకి వచ్చేసాము. వచ్చేముందు బాబాకి దణ్ణం పెట్టుకుని ఒకటే మొరపెట్టుకున్నాను, "అంతా బాగుండి, నేను సంతోషంగా తిరిగి దుబాయ్ చేరుకోవాలి" అని. తరువాత మా అన్నయ్య వర్మ హాస్పిటల్లో నాన్నని హైదరాబాద్ తీసుకెళ్తామని చెప్పి అక్కడినుండి బయటకు తీసుకొచ్చాడు. అంతలో రాజమండ్రి, బోలినేనిలో బాగా చూస్తారంటే, అక్కడికి తీసుకెళ్లాం. ఆ వ్యవధిలో నాన్న ఆరోగ్యం చాలా ఒడిదుడుకులకు గురైంది. కానీ బాబా వాటినుండి నాన్నను కాపాడారు. అడుగడుగునా బాబా మాతో ఉన్నారు అనడానికి ఇదొక నిదర్శనం.

తరువాత నాన్నకు రేపు ఉదయం ఆపరేషన్ చేస్తారనగా ఆరోజు సాయంత్రం మా అమ్మ, నేను, మా ఆడపడుచు మా ఇంటిదగ్గరలో ఉన్న సాయి మాత (పాత సోమాలమ్మ టెంపుల్) గుడికి వెళ్ళాము. ఆ గుడి బయట ఒక అవు కనిపిస్తే, మా అమ్మ దణ్ణం పెట్టుకుంది. గుడిలోకి వెళ్ళాక నేను సాయి మాత దర్శనం చేసుకుని, అక్కడ కూర్చుని లలితా సహస్రనామం చదివి, దర్శనానంతరం బయటకు వచ్చేముందు మా అమ్మ అక్కడున్న ఆవుల శాలలోకి వెళ్లి దణ్ణం పెట్టుకుంటానంటే, "వద్దు ఎర్ర చీరతో ఉన్నావు. అవి పొడుస్తాయేమో!" అని బయటకి తీసుకుని వచ్చేసాను. తరువాత మేము హాస్పిటల్‍కి బయలుదేరే సమయానికి మా ఇంటి ముందు గోమాత చక్కగా కూర్చుని కనిపించింది. దాని మొహానికి నిండుగా బొట్టు పెట్టి ఉంది. నేను మా అమ్మతో, "ఇదిగో సాయి మాత మనకి ఎదురు వచ్చారు. ఎంత మంచి శకునమో! వెళ్లి దణ్ణం పెట్టుకో" అని అన్నాను. 'హాస్పిటల్‍కి వెళ్లేముందు ఆవు ఎదురైంది, అంతా మంచి జరుగుతుంద'ని అమ్మ, నేను చాలా ఆనందపడ్డాము. అనుకున్నట్లే ఆపరేషన్ విజయవంతమైంది. తరువాత నాన్న డిశ్చార్జ్ అయ్యే సమయానికి ఏదో కారణంగా ఆరోగ్యశ్రీ మెషిన్ పని చేయలేదు. అయినా నాన్న ఈరోజే వెళ్ళిపోవాలి అని అన్నారు. ఆయన ఉన్న గదిలో ఆయనకి పీడ కలలు కూడా వస్తున్నందున మేము కూడా భయపడి తీసుకెళ్ళిపోదామనుకుని హాస్పిటల్ స్టాఫ్ అందరితో బాగా పరిచయమున్న మా ఆడపడుచు భర్తతో చెప్పాము. ఆయన రూపంలో బాబాయే మమ్మల్ని నడిపించారు. వాళ్ల మేలు మేము మర్చిపోలేము.

మా ఆడపడుచు భర్త, నేను కలిసి నాన్నని తీసుకెళ్ళిపోతామని అడిగాము. అందుకు వాళ్ళు సరే అన్నారు. అంతా బాబా దయ. నాన్నని తీసుకెళ్ళడానికి అనుమతించిన వెంటనే నేను రూమ్‍కి వెళ్లి, నాన్నని కిందకి తీసుకుని వచ్చేసాను. తీరా కిందకి వచ్చాక నాన్న షుగర్‍కి ఇన్సులిన్ ఎంత ఇవ్వాలి అని నాకు అనుమానం వచ్చి నాన్నని అక్కడే కూర్చోబెట్టి, నేను పైకి వెళ్లాను. అంతలో మా అమ్మ నాన్నకి దేవుడి కుంకుమ పెడుతుండగా ఒక్కసారిగా నాన్న చేతులు వంకరపోయి, కనుగుడ్లు పైకి పెట్టేశారు. నాన్నకి ఏదో అయిపోతుందని అమ్మ ఏడుస్తూ నాకు ఫోన్ చేసి విషయం చెప్పారు. రౌండ్స్ కి వచ్చిన సర్జన్‍తో మాట్లాడదామని పైన వేచి ఉన్న నేను బాబాకి గట్టిగా దణ్ణం పెట్టుకుని, "బాబా! నాన్నకి ఏమీ కాకుండా చూడు తండ్రి. నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. మా అన్నయ్య, మా ఆడపడుచు భర్త నాన్నని వెంటనే పైకి తీసుకుని వచ్చారు. డాక్టర్ నాన్నని చూసి, బిపి డౌన్ అయింది. ఈరోజు ఉంచి రేపు తీసుకెళ్లండి" అన్నారు. అలాగే మరుసటిరోజు నాన్నని ఇంటికి పంపించారు. నమ్మిన వారిని ఎప్పటికీ వదలరు సాయి. మీకు చాలా చాలా ధన్యవాదాలు సాయి తండ్రి.

ఇండియా నుండి దుబాయ్‍కి తిరిగి వెళ్ళేలోపు నాన్న ఆరోగ్యం బాగుండాలి అనుకున్న నా కోరిక తీరింది. కానీ నాకు ఒక సమస్య వచ్చింది. నెలసరికి ముందు నా బ్రెస్ట్ లో చిన్న కణితిలా వచ్చింది. నెలసరి తర్వాత తగ్గుతుందేమో అనుకున్నాను. అయితే కొంచెం పరిమాణం తగ్గినప్పటికీ పూర్తిగా తగ్గలేదు. దాంతో మళ్ళీ నెలసరి వచ్చిన తరువాత తగ్గుతుందేమో అనుకున్నాను. కానీ అలాగే ఉండేసరికి 2021, డిసెంబర్ 5న హాస్పిటల్‍కి వెళ్తే, డాక్టర్ స్కాన్ రాశారు. రిపోర్టులో తేడా ఉంటే బయాప్సీ చేయాల్సి ఉంటుందని అన్నారు. అప్పుడు నేను, "బాబా! నా జీవితం నీ చేతిలో ఉంది" అని వేడుకున్నాను. స్కాన్ ఇంకా జరగాల్సి ఉంది. కానీ నన్ను ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి కాపాడుతున్న బాబా ఇప్పుడు కూడా కాపాడతారు. నాకు సమస్య లేదని తెలిస్తే ఆ అనుభవంతో మళ్లీ మీ ముందుకు వస్తాను.

సాయి ద్వారా పొందిన సహాయాలు

సాయిభక్తులుకు నమస్కారం. ఈ బ్లాగు నిర్వహించే సాయికి నా ధన్యవాదాలు. నేను ఒక సాయిభక్తురాలిని. ప్రతి కష్టంలోనూ బాబా నాకు తోడు ఉన్నారు. ఈమధ్య నేను సాయి ద్వారా పొందిన సహాయాల గురించి ఇప్పుడు మీ అందరితో పంచుకుంటున్నాను. ఈమధ్య ఒకసారి కుక్కర్ పడి నాకు కాలిపోయింది. అయితే పెద్ద మొత్తంలో కాలి పోకుండా కేవలం చిన్నగా తగిలేలా చేసి బాబా కాపాడారు. మా ఇంట్లో ఉన్న నా మేనల్లుడికి చాలా తీవ్రంగా కాళ్ళనొప్పులు వచ్చి నడవలేకపోయాడు. పోలియో ఏమోనని అనుమానపడ్డాము. అయితే బాబా దయవల్ల వారికి నమస్కరించుకున్నంతనే బాబు చక్కగా నడిచాడు. వేరే చోట ఉన్న మా అమ్మ క్షేమంగా మా వద్దకు వచ్చేలా చేశారు బాబా. ఇంకా ఆక్సిడెంట్ వల్ల నాకు ఏమీ కాకుండా కాపాడారు. ఏ టెన్షన్ లేకుండా నా ఫెర్టిలిటీ చికిత్స అయ్యేలా చూశారు బాబా. ఇలా ప్రతిక్షణం బాబా నాతో ఉంటూ అడుగడుగునా నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. "బాబా! నా ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ విజయవంతమై నేను ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కల నెరవేరి అందరూ గర్వంగా చెప్పుకోవాలని నా కోరిక. నా ఆస్తి, నా బలం, నా నమ్మకం, నా సంతోషం అన్నీ మీరేనని గట్టిగా అందరికీ చెప్పాలని ఉంది. ఆ అవకాశం నాకివ్వు బాబా. నువ్వు ఉన్నావన్న ఒకేఒక్క నమ్మకంతో ఈ రోజు నేను ఏ టెన్షన్ లేకుండా ఉన్నాను. మీరే నా ధైర్యం. నా ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ విజయవంతమయ్యేలా చూడండి బాబా".


12 comments:

  1. Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  2. Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness and happiness in the world of yours. Jaisairam

    ReplyDelete
  3. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🤗🌹🥰🌼😃🌸😀🌺👪💕

    ReplyDelete
  4. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  5. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  6. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  7. సాయిరాం బాబా నీవే కలవు.. నీవు తప్ప మాకు ఎవరున్నారు ఈ లోకంలో.. నీ కరుణాకటాక్ష వీక్షణాలు వల్లనే మేము చాలా బాగున్నాము.. మా అందరికి సాయి దేవుని (మీ ఆశీస్సులు ) దయ తో ఆరోగ్యం బాగున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు సాయి బాబా మాకు ఎవరున్నారు ఈ లోకంలో ఎవరూ లేరు మీరు తప్పా.. థాంక్యూ సాయిరాం బాబా షిరిడీశ్వరా సాయి దేవా.. అనునిత్యం మమ్మలను కాపాడే నా ఇష్ట దైవమా షిరిడి శ్వర మీకు వేల కోట్ల నమస్కారాలు.. అత్యంత ప్రమాదాల బారినుంచి సైతం మమ్మల్ని మంచిగా దీవించి ఆదుకున్న సాయి దేవా మీకు ఇవే వేలకోట్ల నమస్కార సాష్టాంగ ప్రణామాలు తండ్రి..

    ReplyDelete
  8. Baba ma arogya samasyalani teerchu thandri sainatha pleaseeee

    ReplyDelete
  9. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🤗🌺🥰🌹😃🌼😀🌸👪💕

    ReplyDelete
  10. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo