సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1008వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సమస్య ఏదైనా బాబాను ప్రార్థిస్తే, తప్పక మనల్ని సమస్య నుంచి బయటపడేస్తారు
2. వైద్యులకు సాధ్యంకానిది బాబా వల్ల అవుతుంది
3. అడగటమే ఆలస్యం - అనుగ్రహించే బాబా

సమస్య ఏదైనా బాబాను ప్రార్థిస్తే, తప్పక మనల్ని సమస్య నుంచి బయటపడేస్తారు


సాయిబంధువులందరికీ నా నమస్కారం. ఇంత మంచి బ్లాగును ఏర్పాటుచేసిన బ్లాగ్ నిర్వాహకులకు ధన్యవాదాలు. నా పేరు ప్రీతిరావు. నేను హైదరాబాదు నివాసిని. ముందుగా, నా అనుభవాలను ఆలస్యంగా పంచుకుంటున్నందుకు బాబాకి క్షమాపణలు చెప్పుకుంటున్నాను. నేను ఇంతకుముందు రెండుసార్లు నా అనుభవాలను మీతో పంచుకున్నాను. బాబా అనుగ్రహంతో ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను.


నా భర్త ఉద్యోగరీత్యా వేరే దేశంలో ఉన్నారు. నేను ఇద్దరు పిల్లలతో ఇక్కడ అద్దె ఇంట్లో ఉంటున్నాను. కొన్ని అనుకోని కారణాలవల్ల నేను తరచూ ఇల్లు మారాల్సి వచ్చేది. అయితే, ఇద్దరు పిల్లలతో తరచూ ఇల్లు మారడం నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ, ప్రతిసారీ బాబా నాకు అండగా నిలిచేవారు. బాబా నాకు ఎక్కడా ఏ సమస్య రాకుండా అన్ని విషయాల్లో సహాయం చేస్తూ ప్రతిసారీ మునుపటికంటే మంచి ఇరుగుపొరుగు ఉండే అనుకూలమైన ఇంటిని చూపిస్తున్నారు. "ధన్యవాదాలు బాబా. దయతో మాకు ఒక సొంత ఇంటిని ప్రసాదించండి తండ్రీ".


ఒకసారి నా కంప్యూటరులో ఏదో సమస్య వచ్చి ఎన్నిసార్లు రీస్టార్ట్ చేసినా విండో స్క్రీన్ ఓపెన్ అవలేదు. అప్పుడు నేను బాబాను ప్రార్ధించి, "బాబా! మీ దయతో నా కంప్యూటర్ నార్మల్‌గా పనిచేస్తే, నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని అనుకున్నాను. కాసేపటికి నా సిస్టమ్ రీస్టార్ట్ అయి నార్మల్‌గా పనిచేయడం మొదలుపెట్టింది.


ఈమధ్య మా అమ్మ తన చెవికమ్మలు ఎక్కడో పెట్టి మర్చిపోయింది. ఎంత వెతికినా అవి దొరకలేదు. నాకు మాత్రం బాబా దయతో అవి తప్పకుండా దొరుకుతాయని నమ్మకం ఉండి, "బాబా! అమ్మ చెవికమ్మలు దొరికితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. అంతటితో నేను ఆ విషయం గురించి మర్చిపోయాను. తర్వాత కొన్నిరోజులకు మా అమ్మ ఫోన్ చేసి, "చెవికమ్మలు దొరికాయ"ని చెప్పింది. అది విని నాకు ఎంత సంతోషం కలిగి ఉంటుందో మీరు ఊహించగలరనుకుంటాను. మనం ఏ సమస్య గురించి బాబాను ప్రార్థించినా ఆయన తప్పక మనతోనే ఉండి ఆ సమస్య నుంచి బయటపడేలా చూస్తారు. అంతేకాదు, బాబా తండ్రిని నమ్ముకుంటే, మన ప్రతి పనిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకుంటారు. "ధన్యవాదాలు బాబా".


వైద్యులకు సాధ్యంకానిది బాబా వల్ల అవుతుంది


సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. నా పేరు అరుణ. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. మా మరదలి కాన్పు విషయంలో చాలా సమస్యలు ఏర్పడి తల్లి, బిడ్డలను రక్షించటం కష్టమని డాక్టర్లు చెప్పారు. అది విని మేమంతా చాలా భయపడ్డాము. ఆ సమయంలో మాకు బాబా తప్ప ఇంకెవరూ కనిపించలేదు. మా మరదలు కూడా బాబా భక్తురాలు. నేను తనతో ఒకటే చెప్పాను: "ఎల్లప్పుడూ బాబా స్మరణలోనే ఉండు. నీకు, నీ బిడ్డకి ఏమీ కాదు" అని చెప్పాను. అలాగే నేను సప్తాహపారాయణ మొదలుపెట్టాను. అది పూర్తయ్యేలోపు తల్లి, బిడ్డ ఇద్దరూ ఆ విపత్తు నుండి క్షేమంగా బయటపడ్డారు. వాళ్ళిద్దరూ క్షేమంగా ఉండటమన్నది బాబా కృప వల్లనే సాధ్యమైంది. "బాబా! మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మా మీద ఇలానే ఉండాలి".


మా అక్కావాళ్ళ అమ్మాయికి పెళ్ళై 4 సంవత్సరాలైనా పిల్లలు లేరు. ఆ విషయంలో మా ఇంట్లో అందరం చాలా ఆతృతగా ఉండి ఎంతో బాధపడేవాళ్ళం. ఒకరోజు నేను మా అక్క కూతురుతో 'సాయి దివ్యపూజ' చేయమని చెప్పాను. తను అలాగే చేసింది. పూజ చేసిన కొన్ని నెలల్లో తను గర్భవతి అయింది. ఏ మెడికల్ సమస్యనైనా డాక్టర్లకి పరిష్కరించటం సాధ్యమవుతుందో, లేదో తెలీదుకానీ, సాయిబాబా వల్ల మాత్రం ఖచ్చితంగా అవుతుంది. ఎవరు ఎలాంటి సమస్య విషయంలోనైనా భారం బాబాపై వేయండి. ఆయన తప్పకుండా తీరుస్తారు. "ధన్యవాదాలు బాబా. నేను మిమ్మల్ని రెండు కోరికలు కోరుతూ సాధ్యమైనంత తొందరగా అవి పూర్తి కావాలని కోరుకుంటున్నాను. మీరు తప్పకుండా తీరుస్తారని, ఆ అనుభవాన్ని తోటి భక్తులతో తొందరగా పంచుకోవాలని ఆశిస్తున్నాను తండ్రీ".


అడగటమే ఆలస్యం - అనుగ్రహించే బాబా


సాయిబంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగును ఎంతో చక్కగా నడుపుతున్న సాయికి నా ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు గోష్టేశ్వరి. నా కుటుంబాన్ని బాబా అడుగడుగునా కాపాడుతున్నారు. నా పూర్వకర్మ ప్రారబ్ధానుసారం నేను కొన్ని మానసిక సమస్యలతో సతమతమవుతున్నప్పటికీ బాబా దయవల్లనే వాటిని ధైర్యంగా ఎదుర్కోగలుగుతున్నాను. బాబా లేకుంటే నా జీవితం లేదనిపిస్తోంది. ఇక నా అనుభవాల విషయానికి వస్తే... మా పాపకి ఈమధ్య జ్వరం వచ్చింది. అప్పుడు నేను, "ఏంటి బాబా, పాపకి తరచూ జ్వరం వస్తోంది? నాకు భయంగా ఉంది బాబా" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల రెండు రోజుల్లో పాపకి జ్వరం తగ్గింది.


2021, నవంబరు రెండవ వారంలో మా ఇంట్లోకి ఒక ఎలుక దూరింది. ఎలుక ఇంట్లోకి ప్రవేశిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే! నాకేమో ఎలుకలను చంపడం ఇష్టం లేదు. అందుచేత, "దయచేసి ఈ ఒక్క ఎలుకను ఎలాగో ఒకలా బయటకి పంపించేయండి బాబా. దాన్ని చంపటం నాకు ఇష్టం లేదు" అని నా సాయిగణేశుడిని ప్రార్థించాను. బాబా దయవల్ల రెండు రోజుల్లో ఆ ఎలుక మరి కనిపించలేదు. "ధన్యవాదాలు తండ్రీ".


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్ కీ జై!!!


10 comments:

  1. Om sai ram your sai leelas are very nice baba. With sai every problem can cured. That is your power. Sai avatar is loving his devotees and save them from problems. Om sai ram❤❤❤

    ReplyDelete
  2. Om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram

    ReplyDelete
  3. Jaisairam. Eesha is suffering with fever. Bless her and help her and recover from fever. Jaisairam

    ReplyDelete
  4. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  6. Om sai ram baba ma pyna karuna chupandi sai ma arogya samasyalani teerchu thandri sainatha pleaseeee

    ReplyDelete
  7. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్ కీ జై!!!

    ReplyDelete
  8. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😃🌺🤗🌹🥰🌼😀🌸💕👪

    ReplyDelete
  9. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo