1. బాబా తమ బిడ్డలను ఇబ్బంది పడనివ్వరు
2. భక్తులకు తోడు-నీడగా ఉండే బాబా
3. బాబా ఊదీతో పూర్తిగా నయమైన గుండెలో రంధ్రం
బాబా తమ బిడ్డలను ఇబ్బంది పడనివ్వరు
శ్రీ సాయినాథునికి శతకోటి వందనాలు. బ్లాగు నిర్వాహకులకు అభినందనలు. నేను ఒక సాయిభక్తురాలిని. నేను ఈ మధ్య మా ఫ్రెండ్స్‌తో కలిసి శిరిడీ దర్శించాను. ఫ్లైట్‌లో ఉదయం వెళ్లి, సాయంత్రానికి రావాల్సి ఉండడంతో మేము దర్శనం గురించి భయపడ్డాము. కానీ మన బాబా తమ బిడ్డలను ఇబ్బంది పడనివ్వరు కదా! శిరిడీ చేరుకున్నాక ఒక వ్యక్తి నేరుగా మమ్మల్ని తీసుకుని వెళ్లి బాబా దర్శనం చేయించారు. ఆ వ్యక్తి రూపంలో బాబానే మాకు సహాయం చేశారు. బాబా ఆశీస్సులతో చాలా సంతోషంగా తిరిగి వచ్చాము.
తర్వాత ఈ మధ్య మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక టూర్‌కి వెళ్ళాము. ఆ టూర్‌కి వెళ్ళేముందు నేను బాబాతో, "ఏ ఇబ్బంది లేకుండా టూర్ పూర్తి చేసుకుని వస్తే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని చెప్పుకున్నాను. అందరం సంతోషంగా వెళ్లి, అక్కడ దత్త దర్శనం మొదలు అన్ని దర్శనాలు చేసుకుని తిరిగి వచ్చాము. బాబా దయవల్ల ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కలగలేదు. "కొన్ని వివరాలు ఇక్కడ వ్రాయలేక తెలియజేయడం లేదు. నన్ను క్షమించండి బాబా".
ఈమధ్య మా కోడలు తండ్రికి యాంజియోగ్రామ్ చేయాలంటే నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! ఆయనకి ఆపరేషన్ అవసరం లేకుండా చూసి ఆయన ఆరోగ్యం బాగుండేలా చేయి తండ్రి. మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. ఆరోజు గురువారం అయినందున 'బాబా ఉండగా మనకి భయమేలా?' అని అనుకున్నాను. ఆయనకి యాంజియోగ్రామ్ చేసి, "హర్ట్ లో కొద్దిగా బ్లాకులున్నాయి, కానీ ఆపరేషన్ అక్కరలేద"ని స్టెంట్ వేశారు. బాబా దయవల్ల ఇప్పుడు అంతా బాగుంది. "ఇక ముందు కూడా ఆయన ఆరోగ్యం గురించి మీరు చూసుకోండి బాబా. మీకు ధన్యవాదాలు చెప్పడం తప్ప నేను ఏమి చేయలేను తండ్రి". తరువాత నా మనసులో నేను ఏదో పంచుకోవాలనుకుని, పంచుకోలేదని అనుమానం వచ్చింది. కానీ నాకు గుర్తు రాలేదు. "నన్ను క్షమించండి బాబా".
మా ఊరిలో మేము ఒక కొత్త ఇల్లు నిర్మిస్తున్నాము. "ఆ పనులు ఏ ఆటంకాలు లేకుండా తొందరగా జరగాల"ని బాబాను వేడుకుని, 'అలా జరిగితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను' అని అనుకున్నాను. బాబా మీద భారం వేశాక అంతా ఆయనే చూసుకుంటారు కదా! ఆయన దయవల్ల ఇంటి నిర్మాణం సక్రమంగా సాగుతుంది. బాబా, మా ఇలవేల్పు సత్తెమ్మతల్లి ఇంటి నిర్మాణం జరిపిస్తున్నారని నా విశ్వాసం. "ధన్యవాదాలు బాబా. మీ దయతో మేమంతా ఆనందంగా ఆ ఇంట తిరగాలి. మాలో ఎవరి వల్ల అయినా ఏదైనా తప్పు జరిగి ఉంటే, క్షమించమని అందరి తరపున వేడుకుంటున్నాను తండ్రి".
ఇటీవల అమెరికాలో ఉన్న మా చిన్నబ్బాయి, కోడలు బయటకి వెళ్లొచ్చారు. వాళ్ళకి ఏ ఇబ్బందీ లేకుండా బాబా చూసుకున్నారు. ఇకపోతే మా చిన్నబ్బాయికి ఇదివరకు బాబా ఒక బాబుని ప్రసాదించారు. ఇప్పుడు మా కోడలు గర్భవతిగా ఉంది. మేము ముందు బాబు రూపంలో వచ్చిన బాబాను ఇప్పుడు అమ్మాయి(మనవరాలిగా) రూపంలో రావాలని కోరుకున్నాము. బాబా మా కోరికను మన్నించారు. డాక్టరు మా చిన్న కోడలికి స్కాన్ చేసి కడుపులో ఉన్నది ఆడపిల్ల అని చెప్పారు. మా ఆనందాన్ని మీరు ఉహించగలరనుకుంటాను. పుట్టబోయే మనవరాలికి మీ అందరి దీవెనలు కోరుకుంటున్నాను. "ధన్యవాదాలు బాబా. మీ దయతో కోడలికి నార్మల్ డెలివరీ అయి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను తండ్రి. అలాగే ఇదివరకు అమ్మాయిని అనుగ్రహించిన మా పెద్దబాబుకి ఒక కుమారుని తొందరగా ప్రసాదించండి బాబా. మా మనవరాలిని దయతో చూడాలి బాబా. మీ కూతురు, మనవల బాధ మీరే తీసేయాలి. మా కుటుంబం బాధ్యత అంతా మీదే బాబా. మీ నీడలో మేమందరం ఆనందంగా, హాయిగా ఉండాలి బాబా. అయినా మీరు ఉండగా మాకు భయమేల? చివరిగా ఏవైనా తప్పులు వ్రాసినా, పంచుకుంటానని ఏమైనా మర్చిపోయి ఉన్నా నన్ను క్షమించండి బాబా". మా పెద్దబ్బాయికి కుమారుని ప్రసాదించమని నేను బాబాను కోరుకున్న కోరిక విషయంలో కూడా మీ అందరి దీవెనలు ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.
భక్తులకు తోడు-నీడగా ఉండే బాబా
ఓం శ్రీసాయినాధాయ నమః!!! సాయిబంధువులందరికీ నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. ఈమధ్య 83 సంవత్సరాల మా అమ్మకి కాలు విరిగితే, ఆపరేషన్ చేయించాము. పెద్దావిడ పనులు చూసుకుంటూ, తనకి సహాయంగా ఉండే మనిషికోసం చూస్తే మాకు ఎవరూ దొరకలేదు. అందుకని ఒక వంటమనిషిని, పనిమనిషిని మాట్లాడుకున్నాము. కొద్దిరోజులకు వాళ్ళిద్దరూ ఒకేసారి మానేసారు. సరిగ్గా అదే సమయంలో స్కూళ్లు తెరవడంతో డ్యూటీకి వెళ్ళడం నాకు చాలా కష్టమైంది. మరో వైపు మా అమ్మ, "నేను ఇలా ఉండి, నీకు భారం అవుతున్నాను" అని రోజూ బాధపడేది. అలాంటి పరిస్థితిలో నేను సహాయం కోసం బాబాను వేడుకున్నాను. ఒకటిన్నర నెల నేను కష్టపడ్డాక బాబా నా బాధ చూడలేకపోయారేమో! ఐదు సంవత్సరాల క్రితం మా ఇంట్లో పనిచేసిన ఆవిడ, 'పని చేస్తానంటూ' వచ్చింది. ఆ విధంగా బాబా నాపై దయ చూపారు.
ఒకసారి 'నీకు ఏ కష్టం వచ్చినా, నేను నీకు అండగా ఉంటాన'ని తెలియజేశారు బాబా. తరువాత కొత్తగా పెళ్ళైన నా కొడుకు, కోడలితో శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలనుకుని తేదీ నిర్ణయించి బంధుమిత్రులను ఆహ్వానించాము. అయితే అదే రోజున సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన మా కోడలికి ఆఫీసు పని పడింది. అసలే వాళ్ల పెళ్లి కోవిడ్ సమయంలో కేవలం 30మంది మధ్య జరిగింది. కాబట్టి వ్రతంలో అయినా ఇద్దరినీ అందరూ చూస్తారంటే ఇలా సమస్య వచ్చి పడింది. నాకు చాలా బాధేసి, "బాబా! మీ కృపతో ఏ ఇబ్బందీ లేకుండా వ్రతం సక్రమంగా జరిగితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. ఆయన మీద భారం వేసి ఆరోజు తొందరగా వ్రతం మొదలుపెట్టాము. కొద్దిసేపటికి ఆఫీసు పని వాయిదా పడిందని తెలిసింది. బాబా దయవల్ల శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం బాగా జరిగింది. బంధువులందరూ బిడ్డలను ఆశీర్వదించి వెళ్ళారు. ఇలా బాబా నాకు ఎప్పుడూ తోడు, నీడగా ఉన్నారు. "ధన్యవాదాలు బాబా".
శ్రీ సాయినాథ్ మహరాజ్ కి జై!!!
బాబా ఊదీతో పూర్తిగా నయమైన గుండెలో రంధ్రం
ఓం శ్రీసాయినాథాయ నమ:!!! సాయిబంధువులందరికీ, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు ఆ సాయినాథుని ఆశీస్సులు ఎల్లవేళలా పరిపూర్ణంగా ఉండాలని బాబాను ప్రార్ధిస్తున్నాను. నా పేరు సుజిత. నాకు సర్వం శ్రీసాయినాథుడే. ఆయన నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను. 2010, అక్టోబర్ 14న నేను ఒక మగబిడ్డకు జన్మనిచ్చాను. బాబు చాలా బలహీనంగా ఉన్నాడని స్కాన్ తీసి, "బాబు గుండెలో రంధ్రం ఉంద"ని డాక్టర్లు చెప్పారు. ఆ సమయంలో ఏమి చేయాలో మాకేమీ అర్ధం కాలేదు. మా అమ్మమ్మవాళ్ళ ఇంటి ప్రక్కన బాబా గుడి ఉంది. మా అమ్మమ్మ నాకు బాబా ఊదీ పంపింది. నేను సాయినాథుని ప్రార్ధించి, ప్రతిరోజూ ఆ ఊదీ మా బాబు నుదుటన పెడుతూ ఉండేదాన్ని. 3 సంవత్సరాల తరువాత మా బాబుని చూస్తున్న డాక్టర్, "సాయి ఛారిటబుల్ ట్రస్ట్ కి హార్ట్ స్పెషలిస్ట్ వస్తారు. బాబుని వారికి చూపించండి" అని చెప్పారు. ఆ సూచన మేరకు మేము వెళ్ళి ఆ హార్ట్ స్పెషలిస్ట్ ని కలిసాము. ఆయన స్కాన్ చేసి, "గుండెలో రంధ్రం పూర్తిగా నయం అయింద"ని చెప్పారు. మేము అస్సలు నమ్మలేకపోయాము. మేము ఎంత ఆనందపడ్డామో మాటల్లో చెప్పలేను. ఇదంతా సాయినాథుని దయవల్లే. కృతజ్ఞతతో మా బాబుకి బాబా పేరు కలిసి వచ్చేలా 'సాయి భరత్' అని పేరు పెట్టుకున్నాము. ఇప్పుడు మా బాబుకి 12 సంవత్సరాలు, చాలా బాగున్నాడు. నా ఆనందాన్ని మీతో పంచుకోవాలని ఎన్నోసార్లు అనుకున్నాను. ఆ సాయినాథుని దయవల్ల అది ఇప్పుడు నెరవేరింది. "సాయినాథా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. అందరినీ చల్లగా చూడండి బాబా".
Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness and happiness in the world of yours. Jaisairam
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm సాయిరాం మీరు క్యాన్సర్ న మం చే స్త రు , మీ కు సాధ్య ము కా ని ది లేదు .గుండె లో న రన్ ద్ర ము పూడు కో వ డ వ డ ము మీ కు సు ల భ ము. ఓమ్ శ్రీ సాయిరాం ❤❤❤
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sai ram baba ma arogya samasyalani tondarga teerchu thandri sainatha pleaseeee
ReplyDeleteBaba santosh ki day shift ee month lo vachela chudu thandri sainatha pleaseeee
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🤗🌹😀🌼🥰🌸😃🌺👪💕
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOm sri sainathayanamaha
ReplyDeletePlease take care of my child baba 🙏🌺🙏 👏
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDelete