సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 307వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. సాయిబాబా చేసిన సహాయాలు
  2. వైవాహిక జీవితాన్ని కాపాడిన బాబా

సాయిబాబా చేసిన సహాయాలు

సాయిభక్తులందరికీ నమస్కారం. నేను సాయిభక్తుడిని. నా పేరు నిర్మల్ జోషీ. బాబా ఆశీస్సులతో మా కుటుంబమంతా హృదయపూర్వకంగా ఆయనను ఆరాధిస్తున్నాము. నేను ప్రతి గురువారం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మౌనవ్రతంలో ఉంటాను. ఒక గురువారం నా భార్యకు తను పనిచేస్తున్న స్కూలుకి సంబంధించిన రిజిస్టర్లు కనిపించలేదు. ఆమెకు వేరే స్కూలుకి బదిలీ అయినందున వాటిని అత్యవసరంగా స్కూలులో అప్పగించాల్సివుంది. నేను మౌనవ్రతంలో ఉన్నందున ఆమె నాకేమీ చెప్పకుండా స్కూలుకు వెళ్లి, అక్కడ కూడా ఆ రిజిస్టర్లకోసం తీవ్రంగా గాలించింది కానీ, ప్రయోజనం లేకపోయింది. సాయంత్రం ఆమె నాతో విషయం చెప్పి రిజిస్టర్లు దొరకకపోతే పెద్ద సమస్య అవుతుందని చెప్పింది. వెంటనే మేము, "ఈ సమస్యను పరిష్కరించండి బాబా" అని బాబాను ప్రార్థించాము. తరువాత మేము రాత్రి భోజనం చేస్తూ ఇప్పుడేమి చేయాలా అని చర్చించుకుంటున్నాము. అకస్మాత్తుగా బాబా కృపవలన నా భార్యకి ఒక ఆలోచన వచ్చింది, తను వెళ్ళిన దుకాణంలో రిజిస్టర్లు ఉండవచ్చని. మేము ఆ దుకాణానికి వెళ్లి, "ఇక్కడ ఏమైనా కొన్ని రిజిస్టర్లు కనిపించాయా?" అని యజమానిని అడిగాము. అతను సరిగా స్పందించలేదు. అంతలో అక్కడ పనిచేస్తున్న ఒకతను, "రిజిస్టర్లతో ఒక కవరు ఉంది. అది మీదో, కాదో చూసుకోండి" అని చెప్పాడు. అవి మేము వెతుకుతున్న రిజిస్టర్లే! బాబా ఆశీర్వాదంతో చివరకు మా రిజిస్టర్లు మాకు దొరికాయి. ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాము.

2019వ సంవత్సరం హోళీ పండుగకి కాస్త ముందుగా మార్చిలో నేను చైనా వెళ్ళవలసి వచ్చింది. అదే నా మొదటి విదేశీయాత్ర. ఎలా వెళ్లాలో, అక్కడ విషయాలన్నీ ఎలా నిర్వహించుకోవాలో అని చాలా టెన్షన్ పడి బాబాతో చెప్పుకున్నాను. ఆయన దయవల్ల తరచూ చైనా వెళ్లే నా స్నేహితుని సోదరుడు నాకు సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. అతను నాతో చైనాకు రావాలని కూడా నిర్ణయించుకున్నాడు. నేను వెళ్లాల్సిన చోటు, తనకు పనివున్న చోటు వేర్వేరు నగరాల్లో ఉన్నాయి. అతను నాకోసం చాలా శ్రద్ధ తీసుకుని సమీపంలో రెస్టారెంట్ ఉండేలా చూసి మరీ ఒక హోటల్ బుక్ చేసాడు. మేము చైనా చేరుకున్న తరువాత, అతను దగ్గరుండి నన్ను హోటల్‌కి తీసుకుని వెళ్లి, అన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో తనిఖీ చేశాడు. ఆ హోటల్ బహుళ అంతస్తుల వాణిజ్య సముదాయంలో ఉంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో రిసెప్షన్‌ ఉంది. రిసెప్షన్‌కు వెలుపల 'సాయి సాగర్ రెస్టారెంట్' అనే రెస్టారెంటుకి సంబంధించిన అడ్వర్టైజ్‌మెంట్ బోర్డు ఉంది. దాన్ని చూస్తూనే నాకు చాలా ఆనందంగా అనిపించింది. శ్యామా కంటే ముందుగా బాబా గయ చేరుకున్న సచ్చరిత్రలోని సంఘటన నాకు జ్ఞాపకం వచ్చింది. ఆ ప్రకటన బోర్డుతో సాయి నాకు తోడుగా ఉన్నట్లు అనిపించింది. అంతేకాదు, నా పర్యటన మొత్తం సాయిబాబా నాతో ఉన్నారు. ఆయన ఆశీర్వాదాలతో నేను నా పనిని విజయవంతంగా పూర్తిచేశాను.

ఒకసారి నేను ఒక ప్లాట్‌ను కొనుగోలు చేశాను. దానికి సంబంధించిన డబ్బు చెల్లించడానికి రెండునెలల సమయముండగా నేను ఆ డబ్బుకోసం నాకున్న ఒక ఇంటిని అమ్మేయాలని అనుకున్నాను. దురదృష్టవశాత్తూ ఆ ఇల్లు అమ్ముడుపోలేదు. ఇతర మార్గాల ద్వారా నేను ఆ డబ్బు సర్దుబాటు చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఇంకా 15 లక్షల రూపాయలు తక్కువయ్యాయి. ఇంకా ఒక్కరోజే మిగిలివుండగా నాకు ఏమి చేయాలో అర్థం కాలేదు. అంతలో నా స్నేహితుడు తన బంధువులలో ఒకరు డబ్బు అప్పుగా ఇవ్వగలరని, తనతో మాట్లాడి ఏ విషయం చెప్తానని అన్నాడు. కానీ ఏవో కారణాల వల్ల మరుసటిరోజు ఉదయం వరకు నా స్నేహితుడు అతనితో మాట్లాడలేకపోయాడు. నేను చాలా టెన్షన్ పడుతూ ఆఫీసుకు బయలుదేరేముందు, "ఏదోక విధంగా నాకు అవసరమైన ఏర్పాట్లు చేయమ"ని బాబాను ప్రార్థించాను. తరువాత నేను బయలుదేరబోతుండగా నా స్నేహితుడి నుండి ఫోన్ వచ్చింది. నేను ఆత్రంగా ఫోన్ లిఫ్ట్ చేశాను. తను తన బంధువు డబ్బు ఇవ్వడానికి అంగీకరించాడని చెప్పాడు. ఆ విధంగా సాయిబాబా ఆ సమస్య నుండి బయటపడేందుకు నాకు సహాయం చేశారు. నేను పట్టలేని ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను.

source:http://www.shirdisaibabaexperiences.org/2019/11/shirdi-sai-baba-miracles-part-2536.html

వైవాహిక జీవితాన్ని కాపాడిన బాబా

నేను చిన్నప్పటినుండి సాయిబాబా భక్తురాలిని. నేను సహాయం అర్థించినప్పుడల్లా బాబా నాకు సహాయం చేశారు. మొదట్లో నా భర్త, నేను ఉద్యోగరీత్యా, మా బాబు ఆరోగ్యరీత్యా వేర్వేరు ప్రదేశాల్లో ఉండేవాళ్ళము. తరువాత 2017, ఏప్రిల్ నుండి మేము కలిసి ఉంటుండగా అకస్మాత్తుగా 2017 జూలై చివరినుండి మా మధ్య అపార్థాలు చోటుచేసుకున్నాయి. దాంతో నా భర్త నన్ను ఇష్టపడటం లేదని, నా నుండి విడిపోవాలని కోరుకుంటున్నానని చెప్పాడు. ఈ పరిస్థితి కొన్నినెలలపాటు కొనసాగింది. ఇక కలిసి ఉండలేక 2018, ఫిబ్రవరిలో నేను నా పుట్టింటికి వెళ్ళిపోయాను. నా భర్తను ఒప్పించడానికి ఎంతమంది ఎన్నిరకాలుగా ప్రయత్నించినా అతను ఎవరి మాటా వినలేదు. నేను పూర్తిగా ఆశను కోల్పోయాను. అప్పుడు నా బాబా నాకు గుర్తుకు వచ్చారు. వెంటనే బాబాను ప్రార్థించడం మొదలుపెట్టాను. "నేను నా భర్త వద్దకు తిరిగి వెళ్లగలిగితే తోటి భక్తులతో నా అనుభవం పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. తరువాత నేను సాయి సచ్చరిత్ర చదవడం, నవగురువార వ్రతం చేయడం ప్రారంభించాను. సాయి కలలో దర్శనమిచ్చారు. క్వశ్చన్&ఆన్సర్ వెబ్‌సైట్ ద్వారా చాలా సానుకూల సంకేతాలను ఇచ్చారు. అయితే పరిస్థితుల కారణంగా నేను చాలా నిరాశకు గురవుతూ బాబా, బాలా అమ్మ నాకు మంచి చేస్తారని నేను ఆశించాను. చివరికి బాబా అనుగ్రహించారు. నా భర్త మనిద్దరం కలిసి ఉందామని అన్నారు. దాంతో 2018, సెప్టెంబరులో నేను నా భర్త వద్దకు తిరిగి వెళ్ళాను. బాబా తన భక్తులను ఎప్పటికీ విడిచిపెట్టరు. "బాబా! దయచేసి నన్ను ఆశీర్వదించండి. నాకు ఎల్లప్పుడూ మీ సహాయం కావాలి. నాకోసం ఒక పని చేయమని నేను మిమ్మల్ని ప్రార్థించాను. ఆ సమస్య కారణంగా నేను రాత్రిళ్ళు నిద్రపోలేకపోతున్నాను. దయచేసి వెంటనే నాకు సహాయం చేయండి బాబా!"

source:http://www.shirdisaibabaexperiences.org/2019/04/shirdi-sai-baba-miracles-part-2328.html?m=0


8 comments:

  1. SAI NAA KODUKUNI NAA DAGGARAKU RAPINCHADI
    LEDANTE NNANE NEE DAGGARAKU THISUKONI VELLU
    PLS SAI

    ReplyDelete
    Replies
    1. 🌹🌹 Om Sairam🌹🌹

      Delete
    2. Sai entavaraku naa koduku naa daggaraku raledu tandri

      Delete
  2. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  3. Baba me daya valana Kalyan ki marriage ipoindi na health bagu cheyandi pl house lo problem solve cheyandi Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi

    ReplyDelete
  4. Om sri sairam 🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo