సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 301వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. సద్గురు సాయీశ్వరా!
  2. సోదరికి తగిన సంబంధాన్ని పంపించిన బాబా

సద్గురు సాయీశ్వరా!

ఓం శ్రీ సాయీశ్వరాయ నమః. సాయిబంధువులకి నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు సంధ్య. నేను మొదటినుంచి శివుడిని తండ్రిలా, జగన్మాతను తల్లిలా ఆరాధిస్తాను. ఏ దేవాలయానికి వెళ్ళినా అంతా ఈశ్వర రూపాలు, ఈశ్వరుని అంశలే అనే భావంతో నమస్కరిస్తాను. దేవుడంటే శివుడేనని నా విశ్వాసం. సంతోషమైనా, దుఃఖమైనా ఈశ్వరుడే నాకు గుర్తుకొస్తారు. అలాంటి నాకు ఆ ఈశ్వరుడే శ్రీసాయినాథుడని తెలియజేసిన అనుభవం నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

ఒకప్పుడు మా అత్తమ్మ చాలా అనారోగ్యానికి గురైంది. ఆమె ఎప్పుడూ బాబాకు నమస్కరించేది. అందువలన నేను ఆమె ఆరోగ్యం కోసం బాబాకు మ్రొక్కుకున్నాను. ఆయన అనుగ్రహం వల్ల ఆమె త్వరలోనే కోలుకుంది. తరువాత ఒకరోజు నా మ్రొక్కు తీర్చుకుందామని మా అత్తమ్మతో కలసి నేను సాయిబాబా గుడికి వెళ్ళాను. దీపాలు వెలిగించి, బాబాకు శాలువా సమర్పించి, పులిహోరను నైవేద్యంగా సమర్పించాము. అంతలో మధ్యాహ్న ఆరతి సమయం కావడంతో మేము వరుసలో నిల్చున్నాము. నేను బాబా ఆరతి చూడడం అదే మొదటిసారి. నా అజ్ఞానం చూడండి, 'సాయి మానవులు కదా, మనిషిని పూజిస్తారా?' అనే సందేహం నా మనస్సులో తలెత్తింది. నా మనసు తెలిసిన సాయి మరుక్షణంలో అద్భుతాన్ని చూపించారు. సాయి పాదం కదులుతూ ఉంది. ఆ దివ్య పాదదర్శనంతో నన్ను నేను మరచి పరవశించిపోయాను. ఆ దర్శనంతో నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి, ఆ ఈశ్వరుడే మానవరూపంలో సద్గురుసాయిగా అవతరించారన్న విశ్వాసాన్ని కలిగించారు. 'కర్మ నశించనిదే గురుకృపను తెలుసుకోలేము' అన్నట్లు నా జీవితంలో సాయి పంచిన ప్రేమను, జరిగిన సాయి లీలలను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. "సద్గురు సాయిశ్వరా! మీ పాదాలకు శరణు వేడుతున్నాను. ఎల్లవేళలా మీ ప్రేమను పొందే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. ప్రాపంచిక మాయలో ఉన్న మమ్మల్ని పారమార్థిక మార్గంలోకి నడిపించండి. గురుదేవా! సాయీ! మీ దివ్య పాదదర్శనంతో ధ్యానస్థితిని ప్రసాదించిన మీ ప్రేమను ఎంతని వర్ణించను? మిమ్మల్ని ప్రేమించటం తప్ప ఏ విధంగా కృతజ్ఞతలు తెలుపుకోగలను? ఐ లవ్ యు బాబా! ఐ లవ్ యు!".

సోదరికి తగిన సంబంధాన్ని పంపించిన బాబా

ఓం శ్రీ సాయినాథాయ నమః. నేను ఒక సాయిభక్తురాలిని. నేను పుట్టినప్పటినుంచి బాబా దయ నాపై ఉంది. ఆయన నా పేరులో భాగమై ఉన్నారు. అయితే ఇటీవలే నేను ఆయన లీలలను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. అప్పటినుండి నా జీవితంలో అద్భుతాలు ఆగలేదు. నా సోదరి జీవితంలోకి సరైన వ్యక్తిని పంపినందుకు నేను బాబాకు చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఈ సంఘటనను నేను నిజమైన బాబా భక్తులతో తప్ప మరెవరితోనైనా పంచుకుంటే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. కానీ బాబా యొక్క దృఢమైన భక్తులతో పంచుకుంటే, వాళ్ళు అంచనా వేయలేని బాబా శక్తిని అనుభూతి చెందటంతో పాటు, తమ భక్తిని కూడా దృఢపరుచుకుంటారు.

మేము మా సోదరి కోసం సంబంధాలు వెతుకుతున్నప్పుడు బాబాను హృదయపూర్వకంగా ప్రార్థించాము. ఆయన మా సోదరి జీవితంలోకి సరైన వ్యక్తిని పంపించారు. విచిత్రమేమిటంటే, మా సోదరి తనకు కాబోయే జీవితభాగస్వామి ఎలా అయితే ఉండాలని ఆశించిందో సరిగ్గా అతను అలాగే ఉన్నాడు. ఇంకో ఆశ్చర్యమేమిటంటే, అతను మా ఇంటికి రావడానికి ముందుగా తన ప్రణాళిక ప్రకారం శిరిడీ సందర్శించాడు. అక్కడనుండి అతను శిరిడీ ప్రసాదాన్ని, బాబా విగ్రహాలను తీసుకుని వచ్చాడు. మేము బాబా అనుగ్రహాన్ని అసలు నమ్మలేకపోయాము. నిజానికి మా నాన్న అదే నెలలో శిరిడీ వెళ్లాలని అనుకున్నప్పటికీ సాధ్యపడలేదు. కానీ బాబా అంతా చక్కగా ప్రణాళిక చేశారు. ఈ మొత్తం సంఘటన మా బావని బాబాకు దృఢమైన భక్తునిగా మార్చింది. అందులో మా సోదరి ప్రభావం కూడా ఉంది. ఈ అనుభవంతో 'స్వర్గంలో సంబంధాలు నిర్ణయించబడతాయ'ని నేను నమ్మడం ప్రారంభించాను. అవును, అది వాస్తవం! "చాలా చాలా ధన్యవాదాలు బాబా!" 

జీవితభాగస్వామి కోసం వెతుకుతున్న దశలో ఉన్న ప్రతి సాయిభక్తునికి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. పూర్తి విశ్వాసంతో బాబాకు శరణాగతి చెందండి. ఆయన మీకోసం ఉత్తమమైన సంబంధాన్ని అనుగ్రహిస్తారు.


source:http://www.shirdisaibabaexperiences.org/2019/11/shirdi-sai-baba-miracles-part-2541.html


5 comments:

  1. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  2. Baba saranu saranu.. saranagathi deva.. tanaki tagina vyakthi ni varudiga pampinchandi.. Sakalam lo tanaki vivaham jaripinchandi please please please 🥲🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo