నిన్నటి రోజున మీరు చదివిన "ఒక సాయిబంధువు షిరిడీ పర్యటనకు సంబంధించిన వాట్సాప్ సంత్సంగం" లోని సాయిబంధువు తన అనుభవాలు ఇంకా ఇలా తెలియజేస్తున్నారు. తన పేరు గుప్తంగా ఉంచమన్నందువలన పేరు తెలియజేయటం లేదు. తన మాటలలోనే చదివి ఆనందించండి.
ఓం సాయిరామ్
నేను బాబాకు వినయపూర్వకమైన భక్తురాలిని. బాబాతో నాకున్న అనుభవాలను "సాయి మహారాజ్ సన్నిధి బ్లాగు" ద్వారా సాయిబంధువులతో పంచుకొనే అవకాశం ఇచ్చిన బాబాకి నా కృతఙ్ఞతలు. 2017వ సంవత్సరం గురుపూర్ణిమ రోజు బాబా ఇచ్చిన అద్భుతమైన అనుభవాన్ని మరియు మా నాన్నగారి శస్త్రచికిత్స విషయంలో బాబా మాకు చేసిన మార్గనిర్దేశం గురించి నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను.
మా నాన్నగారు ఒక హార్ట్ పేషెంట్, డయాబెటిక్ పేషెంట్ కూడా. అతని గుండెకు 2016 నవంబర్ లో శస్త్రచికిత్స జరిగింది. తరువాత కొద్దికాలానికి నాన్న తన దృష్టి లోపం గురించి ఫిర్యాదు చేశారు. నా చెల్లెలు ఒక వైద్యురాలు. ఆమె ఒక నేత్ర వైద్యుడి దగ్గరకు నాన్నని తీసుకొని వెళ్ళింది. వైద్యుడు పరీక్షించి, కంటిలో శుక్లాలు వచ్చాయని, శస్త్రచికిత్స అవసరమని చెప్పారు. కానీ, నాన్న హార్ట్ కు సంబంధించిన మందులు వాడుతున్నందున ఆ దశలో ఏ ఇతర శస్త్రచికిత్స కోసం వెళ్లకూడదని మా చెల్లి సూచించింది. కానీ నాన్న చెల్లి చెప్పిన దానికి ఒప్పుకోక, మేము తన దృష్టి సమస్యను తీవ్రంగా తీసుకోకుండా తనని నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా భావించారు. ఆ విషయమై నాన్న చాలా బాధపడుతున్నారు. బాబా దయవలన నేను అది గమనించి మళ్ళీ ఇంకోసారి నేత్ర వైద్యుడిని సంప్రదించి రెండవ అభిప్రాయం గురించి అడుగుదామని నిర్ణయించుకున్నాను.
ఇక్కడనుండి మన బాబా లీల మొదలైంది. ఆయన ప్రతి దశలో మాకు మార్గనిర్దేశం చేసారు. గురుపూర్ణిమ రోజు సాయంత్రం నేను ఉదయం నుండి బాబా కోసం ఏమీ చేయలేదని బాధపడుతూ పూజ చేస్తున్నాను. మా పూజా మందిరంలో తెల్లని బాబా విగ్రహం ఉంది. నేను ఆయనకి గోరువెచ్చని నీటితో స్నానం చేయించి, గంధము, కుంకుమ పెట్టాను. అనుకోకుండా కుంకుమ ఆయన ఒక కంటిలోకి కొద్దిగా వెళ్ళింది. సాధారణంగా నేను రుమాలును బాబాకు టవల్ గా వాడుతూ ఉంటాను. నేను ఆ రుమాలుతో కుంకుమ తొలగించటానికి ప్రయత్నిస్తున్నాను. నేను అలా ప్రయత్నిస్తున్నప్పుడు, కుంకుమ మొత్తం కన్ను అంతటికీ వ్యాపించింది. దానితో బాబా ముఖం కోపంగా మారింది. నేను చాలా భయపడిపోయి, "ఎందుకు బాబా అంత కోపంగా చూస్తున్నారు?" అని అడిగాను. సాధారణంగా నేను బాబాకి స్నానం చేయించి, ఆయనకి డ్రెస్సింగ్ చేస్తున్నప్పుడు ఆయన ముఖంలో ఎల్లప్పుడూ ఒక నవ్వు ఉంటుంది, కానీ ఇప్పుడు ఆ నవ్వు లేదు. నాకు చాలా కంగారుగా అనిపించింది. "బాబా! మీరు నాకేదో చెప్పాలనుకుంటున్నారు. అదేమిటో నాకు అర్థమయ్యేలా తెలియజేయండి ప్లీజ్" అని ప్రార్థించాను. అకస్మాత్తుగా అది నాన్న కంటికి సంబంధించినదై ఉంటుందనిపించింది. అప్పటికి 2, 3 రోజులుగా మా ఇంటిలో దాని గురించే మేము చర్చించుకుంటున్నాము. వెంటనే, "బాబా, నాన్న విషయంలో శ్రద్ధ వహించండ"ని ప్రార్థించాను. కానీ బాబా ముఖంలో తీవ్రమైన కోపాన్ని చూసి నా కళ్ళనుండి కన్నీళ్లు జలజలా రాలిపోతున్నాయి. ఆ పరిస్థితి నరకంలా అనిపించి భయపడిపోయాను. "బాబా, మీరు నా తండ్రిని జాగ్రత్తగా చూసుకోకపోయినట్లయితే నేను ఇంక మిమ్మల్ని విశ్వసించలేను. ఇప్పటికే మేము ఇంట్లో చాలా సమస్యలతో సతమతమవుతున్నాము. ఇంక క్రొత్త సమస్యలను మేము ఎదుర్కోలేము బాబా" అని చెప్పుకున్నాను. అలా చెప్పుకున్న మరుక్షణమే నా మనసులో అకస్మాత్తుగా రెండో ఆలోచన వచ్చింది. బాబా నా చేతిని వదిలిపెట్టినట్లయితే నేను ఈ ప్రపంచంలో ఓడిపోతాను. నన్నే కాదు, ఆయనను విశ్వసించని ఎవరినైనా ఆయన వదిలిపెడితే ఇంక వారికి దిక్కెవరు? బాబా లేకుండా నేను ఎలా జీవించగలను? బాబా లేకుండా నన్ను నేను ఊహించుకోలేను అనిపించింది. తరువాత పూర్తిగా ఆయనకు శరణాగతి చెందాను. ఆయన దివ్యచరణాలకు ఎలా శరణాగతి చెందాలో నాకు నేర్పించారు. ఒక్కసారి అలా శరణాగతి చెందగానే బాబా ముఖంలో నవ్వు చూడగలిగాను. అప్పుడు మా నాన్న శస్త్రచికిత్స విషయం బాబా దివ్యచరణాల వద్ద ఉంచాను. అంతా బాబా జాగ్రత్తగా చూసుకుంటారని అనుకున్నాను.

ఆలస్యం చేయకుండా మరుసటిరోజు నాన్నని తీసుకొని నేత్ర వైద్యుడి వద్దకు క్యాబ్ లో బయలుదేరాను. సాధారణంగా ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు దారంతా బాబా ఫోటోలు పరిశీలించుకుంటూ వెళ్ళడం నాకలవాటు. కానీ ఆరోజు బాబా ఎక్కడా కనిపించట్లేదు. "బాబా! దయచేసి మాతోపాటు రండి" అని ప్రార్థించాను. కనీసం హాస్పిటల్లో అయినా ఆయన కనిపిస్తారని ఆశించాను. కానీ, ఆసుపత్రిలో కూడా నాకు ఆయన కనపడలేదు. మేము అక్కడ ఫార్మాలిటీలు పూర్తి చేసి రిసెప్షన్ వద్ద వేచి ఉన్నాము. నాకు కన్నీళ్లు వస్తూ ఉన్నాయి. బాబాతో, "నేను మీ భక్తులందరిలా మంచిదానిని కానని నాకు తెలుసు. అయినప్పటికీ మీరు నన్ను అన్ని సమయాలలోనూ తోడుగా ఉండి జాగ్రత్తగా నడిపించారు. కానీ ఇప్పుడు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? మీరు డైరెక్టుగా కనిపించకపోయినా కనీసం మీ నామమైనా నాకు వినిపిస్తే చాలు, అది నాకు చాలా ధైర్యాన్నిస్తుంది" అని చెప్పుకున్నాను. డాక్టర్ మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారా అని వేచి చూస్తున్నాము, కానీ నేను మాత్రం అక్కడ ఉన్న ప్రతిక్షణం బాబా కోసం వెతుకుతున్నాను. అంతలో ఇద్దరు పిల్లలతో ఒక స్త్రీ హాస్పిటల్ రిసెప్షన్ వద్దకు వచ్చింది. ఆమె ఆ పిల్లలకి అమ్మమ్మ. ఆమె మొదటిసారిగా తన కంటి పరీక్ష కోసం వచ్చింది. రిసెప్షనిస్ట్ ఆమెని రిజిస్ట్రేషన్ ఫారంని పూర్తి చేయమని చెప్పింది. అందుకు ఆ పెద్దావిడ ఇబ్బందిపడ్డారు. దానితో రిసెప్షనిస్ట్ తానే ఫారం పూర్తి చేస్తానని చెప్పి, ఆమెను పేరు అడిగారు. ఆ స్త్రీ "సాయి" అని చెప్పింది. ఇదంతా గమనిస్తూ ఉన్న నేను ఆ పేరు వినడంతో బాబా నా ప్రార్థన విన్నారని, ఆయనే ఈ రూపంలో ఆశీస్సులు అందిస్తున్నారని చాలా ఆనందం పొందాను. అప్పుడు డాక్టరును కలవడానికి నాకు ధైర్యం వచ్చింది.
డాక్టరు పరీక్షించి కంటిశుక్లాల లెన్స్ సర్జరీకి సంబంధించి వివిధ ప్యాకేజీల గురించి చెప్పారు. శస్త్రచికిత్సకు ముందు కొన్ని పరీక్షలను కూడా సూచించారు. అంతేకాకుండా శస్త్రచికిత్సకి కార్డియాలజిస్ట్ అనుమతిని తీసుకోవాలి, ఎందుకంటే నాన్న హార్టుకి సంబంధించి రోజూ తీసుకొనే మందులను శస్త్రచికిత్సకు రెండు, మూడు రోజుల ముందు నుంచి పూర్తిగా ఆపేయాలి. నేను పరీక్షలకు అమౌంట్ చెల్లించి, చెల్లికి ఫోన్ చేసి విషయం చెప్పి, తన సీనియర్స్ ఆమోదం తీసుకోమని చెప్పాను. తను కార్పొరేట్ హాస్పిటల్లో కార్డియాలజీ విభాగంలో పనిచేస్తోంది. ఇంతలో మమ్మల్ని రక్త నమూనాలను ఇవ్వడానికి ఐ ఆస్పత్రిలో పాథాలజీ ప్రయోగశాలకు పంపించారు. నేను, నాన్న సాంకేతిక నిపుణుడికోసం వేచి ఉన్నాము. అంతలో చెల్లి ఫోన్ చేసి తన సీనియర్లు శస్త్రచికిత్సను వ్యతిరేకిస్తున్నారని, ఈ దశలో నాన్నకు ఈ సర్జరీ చాలా రిస్క్ అని కూడా చెప్పారని చెప్పింది. శస్త్రచికిత్సకు ఆస్పత్రిలో కంటి డాక్టర్స్ బాధ్యత వహించరు, అందుకే వారు కార్డియాలజిస్ట్ ఆమోదం కోరుతున్నారు. కనీసం 6 నెలల పాటు శస్త్రచికిత్సను వాయిదా వేయమని కార్డియాలజిస్ట్ చెప్పారు. సకాలంలో సమాచారం అందేలా చేసినందుకు బాబాకు కృతజ్ఞతలు చెప్పుకొని, రిసెప్షన్ వద్దకు వెళ్లి మా కార్డియాలజిస్ట్ సర్జరీకి అనుమతినివ్వలేదు, అందువలన ఇప్పుడు మాకు సర్జరీ అవసరంలేదు, కాబట్టి నేను చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వవలసిందిగా కోరాను. రిసెప్షనిస్ట్ నన్ను వేచి ఉండమని చెప్పి, తన సీనియర్లను కలవడానికి వెళ్ళింది. నేను కాస్త బయట హాస్పిటల్ ఆవరణలోకి వచ్చి మా చెల్లికి ఫోన్ చేసి శస్త్రచికిత్సను రద్దు చేసుకున్నామని తెలియచేసాను. తరువాత హాస్పిటల్ ఎదురుగా పెద్ద బాబా చిత్రపటాన్ని చూసాను. అంతకుముందు మా చెల్లితో మాట్లాడినప్పుడు కూడా బాబాని చూడలేదు. ఇంతలోనే అక్కడ బాబా ఉన్నారు. నేను, "బాబా! మీరు ఇక్కడ ఉన్నారా! దయచేసి అమౌంట్ మొత్తం తిరిగి వచ్చేలా సహాయం చేయండి. ఎందుకంటే హాస్పిటల్ సిబ్బంది అమౌంట్ తిరిగి ఇవ్వడానికి అయిష్టంగా ఉన్నట్లున్నారు" అని ప్రార్ధించాను. రిసెప్షనిస్ట్ నన్ను కౌన్సిలింగ్ గదికి తీసుకొని వెళ్లి, అమౌంట్ తిరిగివ్వడం తమ హాస్పిటల్ నియమ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకమని, కాబట్టి 6 నెలల తర్వాత శస్త్రచికిత్సకు ప్లాన్ చేసుకోమని నాకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. నేను అందుకు ఒప్పుకోలేదు. దానితో మా మధ్యన వాదన చాలాసేపు జరిగింది. చివరికి మొత్తం అమౌంట్ తిరిగి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. బాబా దయవలన మా అమౌంట్ మాకు తిరిగి రావడమే కాకుండా పెద్ద ప్రమాదం నుండి కూడా రక్షించబడ్డాము. మేము కొంతకాలం మా నాన్న శస్త్రచికిత్సను వాయిదా వేసుకున్నాము. సరైన సమయంలో నాన్న శస్త్రచికిత్సను బాబాయే ప్లాన్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. మా అందరి యోగక్షేమాలు ఆయనే చూసుకుంటారు. లవ్ యు సో మచ్ బాబా! అన్నింటికీ ధన్యవాదాలు బాబా. తెలిసీ తెలియక చేసిన మా తప్పులను మన్నించి మాపై శ్రద్ధ వహించండి.
బాబా మా అమ్మ ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త తీసుకున్నారు. ఒకసారి మా అమ్మ ఆరోగ్యం బాగాలేక చాలా బాధపడింది. పరీక్షలు చేయించి బ్లడ్ రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నాము. ఆరోజు రాత్రి నేను బాధపడుతూ, "బాబా, అమ్మకి ఆమె బ్లడ్ రిపోర్టులో డయాబెటిస్ నిర్ధారణ కాకుండా చూడండి" అని ప్రార్థించాను. రిపోర్ట్స్ ప్రతికూలంగా వస్తాయని నేను చాలా నమ్మకంతో ఉన్నాను కానీ, దురదృష్టవశాత్తు, సానుకూలంగా వచ్చాయి. అందువలన ఇప్పుడామె డయాబెటిస్ కోసం మందులు వాడుతుంది. కానీ ఆమె తన గత కర్మలనుండి ఉపశమనం పొందటానికే బాబా తనకి వేరే ఏ పెద్ద సమస్య కాకుండా డయాబెటిస్ అనే చిన్ని సమస్యను ఆమె మేలుకోసమే ఇచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను. బాబా! నా తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి. మీ దివ్యచరణాలకు నా కోటి కోటి ప్రణామములు. మీ పాదాల నుండి నన్ను దూరం చేసేది ఏదీ నాకు అవసరం లేదు. మీ బిడ్డపై ఎల్లవేళలా మీ ఆశీర్వాదములు ఉంచండి. లవ్ యు బాబా! ఈ అనుభవాన్ని పంచుకోవటానికి నాకు అవకాశం ఇచ్చినందుకు, ఇదంతా టైప్ చేస్తున్నప్పుడు మీరు నాతోపాటుగా ఉన్నందుకు మీకు నా ధన్యవాదాలు బాబా.
మరో అనుభవాన్ని రేపు మీతో పంచుకుంటాను. అందరికి సాయిరామ్.

No comments:
Post a Comment