సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1970వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయి దయ
2. మందులు వాడకుండా జ్వరం తగ్గేలా అనుగ్రహించిన బాబా
3. సాయి మహిమ అనిర్వచనీయం!

సాయి దయ

సాయి బంధువులందరికీ నమస్కారాలు. నా పేరు నాగలక్ష్మి. సాయినాథుడు ఎన్నో కష్టాల్లో మాకు తోడుగా ఉండి ఆ కష్టాలు తీర్చి మమ్మల్ని ముందుకు నడిపించారు. ఆయనకు మేము సదా కృతజ్ఞులం. ఈ బ్లాగులోని అనుభవాలు చదువుతూ సాయి మహిమలు తెలుసుకుంటూ ఒక అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతున్నాము. ఇక నా అనుభవానికి వస్తే.. 2025లో నాకు మెనోపాజ్ దశ మొదలైంది. ఆ సమయంలో నేను శిరిడీలో ఉండగా నాకు బ్లీడింగ్ మొదలైంది. అప్పుడు నేను, 'ఏంటి సాయీ! శిరిడీ వస్తే అందరి ఆరోగ్యం బాగవుతుంది. నాకేమో అనారోగ్యం ఇచ్చావు' అని మనసులో బాధపడ్డాను. అయినా సాయికి ఇలాంటి పట్టింపులు ఉండవని రోజూ ఆయన దర్శనం చేసుకొని ఇంటికి తిరిగి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత కూడా బ్లీడింగ్ అవుతూనే ఉంటే డాక్టరుని సంప్రదించాను. డాక్టర్ స్కాన్ చేసి "అంతా నార్మల్" అని చెప్పి మందులిచ్చారు. అయితే అవి వేసుకున్నాక కూడా ఏం మార్పు రాలేదు. ఇంకా నేను రోజూ బాబాని, "ఎందుకు సాయీ, నన్ను ఇంత కఠినంగా పరీక్షిస్తున్నావు?" అని కన్నీళ్ళతో ప్రార్థిస్తూ ఊదీ తీసుకున్నాను. సాయి దయవల్ల నెలన్నర తర్వాత నార్మల్ అయ్యాను. "సాయీ! మీకు శతకోటి ధన్యవాదాలు. నా బాధలు, కష్టాలు, సమస్యలు అన్ని మీకు తెలుసు. దయుంచి నేను మీ మీద విశ్వాసం కోల్పోకుండా ఉండేటట్లు చేయండి. మావారి ఆరోగ్య సమస్య కూడా తీర్చి మేమందరం సుఖసంతోషాలతో ఉండేటట్లు చేయండి. మీ కృపాదృష్టి మా మీద ఉండేటట్లు చూడండి సాయి". 



సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo