1. బాబా మనకోసం ఎప్పుడూ ఉన్నారు
2. బాబా దయతో పీజీ మెడికల్ సీటు
బాబా మనకోసం ఎప్పుడూ ఉన్నారు
నా పేరు మహేష్. బాబా నా జీవితంలో ఎన్నో మహిమలు చేశారు. కొన్నిరోజుల క్రితం నాకు జ్వరం వచ్చింది. మొదట స్వల్ప జ్వరమనిపించినా తరువాత బాగా ఎక్కువైంది. బాబా కృప ఉంటే ఏ కష్టమైనా తొలగిపోతుందని నాకు తెలుసు. అందుచేత, "నాకొచ్చిన ఈ బాధను తగ్గించమ"ని బాబాని భక్తితో ప్రార్థించి ఆయన మీద నమ్మకంతో ఊదీ నీటిలో కలిపి తాగి, మరికొంత ఊదీ నుదుటిపై రుద్దుకొని 'ఓం సాయినాథాయ నమః' అని జపిస్తూ నిద్రపోయాను. మరుసటిరోజు ఉదయం నాకెంతో తేలికగా అనిపించింది. జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. ఒక్క రోజులోనే నా ఆరోగ్యం తిరిగి సాధారణ స్థితికి వచ్చింది. ఇది కేవలం బాబా ఆశీర్వాదమే! ఈ అనుభవం బాబా దయ ఉంటే ఏ సమస్య అయినా సులభంగా తొలగిపోతుందని, బాబా మనకోసం ఎప్పుడూ ఉన్నారని మరోసారి నిరూపించింది, అలాగే నమ్మకంతో ప్రార్థిస్తే ఆయన సహాయం అనివార్యంగా అందుతుందని తెలియజేయడమే కాకుండా నాలో భక్తిని పెంచింది.
కొన్ని రోజుల క్రితం నా సోడెక్సో కార్డ్ ఎక్కడో పోయింది. ఎంత వెతికినా కనబడలేదు. దాంతో అది ఇంకా పోయినట్లేనని నాకనిపించి సహాయాన్ని అర్థిస్తూ బాబాను ప్రార్థించాను. తర్వాత ఆ కార్డ్ మా అక్క వాళ్ళింట్లో దొరికింది. ఇంకోసారి మేము బస్సులో పెంచలకోన వెళ్ళాము. స్వామి దర్శనానంతరం తిరిగి వెళ్ళడానికి బస్సులు లేకపోవడంతో ఆటోకోసం వేచి చూసాము. కానీ మా ఊరు వెళ్ళే ఆటో ఒక్కటి కూడా రాలేదు. అప్పుడు నేను బాబాను ప్రార్థిస్తే కొద్దిసేపట్లో ఒక ఆటో వచ్చింది. అతను కలువోయవకు వెళ్తున్నట్లు చెప్పాడు. అక్కడికి వెళ్లాలంటే మా వూరు మీదుగానే వెళ్ళాలి. ఇవి బాబా ఆశీస్సుల వల్లనే సాధ్యమయ్యాయని నా నమ్మకం. "హృదయపూర్వక ధన్యవాదాలు బాబా. మీ ఆశీస్సులు నాకెప్పుడూ ఉండాలి. ఎప్పటికీ మీ చరణాల వద్ద నాకు స్థానం ఉండాలి".
సాధారణంగా నేనెప్పుడూ నా ఐడి కార్డు జాగ్రత్తగా ఉంచుకుంటాను. అలాంటిది ఒకరోజు నా ఐడి కార్డు ఎక్కడా కనిపించలేదు. నా టేబుల్, జేబులు, ఇంట్లో సాధారణంగా పెట్టే అన్ని చోట్ల చూసినా కనిపించలేదు. ఇది కాస్త టెన్షన్ పెంచే విషయం అయినందున, “బాబా! మీరు సహాయం చేస్తే తప్ప అది దొరకదు” మనసారా బాబాను ప్రార్థించాను. అప్పటికే నేను నా బ్యాగ్ ఎన్నోసార్లు వెతికాను. కానీ బాబాను ప్రార్థించిన తర్వాత మళ్లీ వెతకాలని ఏదో తెలియని ప్రేరణ బలంగా కలిగింది. దాంతో బ్యాగ్ తెరిచి మరోసారి నిశితంగా పరిశీలించాను. ఆశ్చర్యం ఏమిటంటే, నా ఐడి కార్డు అందులోనే ఉంది. దాన్ని చూసిన వెంటనే హృదయం బాబాపట్ల కృతజ్ఞతతో నిండిపోయింది. అది ఆయన అనుగ్రహం కాకపోతే మరేంటి? ఈ చిన్న అనుభవం నాకు మరోసారి తెలియజేసింది, 'ఏదైనా సమస్య వచ్చినప్పుడు బాబాను నమ్మి ప్రార్థిస్తే, ఆయన తప్పకుండా మార్గం చూపిస్తార'ని. "ధన్యవాదాలు బాబా".
కొన్ని రోజుల క్రితం మా వాషింగ్ మెషిన్ పైపు లీకేజీ సమస్య వచ్చింది. పైపు పగిలిపోయి నీరు బయటకు పోతుండేది. అందువల్ల మెషిన్ ఉపయోగించడం చాలా కష్టంగా మారింది. మొదట అది చిన్న సమస్యగా అనుకుని నేనే సరిచేయాలని ప్రయత్నించాను కానీ, అది అంత సులభం కాకపోయింది. టెక్నీషియన్‌కి ఫోన్ చేస్తే రెండు, మూడు రోజులు పడుతుందని చెప్పాడు. ఆ మాట నాకు ఆందోళన కలిగించింది. ఎందుకంటే, రోజువారీ పనులకు వాషింగ్ మెషిన్ చాలా అవసరం. నాకేం అర్థంకాక సాయిబాబాను ప్రార్థించి, "సమస్య త్వరగా పరిష్కారం కావాల"ని కోరుకున్నాను. ఆశ్చర్యకరంగా కొద్ది గంటల్లోనే ఇంకొక టెక్నీషియన్ నుండి కాల్ వచ్చింది. అతను అదేరోజున రావడానికి సిద్ధంగా ఉన్నానని వెంటనే వచ్చి మెషిన్ తనిఖీ చేసి, సమస్యను గుర్తించి, అవసరమైన విడి భాగం దగ్గరే ఉండడంతో వెంటనే మరమ్మతు చేశాడు. ఇది బాబా ఆశీర్వాదం కాక మరేమిటి? నా ఊహకు కూడా అందని విధంగా సమయానికి వ్యక్తిని పంపి చాలా సులభంగా సమస్యను పరిష్కారం చేసారు. "ఎప్పుడూ నా పక్కనే ఉండి నా సమస్యలను సులభంగా పరిష్కరిస్తున్నందుకు హృదయపూర్
Sai inka yennallu ee pariksha
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house lo problem solve cheyandi pl
ReplyDeleteOm sai Sri sai jai jai sai...plz baba family lo andariki health bagundela chei sai🙏🙏
ReplyDeleteOm Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.
ReplyDeleteOm Sai Ram 🙏🙏🙏🙏❤️
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sai Ram
ReplyDelete