సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1977వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయితో చెప్పుకుంటే కానిది ఏదీ లేదు
2. బాబా ఉన్నారని పూర్తి నమ్మకంతో ఉంటే ఆయన మన జీవితంలో వెలుగు నింపుతారు

సాయితో చెప్పుకుంటే కానిది ఏదీ లేదు

నా పేరు మణి. మాది హైదరాబాద్. సాయితో చెప్పుకుంటే కానిది ఏదీ లేదు. సాయి నాకు చాలా అనుభవాలు ఇచ్చారు. మేము మా మనవడి మొదటి పుట్టినరోజు చేసిన తర్వాత మా కులదైవం సత్తెమ్మతల్లి సంబరం చేయడానికి మా ఊరు వెళ్ళాం. అక్కడ అంతా బాగా జరిగిన తర్వాత శనివారంనాడు తిరిగి వచ్చాం. ఆరోజు హఠాత్తుగా మా మనవడికి వాంతులు, విరోచనాలు చాలా ఎక్కువగా అయి బాగా నిరసించిపోయాడు. మర్నాడు ఆదివారం మావారి ఆబ్దికం ఉన్నందున మాకు ఏం చేయాలో తోచలేదు. నేను సాయినే నమ్మి, "బాబా! ఇంటి దైవానికి సంబరం చేసి వచ్చేసరికి ఇలా అయిందేంటి? బాబుకు నీరసంగా ఉంటే ఎవరికీ ఏమీ తోచట్లేదు. రేపు నా కొడుకు తన బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంది. ఆ కార్యక్రమం పూర్తి చేయాల్సిన బాధ్యత మీదే తండ్రీ. ఆ సత్తమ్మతల్లి, మీరు కలిసి బిడ్డకు ఆరోగ్యం ప్రసాదించండి. రేపటికి బాబుకు తేలికపడాలి" అని చెప్పుకొని బాబుకు ఊదీ పెట్టి ఆయన మీదే భారం వేసాను. తర్వాత బాబుని హాస్పిటల్‌కి తీసుకెళ్లి వచ్చాము. ఆ రాత్రి బాబు నిద్రపోతాడో, లేదో అని చాలా భయమేసింది. కానీ బాబా దయవల్ల బాబు కొంచెం కోలుకొని బాగానే నిద్రపోయాడు. తెల్లారి జరగాల్సిన కార్యక్రమం సజావుగా సాగింది. ఆ సాయంత్రానికి బాబు బాగా కోలుకున్నాడు. కానీ తర్వాత రోజు నుంచి ఇంట్లో అందరికీ కొంచెం నలతగా అనిపించింది. అప్పుడు నేను, "బాబా! నీదే భారం తండ్రి. శివరాత్రి వస్తుంది. ఆరోజుకి అందరూ కోలుకొని ఆనందంగా శివయ్యను ప్రార్థించుకొనేలా చేయి తండ్రీ" అని బాబాకి చెప్పుకొని, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని అనుకున్నాను. సాయి పిలిస్తే పలికే దైవం కదా! అన్ని సమస్యలను తొలగించి అందరం ఆనందంగా శివయ్యకు పూజ చేసుకునేలా ఆశీర్వదించారు బాబా. "ధన్యవాదాలు సాయి".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo