సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1980వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. 'నేను మీతో ఉన్నాన'ని అభయమిచ్చిన బాబా
2. బాబా చరణం సర్వదా శరణం శరణం

'నేను మీతో ఉన్నాన'ని అభయమిచ్చిన బాబా  

సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు శిరీష. నేను చాలా రోజుల తర్వాత నా అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. నిజానికి ఈ అనుభవాన్ని ఒక నెల క్రిందటే వ్రాసి బ్లాగుకి పంపితే, 'వివరంగా లేదు. మళ్ళీ వివరంగా వ్రాసి పంపండి" అని బదులిచ్చారు. అది చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగినప్పటికీ, 'జాగ్రత్తగా అనుభవాన్ని చదివి, ఎలా వ్రాశానో విశ్లేషించినందుకు' సంతోషంగా అనిపించింది. నేను మొదటిసారి నా అనుభవం వ్రాసేటప్పుడు కొన్ని విషయాలు అసంపూర్తిగా వ్రాశాను. అందుకే బ్లాగు వారు నన్ను అలా అడిగారు. సరే, ఈసారి పూర్తిగా వ్రాయడానికి ప్రయత్నిస్తాను.

2025, జనవరి నెల మొదటి వారంలో 73 సంవత్సరాల మా అమ్మకు హార్ట్ ప్రాబ్లం ఉందని తెలిసింది. నేను బాబాను, "అమ్మకు ఏమీ కాకూడద"ని ప్రార్థించి విజయవాడలోని కార్డియాలజిస్ట్ దగ్గరకి అమ్మని తీసుకొని వెళ్ళాను. డాక్టర్ అమ్మకి ఎకో టెస్ట్ చేయాలని, ఆ టెస్టు చేసే చోట కూర్చోమన్నారు. నేను అక్కడ ఒక కుర్చీలో కూర్చుని, "బాబా! మాకు తోడుగా ఉండండి. అమ్మకు పెద్ద సమస్యేమీ లేకుండా చూడండి" అని బాబాతో చెప్పుకున్నాను. తర్వాత నేను తలపైకెత్తి చూస్తే, వెనక పెద్ద బాబా ఫోటో దర్శనమిచ్చింది. నేను సరిగ్గా ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉన్నాను. నేను అక్కడ కూర్చొనే ముందు నా కుర్చీ వెనకగా ఉన్న ఆ ఫోటోని చూడలేదు. సరిగ్గా ఆయన్ని తలుచుకోగానే ఆయన కనిపించి, 'నేను మీతో ఉన్నాన'ని చెప్తున్నట్లనిపించి నాకు చాలా సంతోషంగా, ధైర్యంగా అనిపించింది. ఎకో టెస్టు చేసిన తర్వాత అదేరోజు మధ్యాహ్నం అమ్మకు యాంజియోగ్రామ్ చేసి, "సమస్య ఉంది. సర్జరీ చేయాలి. హైదరాబాదులో అయితే బాగుంటుంద"ని చెప్పి సాయంత్రం ఇంటికి వెళ్లిపోవచ్చని చెప్పారు. నిజానికి మేము మూడు రోజులు హాస్పిటల్లో ఉండాల్సి ఉంటుందని వెళ్ళాము. కానీ అదేరోజు సాయంత్రానికి డిస్చార్జ్ చేశారు. అంతా బాబా దయ.

తర్వాత రెండు వారాలకి మా తమ్ముడు యుఎస్ నుండి వచ్చి అమ్మను హైదరాబాదులోని కార్డియోథొరాసిక్ సర్జన్ దగ్గరకి తీసుకొని వెళ్ళాడు వెళ్ళాడు. కానీ మేము కలవాల్సిన సర్జన్ ముందురోజు నుంచి సెలవులో ఉన్నారు. దాంతో అతని అసిస్టెంట్ డాక్టరుతో మాట్లాడి అమ్మకి అన్ని టెస్టులు చేయించాడు తమ్ముడు. తర్వాత రోజు అనుకోకుండా మేము కలవాలన్న సర్జన్ హాస్పిటల్‌కి వచ్చి అమ్మను చూసి వారం తర్వాత సర్జరీ చేయడానికి ప్లాన్ చేసి వెళ్లారు. అయితే సర్జరీ చేయాల్సిన రోజు కూడా ఆ సర్జన్ సెలవులో ఉన్నారు. అయినప్పటికీ హాస్పిటల్‌కి వచ్చి సర్జరీ చేసి వెళ్లారు. అలా జరగకపోయుంటే మా తమ్ముడు సెలవులు పొడిగించుకోవాల్సి వచ్చేది. అంతా ఎవరో ముందుగా ప్రణాళికి వేసినట్లు ఏ ఆటంకం లేకుండా సవ్యంగా జరిగిపోయాయి. బాబా దయవల్ల సర్జరీ విజయవంతమై అమ్మ చక్కగా కోలుకుంది. సాధారణంగా అలాంటి ఆపరేషన్ జరిగాక కనీసం ఒక ఆరు వారలు విశ్రాంతి అవసరం ఉంటుంది. కానీ అమ్మ ఆరు రోజుల్లోనే లేచి పనులు చేసుకోగలిగింది. మా ఇంట్లో వాళ్ళు ఎవరూ బాబాను నమ్మనప్పటికీ ఆయన దగ్గర ఉండి అన్నీ చూసుకున్నారనిపించింది. ఎందుకంటే, 'బాబా తమ భక్తుల కుటుంబసభ్యుల బాధ్యత కూడా వహిస్తారు'.

2025, మార్చి మొదటి వారంలో మా అమ్మాయికి ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఆ సమయంలో ఆరోగ్య సమస్య వచ్చి తను చదువుకోలేకపోయింది. నేను 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని 108 సార్లు జపించి, "అమ్మాయి పరీక్ష బాగా వ్రాయగలిగితే గుడికి వచ్చి కొబ్బరికాయ కొడతాన"ని బాబాను ప్రార్థించాను. ఏమీ చదవకపోయినా మర్నాడు పరీక్ష బాగా వ్రాసానని మా అమ్మాయి చెప్పింది. నేను సంతోషంగా వెంటనే బాబా గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి, ఆయనకు ధన్యవాదాలు చెప్పుకొని వచ్చాను.


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo