సాయి వచనం:-
'లోకులు పలుగాకులు. నీ మానాన నీవుండటం మంచిది.'

'లక్ష్యాన్ని చేరడం ఒక్కటే ప్రధానం కాదు. ‘ఆ లక్ష్యాన్ని బాబా చూపిన శుభ్రమార్గంలోనే చేరామా? లేదా?’ అనేది కూడా ప్రధానం.' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1979వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఇబ్బంది లేకుండా దయ చూపిన బాబా
2. అడిగితే కాదనకుండా ఏదైనా ఇస్తారు బాబా

ఇబ్బంది లేకుండా దయ చూపిన బాబా

శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై. నా పేరు చైతన్య. ముందుగా సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. ఈ 'సాయి మహరాజ్ సన్నిధి' బాబా అనుగ్రహ లీలల భాండాగారం. దీనిలో ఎవరికి ఏది కావాలన్నా, ఏ సమస్య ఉన్నా సమాధానం దొరుకుతుంది. బాబా తమ లీలలను తమ భక్తులతో ఈ బ్లాగులో వ్రాయించుకుంటూ తమ భక్తులకు శ్రద్ధ, విశ్వాసాలు పెంపొందేలా అనుగ్రహిస్తున్నారు. ఇక నా అనుభవాల విషయానికి వస్తే.. మా తమ్ముడు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. తను ఇండియా వచ్చి దాదాపు 6 సంవత్సరాలైంది. అందువల్ల మా తల్లిదండ్రులు తనని చూడాలని ఉందని ఒకసారి ఇండియా రమ్మన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల మా తమ్ముడికి, తన భార్యకి మధ్య మనస్పర్థలు వచ్చి మా మరదలువాళ్లు మా తమ్ముడు మీద పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టారు. ఆ కేసు వల్ల తమ్ముడు ఇండియా వస్తే సమస్య అవుతుంది. తను ఇండియా వస్తూనే ఎయిర్‌పోర్ట్‌వాళ్లు కేసు పెట్టబడిన సదరు పోలీస్ స్టేషన్‌కి సమాచారం ఇస్తారు. దాంతో పోలీసులు వచ్చి తమ్ముడిని స్టేషన్‌కి తీసుకెళ్తారు. అయినా మేము బాబా మీద భారమేసి తమ్ముడితో, "నువ్వు ఇండియాకి రా. మనకి సహాయం చేయడానికి బాబా ఉన్నారు" అని చెప్పాము. దాంతో మా తమ్ముడు ఇండియా రావడానికి టికెట్ బుక్ చేసుకున్నాడు. మేము అనుకున్నట్లే తమ్ముడు హైదరాబాద్ రాగానే ఎయిర్‌పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్ చెకప్ వద్ద "మీ మీద పోలీసు కేసు వుంది. కాబట్టి మీరు వెళ్ళడానికి  వీలు లేదు. మీ మీద కేసు పెట్టబడిన సదరు పోలీస్ స్టేషన్‌వాళ్ళు వచ్చి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తారు" అని చెప్పారు. మేము చాలా కంగారుపడ్డాము. ఎందుకంటే, కేసు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టి ఉన్నందు వల్ల అక్కడినుండి పోలీసులు వచ్చేవరకు ఎయిర్పోర్టులో వేచి ఉండాలి. కాబట్టి మేము, "బాబా! ఎలాగైనా మీరే రక్షించండి. ఇప్పుడు అక్కడికి వెళ్లకుండా తర్వాత పోలీస్ స్టేషన్లో హాజరయ్యేలా చూడండి" అని బాబాని వేడుకున్నాము. బాబాని ప్రార్థిస్తే ఆయన సహాయం ఏదో ఒక రూపంలో అందుతుంది కదా! మేము మాకు  తెలిసినవాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్తే, "ఇప్పుడు పంపించండి. తర్వాత వచ్చి హాజరవవుతార'ని చెప్పి వాళ్ళు మెయిల్ పెట్టారు. దాంతో ఏ ఇబ్బంది లేకుండా మా తమ్ముడు క్షేమంగా ఇంటికి వచ్చాడు. ఇండియా నుంచి తిరిగి విదేశాలకు వెళ్లేటప్పుడు కూడా అదే సమస్య వస్తుందని భయపడ్డాను. కానీ సాయినాథుని దయవల్ల ఏ ఇబ్బంది కలగలేదు. ఇదంతా బాబాకి తప్ప ఎవరికీ సాధ్యం కాదు. అంతా ఆయన దయ. "శతకోటి ప్రణామాలు బాబా".

అడిగితే కాదనకుండా ఏదైనా ఇస్తారు బాబా  

నా పేరు గురుప్రసాద్. నేను గత సంవత్సరం నుంచి బ్యాంకు లోన్ కోసం ప్రయత్నిస్తున్నాను. 2024లో లోన్ కోసం అప్లై చేస్తే, తిరస్కరింపబడింది. బ్యాంకువాళ్ళని కారణమేంటని అడిగితే, ఏమీ చెప్పలేదు. తరువాత 2025, ఫిబ్రవరి నెల చివరివారంలో, 'ఈసారి బాబా దయవల్ల లోన్ రావాలి' అని గట్టిగా అనుకొని మరో ప్రయత్నంగా మళ్ళీ అప్లై చేసి, అపాయింట్‌మెంట్ బుక్ చేసాను. అయితే అప్పోయింట్మెంట్ ఒక బ్రాంచ్‌లో ఉంటే పొరపాటున వేరే బ్రాంచ్‌కి వెళ్ళాను. అక్కడివాళ్ళు "రాంగ్ లొకేషన్‌కి వచ్చారు. ఇక్కడ ఏ అపాయింట్మెంట్లు లేవు" అని చెప్పారు. నేను బాధతో ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతూ మనుసులో, 'ఇలా అయ్యిందేంటి బాబా?' అని అనుకున్నాను. 10 నిమిషాలలో నేను అపాయింట్‌మెంట్ బుక్ చేసిన బ్యాంకువాళ్ళు నాకు ఫోన్ చేసి, "మీరు ఎక్కడ ఉన్నారు?" అని అడిగారు. నేను, "పొరపాటున వేరే బ్రాంచ్‌కి వచ్చాను" అని చెప్పాను. వాళ్ళు, "కలత చెందనవసరం లేదు. నేను ఫోన్లో మీ వివరాలు తీసుకుంటాను" అని చెప్పి అన్ని వివరాలు తీసుకొని, "సాయంత్రం మీకు ఫోన్ చేస్తాను" అని చెప్పారు. అలాగే సాయంత్రం మళ్ళీ కాల్ చేసి కొన్ని వివరాలు అడిగితే, నేను చెప్పాను. కొన్ని నిమిషాల తర్వాత అతను లోన్ ఆమోదింపబడినట్లు నాకు ఇమెయిల్ చేసాడు. నేను చాలా సంతోషించాను. అతని రూపంలో బాబానే అంతా చేసారు. బాబా మేలు నేను ఎన్నటికీ మార్చిపోను. నా బావమరిదికి కూడా ఇలాగే లోన్‌కి అప్లై చేస్తే, రాలేదు. నేను తనకి కూడా లోన్ రావాలని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల నాకు లోన్ వచ్చేలా చేసిన అతని ద్వారా నా బావమరిదికి కూడా లోన్ వచ్చింది. బాబాని అడిగితే, కాదనకుండా ఏదైనా ఇస్తారు. "ధన్యవాదాలు బాబా".

10 comments:

  1. Baba court ki vadhu baba naku na bartha kavali sai

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Baba, provide peace and wellness to my parents 💐💐💐💐

    ReplyDelete
  4. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏

    ReplyDelete
  5. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on my family members forever 🙏🙏💐💐

    ReplyDelete
  6. Baba.. na puttintlo, mettinintlo anni problems unnai.. thammudiki manasika paristhithi sariga undadam ledu. Tanaki, tana bharyaki godavalavutunnai.. Amma ki sakthi taggipotondi, health sariga undadam ledu.. nannaki heart problem vachi mandulu vadututunnaru, tammudi peru meeda loan tiskunnavallu kattakunda ibbandi pettaru, recent ga intlo gold ring poindi. Maa adapaduchulaki age ekkuva autondi Kani pelli set a Avadam
    Ledu, athagaru hatathuga Kalam chesaru, dayadulatho bhutagadalu, papa school ki vellanu ani godava chestondi, anukunna panulemi avvadam ledu.. inka ennallu maku karmaphalam.. Chala samvatsaraluga badhapadtunnam.. ika chalinchu baba.. O samartha Sadguru, ma kashtalani tolaginchi, ma karmaphalanni apuccheyi deva🥲… nuvvichina mataprakaram ma intlo subhakaryalu jaripinchu tandri🙏🙏🙏

    ReplyDelete
  7. ఓంసాయిరాం. నబిడ్డకిఆరోగ్యానిప్రసాదనిచూసైతండ్రి.

    ReplyDelete
  8. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.

    ReplyDelete
  9. Om Sairam
    Sai always be with me 💐💐💐💐💐

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo