ఈ భాగంలో అనుభవాలు:
1. అడిగిన వెంటనే అద్భుతాలు చేస్తారు బాబా
2. బాబా ఊదీ పరమౌషధం
3. మొబైల్ దానంతట అదే ఆన్ అయి మామూలుగా పని చేసేలా దయ చూపిన బాబా
అడిగిన వెంటనే అద్భుతాలు చేస్తారు బాబా
నా పేరు మంజు. గత సంవత్సరం(2024) మా చిన్నపాప ఎంసెట్ పరీక్ష కోసం కుల ధృవీకరణ పత్రం అప్లై చేస్తే, 'సమీపంలో ఎన్నికలు ఉండటం వల్ల ఎలక్షన్ కోడ్ వస్తే సర్టిఫికెట్ రావడం కష్టమని' చెప్పారు. నేను ఆ సర్టిఫికెట్ కోసం ఒక నెల రోజులు తిరిగి తిరిగి అలసిపోయాను కానీ, పని జరగలేదు. ఇక అప్పుడు బాబాపై భారమేసి ఒకరోజు ఉదయం నేను పత్రాలు పట్టుకొని వెళ్లి, ఎంఆర్ఓ ఆఫీసులో సమర్పించాను. కొంత డబ్బు ఖర్చు అయినా గాని బాబా దయవల్ల ఎన్నికల కోడ్ రావడానికి 2 గంటల ముందు నాకు కుల ధృవీకరణ పత్రం జారీ అయింది. 3 రోజుల తర్వాత నేను సచివాలయంలో కుల ధృవీకరణ పత్రాన్ని తీసుకున్నాను. కుల ధృవీకరణ పత్రం రాదనుకున్నప్పటికీ చెప్పుకుంటే, ఒక్క రోజులో వచ్చేలా చేశారు బాబా.
2025, మార్చి 21న నా భర్త యధావిధిగా ఆఫీసుకి వెళ్ళారు, మా అమ్మాయి కాలేజీలో జరుగుతున్న క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్ళింది. కొంతసేపటికి మా అమ్మాయి నాకు ఫోన్ చేసి మొదటి రౌండ్లో సెలెక్ట్ అయి, రెండో రౌండ్‌కి వెళ్ళాను అని చెప్పింది. కొన్ని గంటల తర్వాత తను ఇంటికి వచ్చి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యానని చెప్పింది. ఆ విషయం నేను నా భర్తకి చెపుదామని పదిసార్లు ఫోన్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు. డ్రైవింగ్‌లో ఉన్నారనుకున్నాను. కానీ మా అమ్మాయి కూడా చాలాసార్లు ఫోన్ చేసి, మెసేజ్‌లు పెట్టింది. వాటికి కూడా ఆయన నుండి ఏ స్పందన రాలేదు. దాంతో తను చాలా టెన్షన్ పడింది. నేను కూడా బాగా టెన్షన్ ఫీల్ అయి, ఏదైనా సమస్య అయిందేమోనని ఏడ్చేసాను. పూజగదిలో బాబా దగ్గరకు వెళ్లి దణ్ణం పెట్టుకొని, ఊదీ ధరించి, "నా భర్త క్షేమంగా ఉండాలి. ఆయనే నాకు ఫోన్ చేసేలా చేయండి బాబా" అని వేడుకున్నాను. 10 నిమిషాల్లో నా భర్త నాకు ఫోన్ చేసి, "ఎండ వేడికి ఫోన్ స్క్రీన్ బ్లాంక్ అయిపోయి ఏమీ కనిపించలేదు. అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు చూసి కాల్ బ్యాక్ చేశాను" అని చెప్పారు. ఇదే కదా, బాబా మహిమ! అడిగిన వెంటనే అద్భుతాలు చేస్తారు బాబా. "చాలా ధన్యవాదాలు బాబా. మా పెద్దమ్మాయి RRB పరీక్షకు దరఖాస్తు చేసింది. మీ అనుగ్రహంతో తనకి ఉద్యోగం వచ్చేలా చూడు తండ్రీ".
బాబా ఊదీ పరమౌషధం
నేను ఒక సాయి భక్తురాలిని. నా చేయి పట్టుకుని నడిపిస్తున్న బాబాకు వేలవేల ధన్యవాదాలు. నేను బాబాను అడిగి(చీటీలు వేసి) ప్రతి నిర్ణయం తీసుకుంటాను. ఒక్కోసారి బాబా నిర్ణయం అనుకూలంగా రాకపోయినా చివరికి అదే సరైనదని ఋజువవుతుంది. ఒక అదివారం నాకు స్వల్ప గొంతునొప్పితో బాగా నీరసంగా అనిపించి రెండు, మూడు రోజులు అలానే ఉంది. నేను ఆ మూడు రోజులు ఆఫీసుకి వెళ్ళలేదు. ఇంక నాల్గవ రోజు ఒళ్ళు కాస్త వేడిగా ఉండటంతోపాటు జ్వరమొచ్చినట్లు బాగా నీరసం, అవేకాక మెడ భాగంలో కుడివైపున నొప్పిగా కూడా ఉండింది. డాక్టర్ దగ్గరకి వెళ్తే, "మెడ వాపు లాంటిది ఏమీ లేదు" అన్నారు. నేను, "జ్వరం వచ్చినట్లు ఉంద"ని అంటే, యాంటీబయాటిక్స్ ఇచ్చి, "రెండు రోజులు చూడండి. జ్వరం వస్తే టెస్టులు చేద్దామ"ని అన్నారు. యాంటీబయాటిక్స్ వేసుకోవడం నాకు ఇష్టముండన్నందున నేను డాక్టరుతో, "ముందు టెస్టులు చేయండి. ఏమైనా తేడా ఉంటే యాంటిబయోటిక్స్ వేసుకుంటాన"ని అన్నాను. అయినా డాక్టర్ యాంటిబయోటిక్స్ వేసుకోండి" అన్నారు. కానీ నేను ఆ విషయం గురించి బాబాను అడిగితే, 'వేసుకోవద్ద'ని వచ్చింది. అదివరకు ఇలానే ఆరోగ్య సమస్యలొచ్చి లింఫ్ నోడ్(రసగ్రంథి) ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ విషయం గుర్తొచ్చి నాకు భయమేసి బాబాను వేడుకొని, నమ్మకంతో ఊదీ వాడాను. బాబా దయవల్ల ఈసారి ఇన్ఫెక్షన్కి దారి తీయకుండా మెడ నొప్పి, నీరసం అన్నీ తగ్గిపోయాయి. బాబా ఊదీ పరమౌషధం. "బాబా! మీ ఋణం తీర్చలేనిది. మీ నామాన్ని స్మరిస్తూ ఎల్లప్పుడూ మిమ్మల్ని గుర్తుంచుకోవడమే మేము చేయగలిగింది. మీకు సర్వస్య శరణాగతి చెందిన నా చేసి పట్టుకుని నడిపించి జీవితపరమావధిని ధాటించండి బాబా".
మొబైల్ దానంతట అదే ఆన్ అయి మామూలుగా పని చేసేలా దయ చూపిన బాబా
అందరికీ నమస్కారం. నా పేరు ఎస్.సాయి. ఒకసారి చాలా ఖరీదు పెట్టి తీసుకున్న మావారి మొబైల్ కొద్దిరోజులకే హఠాత్తుగా ఆగిపోయింది. ఆ సమయంలో మేము భూ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నాము. ఆ భూమికి సంబంధించిన ఫోటోలన్నీ ఆ ఫోన్లోనే ఉన్నాయి. ఆ ఫోన్ తిరిగి ఆన్ అవ్వకపోవడంతో మావారు దాన్ని సర్వీస్ సెంటర్‌కి తీసుకొని వెళ్తే, దానిలోని ఫొటోలన్నీ పోతాయని చాలా బాధపడ్డారు. అప్పుడు నేను, "ఈ ఫోన్ సాయంత్రం లోపల అదే ఆన్ అవ్వాలి బాబా" అని అనుకున్నాను. ఆ మధ్యాహ్నం మావారు మొబైల్ దానంతట అదే ఆన్ అయి మామూలుగా పని చేస్తుందని చెప్పారు. అది విని నాకు చాలా సంతోషమేసి నా ఆనందాన్ని ఇలా మీతో పంచుకున్నాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై.
Om Sai Ram
ReplyDeleteOm Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐
ReplyDeleteOm sri sai ram 🙏
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteSai always be with me
Baba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house lo unna problem solve cheyandi pl
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteసాయీ ! నాకు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో తెలియదు. కానీ మీమీద నమ్మకంతో జీవితాన్ని గడుపుతున్నాను
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDeleteOm Sri Sai Arogyakshemadhaaya Namaha 🙏🙏🙏