సమయానికి ప్రాజెక్టు ఇచ్చి సమస్యను పరిష్కరించిన బాబా
నా పేరు మహేశ్వర. నా ఐటీ కెరీర్లో మరపురాని అనుభవం నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. నేను ఒక ప్రాజెక్ట్‌లో 10 సంవత్సరాల 10 నెలలు పని చేశాను. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్‌ను క్లయింట్ స్వయంగా నిర్వహించుకోవడానికి తీసుకున్నారు. దాంతో నేను ఆ ప్రాజెక్ట్ నుంచి రిలీవ్ అయి 45 రోజులకు పైగా బఫర్ పూల్‌లో ఉన్నాను. అప్పుడు నేను, నాతోపాటు కొంతమంది ఒక ఇంటర్నల్ ప్రాజెక్ట్‌కోసం ఎంపికయ్యాము. కానీ ఆ ప్రాజెక్ట్ ఇంకా క్లయింట్ అనుమతుల కోసం ఎదురుచూస్తున్న కారణంగా మమ్మల్ని అధికారికంగా ఆ ప్రాజెక్టులో నియమించలేదు. కానీ హామీ ఇచ్చి అనుమతులు వచ్చేవరకు వేచి చూడాలని చెప్పారు. కాబట్టి మేము ఇతర ఇంటర్నల్ ప్రాజెక్ట్ ఇంటర్వ్యూలకు హాజరు కాలేదు. తీరా 60 రోజుల నిరీక్షించాక ప్రాజెక్ట్‌కి అనుమతులు రానందున మమ్మల్ని కొత్త అవకాశాలు వెతుక్కోవాల్సిందిగా చెప్పారు. వెంటనే నేను ఇంటర్నల్ ప్రాజెక్ట్స్కోసం ప్రయత్నించడం మొదలుపెట్టాను కానీ, నాకు ఏ అవకాశం లభించలేదు. నేను బయట అవకాశాల కోసం కూడా ప్రయత్నించినప్పటికీ అవి కూడా ఫలితాన్ని ఇవ్వలేదు. ఇదే సమయంలో మా హెచ్ఆర్ వారం రోజుల్లోగా నేను ప్రాజెక్టులో ఉండాలని ఒత్తిడి తెచ్చారు. దాంతో నేను ఎంతో టెన్షన్లో పడిపోయాను. ఆ వారంలో కూడా నేను కంపెనీ లోపలే కొన్ని ఇంటర్వ్యూలకు హాజరయ్యాను కానీ, ప్రయోజనం లేకపోయింది. వారం గడిచాక ఒక రోజు సాయంత్రం 5:20కి హెచ్ఆర్ మళ్ళీ కాల్ చేసి, రేపు ఆఫీసుకు వచ్చి, తమని కలిసి మాట్లాడాలని చెప్పారు. వాళ్ళు రాజీనామా పత్రాలపై సంతకం చేయమనడిగే అవకాశం ఉందనిపించి
నా మనసు చాలా ఆందోళనకు గురైంది. ఆ రోజు నేను అప్పటికే కొత్త ప్రాజెక్ట్ కోసం మొదలుపెట్టిన సాయి దివ్యపూజ మూడో వారం పూజ చేసాను. అదేరోజు సాయంత్రం 6:30కి నా సహోద్యోగి నుండి, తన మేనేజర్ నన్ను తమ ప్రాజెక్ట్‌లోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు మెసేజ్ వచ్చింది. అది చూసి నాకు కన్నీళ్లు ఆగలేదు. నేను వెంటనే ఆ మేనేజర్ని సంప్రదించి, అందుకు సంబంధించిన మెయిల్ హెచ్ఆర్కి పెట్టమని కోరాను. ఆయన వెంటనే ఆ పని చేశారు. మరుసటిరోజు నేను హెచ్ఆర్తో చాట్ చేస్తే, కలవనవసరం లేదని చెప్పారు. ఇది పూర్తిగా సాయి కృపతోనే జరిగింది. ఆయన నేను హెచ్ఆర్ ను కలవడానికి వెళ్ళాక ముందే నాకు ప్రాజెక్ట్‌ను కేటాయించి సమస్యను పరిష్కరించారు. ఇది నా జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన, ఆశ్చర్యకరమైన మహిమ అని చెప్పుకోవచ్చు. ఈ అనుభవాన్ని నేను నా చివరి శ్వాస వరకు గుర్తుంచుకుంటాను. "కష్ట సమయాల్లో నన్ను మార్గనిర్దేశం చేస్తున్నందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు బాబా".
మా ఇంటి పనిమనిషి ఒక రెండు రోజులు ఆలస్యంగా వచ్చింది. 2025, మార్చి 5న అయితే ఆమె రాదేమోననిపించి ఒక్కడినే పని చేసుకోవాల్సి వస్తుందేమోనని కొంచం ఆందోళన చెందాను. అప్పుడు, "బాబా! దయచేసి పనామెను పంపించండి" అని మనస్ఫూర్తిగా బాబాను ప్రార్థించాను. బాబా కృపవలన కొద్దిసేపటికి ఆమె వచ్చింది. ఆమెను చూడగానే నాకు ఎంతో ఉపశమనం కలిగింది. తరవాత 2025, మార్చి రెండో వారంలో నా యూనివర్సల్ అడాప్టర్ రెండు రోజులు పని చేయలేదు. ఎన్నిసార్లు ప్లగ్ మార్చినా, కొత్త సాకెట్‌తో కనెక్ట్ చేసినా ఉపయోగం లేకుండా పోయింది. అది నా రోజువారీ పనులకు చాలా అవసరమైనదైనందున నాకు చాలా బాధేసి ఎప్పటిలాగే నా ప్రియమైన సాయిబాబాను ఆశ్రయించి, భక్తితో మనస్ఫూర్తిగా ప్రార్థించాను. తర్వాత బాబా సహాయం చేస్తారని నమ్మకంతో అడాప్టర్ మళ్లీ ఉపయోగించడానికి ప్రయత్నించాను. ఈసారి అది పని చేయడం మొదలు పెట్టింది. అది చూసి నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇది పూర్తిగా బాబా కృప అని నాకు తెలుసు. నాతోపాటు ఎప్పుడూ ఉంటున్నందుకు, చిన్న చిన్న విషయాల్లో కూడా నా మనసు బాధపడకుండా చూసుకుంటున్నందుకు బాబాకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family forever 🙏🙏💐💐
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house lo problem solve cheyandi pl marriage visham gavissigi poinau pl doit immediately baba
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sai Ram
ReplyDelete