ఈ భాగంలో అనుభవాలు:
1. బాబా ఏదైనా మనకి అందకుండా చేస్తే, దానికంటే ఉన్నతమైనది అనుగ్రహించడానికి మాత్రమే!
2. తక్షణమే నిదర్శనమిచ్చిన బాబా
3. బాబా కృపాదృష్టి
బాబా ఏదైనా మనకి అందకుండా చేస్తే, దానికంటే ఉన్నతమైనది అనుగ్రహించడానికి మాత్రమే!
నేను ఒక సాయిభక్తుడిని. నేను అమెరికాలో ఉంటున్నాను. నేను ఇక్కడ మొదట ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా(కాంట్రాక్ట్ ఉద్యోగం) పనిచేశాను. ఆ ఉద్యోగంలో సెలవులు, ఆరోగ్య బీమా, సిక్ లీవ్ వంటి ఏ ప్రయోజనాలు ఉండేవి కావు. నేను పనిచేసే గంటలకు మాత్రమే జీతం వచ్చేది. అయినప్పటికీ, అమెరికాలో నెలకొన్న కఠిన ఉద్యోగ అవకాశాల దృష్ట్యా ఆ ఉద్యోగం పట్ల నేను చాలా కృతజ్ఞతగా ఉంటూ ఆ అవకాశాన్ని నాకిచ్చిన బాబాకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. నేను ఆ ఉద్యోగం 7 నెలలు చేసాక కొత్త అవకాశాల కోసం వెతికితే ఎక్కువ జీతంతో కొత్త కాంట్రాక్ట్ ఉద్యోగం లభించింది. అనుకోకుండా ఆరోజు గురువారం అవ్వడం ఈ పవిత్రమైన రోజున బాబా నన్ను ఆశీర్వదించారని నేను నమ్మేలా చేసింది. నేను చాలా ఆనందించి వెంటనే ఆ వార్తను నా తల్లిదండ్రులతో పంచుకున్నాను. వారు కూడా అంతే సంతోషించారు. అయితే, బడ్జెట్ సమస్యల కారణంగా ఆ ఉద్యోగం రద్దు చేయబడిందని నాకు సమాచారం అందింది. నేను చాలా నిరాశ చెందాను. ఆ బాధ కంటే నా తల్లిదండ్రులు ఎలా తీసుకుంటారో అని ఆందోళన చెందాను. కానీ ఆ అవకాశం చేజారిపోయినా దానికంటే చాలా శ్రేష్టమైనది నాకోసం బాబా ప్లాన్ చేశారు. నేను ఎదురుదెబ్బ తగిలినప్పటికీ నా ప్రయత్నాలు ఆపలేదు. మహాపారాయణ గ్రూపులో సభ్యుడిగా ప్రతి గురువారం సచ్చరిత్రలో నాకు కేటాయించిన అధ్యాయాలు శ్రద్ధగా చదువుతూ నా ప్రయత్నాలు నేను చేశాను. చివరికి 65% జీతం పెంపు మరియు పూర్తి ప్రయోజనాలతో శాశ్వత ఉద్యోగ అవకాశం వచ్చింది. నేను ఆశ్చర్యపోయేలా అది కూడా గురువారంనాడు. బాబా మరోసారి తాము చేసే ప్రతి పనికి ఒక కారణం ఉంటుందని నిరూపించారు. ఆయన ఏదైనా మనకి అందకుండా చేస్తే దానికంటే ఉన్నతమైనది మనకి అనుగ్రహించడానికి మాత్రమే. నేను బాబా అనుగ్రహానికి కృతజ్ఞతగా క్యారెట్ హల్వా తయారుచేసి దగ్గరలో ఉన్న గుడిలో బాబాకి నివేదించి నా కొత్త ఉద్యోగం కోసం, బాబా చూపించే అద్భుతాల కోసం నేను ఎదురుచూస్తున్నాను. సాయి సచ్చరిత్రలో చెప్పినట్లు ఓర్పు, పట్టుదల రెండు ముఖ్యమైన లక్షణాలు. వాటిని మనం కలిగి ఉండాలి. బాబాకు భక్తులపట్ల ఉన్న ప్రేమను మనం ఎప్పుడూ అనుమానించకూడదు.
అనంతకోటి బ్రహ్మాండనాయక శ్రీ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
తక్షణమే నిదర్శనమిచ్చిన బాబా
సాయిబంధువులుకు హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు మురళీమోహన్. 2025, మార్చి 17న నేను రోజులాగే సంధ్యా సమయంలో సాయి పూజ చేస్తుంటే హఠాత్తుగా ఒక సాలెపురుగు బాబా పటానికి కాస్త దూరంలో కనిపించింది. అది గమనించిన నేను కుతూహలంతో, "సర్వ జీవుల్లో ఉండేది మీరే కదా బాబా! మరి ఈ సాలెపురుగులో వున్నారా? వుంటే, నాకు ఇప్పుడే అందుకు నిదర్శనంగా అది మీ ఫోటో మీదగా రావాలి" అని మనసులో అనుకున్నాను. తర్వాత బాబా ఫోటో ఉన్న వైపుగా కాక వేరే వైపు వెళ్తున్న ఆ సాలెపురుగును గమనిస్తుండగా ఒక విచిత్రం జరిగింది. అది బాబా ఫోటో మీదకి రాకపోయినప్పటికీ బాబానే దాని మీదకు వెళ్లారు. ఆశ్చర్యం కలుగుతుందా? అది ఎలా అనుకుంటున్నారా? బాబా కూర్చున్న దివ్యమంగళ రూపం యొక్క నీడ గోడ మీద ప్రత్యక్షమైంది. అది కూడా బాబా(నీడ) ఛాతిపైన అ సాలెపురుగు ఉండేలా! నిజానికి బాబా నీడ ఆ గోడ మీద పడటానికి అస్సలు ఆస్కారం లేదు. ఆవిధంగా అక్కడ, ఇక్కడ, అన్నిటా, అంతటా, సమస్త జీవుల్లో సర్వాంతర్యామిగా వున్నది నేనే అని బాబా ఇచ్చిన నిదర్శనంతో నా ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. ఆ ఆనందంలో ఫోటో తీయాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు కానీ సాయి బంధువులతో ఈ అద్భుతమైన అనుభవం పంచుకోవాలని స్ఫూర్తి కలిగింది. మన అందరిపై బాబా కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.... 'ఓం శ్రీసాయి సర్వాంతర్యామినే నమః'.
బాబా కృపాదృష్టి
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!! సాయి బంధువులందరికీ నమస్కారం. నేనొక సాయి భక్తురాలిని. ఎంత బాధలో ఉన్నా బాబాని తలుచుకుంటే ధైర్యంగా ఉంటుంది. మేము మా అన్నయ్యకి తగిన పెళ్లి సంబంధం కోసం చాలారోజులు చూసినప్పటికీ ఒక్క సంబంధమూ కుదరలేదు. ఈ విషయమై మేము చాలా బాధపడ్డాం. నేను బాబాతో, "ఐదు వారాలు పూర్తైయ్యేలోపు అన్నయ్యకి మంచి సంబంధం కుదరాల"ని చెప్పుకొని సాయి దివ్యపూజ ప్రారంభించాను. అంతే! ఐదో వారంలో అన్నయ్యకి పెళ్లి సంబంధం కుదిరి 2025, ఫిబ్రవరిలో పెళ్లి మంచిగా జరిగింది. "ధన్యవాదాలు బాబా. ఇలాగే మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మా మీద ఉండాలి".
సర్వం శ్రీసాయి.
Om Sai Ram 🙏🙏🙏🙏
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house lo unna problem solve cheyandi pl
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Omsrisaiarogyaskemadhayanamaha
ReplyDeleteOm Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.
ReplyDeleteBABA MEE MANAVADU SAI MADHAVA KI MANCHI VIDYA NI PRASADINCHANDI. PROYOJAKUDU AVVALI. ADI EE THALLI KORIKA
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDeleteOm Sri Sai Aarogyakshemadhaaya Namaha🙏🙏🙏