ఈ భాగంలో అనుభవం:
- జరగబోయే పెద్ద ప్రమాదాన్ని చిన్నదానితో సరిపెట్టిన బాబా
సాయిబంధువులకు నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. 2025, ఫిబ్రవరి 13, గురువారం ఉదయం 7:30కి ఇంటినుండి బయలుదేరి మా ఊరిలో ఉన్న ఒక ఆశ్రమానికి వెళ్లి అక్కడ ఒక రెండు గంటలు సేవలో పాల్గొన్న తర్వాత 10, 10:30కి ఇంటికొచ్చి తయారై, అదే ఆశ్రమానికి చెందినవారి గృహప్రవేశ కార్యక్రమానికి వెళ్లాలన్నది నా ప్రణాళిక. తదనుగుణంగా ఆరోజు నేను ఇంటినుండి బయలుదేరబోతూ నా ఫోన్ చూసుకుంటే, మా కజిన్ నుంచి వచ్చిన ఒక మెసేజ్ కనిపించింది. దాని సారాంశమేమిటంటే, 'నేను నిద్ర లేవగానే తనకి ఫోన్ చేయమని, వాళ్ళ అబ్బాయికి ఏదో సంబంధం వచ్చింది, దాని గురించి మాట్లాడాలి' అని. నేను వెంటనే ఫోన్ చేస్తే, తను ఎత్తలేదు. సేవకి ఆలస్యమవుతుందన్న కంగారులో ఉన్న నేను, 'సరే.. నేను సేవ నుండి వచ్చాక చేస్తాను' అని తనకి మెసేజ్ పెట్టేసి వెళ్ళిపోయాను. సేవలో పాల్గొని 10.30కి తిరిగి ఇంటికి రావడానికి బయలుదేరి, 'ఇంటికి వెళ్ళగానే తనకి ఫోన్ చేయాలా, లేదా గృహప్రవేశంకి వెళ్ళడానికి తయారయ్యాక చేద్దామా' అని ఆలోచిస్తూ బైక్ నడుపుతున్నాను. అది నేను రోజూ వెళ్ళే దారే, పైగా విశాలమైన రోడ్డు, ట్రాఫిక్ ఉండదు, నా స్పీడ్ కూడా ఎప్పుడూ 30కి.మీ.లకు మించదు. అయితే అది కొత్తగా వేసిన రోడ్డు కావడం వల్ల తారు రోడ్డు కొంచెం ఎత్తుగా, పక్కన కొంచెం పల్లంగా ఉంది. అనుకోకుండా నా బండి తారు రోడ్డు మీద నుంచి రోడ్డు పక్కన పల్లంగా ఉన్న మట్టి రోడ్డులోకి వెళ్ళబోయింది. అది గమనించిన నేను హఠాత్తుగా బ్రేక్ వేసేసరికి టైర్ జారి బండి పక్కకి పడిపోయింది. దాంతో నేను కూడా క్రింద పడ్డాను. మామూలుగానే పడ్డాననుకున్నాను కానీ, లేవలేకపోయాను. అంతలో ఆ దారిలో పోతున్న ఎవరో నలుగురు, ఐదుగురు సాయి బంధువులు ఆగి సహాయం చేశారు. నేను వాళ్ళని అభ్యర్థించి నా బండి మీద మా ఇంటి దగ్గర దింపించుకున్నాను. ఇంటికి రాగానే ఫోన్ ఓపెన్ చేస్తే, "నీ చావు చీటీ చించేసాను. త్వరలోనే నీ ఆరోగ్యం బాగవుతుంది" అన్న మెసేజ్ వచ్చింది. అప్పటివరకు తిమ్మిరి వల్ల అంతగా తెలియలేదు కానీ, ఎడమ ప్రక్కటెముకల దగ్గర, అలాగే ఎడమ మోకాలు పైన, కింద భాగాలలో బాగా నొప్పి వస్తూ సరిగా నడవలేకపోయాను. నా బట్టలు అంతా దుమ్ము కొట్టుకుపోయి, భుజాల దగ్గర చిరిగిపోయి ఉంటే బట్టలు మార్చుకోవడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. లోపల ఏమైనా ఫ్రాక్చర్ అయిందేమోనని భయపడి, సాయిని తలుచుకొని అదే పనిగా 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని జపించసాగాను. తర్వాత నా కజిన్‌తో మాట్లాడుతూ విషయం చెపితే, "ఫ్రాక్చర్ అయి ఉండదులే, జరిగుంటే నువ్వు ఇలా మాట్లాడలేవు" అని తను ధైర్యం చెప్పింది. కానీ నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే, ఏదైనా కట్టులు కట్టి బెడ్ రెస్ట్ అన్నా, ఆపరేషన్ అన్నా నాకు సహాయం చేయడానికి దగ్గర వాళ్ళు ఎవరూ లేరు(అమ్మ, నాన్న పోయారు. బ్రదర్స్ తప్ప నాకు సిస్టర్స్ లేరు). అందువల్ల చాలా కష్టమైపోతుందని సాయంత్రం హాస్పిటల్‌కి వెళ్లి ఎక్స్ రే తీయుంచుకోవడానికి వెళ్లేవరకూ భయపడుతూనే ఉన్నాను. నేను హాస్పిటల్‌కి వెళ్ళినప్పటినుంచి సాయి దర్శనం కోసం అటూ ఇటూ వెతుకుతుంటే అందరు దేవుళ్ళు కనిపిస్తున్నా సాయి కనిపించలేదు. ఇదేంటి అని టెన్షన్ పడుతూ ఎక్స్ రే తీసే గదికి వెళ్ళబోతూ పక్కనున్న ఫార్మసీ పేరు 'శ్రీసాయి ఫార్మసీ' అని చూసి మురిసిపోయాను. ఇంకేముంది నేను ఎక్స్ రే తీయించుకోవడం, డాక్టర్ చెక్ చేసి, "ఫ్రాక్చర్ ఏమీ లేవు. కొంచెం నరం బెణికినట్టుంది" అని కొన్ని మందులు, కాలికి సపోర్ట్ ఇచ్చే బెల్ట్ వంటివి రాసి "10 రోజులు ఎక్కువగా నడవకుండా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది" అని చెప్పడం పావు గంటలో జరిగిపోయాయి. అలా ఎప్పటిలాగే సాయి నా టెన్షన్‌ని చాలా తేలిగ్గా తీసేశారు. కానీ ఫిబ్రవరి 20, గురువారం బయలుదేరాల్సిన మా తిరుపతి ప్రయాణం వాయిదా పడటమే బాధ కలిగించింది. విషయం తెలిసి హైదరాబాద్ ఉద్యోగం చేస్తున్న మా అమ్మాయి వర్క్ ఫ్రమ్ హోమ్ పర్మిషన్ తీసుకుని నాకు తోడుగా ఉండడానికి ఇంటికి వచ్చింది. నాకు పెద్ద ఇబ్బందేమీ లేకపోయినా వినకుండా ఎప్పుడూ ఇటు పుల్ల తీసి అటు పెట్టని మావారు, అమ్మాయి ఇద్దరూ నన్ను మంచం దిగనివ్వకుండా సేవలు చేసారు. అంతా సర్దుకున్నాక తీరిగ్గా ఆలోచిస్తుంటే నేను ఎందుకు పడ్డానో, ఎలా పడ్డానో అస్సలు అర్థం కాలేదు గాని, నా సాయితండ్రి ఏదో పెద్ద ప్రమాదం తప్పించడానికే ఇలా చేసారనిపిస్తుంది. ఆ విషయాన్ని ఆయన, "నీ చావు చీటీ చించేసాను. త్వరలోనే నీ ఆరోగ్యం బాగవుతుంది" అన్న మెసేజ్ ద్వారా చెప్పకనే చెప్పారు కూడా. ఆయన లీలలు ఏంటో, ఆయన టైమింగ్ ఏంటో ఆయనకే అర్థం కావాలి. ఈ అనుభవాన్ని ఇంత విపులంగా వ్రాసే ప్రేరణ సాయి నాకు ఇచ్చారంటే కొన్నాళ్ళ తరువాత ఇది ఏ భక్తులకో ధైర్యాన్ని ఇవ్వడానికే అని నాకు తెలుసు. ఆయనకు భూత, భవిష్యత్, వర్తమానాలు అన్నీ తెలుసు. తదనుగుణంగా ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటారు. "కానీ బాబా, ఎంత భక్తులమైన కొన్నిసార్లు అజ్ఞానంతో కర్తృత్వాన్ని మా మీద వేసుకుంటూ ఉంటాం. నీ పాదాల చెంత అహంకారాన్ని విడిచి శరణాగతి పొందే అదృష్టాన్ని మీరే మాకు ప్రసాదించాలి స్వామీ!"
చివరిగా సాయి బంధువులు అందరికీ ఒక విన్నపం. 'సాయి ఉండగా దేనికి ఆందోళన చెందకండి. అక్కచెల్లలు, ఆడపిల్లలు లేనివాళ్ళు ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ఎలా అని దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎలాంటి వాళ్ళకి సరిపోయేలా అలాంటి పరిస్తితినే కల్పిస్తారు మన సాయి. అవసరమైతే ఆయనే ఏదో ఒక రూపంలో సహాయం చేస్తారు. కాబట్టి అందరూ నమ్మకంతో ధైర్యంగా, సంతోషంగా ఉండండి'.
సర్వం శ్రీసాయి చరణారవిందార్పణమస్తు
Yendhuku sai na jeevitham Madhya lo apesaru om sairam
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 💐💐
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Yeppudu Sai karunistavu.. na karma phalam inka teeraleda 🥲.. na life naku nachinattu undada🥲🥲🥲
ReplyDeleteOmsairam 🙏
ReplyDeleteWaiting for blessings since 20years OM SAI RAM🙏
ReplyDeleteToday i loose one opportunity perhaps
ReplyDeleteOm Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.
ReplyDeleteOm sri Sairam
ReplyDeleteBaba please piece of mind , na papa ki health bavundali
ReplyDeleteOm sri sairam 🙏🙏🙏🙏💐💐💐❤️♥️
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDeleteOm Sri Sai Aarogyakshemadhaaya Namaha 🙏🙏🙏