ఈ భాగంలో అనుభవాలు:
1. బాబా దయతో ధనం వాపసు - ఏళ్లనాటి సమస్య మాయం
2. శ్రీసాయి దయ
బాబా దయతో ధనం వాపసు - ఏళ్లనాటి సమస్య మాయం
నా తండ్రి సాయినాథునికి నా సాష్టాంగ నమస్కారాలు. సాయి భక్తులందరికీ శతకోటి వందనాలు. నా పేరు కృష్ణ. మాది హైదరాబాద్. బాబా ఎన్నో సందర్భాల్లో నాకు, నా కుటుంబానికి తోడుగా ఉండి ముందుకు నడిపిస్తున్నారు. వాటిలో కొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. 2024, జూన్ మాసంలో ఒక ఆదివారం నా మేనల్లుడు ఎంటెక్ సీటు కోసం గేట్ ఎగ్జామ్ వ్రాయదలచి కోచింగ్ నిమిత్తం నెలకి 5000 రూపాయలు కట్టి ఒక హాస్టల్లో జాయినయ్యాడు. బాబా దయవల్ల మర్నాడు సోమవారం ముందు సంవత్సరం వ్రాసిన గేట్ పరీక్ష ఆధారంగా తనకి ఐఐటీలో సీటు వచ్చింది. దాంతో కోచింగ్ తీసుకుంటూ హాస్టల్లో ఉండే అవసరం లేకుండా పోయింది. అందుచేత జాయిన్ అయిన మర్నాడే హాస్టల్ ఖాళీ చేస్తూ ఆ హాస్టల్ ఇంఛార్జిని ఒక రెండు రోజులు ఫీజు తీసుకొని మిగిలిన డబ్బు వాపసు ఇవ్వమని అడిగాము. అతను అందుకు, "అలా కుదరదు. మేము మొదటే చెప్పాము కదా, తిరిగి డబ్బు ఇవ్వబడదు' అని అన్నాడు. ఆ డబ్బు నా మేనల్లుడికి చాలా అవసరమైనందున ఎంతోకొంత కట్ చేసుకుని ఇస్తే బాగుండునని శ్రీసాయినాథుని వేడుకున్నాను. రెండు నెలల కాలంలో సుమారు 90 సార్లు ఆ హాస్టల్వాళ్ళకి ఫోన్ చేశాను కానీ, వాళ్ళ నుండి సరైన సమాధానం రాలేదు. ఇంకా నేను ఆశలు వదిలేసుకున్నాను. కానీ బాబా దయచూపారు. ఒకరోజు మొత్తం డబ్బు వాపసు అయింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీ దయవలన అబ్బాయి ఇప్పుడు ఐఐటీ రూర్కీలో ఎంటెక్ చేస్తున్నాడు. తనకి మంచి ఉద్యోగం వచ్చేలా ఆశీర్వదించండి".
ఎన్నో సంవత్సరాల కిందట నా చేతిగోళ్ళు అన్ని పుచ్చి పోయినట్లు అయిపోయాయి. దాదాపు 25 సంవత్సరాలు చాలామంది డాక్టర్లను సంప్రదించి ఎన్నో మందులు వాడాను. కానీ ప్రయోజనం కనిపించలేదు. చివరికి బాబాను వేడుకొని సుమారు 20, 25 రోజులు రోజు రాత్రి ఊదీ రాసుకుని నిద్రపోగా రెండు నెలల్లో నా చేతి గోళ్లు అనారోగ్య సమస్య పూర్తిగా సమసిపోయింది. ఇన్ని సంవత్సరాలుగా నయంకాని అనారోగ్యం బాబా ఊదీతో కొద్ది రోజులలో నయమైంది. అందుకే శ్రీసాయినాథుడు డాక్టర్లకే డాక్టర్ అని మా ప్రగాఢ నమ్మకం. మా కుటుంబంలో మాత్రలు, మందులు కంటే శ్రీసాయినాథుని ఊదీయే మాకు శరణం. ఇలా నా అనుభవాలు మీ అందరితో పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. "ధన్యవాదాలు బాబా. నా తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి బాబా. నా కుమారుడికి మీరే ఒక దారి చూపించండి తండ్రీ. మా కుటుంబం మరియు కోటానుకోట్ల సాయి భక్తులపైన మీ అనుగ్రహకుసుమాలు ఎల్లప్పుడూ వర్షిస్తూ సర్వవేళలా, సర్వావస్థలయందు మమ్మల్ని చల్లగా చూడు తండ్రి. మీకు నిజమైన భక్తులుగా ఉండేలా దయ చూపండి సాయి".
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు.
శ్రీసాయి దయ
సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు శ్వేత. ఇటీవల మా చిన్నబాబుకి జ్వరం వచ్చింది. నేను జ్వరం తగ్గడానికి 2 రోజులు మందులిచ్చినప్పటికీ జ్వరం తగ్గలేదు. దాంతో బాబుని హాస్పిటల్కి తీసుకెళ్తే, డాక్టర్ చెక్ చేసి "ముందు మాములు మందులు వాడుదాం. 2 రోజులు చూసి తగ్గకపోతే యాంటీబయాటిక్స్ మొదలుపెడదాం. అలాగే కొన్ని టెస్టులు కూడా చేయిద్దాం" అన్నారు. కానీ యాంటిబయోటిక్స్ వాడితే పిల్లలు వీక్ అయిపోతారని నాకు భయమేసి డాక్టర్ ఇచ్చిన మందులతోపాటు ఊదీ నీళ్ళు బాబుకిస్తూ, "బాబా! ఎలాంటి టెస్టులు చేయాల్సిన అవసరం రాకుండా, అలాగే యాంటిబయోటిక్స్ మొదలుపెట్టమని డాక్టర్ చెప్పకుండా ఉండేలా చూడండి" అని బాబాతో చెప్పుకున్నాను. 2 రోజుల తరువాత డాక్టర్కి ఫోన్ చేసి పరిస్థితి చెప్తే, "జ్వరం తగ్గుతుంది. యాంటిబయోటిక్స్ మొదలుపెట్టాల్సిన అవసరం లేదు" అని అన్నారు. బాబాకి మనసులో ఎన్నోసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. బాబా దయవల్ల మర్నాటికి బాబుకి జ్వరం తగ్గి ఆక్టివ్ అయ్యాడు. తర్వాత 2025, ఫిబ్రవరి మూడో వారంలో మా సొసైటీలో పిల్లలకి బ్యాడ్మింటన్ కాంపిటీషన్ పెట్టారు. అందులో మా బాబు పాల్గొన్నాడు. నేను బాబాని, "బాబు బాగా ఆడేలా చూడు సాయి" అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల మా బాబు ఫస్ట్ వచ్చాడు. "చాలా చాలా ధన్యవాదాలు సాయి. నా తప్పులు ఏవైనా ఉంటే సరి చేసి క్షమించండి".
Om Sai Ram 🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm Sai Sri Sai Jai Jai Sai . Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sai Ram
ReplyDeleteBaba ma family lo Andhariki health bagundela chudu thandri🙏🙏
ReplyDeleteSai
ReplyDelete