ఈ భాగంలో అనుభవం:
- 'నా అనుగ్రహంలో ఉన్న వారికి ఎటువంటి హాని జరగదు'
నా పేరు మాధవి. మేము యుఎస్ఏలో ఉంటున్నాము. ఒకసారి ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు నా కొడుకు ముక్కు దిబ్బడతో ఇబ్బందిపడుతూ సరిగా నిద్రపోలేకపోతుండేవాడు. నేను అన్ని విధాలా ప్రయత్నించినప్పటికీ తను ఇబ్బందిపడుతూనే ఉండేవాడు. నేను బాధపడి ఒకరోజు రాత్రి తను పడుకునే ముందు బాబాను ప్రార్థించి, తనకి ఊదీ పెట్టి నిద్రపుచ్చాను. అంతే, తను చాలా ప్రశాంతంగా నిద్రపోయాడు. "ఊదీ రూపంలో ప్రసాదించిన అద్భుత అనుగ్రహానికి చాలా ధన్యవాదాలు బాబా".
2025, సంక్రాంతి పండక్కి నా మేనమామ, అత్తలు ఇండియాలో ఉన్న మా అమ్మవాళ్ళింటికి వెళ్లారు. అక్కడ అంతా బాగా జరిగింది. ఒకరోజు అత్త మావయ్యతో శివమాల ధరించమని చెప్పింది. అది ధరించడం మావయ్యకు ఇష్టం లేకపోయినా ఆమె సంతోషం కోసం ధరించారు. తరువాత వాళ్ళు తిరిగి తమ ఊరు వెళ్ళడానికి బయలుదేరారు. అయితే వాళ్ళు గ్రామ శివార్లకు చేరుకునేసరికి అకస్మాత్తుగా మావయ్య శరీరంలో ఎడమ భాగం పక్షవాతం వచ్చినట్టు అనిపించింది. దాంతో అత్త చాలా ఆందోళన చెంది మా నాన్నకు ఫోన్ చేసి విషయం చెప్పింది. నాన్న వెంటనే అక్కడికి వెళ్లి మావయ్యను హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ ఒక ఇంజక్షన్ ఇచ్చారు. బాబా దయవల్ల 30 నిమిషాల్లో మావయ్య సాధారణ స్థితికి వచ్చారు. అప్పుడు డాక్టర్ మరియు మా నాన్న, "ఇది గ్రామం. మళ్ళీ సమస్య వస్తే, ఇక్కడ తగినంత వైద్య సదుపాయం ఉండదు. మీరు మీ సిటీకి వెళ్లడం మంచిద"ని చెప్పారు. దాంతో మావయ్య, అత్తయ్య బస్సులో వాళ్ళు ఉండే సిటీకి వెళ్లిపోయారు. వాళ్ళు ఇంటికి చేరుకున్న 30 నిమిషాల తర్వాత మావయ్యకి మళ్ళీ పక్షవాతం వచ్చినట్టు అనిపించడంతో వెంటనే హాస్పిటల్కి వెళ్లి అడ్మిట్ అయ్యారు. నేను బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల మావయ్య కోలుకున్నారు. డాక్టరు 3 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసి మందులిచ్చి పంపారు. మావయ్య ఆ మందులు వాడుతుండేవారు కానీ, తన రోజువారీ జీవితానికి సంబంధం లేకుండా చాలా విభిన్నంగా మాట్లాడుతూ రాత్రంతా నిద్రపోయేవారు కాదు. ఈ పరిస్థితి మమ్మల్ని చాలా ఆందోళనకు గురిచేసింది. నేను బాబాను ప్రార్థించి, "మా మావయ్య ప్రమాదం నుండి బయటపడ్డారా, లేదా" అని అడిగాను. అప్పుడు, "సాయిబాబాను గుర్తుంచుకో శత్రువులు తొలగిపోతారు" అని సమాధానం వచ్చింది. అది చూసిన తర్వాత నాకు ప్రశాంతంగా అనిపించి బాబా సమాధానం గురించి మా అమ్మతో చెప్పాను. అప్పుడు మేము డాక్టర్లు ఇచ్చిన మందుల వల్ల కావచ్చు అని అనుకున్నాము. తర్వాత అత్తయ్యవాళ్ళు హాస్పిటల్కి వెళ్లి, 'ఆయన సాధారణంగా మాట్లాడటం లేదని, రాత్రంతా నిద్రపోకుండా ఏదో మాట్లాడుతున్నారని, అది మమ్మల్ని అందరినీ ఆందోళనకు గురిచేస్తుందని' చెప్పారు. కానీ డాక్టర్, "అంతా బాగానే ఉంద"ని చెప్పి నిద్రమాత్రలు ఇచ్చారు. అయితే నిద్రమాత్రలు వేసుకున్న తర్వాత కూడా ఆయన రాత్రంతా నిద్రపోయేవారు కాదు. అది విని మేము శక్తివంతమైన మందులు తీసుకున్న తర్వాత కూడా అలా ఎలా జరుగుతుందని ఆశ్చర్యపోయాము. అప్పుడు మా అమ్మ, నా సోదరుడు ఏదో దుష్టశక్తి ప్రభావం అని అనుకున్నారు. నిజానికి దేవుడే వాళ్ళని అలా ఆలోచించేలా చేసాడని చెప్పాలి. ఎందుకంటే, నా సోదరుడు దేవుడు, దుష్టశక్తులు మొదలైన వాటిని అస్సలు నమ్మడు. కానీ మా మావయ్య సరిగా తన ఇంటి చిరునామా చెప్పలేకపోవడం, తప్పుడు చిరునామా చెప్పడం వంటి వాటిని విన్న తర్వాత నా సోదరుడు అమ్మతో, "మా(అమ్మా)! నేను అలాంటివి నమ్మను కానీ, ఇక్కడ ఏదో అనుమానంగా ఉంది. బహుశా ఎవరైనా చేతబడి చేశారేమో!" అని అన్నాడు. అది విన్న తర్వాత మా అమ్మకి కూడా అలాగే అనిపించి మామయ్య వాళ్ళ వూరు వెళ్లి, ఆయన్ని సుంకులమ్మ(దేవత) గుడికి తీసుకెళ్లాలని అనుకుంది. అలాగే అమ్మ ఆ వూరు వెళ్లి అత్తతో కలిసి మామయ్యను అమ్మవారి గుడికి తీసుకెళ్లింది. అక్కడున్న పూజారి, "40 - 45 సంవత్సరాల వయసున్న స్త్రీ ఆత్మ ఇతనిలో ప్రవేశించింది. ఇతను శివ మాల ధరించినందువల్ల శివయ్య ఆ ఆత్మ ఇతనికి హాని కలిగించకుండా జాగ్రత్త వహిస్తున్నాడు. కానీ ఇతను శివమాల తీసేసి అంతరం(చేతికి ధరించేది) ధరించాలి" అని చెప్పారు. ఇది విని మా అమ్మ శివమాల తీసేయమని చెప్తే, మావయ్య తీసేసాడు. తర్వాత వాళ్ళున్న సిటీకి సమీపంలో ఉన్న గ్రామంలోని హనుమాన్ గుడికి వెళదామని బయలుదేరారు. వాళ్ళు మధ్య దారిలో ఉన్నప్పుడు మా మామయ్య హిందీలో తిట్టడం ప్రారంభించారు. హిందీ మాతృ భాష కానీ మావయ్య అలా హిందీలో మాట్లాడుతుండేసరికి వాళ్ళు భయపడిపోయారు, కళ్ళతో చూస్తుంది నమ్మలేకపోయారు. ఎలాగో మొత్తానికి హనుమాన్ గుడికి చేరుకున్నారు. ఇంకా మా మావయ్య చాలా అసాధారణంగా ప్రవర్తిస్తూ నేను చనిపోతానని చెప్పి గుడి నుండి బయటకి పరుగుతీసారు. ఇతరుల సహాయంతో ఏదోవిధంగా అతన్ని పట్టుకొని గుడిలోకి తీసుకెళ్లారు. ఈ విషయాలన్ని మద్యమద్యలో మా అమ్మ నాకు ఫోన్ చేసి చెప్తుంది. అవి నిన్న నేను ఆయన పరిస్థితి మాములుగా లేనందున అమ్మకి ఏదైనా హాని చేస్తారేమోనని చాలా కలత చెందాను. కొద్దిసేపటి తర్వాత అకస్మాత్తుగా మావయ్య తన భార్య తనని గుడిలోకి తీసుకెళ్లిందని, మోసం చేసిందని ఆమెను కొట్టాడు. మామూలుగా ఆయన చాలా మంచివారు, తన భార్యను అసలెప్పుడూ కొట్టలేదు. నేను చాలా టెన్షన్ పడి బాబాను ప్రార్థిస్తూ 'ఓం సాయిరామ్' అని నిరంతరాయంగా జపించసాగాను. బాబా నా ప్రార్థనలకు ఫేస్బుక్ ద్వారా "నీ తల్లిదండ్రులకు ఎటువంటి హాని జరగదు" అని సమాధానం ఇచ్చారు. అది చూసి నాకు ఊరటగా అనిపించి, "చాలా ధన్యవాదాలు బాబా" అని బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను. మావయ్య రెండు రాత్రులు గుడిలో హనుమాన్ పాదాల చెంత నిద్రపోవడంతో ఆయన పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది. ఇదంతా జరుగుతున్నప్పుడు నేను బాబాను, "చాలా దూరంగా యుఎస్ఏలో ఉంటున్న మాకు ఆ రకమైన పరిస్థితి ఎదురైతే, ఏం చేయాల"ని అడిగాను. అందుకు బాబా, "మీరు నా అనుగ్రహంలో ఉన్నారు. మీకు ఎటువంటి హాని జరగదు" అని సమాధానమిచ్చారు. అప్పుడు 'బాబా తమ భక్తులపట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నారు, ఆయనకి ఎంత దయ' అని నాకు కన్నీళ్లు వచ్చాయి. ఆయన దయను ప్రశంసించడానికి తగిన పదాలు లేవు. ఎల్లప్పుడూ బాబా నామస్మరణ చేయండి. అలా చేస్తూ ఉంటే ఈ భౌతిక ప్రపంచం నుండి మనకి ఎటువంటి హాని జరగదు. ""చాలా ధన్యవాదాలు బాబా. మేము మా తల్లిదండ్రులు, బంధువులకు చాలా దూరంగా ఉన్నప్పటికీ మీరు వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు కోటి కోటి ప్రణామాలు బాబా".
Om Sai Ram 🙏🙏🙏🙏
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sai Ram
ReplyDeleteSai om sai om sai om🙏
ReplyDeletebaba, maa sai madava ki anni meere ayi madava ni prayojakudini cheyandi baba
ReplyDelete