ఈ భాగంలో అనుభవాలు:
1. బాబా అనుగ్రహం
2. బాబుని ప్రసాదించిన బాబా
బాబా అనుగ్రహం
అందరికీ నమస్కారం. నా పేరు అనిత. నేను 4 సంవత్సరాల నుంచి మహా పారాయణం గ్రూపులో సభ్యురాలిని. సాయిబాబా నా జీవితంలోకి వచ్చాక చాలా అద్భుతాలు జరిగాయి. జరగవు, అసాధ్యం అనుకున్నవి కూడా సులభంగా జరిగాయి. 2020లో కరోనా లాక్ డౌన్ మొదలయ్యాక నా భర్త ఉద్యోగం పోయింది. అప్పుడు నేను, "బాబా! మా ఆయనకి ఉద్యోగమొస్తే మీ గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తాను" అని మొక్కుకున్నాను. నిజానికి ఆ సమయంలో లాక్ డౌన్ వల్ల ఎవరినీ ఉద్యోగంలోకి తీసుకోవడం లేదు. అయినప్పటికీ బాబా దయవల్ల మావారికి మంచి ఉద్యోగం వచ్చింది. అయితే ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల మావారికి వచ్చే జీతం సరిపోయేది కాదు. అందువల్ల నేను ఒక యూట్యూబ్ బుక్ సమ్మరీ ఛానల్‌ని మొదలుపెట్టాను. మొదట్లో చాలా తక్కువ వ్యూస్ వచ్చేవి. అప్పుడు నేను బాబాని, "మానిటైజ్ అయి యూట్యూబ్ ద్వారా నాకు ఆదాయం వస్తే, అలా వచ్చే మొదటి ఆదాయంలో కొంత సమర్పించుకుంటాను" అని వేడుకున్నాను. తర్వాత బాబా దయవల్ల నా యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అయి కొంత సంపాదిస్తూ నా మొక్కు కూడా తీర్చుకున్నాను. బాబా నా ఛానల్ బాగా డెవలప్ అవడానికి సహాయం చేస్తున్నారు. పెళ్లి తర్వాత ఇల్లు, భర్త, పిల్లలు, బాధ్యతలతో కొంతమంది ఆడవాళ్ళ వృత్తి జీవితం ముగిసిపోతుంది. కానీ నా జీవితానికంటూ ఒక లక్ష్యాన్ని, ప్రయోజనాన్ని ఇచ్చారు బాబా. ఎలాంటి లక్ష్యమంటే కష్టంలో ఉన్నప్పుడు కూడా కృంగిపోకుండా లక్ష్యం కోసం బ్రతికి పోరాడేంత! "చాలా చాలా ధన్యురాలిని బాబా".
2022లో నేను 8 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ చనిపోయింది. నేను తనని చివరిసారి చూసుకోవడానికి వెళ్లలేకపోవడమే కాకుండా హై రిస్క్ ప్రెగ్నెన్సీ కారణంగా పెద్దగా ఏడవలేకపోయాను కూడా. దుఃఖభారం బయటికి రాకుండా మనసులోనే ఏడవాల్సి వచ్చింది. దాంతో నాకు ఒక్కసారిగా ఒత్తిడితో బ్లీడింగ్ అయింది. నేను షాక్‌కి గురయ్యాను. అదివరకు ఒకసారి గర్భస్రావం అయిన నాకు మళ్ళీ ఎక్కడ అవుతుందో అని చాలా భయపడ్డాను. వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళడానికి బయలుదేరి హాస్పిటల్‌కి వెళ్లెవరకూ నా కడుపులోని బిడ్డ ఎలా ఉందో అని నా కడుపుపై చేయి వేసి బిడ్డ గుండె చప్పుడు వినిపిస్తుందా అని అయోమయంగా, కంగారుగా చూస్తూ, "బాబా! నా బిడ్డ ఆరోగ్యంగా ఉంటే శిరిడీలో తన పుట్టు వెంట్రుకలు ఇస్తాన"ని బాబాకి మొక్కుకున్నాను. హాస్పిటల్‌కి వెళ్ళాక డాక్టర్ చూసి, "ఎందుకమ్మా ఏడుస్తున్నావ్? చూడు..! బిడ్డ గుండె చప్పుడు వినిపిస్తుంది" అని డాప్లర్లో వినిపించి, "బిడ్డ సురక్షితం. కంగారుపడకండి. ఒకసారి వెళ్లి బ్లీడింగ్ చెక్ చేసుకో, పో వెళ్ళు" అన్నారు. నేను వెళ్లి చూసుకుంటే అస్సలు బ్లీడింగ్ లేదు. దాంతో చాలా ఉపశమనంగా అనిపించి ఇంటికి వచ్చాము. బాబా దయవల్ల నాకు, నా పాపకి ఏమీ అవలేదు. 9వ నెలలో కాన్పు అయి బాబా దయవల్ల మంచి ఆరోగ్యంతో పాప పుట్టింది. బాబా మంచి లవింగ్ ఫ్యామిలీనిచ్చి నా జీవితాన్ని రంగులమయం చేసారు. బాబా నాకు అండగా ఉంటూ నన్ను ఎప్పుడూ సరైన దారిలో నడిపిస్తున్నారు. నాకు ఏ సమస్య వచ్చినా నేను బాబాకే చెప్పుకుంటాను. ఆయన నా ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చారు. బాబా నా తాహతుకు మించి ఇచ్చారు. నిజానికి మాకు ఇల్లు, కారు కొనేంత స్థోమత లేదు. నేను బాబాకి, "మేము ఇల్లు కొనుక్కుంటే మీ విగ్రహం కొని మా అత్తగారి ఊర్లో ప్రతిష్టాపన చేయిస్తాన"ని మొక్కుకున్నాను. బాబా దయవల్ల ఇల్లు, కారు కొనగలిగాం. నేను ఇప్పుడు బాబా విగ్రహం కొనడానికి కష్టపడి పని చేస్తున్నాను. ఏదో ఒకరోజు నేను సంపాదించిన నా డబ్బుతో నర్మదాపురంలో విగ్రహ ప్రతిష్టాపన చేయిస్తాను. "అన్నిటికీ ధన్యవాదాలు బాబా".
బాబుని ప్రసాదించిన బాబా
నా పేరు మాధవి. నాకు 3 సార్లు గర్భస్రావం అయిన తర్వాత ఒకరోజు రాత్రి బాబా నాకు స్వప్న దర్శనమిచ్చారు. ఆ కలలో నేను బాబా కాళ్ళు పట్టుకొని, "నాకు ఒక బిడ్డని ఇవ్వమ"ని ప్రాధేయపడ్డాను. అప్పుడు బాబా, "ఈ సంవత్సరం నీకు బాబుని ప్రసాదిస్తాను" అన్నారు. బాబా చెప్పినట్లే సంవత్సరం పూర్తి అయ్యేసరికి నాకు బాబు పుట్టాడు. బాబు కడుపులో ఉన్నప్పుడు చాలా సమస్యలు వచ్చాయి. 5వ నెలలో డాక్టరు స్కాన్ చేసి, "ప్రసవం అయ్యేలా ఉంది. 7వ నెల వరకు ప్రసవం కాకుండా ఉంటే బిడ్డని రక్షించగలం, లేదంటే కష్టం" అన్నారు. నేను పూర్తిగా బెడ్ రెస్ట్‌లో వుంటూ ప్రతిరోజూ బాబాని వేడుకుంటూ ఉండేదాన్ని. బాబా దయవల్ల 28వ వారం వరకు ప్రసవం కాకుండా ఉండి ఆ వారంలో ప్రసవం అయి బాబు పుట్టాడు. నెలలు నిండకుండా పుట్టినందువల్ల బాబుని నెల రోజులు NICUలో ఉంచాల్సి వచ్చింది. అప్పుడు నేను ప్రతిరోజూ బాబాని నా బిడ్డ గురించి వేడుకుంటూ ఉండేదాన్ని. బాబా దయవలన నా బాబు ఏ అనారోగ్యం లేకుండా క్షేమంగా ఇంటికి వచ్చాడు. ఒకరోజు బాబుకి వాంతులు అయి జ్వరం కూడా వచ్చింది. వాంతులు ఎక్కువగా అవ్వడం వలన బాబు బాగా నీరసించిపోయాడు. నేను బాబాని ప్రార్థించి ఊదీ బాబుకి పెట్టి, కొద్దిగా సిరప్‌లో వేసి బాబుకి ఇచ్చాను. వెంటనే వాంతులు తగ్గి గంటలో బాబు ఉత్సాహంగా ఆడుకోవడం మొదలుపెట్టాడు. తర్వాత ఒకరోజు రాత్రి నాకు తలనొప్పి, వాంతులు మొదలయ్యాయి. టాబ్లెట్ వేసుకుంటే వాంతులు తగ్గాయి కానీ, తలనొప్పి తగ్గలేదు. అప్పుడు ఊదీ పెట్టుకొని పడుకుంటే గంటలో తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా. ఎల్లప్పుడూ మాకు ఇలానే తోడుగా వుండి రక్షించండి బాబా. ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉండేలా చూడండి బాబా".
Om Sai Ram 🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm Sai Ram 🙏🙏🙏🙏🙏
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house lo problem solve cheyandi pl
ReplyDeleteOm Sairam🙏.. Sai Namanni 108 Sarlu Prathi Roju japinchandi/likhinchandi.. Sai nathuni Peru meeda 5 Guruvaralu annadanam cheyandi...mana baba Daya valla antha manche jarugutundi🙏 baba antha chusukuntaru 🙏
DeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sai Ram
ReplyDeleteAnitha garu mee Asayam goppadi.. baba meeku andaga undi, pani poorthi cheyinchalani prarthistunnanu🙏
ReplyDeleteMadhavi garu baba anugraham, mee kutumbampaina sadaa undali 🙏
ReplyDeleteEnduku baba nannu parikshitunnavu.. me inka ye devi devudini prarthinchali.. anni naku vyatirekangane jarugutunnayi.. antha chustu happy ha unnava.. nannu na karmaphalaniki vadilestunnava.. nenu Ela batakali.. na chinna biddaki enduku kashtam kaliginchavu.. nuvve kapadu baba please🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐
ReplyDeleteChala Kashyap ga undi baba 🥲
ReplyDeleteSai… Tammudiki manasika paristhithi sarichesi, amma nannalaki manasulo andolana tagginchandi 🥲🥲🙏🙏
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteSai deva.. Meenakshi ki Pelli kudurinchi, daggarundi Pelli jaripinchu, please..🙏
ReplyDeleteOm Sai Ram please 🙏🙏 give me sumangal ga death.please make my desire come true
ReplyDeleteOm Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.
ReplyDeleteOm Sai Sri Sai jaya jaya sai baba na family lo andariki health bagundela chei thandri🙏🙏
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDeleteOm Sri Sai Aarogyakshemadhaaya Namaha 🙏🙏🙏