సాయి వచనం:-
'అమ్మా! ఆకలేస్తుంటే ఏమైనా పెడతారని మీ ఇంటికి వెళ్ళాను. పూజగది తలుపు తాళం వేసి ఉంది. నేనెలాగో లోపలికి ప్రవేశించాను. అక్కడ భావూ నాకు తినడానికేమీ ఉంచలేదు. నేను ఆకలితో తిరిగి వచ్చాను.'

'పారాయణ ఒక మొక్కుబడి తంతుగా చేయరాదు. బాబాలో వ్యక్తమయ్యే తత్త్వం ఏమిటి? బాబా ఏం చెప్పారు? ఒక లీల జరిగినప్పుడు ఆ భక్తుని స్థానంలో నేనుంటే ఎలా ఫీలవుతాను? - ఇలా ప్రతి విషయాన్ని తరచి తర్కించుకుంటూ చదవాలి. బాబా లీలను చదివినప్పుడు ఆ సందర్భంలో అక్కడున్న భక్తులలో ఒకడివై ఆ సన్నివేశాన్ని చూడగలగాలి. ఆ లీలావిలాసంలో మైమరచి ఆనందిస్తూ మమేకమవగలగాలి. అలా పరాయణత్వం కలిగించినప్పుడే అది పారాయణ అవుతుంది' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1976వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా మనకోసం ఎప్పుడూ ఉన్నారు
2. బాబా దయతో పీజీ మెడికల్ సీటు


బాబా దయతో పీజీ మెడికల్ సీటు

సాయిదేవుని పాదపద్మములకు నా నమస్కారాలు. నా పేరు అమర్నాథ్. మా పాప ఎంబిబిఎస్ మంచి గ్రేడ్‌తో పాసయ్యాక పీజీ చేయడానికి కోచింగ్ తీసుకుంది. నేను రోజూ "పాపకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో సీటు రావాల"ని బాబాని ప్రార్ధింస్తుండేవాడ్ని. కానీ అది త్రుటిలో తప్పిపోయింది. మా కుటుంబం అంతా చాలా బాధపడ్డాం. పాప చాలా నిరుత్సాహంగా అయిపొయింది. మేము తనని ఎంతో ప్రోత్సహించి నిట్ పరీక్షకి ప్రిపేర్ చేయించాము. తను చక్కగా ప్రిపేర్ అయి పరీక్ష బాగా వ్రాసింది. మేము తనకి మంచి ర్యాంకు వచ్చి మంచి కాలేజీ, మంచి బ్రాంచిలో సీటు రావాలని తనని తీసుకుని శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకుని వచ్చాం. ఆ సాయినాథుని  దయవల్ల పాపకి ఆల్ ఇండియా కోటాలో న్యూరో సూపర్ స్పెషాలిటీ యశోద హాస్పిటల్, హైదరాబాద్లో సీటు వచ్చింది. మేము చాలా సంతోషించి ఆ సాయినాథుని మొక్కులు తీర్చుకున్నాం. "ధన్యవాదాలు బాబా".

FacebookWhatsAppXFacebook SendGmailYahoo! MailLinkedInSMSBloggerEmailSumoMe

14 comments:

  1. Sai inka yennallu ee pariksha

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Baba provide peace and wellness to my parents 💐💐💐💐

    ReplyDelete
  4. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏

    ReplyDelete
  5. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐

    ReplyDelete
  6. ఓం సాయిరామ్

    ReplyDelete
  7. Baba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house lo problem solve cheyandi pl

    ReplyDelete
  8. Om sai Sri sai jai jai sai...plz baba family lo andariki health bagundela chei sai🙏🙏

    ReplyDelete
  9. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.

    ReplyDelete
  10. Om Sai Ram 🙏🙏🙏🙏❤️

    ReplyDelete
  11. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  12. Om Sri Sai Raksha 🙏🙏🙏
    Om Sri Sai Aarogyakshemadhaaya Namaha 🙏🙏🙏

    ReplyDelete
  13. Sri Sachchidanand sadguru sai nath maharaj ki jai 🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo
 
FacebookWhatsAppXFacebook SendGmailYahoo! MailLinkedInSMSBloggerEmailSumoMe